breaking news
Odisha
-
నాగలికి ప్రేమికులను కట్టి..
ఒడిశా: ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరిని ఊరు వెలి వేసింది. అంతే కాదు గ్రామ పెద్దలు గ్రామసభలో వారికి దండన విధించారు. ఇద్దరినీ నాగలికి రెండువైపులా కట్టి పొలం దున్నే పనులు చేయించారు. పొలం దున్నే సమయంలో ఇద్దరినీ కర్రలతో కొట్టారు. ఈ అవమానకర ఘటన జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి సికరపాయి సమితి కొంజొమాజొడి గ్రామంలో వారం కిందట జరిగింది. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం నాడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతొ విషయం బయటకు పొక్కింది. వివరాల్లోకి వెళితే... కొంజొమాజొడి గ్రామంలో లకసరక (27) అనే యువకుడు అదే గ్రామంలో కొడియా సరక (32) లు నివసిస్తున్నారు. వరుసకు కొడియా సరక లక సరకకు పిన్ని అవుతుంది. అయితే ఇద్దరి మధ్య గత కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఇద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించకున్నారు. అనంతరం కొద్ది రొజుల క్రితం ఇద్దరూ ఊరు విడిచి బయటకు వెళ్లి వివాహం చేసుకున్నారు. విషయం గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు తెలిసింది. ఇద్దరిని గ్రామానికి రప్పించారు. గ్రామ సభను నిర్వహించారు. గ్రామ కులదేవత వద్ద ఇద్దరికీ స్నానం చేయించారు. గ్రామ కట్టుబాట్లను కాలరాసినందుకు దండన విధించారు. వెదురు కర్రలతొ రూపొందించిన నాగలికి రెండు వైపులా ఇద్దరిని అందరి సమక్షంలో కట్టి ఎద్దులను కొట్టినట్టు కొట్టి పొలం దున్నే పనులను చేయించారు. అనంతరం వారిని ఊరి నుండి వెలివేశారు. విషయం బయటకు పొక్కడంతో గ్రామానికి చేరుకున్న విలేకరులకు కొందరు విషయం చెప్పారు. Odisha: Tribal couple yoked like cattle, beaten & exiled for marrying secretly.In 2025. In India. A young couple tied to a bamboo yoke, forced to plough fields, paraded & humiliated — just for falling in love against “custom.”And then Haryana: Radhika Yadav. 25. National… pic.twitter.com/99Jgd5Zx45— Deepti Sachdeva (@DeeptiSachdeva_) July 11, 2025 -
ప్రేమ వివాహం చేసుకున్నారని..
ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువ జంటపై పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. నాగలికి ఎద్దుల్లాగా కట్టి.. కర్రలతో కొడుతూ వాళ్లతో పొలం దున్నడం పేరిట చితకబాదారు. ఆపై పాపపరిహారం అంటూ గుడిలోనూ చిత్రహింసలకు గురి చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒడిశాలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువజంట పట్ల ఊరి పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. నాగలికి ఎద్దుల్లాగా ఆ జంటను కట్టి.. కర్రలతో కొడుతూ వాళ్లతో పొలం దున్నించారు. రాయగడ జిల్లాలోని కంజమజ్హిరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన యువకుడు, యువతి చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి ఇటీవలె వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహానికి ఊరి పెద్దలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ ఇద్దరూ వరుసకు బంధువులే అయినప్పటికీ.. గ్రామ ఆచారం ప్రకారం ఈ తరహా వివాహం అపచారమని చెబుతూ ఈ శిక్షను విధించారు. తొలుత వీళ్లతో పొలం దున్నడం పేరిట హింసించిన కొందరు.. ఆపై గుడికి తీసుకెళ్లి పాపపరిహారం పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ଘୃଣ୍ୟ ମାନସିକତା...ପ୍ରେମ ପାଇଁ ବଳଦ ସାଜିଲେ ପ୍ରେମୀଯୁଗଳ...ଏଭଳି ଦୃଶ୍ୟ ଦେଖିବାକୁ ମିଳିଛି ରାୟଗଡ଼ା ଜିଲ୍ଲା କଲ୍ୟାଣସିଂହପୁର ଅଞ୍ଚଳରରେ #Rayagada #Kalyansinghapur #Badakhabar #badakhabaratv #Odisha pic.twitter.com/mVr79DFarv— Bada Khabar (@badakhabarnews) July 11, 2025 -
విద్యార్థిని వింత ప్రవర్తన.. నాకు సారా, బీడీ ఇవ్వండి..!
ఒడిశా: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి చంద్రపొడ గ్రామం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు పాఠ్యం బోధిస్తున్న సమయంలో హటాత్తుగా 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనూహ్యంగా, వింతగా ప్రవర్తించింది. నాకు సారా ఇవ్వండి, బీడీ ఇవ్వండి అని పట్టుబట్టింది. తాను ఇక్కడ నుంచి వెళ్లను, నేను వారిని చంపుతాను అని పిచ్చిగా మాట్లాడుతూ వింతగా ప్రవర్తించింది. ఆ సమయంలో రాష్ట్ర విద్యావిభాగ డైరెక్టర్, జిల్లా విద్యాధికారులు పాఠశాలకు వచ్చారు. వింతగా ప్రవర్తిస్తున్న బాలికను చూసిన అధికారులు వెంటనే హాస్పిటల్‌కు తీసుకుళ్లాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆ సమయంలో విషయం తెలిసిన బాలిక సోదరుడు వచ్చి తన చెల్లెను హాస్పిటల్‌కు కాకుండా నేరుగా ఇంటికి తీసుకువెళ్లాడు. బాలిక పరిస్థితిని చూసిన తోటి విద్యార్థులు ఆమెకు దెయ్యమో, భూతమో ఆవహించిందని భయంతో వణికిపోయారు. బాలికను ఆదివాసీ వైద్యుడు దిశారీ వద్దకు తీసుకువెళ్లినట్లు తెలిసింది. మారుమూల ఆదివాసీ గ్రామీణ ప్రజలలో మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయని, వారిని చైతన్యవంతులను చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయురాలు రాజలక్ష్మీ మిశ్ర అభిప్రాయపడ్డారు. బాలికకు భూతం పట్టిందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఇటువంటి సంఘటనలకు మానసిక వ్యాధులే కారణమని, హాస్పిటల్లో వైద్యం చేయించటం మంచిదని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. -
నిజమందిరానికి చేరిన జగన్నాథుడు : అద్వితీయంగా అంతిమ ఘట్టం
భువనేశ్వర్: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని శ్రీ జగన్నాథుని రథ యాత్ర అంతిమ ఘట్టం నీలాద్రి విజే మంగళవారం జరిగింది. దీంతో శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర ముగిసింది. సంధ్యా ధూపం తర్వాత రథంపై ఉన్న మూల విరాటులతో ఉత్సవ మూర్తులను వరుస క్రమంలో గొట్టి పొహండి నిర్వహించి సురక్షితంగా శ్రీ మందిరం రత్న వేదికకు చేర్చడంతో నీలాద్రి విజే విజయవంతమై రథ యాత్రకు తెర పడింది. రథ యాత్ర క్రమంలో ఉత్సవ సేవాదులు నిర్వహించారు. రథాలపై మూల విరాటుల పూజలు ముగియడంతో రథాల పైనుంచి విగ్రహాల్ని దించేందుకు చారుమళ్లు ఏర్పాటు చేశారు. వీటి గుండా వరుస క్రమంలో మూల విరాటులతో ఉత్సవ మూర్తుల్ని శ్రీ మందిరం రత్న వేదిక పైకి తరలించారు. బుధ వారం నుంచి శ్రీ మందిరం రత్న వేదికపై భక్తులకు యథాతథంగా ఏడాది పొడవునా చతుర్థా మూర్తుల దర్శనం ప్రాప్తిస్తుంది. మహాలక్ష్మికి స్వామి బుజ్జగింపురథయాత్ర అంతిమ ఘట్టం నీలాద్రి విజే మహోత్సవంలో శ్రీ మహాలక్ష్మి దేవిని జగన్నాథ స్వామి బుజ్జగించే వైనం భక్త జనాన్ని ముచ్చట గొలిపించే అపురూప ఘట్టం. నీలాద్రి విజే సమయంలో సుదర్శనుడు, దేవీ సుభద్ర, బలభద్ర స్వామిని శ్రీ మందిరంలోనికి ఆహ్వానించిన శ్రీ మహా లక్ష్మి ప్రియ నాథుడు శ్రీ జగన్నాథుని ప్రవేశం అడ్డుకుని శ్రీ మందిరం సింహ ద్వారం తలుపులు మూసి వేస్తుంది. తనను విస్మరించి తోబుట్టువులతో యాత్రకు ఏగి విరహ వేదన తాళలేక స్వయంగా దర్శనం కోసం వెళ్లిన నిరుత్సాహ పరచడంతో శ్రీ మహా లక్ష్మి అలక ప్రదర్శించడం ఈ ముచ్చట గొలిపే ఘట్టం జానపద ఇతివృత్తం. దేవేరి అలక తీర్చేందుకు యాత్ర కానుకగా శ్రీ జగన్నాథుడు రసగుల్లాను దేవేరికి సమరి్పంచడంతో మురిసిపోయి సాదరంగా శ్రీ మందిరం లోనికి ఆహ్వానిస్తుంది. ఇది రథ యాత్రలో చిట్ట చివరి ముచ్చట గొలిపే ఘట్టం.అద్వితీయంగా అంతిమ ఘట్టంపర్లాకిమిడి: పదిరోజులపాటు గుండిచా రథయాత్రకు బయలుదేరిన జగన్నాథ, సుభద్ర, బలభద్రులు మంగళవారం ఉదయం మూడు రథాలతో నిజ మందిరానికి క్షేమంగా విచ్చేశారు. జిల్లా ఎస్పీ జ్యోతింద్రపండా, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, తహసీల్దారు, ఐఐసీ ప్రశాంత్ భూపతి, ఇతర భక్తుల సహాయంతో రాజవీధి నుంచి శ్రీమందిరం వరకూ రథాన్ని లాగారు. గురువారం గురుపౌర్ణమి సందర్భంగా శ్రీలక్ష్మీదేవితో కలిసి శ్రీలక్ష్మీనారాయణ అవతారంతో రథాయాత్ర ముగుస్తుంది. ఆఖరిరోజున పెద్ద యాత్ర జరుగనున్నది. -
