పాక్‌ ఆర్మీకి బిగ్‌ షాక్‌.. బీఎల్‌ఏ దాడిలో సైనికులు మృతి | BLA Says Is Pakistan Army losing Soliders | Sakshi
Sakshi News home page

పాక్‌ ఆర్మీకి బిగ్‌ షాక్‌.. బీఎల్‌ఏ దాడిలో సైనికులు మృతి

Jul 17 2025 1:47 PM | Updated on Jul 17 2025 3:39 PM

BLA Says Is Pakistan Army losing Soliders

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ఆర్మీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. పాక్‌ ఆర్మీ బస్సుపై బలోచ్‌ లిబరేషన్‌ దాడి చేసింది. ఈ ఘటనలో 29 మంది సైనికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక, బలోచ్‌ లిబరేషన్‌(బీఎల్ఏ).. గత ఆరు నెలల్లో 286 దాడులు నిర్వహించి 700 మందిని హతమార్చడం గమనార్హం.

వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌ ఆర్మీపై మరోసారి బీఎల్‌ఏ దాడులపర్వం కొనసాగుతోంది. తాజాగా క్వెట్టా, కలాట్, జహు ప్రాంతాల్లో తాము దాడి చేశామని బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పేర్కొంది. పాక్‌ ఆర్మీ ప్రయాణిస్తున్న వాహనంపై ఐఈడీ బాంబులతో దాడి చేసింది. దాడి సమయంలో పాక్‌ సైనికులు సహా 48 మంది బస్సులో ప్రయాణిస్తున్నారని ప్రకటించింది. దాడి సందర్భంగా 29 మంది పాక్‌ సైనికులు మృతి చెందినట్టు బీఎల్‌ఏ పేర్కొంది. పదులు సంఖ్యలో సైనికులు గాయపడినట్టు బీఎల్‌ఏ తెలిపింది. అ​యితే, ఆరు నెలల్లో 286 దాడులు నిర్వహించి 700 మందిని బీఎల్ఏ హత మార్చింది. 

ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ ఆర్మీకి బలూచ్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. అనూహ్య దాడులకు పాల్పడుతూ పాక్ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వేర్వేరు ఆపరేషన్లలో పాకిస్తానీ భద్రతా దళాలను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తామని బీఎల్ఏ తెలిపింది. బలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం వచ్చే వరకు పాక్ సైన్యం తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే దాడులు చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement