చుట్టూ పచ్చని కొండలు.. గిరులపై నుంచి జాలువారే
జలపాతాల అందం చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు.
ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తూ కనువిందు చేస్తుండటంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
వీటిని తిలకించేందుకు ఉత్సాహంగా తరలివస్తున్న సందర్శకులు..
మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు.