మజ్జిగౌరీ హుండీల ఆదాయం రూ.1.04 కోట్లు, విదేశీ కరెన్సీ
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరీ అమ్మవారి హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మందిరం ట్రస్టు అధ్యక్షులు రాయిసింగి బిడిక, సభ్యులు, మందిరం సూపరింటెండెంట్ సమక్షంలో మందిరం ప్రాంగణంలోని తొమ్మిది హుండీలను తెరిచారు. సాయంత్రం వరకు కొనసాగిన లెక్కింపులో భాగంగా అమ్మవారికి భక్తులు వేసిన కానుకల రూపంలో 1,04,36,963 రూపాయల నగదు, వెండి రెండు కిలోల 505 గ్రాములు, బంగారం 38 గ్రాములు లభించినట్లు మందిరం ట్రస్టు అధ్యక్షులు రాయిసింగ్ తెలిపారు. సాయంత్రం ఆరు గంటల వరకు లెక్కింపు కొనసాగిందని.. స్థానిక సేవా సంస్థలకు చెందిన మహిళలు, విద్యార్థులు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు.ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 27వ తేదీన హుండీ లెక్కింపులో భాగంగా అమ్మవారికి భక్తులు వేసిన కానుకల రూపంలో 94,49,054 రూపాయల నగదు, 93 గ్రామలు బంగారం, 2.170 కిలోల వెండి లభించినట్లు వివరించారు. అమ్మవారి హుండీ ఆదాయంలో భాగంగా ఇప్పటికి రెండుసార్లు కోటి రూపాయలు నగదుగా ఆదాయం సమకూరడం విశేషమని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, ఇటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆది, మంగళ, బు«ధవారాల్లో అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారని అన్నారు. సోమవారం నాడు హుండీలొ లభించిన నగదును స్థానిక ఉత్కళ గ్రామీణ బ్యాంకులో అమ్మవారి పేరిట డిపాజిట్ చేస్తున్నట్టు చెప్పారు. ఇదిలాఉండగా ఈసారి హుండీలొ విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించడం గమనార్హం. -
జగన్నాథుడికి పానకం సేవ, శ్రీమందిరం శిఖరాన మహాదీప హారతి
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుడు కొలువై ఉన్న శ్రీ మందిరంలో ఏకాదశి తిథి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తిథి పురస్కరించుకుని క్రమం తప్పకుండా శ్రీ మందిరం శిఖరాన నీల చక్రం ప్రాంగణంలో మహా దీప హారతి నిర్వహిస్తారు. రథ యాత్రలో పవిత్ర ఏకాదశి నాడు అత్యంత ఆకర్షణీయమైన స్వర్ణాలంకార దర్శనం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులకు శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో ఆలయ శిఖరంపై మహా దీప దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది. స్వర్ణ అలంకార దర్శనం కొనసాగుతుండగా మహాదీప హారతి నిర్వహిస్తారు. దీనితో యాత్రకు తరలి వచ్చిన అశేష భక్తజనం ఆలయ శిఖరంపై మహా దీప హారతి కనులారా ప్రత్యక్షంగా తిలకించే అవకాశం పొందుతారు. వెండి కలశాల్లో హారతి మహా దీప హారతి కోసం 3 వెండి కలశాలు సిద్ధం చేస్తారు. వీటిని నెయ్యితో నింపుతారు. అరటి నారతో దీపం ఒత్తులు వినియోగిస్తారు. అరటి నారకు కొత్త బట్టను చుట్టి బలపరుస్తారు. తెల్ల రంగు వస్త్రం వినియోగిస్తారు. ఇలా సిద్ధం చేసిన మహా దీపాన్ని తొలుత శ్రీ జగన్నాథుని ముందు ద్యోతకం చేసిన తర్వాత, ఆలయం పైకి ఎత్తుతారు. జగన్నాథునికి పానకం నివేదన ఏటా పవిత్ర ఆషాఢ శుక్ల ద్వాదశి సందర్భంగా రథాలపై దేవుళ్లకు పానకం సమరి్పస్తారు. చీకటి పడ్డాక ఈ సేవ నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్ని పాటించారు. ప్రత్యేక మట్టి పాత్రల్లో పానకం నింపుతారు. మూల విరాట్ల పెదవుల ఎత్తు వరకు ఈ పాత్రలు తయారు చేస్తారు. వీటి నిండా సుగంధ ద్రవ్యాలతో రుచికరమైన పానకం పోసి రథాలపై తెరచాటున గోప్యంగా నివేదించడం ఆచారం. ఈ సమగ్ర ప్రక్రియను ఒధొరొ పొణ సేవగా పేర్కొంటారు. రథాలపై ప్రధాన విగ్రహాల ఎదురుగా మట్టి పాత్రల్ని నిలిపి ఒధొరొ పొణ సేవ నిర్వహిస్తారు. స్వామికి పానకం నివేదించడం పూర్తయ్యాక పాత్రలు పగల గొట్టడంతో రథాల పైనుంచి పాణకం పొరలుతుంది. రథాల పైనుంచి పార్శ్వ దేవతల మీదుగా నేలకు ఈ పానకం జారుతుంది. ఇలా జారిన పానకం పార్శ్వ దేవతలు, అశరీర జీవులు సేవించి మోక్షం పొందుతారని విశ్వాసం. పవిత్ర ఆషాఢ శుక్ల ద్వాదశి పురస్కరించుకుని సోమవారం ఈ సేవ జరిగింది. దేవతా మూర్తులకు స్వర్ణాలంకరణ జయపురం: చైతన్యమందిరం నుంచి శ్రీజగన్నాథ్, బలభద్ర, సుభద్రలతో ఉన్న పెద్ద రథం, పతిత పావనుడు ఉన్న చిన్న రథాలు రాత్రి 8.00 గంటలకు రథొపొడియ వద్దకు చేరాయి. దాదాపు రాత్రి పదకొండు వరకు భక్తుల పూజలు అందుకున్న దేవతా మూర్తులను జగన్నాథ ఆలయానికి తీసుకు వచ్చారు. లక్ష్మీదేవి అనుమతితో గర్భగుడిలోకి వెళ్లాక స్వర్ణాలంకరణ చేశారు. కార్యక్రమంలో దేవాదాయ విభాగ అదనపు తహసీల్దార్ చిత్త రంజన్ పటా్నయిక్, జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కశ్యప్, పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంధ్ర రౌత్,జ యపురం సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్‌లతో పాటు దేవదాయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆషాఢ శుక్ల ఏకాదశి బంగారు స్వామి
భువనేశ్వర్: శ్రీ క్షేత్రంలో ఆషాఢ శుక్ల ఏకాదశి పుణ్య తిథి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పూరీ శ్రీ మందిరం భక్త జనంతో కిటకిటలాడింది. వేకువ జాము నుంచి ప్రత్యేక పూజాదులతో స్వామి పలుమార్లు ఆకర్షణీయమైన అలంకరణతో శోభిల్లాడు. హరి శయన ఏకాదశి పురస్కరించుకుని రథాలపై దేవుళ్లకు 2 సార్లు బొడొ సొంగారొ అలంకరణ చేయడం విశేషం. ఈ సందర్భంగా రథాలపై మూల విరాటుల్ని స్వర్ణ అలంకారంలో దర్శించుకుని భక్తులు తరించారు. శ్రీ క్షేత్ర వాసుడు శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర దాదాపు అంతిమ దశకు చేరుకుంది. స్వామి యాత్ర ఆద్యంతాలు భక్త జనాన్ని మురిపిస్తాడు. పవిత్ర ఆషాఢ శుక్ల ఏకాదశి పుణ్య తిథి పురస్కరించుకుని భక్తులకు బంగారు శోభతో దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో 3 రథాలపై దేవుళ్లని బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఈ సందర్భంగా శ్రీ మందిరం సింహ ద్వారం ప్రాంగణంలో పతిత పావనునికి బంగారు అలంకరణ చేశారు. రత్న వేదికపై నిత్యం అసంపూర్ణ దారు విగ్రహాలుగా దర్శనం ఇచ్చే మూల విరాటులు రథ యాత్రలో రథాలపై బంగారు తొడుగులు, ఆభరణాలతో నిలువెత్తు రూపంతో దర్శనం ఇస్తారు. కుల, మత, వర్గ, వర్ణ వివక్షకు అతీతంగా ఆరు బయట పరిపూర్ణ జగన్నాథుని దర్శించుకునే అపురూప అవకాశం స్వామి రథ యాత్రలో మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ ఏడాది రాత్రి 11 గంటల వరకు రథాలపై మూల విరాటుల పరిపూర్ణ రూపాన్ని బంగారు అలంకరణలో దర్శించుకునే అవకాశం కలి్పంచారు. ఆదివారం సాయంత్రం సుమారు 5 గంటల నుంచి ఈ దర్శనం ప్రారంభం కావడం విశేషం. శ్రీమందిరంలో హరి శయన ఏకాదశి ఆషాడ శుక్ల ఏకాదశి సందర్భంగా రథాలపై దేవుళ్ళకు హరి శయన ఏకాదశి ప్రత్యేక పూజాదులు నిర్వహించారు. నేటి నుంచి కార్తీక మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజు వరకు భగవంతుడు 4 నెలలు శయనిస్తాడు. వల్లభ్ల బొడొ సింగారో అలంకరణ పవిత్ర హరి శయన ఏకాదశి పురస్కరించుకుని రథాలపై మూల విరాటులకు వరుసగా 2 సార్లు బొడొ సింగారొ అలంకరణ చేయడం ఆచారం. నిత్యం సాగే బొడొ సింగారొ అలంకరణ తర్వాత భోగ సేవ తర్వాత అధిక భోగ సేవ నిర్వహించి మరో మారు బొడొ సింగారొ అలంకరణ చేస్తారు.దీన్ని వల్లభ బొడొ సింగారొ అలంకరణగా పేర్కొంటారు. ఏటా 5 సార్లు బంగారు శోభతో దర్శనం ఏటా రథ యాత్ర పురస్కరించుకుని మారు యాత్ర (బహుడా)లో భాగంగా ఆషాఢ శుక్ల ఏకాదశి తిథి నాడు రథాలపై బహిరంగంగా అన్ని వర్గాల భక్తులకు స్వామి బంగారు దర్శనం ఒక రోజు లభిస్తుంది. ఏడాదిలో మరో 4 సార్లు శ్రీ మందిరం లోపల మూల విరాటులు బంగారు అలంకరణతో శోభిల్లుతారు. ఏటా కార్తీక పూరి్ణమ, పౌష్య పూర్ణిమ, డోల పూర్ణిమ, అశ్విని శుక్ల దశమి పుణ్య తిథుల్లో స్వామి బంగారు శోభతో భక్తులకు మిరిమిట్లు గొలిపిస్తాడు. పుష్యాభిõÙకం సందర్భంగా పుష్య మాసం పౌర్ణమి నాడు, దసరా ఉత్సవాల్లో విజయ దశమి నాడు స్వర్ణ శోభితుడుగా దర్శనం ఇస్తాడు. శ్రీ మందిరం రత్న వేదికపై ఆయా తిథుల్లో మధ్యాహ్న ధూపం తర్వాత మూల విరాటుల్ని బంగారు ఆభరణాలతో అలంకరించడం ఆచారంగా కొనసాగుతోంది. దసరా సమయంలో విజయ రామచంద్రునిగా, కార్తీక పౌర్ణమి సమయంలో ద్వారక నాథునిగా, డోల పౌర్ణమి సమయంలో గోపేశ్వరుడిగా, పుష్యాభిషేకం సమయంలో శ్రీరామునిగా పూజిస్తారు. -
పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష నవమి భక్తులకు నిరుత్సాహం
భువనేశ్వర్: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష నవమి రోజున గుండిచా ఆలయంలో నవమి సంధ్యా దర్శనం ప్రాప్తిస్తుంది. అడపా మండపంపై ఒక రోజు దర్శనం శ్రీ మందిరం నీలాద్రి మండపంపై జగతినాథుడు శ్రీ జగన్నాథ స్వామి ( Lord Jagannath ) పది సంవత్సరాల దర్శనం పుణ్యఫలం ప్రసాదిస్తుందని పౌరాణిక కథనాలు సూచిస్తున్నాయి. స్వామి జన్మస్థలం అడపా మండపంపై పగటి పూట దర్శనం కంటే సంధ్య వేళ దర్శనం పుణ్యం పది రెట్లు అధికంగా లభిస్తుంది. అందుచేత నవమి సంధ్యా దర్శనం ప్రాధాన్యత సంతరించుకుంది. అడపా మండపంపై శ్రీ నవమి సంధ్యా దర్శనం సాయంత్రం 6 గంటల వరకే పరిమితం చేశారు. స్వామి మారు రథ యాత్ర బహుడా యాత్రకు ముందస్తు సన్నాహాలు, బహుళ సేవల ఆచరణ ఒత్తిళ్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీ మందిరం పాలక వర్గం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ గుండిచా ఆలయ సింహ ద్వారం గుండా ప్రవేశం నివారించారు. దీంతో భక్తులకు నవమి నాడు సంధ్య వేళలో దర్శనం ప్రాప్తి లేకుండా పోయింది. సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇదీ చదవండి: జగన్నాథుడి కల్కి అవతారం : మారు రథయాత్రశ్రీ గుండిచా ఆలయ శుద్ధి తర్వాత తర్వాత అడప మండపంపై అనేక ముఖ్యమైన సేవలను నిర్వహించాల్సి ఉంటుంది. బహుడా యాత్ర రోజున రథంపై మూల విరాటులను దర్శించుకునే అవకాశం భక్తులు పొందుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు భక్తజన వర్గం జగతి నాథుని పట్ల భక్తి పూర్వక సేవ, అంకితభావంతో సహకరించాలని అభ్యర్థించారు.. అనుబంధ వర్గాల సేవకుల సహకారం, సమన్వయంతో బహుడా సంబంధిత సేవల్ని సకాలంలో పూర్తి చేయాలని అభ్యర్థించారు. -
Jagannath Rath Yatra: కల్కి అవతారం : నేడు మారు రథయాత్ర
భువనేశ్వర్: శ్రీ గుండిచా ఆలయంలో భక్తులు శ్రీ జగన్నాథుని సంధ్యా దర్శనం కోసం తండోపతండాలుగా తరలి వచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు పరిమితం చేశారు. అడప మండపంపై ఇది చివరి దర్శనం. ఈ సందర్భంగా శారదా బాలి జనసముద్రంగా మారింది. మహా ప్రభువు దర్శనం కోసం బొడొశొంఖొ వరకు బారులు తీరారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వైబీ ఖురానియా శుక్రవారం శ్రీ గుండిచా ఆలయం ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్భంగా శారదా బాలి ప్రాంగణంలో భక్తుల రద్దీ నియంత్రణ, మారు రథ యాత్ర భద్రతా సన్నాహాల్ని ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఇదీ చదవండి: Antidepressants మహిళల మెదడు సేఫే, బట్ పురుషులకే!బహుడా యాత్ర పురస్కరించుకుని పోలీసులు వాహనాల రవాణా వ్యవస్థ కట్టుదిట్టం చేశారు. అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ దయాళ్ గంగ్వార్ ప్రత్యక్షంగా ఈ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి ప్రజలకు బల్క్ సందేశాలు పంపిస్తారు. జన సందోహం ఉన్న చోట డ్రోన్, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అన్ని ఫోన్లకు సందేశాలు పంపిస్తారు. అదనంగా జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఎల్ఈడీల ద్వారా కూడా వాహన చోదకులకు సమాచారం ప్రసారం చేస్తారు. నవమి సంధ్యా దర్శనం, మారు రథ యాత్ర బహుడా భద్రత, రక్షణల సమగ్ర వ్యవస్థని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వైబీ ఖురానియా పర్యవేక్షించారు. జన్మ వేదికపై శ్రీ జగన్నాథుని చివరి దర్శనం క్రమబదీ్ధకరణ కార్యాచరణని పరిశీలించారు. శాంతిభద్రతల ఏర్పాట్లపై ఆయన దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఇతర సీనియర్ అధికారులతో పోలీస్ డైరెక్టర్ జనరల్ సమావేశమయ్యారు. కల్కి అవతారంలో జగన్నాథుడు పర్లాకిమిడి: స్థానిక గుండిచా మందిరంలో జగన్నాథ స్వామి శుక్రవారం కల్కి అవతారంలో భక్తులకు దర్శనం కల్పించారు ఈ రోజుతో దశవతారాలు పూర్తయ్యాయి. శనివారం బహుడా యాత్ర సందర్భంగా శ్రీజగన్నాథరథాలు తిరుగుముఖం పెట్టారు. గుండిచా మందిరం వెలుపల ఆనందబజార్‌లో శుక్రవారం భక్తులకు ఉచితంగా ఓబ్బడా (అన్న ప్రసాదం) రథాయాత్ర కమిటీ అందజేసింది -
పూరీజగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట
-
రెండోరోజు ఘనంగా పూరీ జగన్నాథ రథయాత్ర
-
Jagannath Rath Yatra సర్వం జగన్నాథం
పర్లాకిమిడి: గజపతి జిల్లా పర్లాకిమిడిలో రథయాత్ర సందర్భంగా ఘోష యాత్ర మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రారంభమైంది. ఉదయం జిల్లా కలెక్టర్ బిజయ కుమార్దాస్, ఎస్పీ జ్యోతింద్ర నాథ్ పండా, సబ్ కలెక్టర్ అనుప్ పండాలు విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథయాత్రకు పహాండిని ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్రలను రథాలపైకి తీసుకెళ్లారు. అనంతరం గజపతి వంశీయురాలు కల్యాణీ దేవి గజపతి మేళతాళాలతో రాజ మందిరం నుంచి విచ్చేసి జగన్నాథుని రథంపై శా్రస్తోత్తరంగా పూజలు చేసి బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేశారు. దీనిని చెరాపహారా అంటారు. స్థానిక కళాకారులు రథాల ముందు ఒడిస్సీ నృత్యాలతో ప్రజలను అలరించారు. మూడు రథాలను గుండిచా మందిరం వైపు సాయంత్రం 5.00 గంటలకు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయడం వలన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. మల్కన్‌గిరిలో... జిల్లా కేంద్రంలో జగన్నాథ స్వామివారి రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ముందుగా కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్‌తో ఆలయ అర్చకులు పూజ నిర్వహించి రథం లాగడం ప్రారంభించారు. యాత్రలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రథం కదిలే సమయంలో కళాకారులు నృత్య ప్రదర్శనలు చేశారు. స్వామివారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. రాయగడలో... రాయగడలో రథయాత్ర వైభవంగా జరిగింది. జగన్నాథ మందిరం నుంచి దేవతామూర్తులకు సాంప్రదాయబద్ధంగా పొహండి నిర్వహించి ప్రత్యేకంగా రూపొందించిన రథంలో నిలిపారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు రథంలాగే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ ఫరూల్ పటా్వరీ, తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక తదితరులు రథంలాగే కార్యక్రమంలో పాల్గొన్నారు. అడుగడుగునా భక్తుల సౌకర్యార్థం స్వచ్ఛంద సేవా సంస్థలు మజ్జిగ, చల్లని పానీయాలు వితరణ చేశారు. ఇదిలా ఉండగా స్థానిక రైతుల కాలనీలోని జిమ్స్ పాఠశాల విద్యార్థులు రూపొందించిన రథం అందరినీ ఆకట్టుకుంది. రథయాత్రను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు స్థానిక మజ్జిగౌరి మందిరం ట్రస్టు తరుపున మందిరం ప్రాంగణంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జయపురంలో... పట్టణంలో అంగరంగ వైభవంగా రథయాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని మిగిలిన ప్రాంతాల్లో శుక్రవారం యాత్ర జరగగా, ఒక్కరోజు తర్వాత అనగా శనివారం నుంచి జయపురంలో రథయాత్ర జరుగుతుంది. దీనిలో భాగంగా శుక్రవారం జగన్నాథ స్వామి ఆలయం నుంచి దేవతామూర్తులను మంగళ వాయిద్యాలతో తోడ్కొని వచ్చి రథాలపై ఆశీనులు చేశారు. అనంతరం శనివారం మధ్యాహ్నం వరకు దేవతామూర్తులకు భక్తులు పూజలు చేస్తారు. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు రథాన్ని గుండిచా మందిరానికి తీసుకొని వెళ్తారు. కొరాపుట్‌లో... కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో రథయత్ర తొలి ఘట్టంలో భాగంగా రథాలు గుండిచా మందిరాలకు చేరుకున్నాయి. కొరాపుట్ జిల్లా కేంద్రంలో జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి దంపతులు, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చోలు పాల్గొన్నారు. నబరంగ్‌పూర్‌లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి రథం లాగారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో సీఆర్పీఎఫ్ 12వ బెటాలియన్‌లో నేతృత్వంలో కమాండెంట్ ఎన్కేకే ప్రసాద్ నేతృత్వంలో రథయాత్ర జరిగింది. మరోవైపు విశ్వవ్యాప్త రథయాత్రకు విభిన్నంగా జయపూర్, ఆంధ్రా–ఒడిశా వివాదస్పద ప్రాంతం కొఠియాలో ఒక రోజు ఆలస్యంగా శనివారం రథయాత్ర జరగనుంది. శుక్రవారం మాత్రం పొహండి నిర్వహించి విగ్రహాలను రథం మీదకి చేర్చారు. ఆకట్టుకునే పుష్ప మకుటంస్వామివారి అలంకరణలో ఆకట్టుకునే అపురూప పుష్ప మకుటం. దీనిని యాత్ర వ్యవహారిక భాషలో ఠయ్యా అంటారు. సుగంధిత పుష్పాలతో దేవతా త్రయం బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీజగన్నాథుని కోసం వేర్వేరుగా 3 ఠయ్యాలు తయారు చేస్తారు. స్థానిక రాఘవ దాసు మఠం క్రమం తప్పకుండా వీటిని పంపిణీ చేస్తుంది. వీటి తయారీలో వెదురు బద్దలు, జీలుగు, జరీ కాగితాలు వంటి ఆకర్షణీయమైన వస్తువులతో పాటు సుగంధిత పుష్పాలను వినియోగిస్తారు. కదంబ పుష్పాలు ప్రముఖ స్థానం ఆక్రమించి ఆబాలగోపాల భక్త జనాన్ని ఆకట్టుకుంటాయి. -
కాసేపట్లో పూరీ రథయాత్ర.. భారీగా తరలిన భక్తులు
భువనేశ్వర్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్ర కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు పూరీ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ వేడుకలో 12 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అంచనావేసిన అధికారులు, దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు.ఇక, జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడి రథంతోపాటు ఆయన అన్న బలరాముడు, వారి చెల్లి సుభద్ర రథాలలో కొలువై భక్తులకు దర్శనమివ్వనున్నారు. లక్షలాది భక్తులు వెంటరాగా ఈ రథాలు జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి రథాలపై తరలివెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జగన్నాథ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి.#WATCH | Odisha: Devotees gather in large numbers at Puri's Jagannath Temple for the annual Rath Yatra, which is set to begin today. pic.twitter.com/jOCJphlKVx— ANI (@ANI) June 27, 2025Every single day, at 214 feet high, a priest fearlessly climbs the Jagannath Temple in Puri without ropes or safety - to change the flag. pic.twitter.com/qgqgLgvmX9— urvi (@itsmiling_face) June 26, 2025సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. కానీ, దీనికి భిన్నంగా పూరీలో మూల విరాట్టునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు. అంతేకాదు, ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు. రాజు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. జగన్నాథుడు, బలభద్రుడు, తమ సోదరి సుభద్ర దేవిలతో కలిసి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని.. అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి వస్తారు. పూరీ జగన్నాథ ఆలయం నుంచి గుండిచా మందిరం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకరోజు యాత్ర తర్వాత మూడు మూర్తులూ ఏడు రోజులపాటు గుండిచా ఆలయంలో విడిది చేస్తారు. తొమ్మిదో రోజున తిరిగి ప్రధాన ఆలయానికి వస్తారు.VIDEO | Odisha: Several foreign devotees gather to attend the Jagannath Rath Yatra in Puri. Here’s what one foreign devotee, Premdas, said: “We came from Vrindavan under the guidance of our Gurudev. We feel extremely happy to be in such a sacred place to have the darshan of… pic.twitter.com/8WwwyPIPzX— Press Trust of India (@PTI_News) June 27, 2025 -
odisha: ఘోరం.. పది రోజుల్లో ఐదు అత్యాచారాలు
భువనేశ్వర్: భారతదేశ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి వైభవం, ఆధ్యాత్మిక శోభతో అలరారే రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ దేవాలయం, చిలికా సరస్సు వంటి అనేక ప్రాచీనమైన, ప్రకృతి శోభతో ఒడిశా ఫరిడవిల్లుతోంది. కానీ ఇటీవల అక్కడ చోటుచేసుకున్న వరుస అత్యాచార ఘటనలు ఆ రాష్ట్ర ప్రాభవాన్ని దెబ్బతీస్తున్నాయి. గడిచిన గత పది రోజుల వ్యవధిలో జరిగిన నాలుగు అత్యాచార ఘటనలు రాష్ట్రంలో మహిళా భద్రతపై తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.తాజాగా, మయూర్భంజ్ జిల్లా కరంజే ప్రాంతంలో దారుణం జరిగింది. జూన్ 25న ఓ యువతి స్థానికంగా ఉన్న దేవాలయంలో దైవ దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో మాటు వేసిన ముగ్గురు అగంతకులు యువతిపై దాడి చేశారు. అనంతరం, స్థానిక అడవుల్లోకి బలవంతంగా లాక్కెళ్లారు. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన మలర్పాడ గ్రామానికి చెందిన బికాష్ పాత్రాను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. VIDEO | Bhubaneswar: On Gopalpur gang rape case, Congress leader Shobha Oza (@Shobha_Oza) says, “In one month, three heart-wrenching gang rape cases like Nirbhaya case have come up. Odisha ranks 5th in India in terms of rape cases. In past one year, cases of human trafficking,… pic.twitter.com/9D5FnqAvxw— Press Trust of India (@PTI_News) June 21, 2025 1. గంజం జిల్లా,గోపాల్పూర్ బీచ్,జూన్17 : ఓ యువతి తన స్నేహితుడితో కలిసి గోపాల్పూర్ బీచ్ చూసేందుకు వచ్చారు. ఆ సమయంలో నిందితులు బాధితురాల్ని స్నేహితుడిపై దాడి చేశారు. అనంతరం, నిందితులు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. మొత్తం 10మంది నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు.2.టెన్తలపాషి గ్రామం, కియోంఝర్ జిల్లా, జూన్ 18: ఉదయం తన ఇంటి సమీపంలో 17 ఏళ్ల బాలికను నిందితులు ఉరితీశారు.దుర్ఘటన జరిగిన ముందు రోజు సాయంత్రం నుంచి ఆమె కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహంపై గాయాలైన గుర్తులు ఉండడంతో బాలికపై దారుణం జరిగినట్లు తేలింది. ఆమె మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరిగిందని కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 3.బరిపడ, మయూర్భంజ్ జిల్లా, జూన్ 19: 31 ఏళ్ల మహిళ భర్త జూన్ 19న బరిపడ సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో నలుగురు నిందితులు ఇంట్లోకి చొరబడి తన భార్యపై అత్యాచారం చేశారని ఆరోపించారు.4. బెర్హంపూర్, గంజాం జిల్లా, జూన్ 25: జూన్ 25న క్లినిక్ యజమాని తనపై అత్యాచారం చేశాడని 17 ఏళ్ల బాలిక ఆరోపించింది. బాధితురాలు బీఎస్సీ (నర్సింగ్) చదవడానికి సహాయం చేస్తానని, ఉచిత వసతి కల్పిస్తానని నిందితుడు కుటుంబానికి హామీ ఇచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేశారు మరియు దర్యాప్తు జరుగుతోంది. -
పవిత్ర తులసి మాలలతో బుల్లి రథం
భువనేశ్వర్/పూరీ: పవిత్రమైన తులసి మాలలతో బుల్లి రథం రూపుదిద్దుకుంది. స్వామివారి భక్తులకు ఈ కళాఖండం అంకితం చేసినట్లు సృజనాత్మక కళాకారుడు బిశ్వజిత్ నాయక్ తెలిపారు. ఆరు రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి 8 అంగుళాల ఎత్తు, 7 అంగుళాల వెడల్పుతో తయారు చేసిన ఈ రథంలో 551 తులసి మాలలు, 175 ఐస్‌క్రీం పుడకల్ని వినియోగించారు. రథయాత్రకు పోలీసు యంత్రాంగం సన్నద్ధంరథయాత్రకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. రథాలు లాగడం మొదలుకొని యాత్ర పూర్తయ్యే వరకు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రథాలు లాగడంపై బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పూరీ రిజర్వు పోలీసు గ్రౌండులో చేపట్టిన ఈ కార్యక్రమం రథయాత్రను తలపింపజేసింది. బలభద్రుని తాళ ధ్వజం, జగన్నాథుని నందిఘోష్, సుభద్ర దర్ప దళనంకు ప్రతీకగా మూడు జీపుల్ని మూడు రథాల మాదిరిగా వినియోగించారు. క్లియరెన్స్, కార్డన్ ఏర్పాటు దశల్లో అనుబంధ బలగాలకు మెలకువలను నేర్పించారు. అదనపు పోలీసు డైరెక్టరు జనరల్, జిల్లా న్యాయాధికారులు, సీనియర్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. -
Jagannath Rath Yatra నేడే జగన్నాథుని నేత్రోత్సవం
భువనేశ్వర్: అశేష భక్త జనం అభీష్టం నెరవేరే మధుర క్షణం చేరువైంది. నవనవలాడే యవ్వన రూపుతో ఆరాధ్య దైవం జగన్నాథుడు భక్తుల మధ్య ప్రత్యక్షం కానున్నాడు. మర్నాడు శ్రీ గుండిచా యాత్రకు బయల్దేరుతాడు. స్వామి రాక కోసం శ్రీ మందిరం గడపలో మూడు రథాలు దేవతల ఆగమనం కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. ఇటు శ్రీ మందిరం, అటు శ్రీ గుండిచా మందిరం వాకిళ్ళు మొదలుకొని ఆలయ ప్రాంగణాలు సైతం శోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. గుండిచా మందిరంలో అడపా మండపం చతుర్థాదారు మూర్తుల ఆసీనం కోసం సిద్ధమై ఉంది. భారీ రంగవళ్లులతో రెండు మందిరాల వాకిళ్లు మిరమిట్లు గొలిపిస్తున్నాయి. గత 14 రోజులుగా తెరచాటున స్వామి భక్తులకు కానరాకుండా రహస్య ఉపచారాలతో సరికొత్త ఉత్సాహం పునరుద్ధరించుకోవడంతో శ్రీ క్షేత్రం హడావిడిగా ఉంది. చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకతజ్యేష్ట పూర్ణిమ నాడు అష్టోత్తర కలశ జలాభిõÙకాన్ని స్నాన యాత్రగా జరుపుకున్న స్వామి తడిసి ముద్దయ్యాడు. దీంతో మూల విరాటుల సహజ రూపు చెదిరి పోయింది. జ్వర పీడతో వైద్య నియమాల ప్రకారం అనవసర మండపానికి తరలిపోయాడు. అది మొదలుకొని భక్తులకు నిత్య దర్శనం కొరవడింది. దైతపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాజవైద్య వర్గం తైలాది వైద్య ఉపచారాలతో దేవుళ్ల ఆరోగ్యం కోలుకుంది. యథాతథంగా భక్తులకు నిత్య దర్శనం ప్రసాదించేందుకు భగవంతునికి మార్గం సుగమం అయింది. హింగుళ (ఎరుపు), హరితల (పసుపు), కస్తూరి, కేశర (కుంకుమ), కొయిత (మారేడు గుజ్జు) వంటి సహజ మూలికా వర్ణ ద్రవ్యాల మేళవింపుతో మూల విరాటుల ముఖాలకు క్రమ పద్ధతిలో రంగులు హద్ది యవ్వన రూపం తీర్చి దిద్దుతారు. జగన్నాథుని సంస్కృతిలో ఇదో గోప్య సేవ. కాగా, గురువారం భక్తులు ప్రవేశించేందుకు శ్రీ మందిరం తలుపులు తెరుచుకుంటాయి. గుడిలో బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, జగన్నాథుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.రథాలపై నీలచక్రాల అమరిక పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని శ్రీమందిరంలో నీలచక్రాలకు పండాలు శాస్త్రోక్తంగా బుధవారం పూజలు నిర్వహించారు. అనంతరం వాయిద్యాలతో వీటిని శ్రీజగన్నాథ రథం నందిఘోష, బలభద్రస్వామి రథం తాలధ్వజ, సుభద్ర రథం దర్పదళన రథాలపై అమర్చారు. దీంతో నేటి నుంచి జగన్నాథ రథంపై హనుమాన్ జెండాను ఎగురవేస్తారు. అనేక దేవతామూర్తులు రథాయాత్రకు ఆటంకం కలుగకుండా ఈ పది రోజులు కాపాడతారనేది భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో రథాయాత్ర కమిటీ చైర్మన్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, తహసీల్దార్ బెహారా, రథాయాత్ర కమిటీ సభ్యులు కుమార్, బసంత పండా, భరత్ భూషన్ మహంతి, రాజేంద్ర కుమార్ బెహరా, అశోక్ మహారాణా పాల్గొన్నారు. -
పూరీ జగన్నాథ యాత్ర.. రథాల తయారీ చూశారా?
-
Jagannath Rath Yatra: జగన్నాథుడి దర్శనం తోపాటు చూడాల్సిన చారిత్రక ప్రదేశాలు..
-
Puri Rath Yatra 2025 ప్రత్యేక రైళ్లు
పర్లాకిమిడి: పూరీ రథయాత్ర సందర్భంగా ఈస్టు కోస్టు రైల్వే గుణుపురం–పూరీ–గుణుపురానికి ఈనెల 26, జూలై 4, జూలై 5న ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈనెల 26న ట్రైన్ నంబర్ 08443 సాయంత్రం 6.30కు గుణుపురం నుంచి బయల్దేరి మరుసటి రోజు వేకువన 2.15కు పూరీ చేరుకుంటుంది. అన్ని స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది. అలాగే తిరుగు ప్రయాణం ట్రైన్ నంబరు 08428 పూరీ నుంచి 2.45లకు వేకువజామున బయలుదేరి గుణుపురానికి మధ్యాహ్నం 12.30లకు చేరుకుంటుందని ఈస్టుకోస్టు రైల్వే సీనియర్ డివిజనల్ మేనేజరు కె.సందీప్ తెలియజేశారు. రిటర్న్ ట్రైను పూరీ నుంచి జూన్ 27 నుంచి జూలై 6, జూలై 7 వరకూ నడుస్తుంది. అలాగే పలాస, పూరీ, పలాసకు అన్‌రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్సు కూడా జూన్ 26 నుంచి జూలై 7 వరకూ రాత్రి 9.30కు పలాసలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు పూరీ చేరుకుంటుంది. రిటర్న్ ట్రైన్లు కూడా పూరీ నుంచి పలాసకు జూన్ 27 నుంచి జూలై 8 వరకూ నడుస్తాయి. మధ్యాహ్నం 2.30కు బయల్దేరి అదే రోజు రాత్రి 9.15కు పలాస చేరుకుంటుంది. అన్ని స్టేషన్లలో ఈ ప్యాసింజరు ట్రైను నిలుపుదల చేస్తారని ఒక ప్రకటనలో తెలియజేశారు. చదవండి: శ్రీ జగన్నాథునికి ఖొల్లి లగ్గి సేవ .. ఎలా చేస్తారు? -
Jagannath Rath Yatra శ్రీ జగన్నాథునికి ఖొల్లి లగ్గి సేవ
భువనేశ్వర్: జగన్నాథుడిని యాత్రకు సిద్ధం చేసేందుకు గోప్య సేవకుల వర్గం తలమునకలై ఉంది. గత 13 రోజులుగా స్వామి సోదరీ సోదరులతో కలిసి తెర చాటున గోప్య సేవలు పొందుతున్నాడు. ఆషాఢ కృష్ణ పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని స్వామి వారికి ఖొల్లి లగ్గి సేవ నిర్వహించారు. రాత్రి పూట ఈ సేవని చేపట్టారు. జ్వరం నుంచి ఉపశమనం పొందడంతో శారీరక దారుఢ్యం కోసం పలు లేపన సామగ్రి గోప్య మండపానికి తరలించడం ఖొల్లి లగ్గి సేవలో భాగం. శుద్ధ సువార్ సేవకుల ఇంటి నుంచి ఈ సామగ్రిని తీసుకుని వెళ్లడం ఆచారం. ముందు రోజు ద్వాదశి నాడు చీకటి పడిన తర్వాత శ్రీ మందిర సముదాయం విమలా దేవి పీఠం ఆవరణలో ఉన్న బావి నుంచి నీరు తోడుకుని పోయి స్వామి చికిత్స కోసం అవసరమైన లేపనాలు తయారు చేశారు. బాజా, తురాయి, ఘంటానాదంతో శుద్ధ సువార్ ఇంటి నుంచి శ్రీ మందిరానికి ఊరేగింపుగా ఔషధ సామగ్రిని సోమవారం తరలించారు. ఈ లేపన సామగ్రిని బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుని శ్రీ అంగాలకు పూర్తిగా అద్దుతారు. దీనితో శరీరం వజ్ర దారుఢ్యంతో మెరుస్తుంది. రూపుదిద్దుకుంటున్న జగన్నాథుని రథం ఈ నెల 27 నుంచి తొమ్మిది రోజుల పాటు జరగనున్న రథాయాత్ర కోసం రథం నిర్మాణం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రథం తయారీలో భాగంగా రంగులు అద్దే పనుల్లొ కళాకారులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది సుమారు 15 లక్షల రుపాయలను వెచ్చించి రథాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నహాలు చేస్తుంది. స్థానిక పాతబస్టాండు సమీపంలోని గుండిచా మందిరంలో పరిశుభ్రత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటుగా జగన్నాథ, బలభద్ర, శుభద్ర దేవతా మూర్తులు గుండిచా మందిరంలో ఉండి భక్తులకు దర్శంన ఇస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి తెలిపారు. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. తొమ్మిది రోజుల యాత్రలో భాగంగా గుండిచా మందిరానికి ఆనుకుని ఏర్పాటైన స్టాల్స్ వద్ద భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు పూర్తిగా ఉంటుందని వివరించారు. -
సేంద్రియ బియ్యంతో జగన్నాథునికి అమృతాన్న భోగం
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని దైనందిన భోగాల నివేదనలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది రథ యాత్ర మొదలుకొని స్వామి వారికి అమృత అన్న భోగం నివేదన ప్రారంభించనున్నారు. ఈ కార్యాచరణలో భాగంగా రథ యాత్ర నుంచి గుండిచా మందిరం అడపా మండపంలో కొఠొ భోగ సమయంలో మహా ప్రభువుకు అమృత అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం మందిరం ప్రధాన నిర్వాహకుడు (సీఏఓ) డాక్టర్ అరవింద కుమార్ పాడీ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బొడు సువార్, సువార్ మహాసువార్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సువార్ మహాసువార్ భోగ మండపంలో అమృత అన్నం ఉపయోగించాలని ప్రతిపాదించారు. మహా ప్రభువు భోగం తయారీలో అమత అన్నాన్ని ఉపయోగించడం గురించి గతంలో చర్చించి ప్రయోగాత్మకంగా ఈ చర్యని అమలు చేశారు. కొరాపుట్ ప్రగతి ఇనిస్టిట్యూట్ అమృత అన్నం బియ్యం సరఫరాకు మద్దతు ప్రకటించిందని సీఏఓ తెలిపారు. ఈ సంస్థ ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సేంద్రియ బియ్యంతో ప్రసాదం తయారీ.. మందిరంలో జగన్నాథుని అన్న ప్రసాదాలు మహా ప్రసాదంగా ప్రతీతి. ఈ ప్రసాదం సేంద్రియ బియ్యాన్ని ఉపయోగించి తయారు చేయాలని పాలక వర్గం నిర్ణయించడం ప్రత్యేకత సంతరించుకుంది. స్వామి నిత్య అన్న ప్రసాదాల తయారీలో సేంద్రియ బియ్యం వినియోగిస్తారు. ఈ బియ్యంతో వండిన ప్రసాదాల్ని అమృత్ అన్నం అనే ప్రత్యేక పేరుతో వ్యవహరిస్తారు. ఎటువంటి రసాయన ఎరువులు ఉపయోగించకుండా సహజమైన ఎరువులను ఉపయోగించి సాగు చేసిన బియ్యం మాత్రమే వినియోగిస్తారు. తొలి దశలో స్వామికి నివేదించే కొఠొ భోగ సేవలో మాత్రమే వినియోగిస్తారు. తదుపరి దశలో ఇతర అన్ని వంటకాల్లో ఈ బియ్యం వినియోగం బలపరుస్తారు. రాష్ట్రంలో రైతులు పండిస్తున్న కొళాజీర, పింపుడిబాసొ, యువరాజ్ మొదలైన సేంద్రియ బియ్యాన్ని అమృత అన్న మహా ప్రసాదంలో ఉపయోగిస్తారు. మందిరంలో రోజుకు 50 నుండి 55 క్వింటాళ్ల బియ్యంతో స్వామి మహా ప్రసాదం వంటకం అవుతుంది. ప్రత్యేక ఉత్సవాలు, పండగపబ్బాల సందర్భంగా రోజుకు 100 నుండి 200 క్వింటాళ్ల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అదనంగా కొఠొ భోగం కోసం ప్రతి రోజూ 100 కిలోల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అన్న మహా ప్రసాదానికి అధిక నాణ్యత గల బియ్యం వినియోగానికి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. పిండి వంటల ప్రసాదాల తయారీలో మసూరి బియ్యం కొనసాగుతుంది. క్రమంగా వీటి స్థానంలో అమృత్ అన్నం బియ్యం వినియోగించే యోచన ఉన్నట్లు పేర్కొన్నారు. పథకం ప్రకారం మందిరం అన్న ప్రసాదాల తయారీలో కొరత లేకుండా అమృత అన్నం బియ్యం సరఫరా చేసేందుకు కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాల భూమిలో సేంద్రియ వరి సాగు అవసరం అని అనుభవజ్ఞుల వర్గం పేర్కొంది. మందిరం పాలక వర్గం ఈ మేరకు సన్నాహాలు చురుగ్గా కొనసాగిస్తుంది.ఇదీ చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత -
మూలికా వైద్యం, కోలుకుంటున్న జగన్నాథుడు
భువనేశ్వర్: జ్యేష్ట పూర్ఠణిమ నుంచి అస్వస్థతకు గురైన శ్రీ జగన్నాథుడు తెర చాటున గోప్యంగా వైద్య సేవలు పొందుతున్నాడు. స్వామి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. మరో వైపు యాత్ర దగ్గర పడుతుంది. స్వామి ఆగమనం కోసం భక్త జనం నిరీక్షిస్తోంది. రాజ వైద్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాత్రింబవళ్లు ఉపచారాలు చేస్తున్నారు. శుక్రవారం పవిత్ర అనవసర దశమి సందర్భంగా శ్రీ మందిరంలో చక్కా విజే సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాటుల్ని రాతి పీఠంపైకి తరలించారు. ఇది స్వామి ఆరోగ్యం కోలుకుంటున్నట్లు సంకేతం. భోగ మండప సేవ పూర్తి అయిన తరువాత జయ, విజయ ద్వారం మూసివేసి బెహరణ్ ద్వారం తెరిచారు. ధుకుడి ద్వారం సమీపంలో ఉన్న మూడు స్తంభాకార పీఠాలను గోప్య సేవల ప్రాంగణానికి తరలించి వాటిపై మూల విరాట్లను పూజించడం చక్కా విజే సేవగా పేర్కొంటారు. దశ మూల మోదకాల వైద్యం ఆయుర్వేద పద్ధతులు, గ్రంథాల ప్రకారం జగతి నాథునికి వైద్యం కొనసాగుతుంది. ఆరోగ్య స్థితిగతులకు అనుగుణంగా వైద్య శైలిని సమయోచితంగా సవరించుకుని ఔషదీయ పదార్థాల్ని నివేదిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం స్వామి కోసం దశ మూలికల మోదకం తయారు చేశారు. శ్రీ మందిరం రాజ వైద్య సేవకులు తరతరాలుగా మహా ప్రభువుని సేవిస్తున్నారు. ఈ మహా ఔషధిని సిద్ధం చేయడంలో పది రకాల ఔషధీయ మూలికల్ని వినియోగించడం విశేషం. ఈ మిశ్రమంతో తయారు చేసిన ఔషధాన్ని వేర్వేరుగా 3 మట్టి పాత్రల్లో పేర్చి వాటిపై కర్పూరం చల్లి మూతబెట్టి శ్రీ మందిరంలో గోప్య సేవలు అందజేస్తున్న వర్గాలకు అందజేశారు. (Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత)ఆషాఢ కృష్ణ పక్ష దశమి రోజున మూడు రాతి పీఠాలపైకి చేర్చిన మర్నాడు సంప్రదాయం ప్రకారం దేవ దేవుళ్ల కోసం రాజ వైద్యుల కుటుంబీకులు తయారు చేసిన దశ మూలికల ఔషధాన్ని వైద్యంలో భాగంగా నివేదిస్తారు. ఆషాఢ కృష్ణ పక్ష ఏకాదశి నాడు మూల విరాటులకు పతి మహాపాత్రొ వర్గం సేవకులు వీటిని సమర్పిస్తారు. పవిత్ర ఏకాదశి తిథి నాడు రాత్రి పూట ఆలయ వైద్యుడి సలహా మేరకు పతి మహాపాత్రో సేవకులు వీటిని సమర్పిస్తారు.కోలుకుంటున్న జగన్నాథుడు -
ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేను
సివాన్: నిత్యం ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాత్రి పగలు ప్రజల కోసమే పని చేస్తున్నానని చెప్పారు. ఆయన శుక్రవారం బిహార్, ఓడిశాలో పర్యటించారు. తొలుత బిహార్‌లోని సివాన్ జిల్లాలో రూ.5,900 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. బిహార్‌లోని పాటలీపుత్ర జంక్షన్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వరకు నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఆర్జేడీ అవమానించిందని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలను అంబేడ్కర్ వ్యతిరేకించారని గుర్తుచేశారు. అందుకే అంబేడ్కర్ అంటే ఆర్జేడీ, దాని మిత్రపక్షాలకు ఇష్టం లేదన్నారు. బాబాసాహెబ్ చిత్రపటాన్ని ఆర్జేడీ నేతలు పాదాలతో తొక్కేశారని, దీనిపై క్షమాపణ చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తే ఏమాత్రం స్పందించలేదని మండిపడ్డారు. అంబేడ్కర్ కంటే తామే గొప్పవాళ్లమని ఆర్జేడీ–కాంగ్రెస్ నాయకులు అహంకారం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అంబేడ్కర్ తన హృదయంలో ఉన్నాడని, ఆయన చిత్రపటాన్ని గుండెకు హత్తుకోవడం తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు కొల్లగొట్టడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ కాచుకొని కూర్చున్నాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాం ‘‘భారతదేశ ప్రగతిని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. నిన్ననే విదేశాల నుంచి తిరిగొచ్చా. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి నేతలు మన దేశ అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రశంసించారు. పేదల సాధికారతకు ఎదురవుతున్న అడ్డంకులను ఎన్డీయే ప్రభుత్వం తొలగిస్తోంది. గత 11 ఏళ్లుగా ప్రజాసేవలో నిమగ్నమయ్యాం. అభివృద్ధి కోసం అహోరాత్రులూ శ్రమిస్తున్నాం. బిహార్‌లో మళ్లీ జంగిల్‌రాజ్ రావొద్దంటే విపక్ష ఇండియా కూటమి ఓడించాలి. ఎన్డీయే నినాదం సబ్కా సాత్, సబ్కా విశ్వాస్. విపక్ష కూటమి నినాదం పరివార్‌కా సాత్, పరివార్‌కా వికాస్. సొంత కుటుంబాల అభివృద్ధి తప్ప ప్రజలంటే వారికి లెక్కలేదు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం కాదా?’’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. భువనేశ్వర్‌లో తిరంగా యాత్ర ప్రధాని మోదీ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో తిరంగా యాత్ర, రోడ్‌షోలో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి జనతా మైదాన్ వరకు 9 కిలోమీటర్ల మేర జరిగిన ఈ యాత్రలో వేలాది మంది ప్రజలు భాగస్వాములయ్యారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భంగా తిరంగా యాత్ర నిర్వహించారు. రూ.18,600 కోట్లకుపైగా విలువైన 105 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ట్రంప్ ఆహ్వానం తిరస్కరించా.. వాషింగ్టన్లో పర్యటించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించగా, తాను తిరస్కరించానని ప్రధాని మోదీ చెప్పారు. వాషింగ్టన్ పర్యటనకు బదులు ఒడిశాను ఎంచుకున్నానని తెలిపారు. భువనేశ్వర్ సభలో ఆయన మాట్లాడారు. ‘‘జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్ నాతో ఫోన్లో మాట్లాడారు. వాషింగ్టన్కు రావాలంటూ ఆహ్వానించారు. చర్చించుకుందామని, కలిసి భోజనం చేద్దామని అన్నారు. ఆహ్వానించినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలియజేశా. జగన్నాథుడు కొలువుదీరిన ఒడిశాకు వెళ్లాల్సి ఉందని చెప్పా. వాషింగ్టన్కు రాలేనంటూ ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించా’’ అని ప్రధానమంత్రి వెల్లడించారు. -
Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత
Jagannath Yatra 2025 జగన్నాథ రథయాత్ర 2025 ఒడిశాలోని పూరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగన్నాథ రథయాత్రను ప్రతి భారతీయుడు కనీసం ఒక్కసారైనా చూసి తరించాలని భావించే ఆధ్యాత్మిక సందర్భం. దేశ, విదేశాల నుంచీ ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు జగన్నాథ రథయాత్రను చూసి తరిస్తారు. ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర ఎప్పుడు జరుగుతుంది.ఉత్సవ విగ్రహాలకు బదులుగా సాక్షాత్తు గర్భగుడిలో ఉండే విగ్రహమూర్తులేప్రత్యేకంగా తయారు చేసిన మూడురథాల్లో (జగన్నాథుడు, బలభద్రుడు , సుభద్ర దేవి) యాత్ర ద్వారా ఒడిశాలోని పూరి వీధుల గుండా ఊరేగడం ఇక్కడి విశేషం. ఈ ఉత్సవంలో ఒవేలాది మంది భక్తులు లాగుతున్న మూడు భారీ చెక్క రథాలు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, గొప్ప రథయాత్ర. అందుకేబ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం లాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Sudarsan pattnaik (@sudarsansand) జగన్నాథ రథయాత్ర చరిత్ర 5 వేల సంవత్సరాల నాటిదనీ, ప్రస్తుత రూపం 12వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగ రాజు ప్రస్తుత జగన్నాథ ఆలయాన్ని నిర్మించినప్పుడు రూపుదిద్దుకుందని చెబుతారు. ప్రతి సంవత్సరం కొత్త కలపతో రథాన్ని తయారు చేయడం ఈ రథయాత్ర మరో ప్రత్యేకత. ఈ యాత్రలో రథం తాడును లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పక్ష రెండవ రోజు నుండి పూరీ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం జగన్నాథ రథయాత్ర జూన్ 27 ప్రారంభమవుతుంది. ఈ యాత్రకు ముందు అనేక శుభ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనాయి.. రథం నిర్మాణం నుండి స్నాన పూర్ణిమ వరకు, జగన్నాథుడు, బలభద్రుడు ,సుభద్రలను 108 కలశాలతో స్నానం చేస్తారు. దీని తరువాత, జూన్ 26న గుండిచ ఆలయం శుభ్రం చేయబడుతుంది. గుండిచ ఆలయం అనేది దేవుని అత్తగారిల్లు. రథయాత్రలో భాగంగా జగన్నాథుడు తన అత్త ఇంటికి వెళ్లి, ఆమరుసటి రోజు అంటే జూన్ 27న రథయాత్రను నిర్వహిస్తారు. ఈ రోజున, భగవంతుడు శ్రీమందిర్ నుండి మూడు గొప్ప రథాలలో గుండిచ ఆలయానికి బయలుదేరుతాడు. రథయాత్ర తొమ్మిది రోజుల పాటు కొనసాగిన తిరుగు ప్రయాణం, బహుద యాత్ర జూలై 5న సాగుతుంది. ఈ సందర్భంలో జగన్నాథుడు మళ్ళీ సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రతో కలిసి శ్రీమందిర్‌కు బయలుదేరుతాడు.ప్రతి రథానికి ఒక ప్రాముఖ్యత ఉంది.నందిఘోష (జగన్నాథుని రథం)"విశ్వ ప్రభువు" అయిన జగన్నాథుడు మూడు రథాలలో అత్యంత గొప్పదైన నందిఘోష రథంలో స్వారీ చేస్తాడు. దాని పేరు సూచించినట్లుగా, అది కదిలేటప్పుడు ఆనందకరమైన శబ్దం చేస్తుంది. మూడు రథాలు వరుసలో ఉన్నప్పుడు అతని రథం ఎల్లప్పుడూ కుడి వైపున ఉంచుతారు.తాళధ్వజ (బలభద్ర ప్రభువు రథం)జగన్నాథుని అన్నయ్య అయిన బలభద్రుడు తాళధ్వజ రథంలో ప్రయాణిస్తాడు. "తలధ్వజ" అనే పేరు దాని జెండాపై ఉన్న తాళ వృక్షాన్ని సూచిస్తుంది. బలరాముడి రూపంగా పరిగణించబడే బలభద్రుడు ఈ రథంలో స్వారీ చేస్తాడు. అతని రథం సాధారణంగా ఊరేగింపులో ఎడమ వైపున ఉంచుతారు.దర్పదలన (సుభద్రాదేవి రథం)అతి చిన్నదైనప్పటికీ అత్యంత అలంకరించబడిన రథం జగన్నాథుడు మరియు బలభద్రుని సోదరి అయిన సుభద్ర దేవికి చెందినది. "దర్పదలన" అనే పేరుకు "గర్వాన్ని నాశనం చేసేది" అని అర్థం, దేవత తన భక్తుల నుండి అహాన్ని ఎలా తొలగిస్తుందో చూపిస్తుంది. పండుగ సమయంలో సుభద్ర దేవి రథాన్ని ఆమె సోదరుల రథాల మధ్య ఉంచుతారు. ఆమె స్త్రీ దైవిక శక్తిని సూచిస్తుంది . మహిళా భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారు.ప్రతి రథం కోసం దాదాపు 1,000 చెక్క ముక్కలను ఉపయోగిస్తారు. నిర్మాణానికి దాదాపు రెండు నెలలు పడుతుంది. విశేషమేమిటంటే, ఈ భారీ నిర్మాణాలు ఎటువంటి లోహపు మేకులు లేదా ఫాస్టెనర్లు లేకుండా తయారు చేస్తారు. "మహారాణులు" అని పిలువబడే కళాకారుల తరతరాలుగా అందించబడిన సాంప్రదాయ కలపడం పద్ధతులను ఉపయోగించి వీటిని రూపొందిస్తారు. శ్రీ జగన్నాథునికి లేహ్య సేవఈ రథయాత్రకు సంబంధించిన రథాల తయారీ దాదాపు తుది దశకు చేరుకుంది. అలాగే ఆ యాత్రంలోభాగంగా జన్నాథునికి లేహ్య సేవ ఘనంగా నిర్వహించారు. స్నాన పూర్ణిమనాడు భారీ స్నానం చేసిన తర్వాత శ్రీ జగన్నాథుడు, అతని తోబుట్టువులు అస్వస్థతకు గురయ్యారు. వారు త్వరగా కోలుకోవడానికి ఆలయ రాజ ఆయుర్వేద వైద్యుల మార్గదర్శకత్వంలో వివిధ రకాల మూలికా ఔషధాలతో చికిత్స కొనసాగిస్తున్నారు. దేవతలు ప్రస్తుతం అనవసర మండపంపై కొలువు దీరి గోప్య సేవలు పొందుతున్నారు. ఈ సేవల్లో ప్రత్యేకంగా తయారుచేసిన నూనెలు, మూలికా ఔషధాలు వాడతారు. ఈ సమయంలో స్థానిక మూలికలు మరియు వేర్లతో తయారు చేసిన ఔషధాలు, పండ్ల రసాలు మూల విరాట్లకు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో మంగళ వారం ఒస్సా లగ్గి (తైల పూత) ఉపచారంతో సేవలు అందించారు. సుధ సువారో సేవక వర్గం తయారు చేసిన ఒస్సా అనే ప్రత్యేక వైద్యాన్ని దేవతలకు అందజేశారు. మంగళ వారం అపరాహ్న ధూపం తర్వాత దేవతలకు ఒస్సా లగ్గి నిర్వహణ సన్నాహాలు ప్రారంభించారు. దైతపతి సేవకులు రాత్రి పూట ఈ చికిత్స నిర్వహించారు. -
Puri Rath Yatra 2025: వస్తున్నాయ్..జగన్నాథ రథచక్రాల్
భువనేశ్వర్: ఈ ఏడాది జరగనున్న పూరీ జగన్నాథుని రథ యాత్రకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. యాత్ర సమీపిస్తుండటంతో, జగన్నాథుని రథాల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. పూరిలోని రథ ఖాలా వద్ద శ్రీ జగన్నాథుని రథం నందిఘోష బలభద్రుని తాళ ధ్వజం, దేవీ సుభద్ర దర్ప దళనం అనే 3 రథాలు శ్రీ మందిరం శిఖరంతో సరిసమానంగా ఎదుగుతున్నట్లు అబ్బురపరుస్తున్నాయి. శ్రీ జగన్నాథ స్వామి యాత్ర తయారీ కార్మిక విభజనకు నిలువెత్తు తార్కాణం. అట్టడుగు నుంచి నిలువెత్తు వరకు రథాల తయారీ పనులు గొలసు కట్టుగా కొనసాగుతున్నాయి. రథాల తయారీ శాలలో వడ్రంగులు, చేతి వృత్తులవారు, ముఖ్యంగా మహరణ, భోయి సేవకులు సంప్రదాయ గడువు ప్రకారం కట్టుదిట్టమైన ఆచార వ్యవహారాలతో ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. 3 రథాల పనులు ఒకే క్రమంలో నిబద్ధతతో నిర్వహించడంతో ఒకే స్థాయిలో అంచెలంచెలుగా తయారీ పూర్తవుతుంది. ఒక్కో రథం బహుళ అంతస్తు భవనాన్ని పోలి ఉంటుంది. రథంపై భగవంతుని పీఠం పైభాగాన 3 మిద్దెలతో రథాల తయారీ నింగిని తాకే ఊపుతో ఎదుగుతుంది. ప్రతి రథం యొక్క మూడవ మరియు చివరి మిద్దె (ఒఘా భూయి) తయారీ పూర్తయ్యింది.భద్రతకు ప్రాధాన్యత: సంప్రదాయబద్ధంగా వడ్రంగుల చేతిలో తయారు అవుతున్న 3 భారీ రథాల్లో ప్రతి అంశాన్ని అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. శ్రీ మందిరం సింహ ద్వారం నుంచి గుండిచా మందిరం వరకు పోకరాకలు చేయాల్సిన రథాలకు చక్రాలకు మూలాధారం. వీటి పటిష్టతకు భద్రత కల్పించే దిశలో చక్ర రక్షకులు (పొరా భొఢి) తయారీ పనులు పూర్తి కావస్తున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న దైవిక ప్రయాణానికి రథాల తయారీ సింహ భాగం పూర్తయ్యింది.నేల నుంచి నింగికి: జతతి నాథుడు యాత్ర చేసే రథం నేల నుంచి నింగికి ఎగసినట్లు తయారవతుంది. చక్రాల నుంచి రథ శిఖరం వరకు అందం కనులు మిరమిట్లు గొలుపుతుంది. ఈ అందాన్ని ఆవిష్కరించడంలో క్లిష్టమైన కళాత్మక రంగుల మేళవింపుతో అలంకరించడంలో చిత్రకారులు హుషారుగా పని చేస్తున్నారు. రథం పార్శ్వ తోరణాల్ని (పట్టొ గుజొ) సేవకులు సాంప్రదాయ మూలాంశాలను రూపకారులు చెక్కుతున్నారు. నలువైపులా అలంకృత చెక్కలు: రథం అందాల్ని ప్రతిబింబించడంలో నలు వైపుల ఆకర్షణీయమైన అలంకార చెక్క తోరణాల (ఫొటొలొ) అమరిక కీలకమైన నైపుణ్యత. రథాలపై నిలిపిన మిద్దెలు పట్టు కోల్పోకుండా దిట్టంగా ఉండేందుకు అంతర్భాగంలో వంపు తిరిగిన చెక్కల్ని (సేని) ఆధారంగా జోడిస్తున్నారు. -
పాటనుకుంటివా.. ఫైర్ ఇంజన్లు..!
అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ యేడాది ఒడిశా (Odisha) 4,500 హెక్టార్లకు (11,120 ఎకరాలు) పైగా అడవులను మంటలు (wildfires) ప్రభావితం చేశాయి. ఈ సమస్య ప్రతి యేటా ఎదుర్కొనేదే. అధికారులు సీసీ కెమెరాలు, ఉపగ్రహ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మంటలను ట్రాక్ చేస్తున్నారు. అడవిలో ఎండు ఆకులను కాల్చడం వల్ల కూడా వేడిగాలులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఈ మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఆర్పడం మరింత కష్టతరం అవుతోంది. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నుంచి గ్రామ ప్రజలను రక్షించడం కోసం ఒకప్పుడు పురుషులు జట్లు జట్లుగా కలిసి ఊళ్లన్నీ తిరిగి పాటలుపాడి అగ్నిప్రమాదాలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను స్త్రీలు స్వీకరించడమే కాదు. మరింత బాగా అవగాహన కల్పిస్తూ... ప్రమాదాల నుంచి రక్షిస్తున్నారని కియోంఝర్ జిల్లాలోని అటవీ డిప్యూటీ పరిరక్షకుడు హనుమంత్ ధమ్‌ధేరే అన్నారు.ఒడిషా రాష్ట్రంలోని ముర్గపహాడి గ్రామంలోని మహిళలు సంవత్సరాల తరబడి నిశ్శబ్దంగా పొలం పనులు, పిల్లలను సాకడం చేస్తుండేవారు. దీంతోపాటు అడవుల్లో పువ్వులు, కట్టెలు సేకరిస్తుంటారు. ఉపాధి లేనప్పుడు వారి భర్తలు నగరాల్లో పని చేస్తుంటే వీళ్లు ఇళ్లను నడిపిస్తుండేవారు. రెండేళ్లుగా మహిళలు కూడా బృందాలుగా చేరి, పాటలుపాడుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇది వారి స్వీయ గౌరవాన్ని పెంచడమే కాదు సమాజంలో వారి పాత్రను మరింత బలపరుస్తోంది.సంప్రదాయ గీతాలతో ఆధునిక పరిష్కారంఈ ప్రయత్నం ఫలితంగా అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు 20–30 శాతం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ధమ్‌ధేరే కొన్ని మహిళా సంకీర్తన బృందాలను చేర్చుకున్నారు. ఈ బృందాలు స్థానిక భాషలలో కాపాడతాయి. వాటిని స్థానిక ప్రజలు సులభంగా అర్థం చేసుకోవడంతోపాటు అవగాహనతో అటవీ పరిరక్షణకు పాటు పడుతుంటారు. ఈ పని చేసినందుకు గాను ఈ బృందాలకు అటవీశాఖ నుంచి ఆదాయం కూడా లభిస్తుంది.సాంస్కృతిక పునరుద్ధరణసంకీర్తన మండళ్ళు 15వ శతాబ్దం నుంచి ఉన్న సంప్రదాయ గీతాల సమూహాలు. ఈ సంప్రదాయాన్ని ఆధునిక అవసరాలకు అన్వయించి, పర్యావరణ పరిరక్షణలో ఉపయోగిస్తున్నారు. దీన్ని ఒక సాంస్కృతిక పునరుజ్జీవనంగా పరిగణించవచ్చు. అయితే, సంకీర్తన మండలి బృందాలలో సాధారణంగా పురుష గాయకులు, నృత్యకారులు ఉండేవారు. వీరు డ్రమ్స్ వాయించడం, మతపరమైన భక్తిపాటలు పాడేవారు. ‘గ్రామాల్లోని పురుషులు ఫ్యాక్టరీలలో పని చేయడానికి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లినప్పుడు సంకీర్తన మండళ్ళు దాదాపుగా పనిచేయడం లేదు. మేం దానిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాం’ అని ముర్గపహాడిలోని బృందానికి నాయకత్వం వహిస్తున్న 35 ఏళ్ల ప్రమీలా ప్రధాన్ చెప్పారు. ప్రధాన్ బృందంలో 17 మంది ఉండగా, వారిలో తొమ్మిదిమంది మహిళలు ఉన్నారు.పురుషులు ఈ మండళ్ళను వదిలి వెళ్లాక, గ్రామీణ మహిళలు ‘సంకీర్తన మండలి’ అనే సంప్రదాయ సంగీత సమూహాన్ని మళ్లీ ప్రారంభించారు. ఈ గీతాలు దేవుని గురించి మాత్రమే కాక, ప్రకృతి పరిరక్షణ, అగ్నిప్రమాదాల నివారణ వంటి సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తాయి. ఇది ఒకవైపు వారిని సాధికారతవైపుకు తీసుకెళ్తుండగా, మరోవైపు పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడుతోంది.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకంఉపాధి గీతాలురాష్ట్రంలో దాదాపు 20,000 సంకీర్తన బృందాలు ఉండగా వాటిలో కనీసం 1,000 బృందాలు మహిళలే నిర్వహిస్తున్నారు. అటవీ మంటలు వారి ఆదాయాలను, పిల్లల పోషణను ప్రభావితం చేస్తున్నాయని మహిళలు అంటున్నారు. ‘కుటుంబ పోషణ కోసం అడవిదుంపలు, ఆకుకూరలు, పుట్టగొడుగులను సేకరిస్తాం. పెద్ద అగ్నిప్రమాదం జరిగితే, ప్రభుత్వం నుంచి మాకు లభించే బియ్యంతోనే సరిపెట్టుకోవాలి. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేలా సంకీర్తన మండలిలో చేరినందుకు మాకు ఉపాధి కూడా లభిస్తోంది‘ అని 42 ఏళ్ల బాలమతి చెప్పారు. చదవండి: మాల్యా లగ్జరీ విల్లాను దక్కించుకున్న బాలీవుడ్ జంట ఎవరో తెలుసా?కేతకి నాయక్‌కి 10 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. ఇప్పుడు ఆమెకు పాతికేళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘నా చిన్నతనంలో పాటలు పాడేదాన్ని. పెళ్లయ్యాక నా నోరు మూతపడిపోయింది. ఇప్పుడు బృందంలో చేరి, ఊరంతా తిరిగి పాటలు పాడుతున్నాను. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు’ అని ఆనందంగా చెబుతుంది. ఇప్పుడు ఈ మండళ్ళలో యువతులు, విద్యార్థులు కూడా చేరి శిక్షణ తీసుకుంటున్నారు. దీని ద్వారా తరువాతి తరం అడవుల పరిరక్షణకు ఏం చేయగలరో నేర్చుకుంటున్నారు. ఇదీ చదవండి: Food Safety ఆహార భద్రతకు 5 శక్తివంతమైన ప్రయోజనాలు -
కిటికీలోంచి నోట్ల కట్టలను విసిరేసిన చీఫ్ ఇంజినీర్
భువనేశ్వర్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణ ఆధారంగా చేపట్టిన దాడుల్లో విజిలెన్స్ విభాగం భారీ స్థాయిలో నగదు స్వాధీనపరచుకుంది. ఈ దాడుల్లో రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజినీరు బైకుంఠ నాథ్ షడంగికి సంబంధించిన ఆస్తులపై పలు చోట్ల శుక్ర వారం విజిలెన్సు వర్గాలు సోదాలు నిర్వహించారు. నిందితుడు ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నట్లు సమాచారం. విజిలెన్స్, ఎనిమిది మంది డిఎస్పీలు, 12 మంది ఇన్స్పెక్టర్లు, 6 మంది సహాయ సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సహాయక సిబ్బంది అంగుల్ విజిలెన్స్ ప్రత్యేక న్యాయమూర్తి జారీ చేసిన సెర్చ్ వారెంట్ల ఆధారంగా సోదాలు నిర్వహించారు. అంగుల్, భువనేశ్వర్, పిప్పిలి (పూరీ) తదితర 7 ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు. విజిలెన్స్ అధికారులను చూడడంతో బైకుంఠ నాథ్ షడంగి భువనేశ్వర్‌లోని తన ఫ్లాట్ కిటికీలోంచి రూ. 500 నోట్ల నగదు కట్టలను బయటకు రువ్వేసినట్లు ఆరోపణ. అంగుల్‌లోని షడంగి ఉంటున్న ఇంటి నుంచి రూ.1.30 కోట్లు, భువనేశ్వర్‌లోని అతని ఫ్లాట్ నుంచి రూ.1.21 కోట్లు సమగ్రంగా రూ. 2.51 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికార వర్గాల సమాచారం. నిందితుడు షేర్ మార్కెట్లో భారీగా రూ. 2.70 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సోదాల్లో తేలింది. విజిలెన్స్ దాడుల సమయంలో 2 బహుళ అంతస్తుల భవనాలు, రెండు ఫ్లాట్లు, 7 అధిక విలువైన ప్లాట్లు, బీమా, రూ. 1.5 కోట్ల విలువైన బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు కనుగొన్నారు. -
సీబీఐ వలలో ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రఘువంశీ
ఒడిశా: లంచం తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీ సీబీఐ వలకు చిక్కారు. రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు 2013 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి అయిన రఘువంశీ, ఓ మైనింగ్ కేసుకు సంబంధించి.. భువనేశ్వర్‌కు చెందిన ఓ వ్యాపారి వద్ద నుంచి రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు.ఏడాదిన్నరగా రఘువంశీ భువనేశ్వర్ జోనల్ కార్యాలయంలో ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రఘువంశీని అరెస్ట్ చేసిన అధికారులు.. భువనేశ్వర్‌లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నారు. ధెంకనల్‌కు చెందిన స్టోన్ మైనింగ్ ఆపరేటర్ రతికంత రౌత్‌పై గతంలో ఒక ఈడీ కేసు నమోదైంది.ఈ కేసులో అతని వద్ద నుంచి రఘువంశీ రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రూ.5 కోట్ల లంచంలో భాగంగా మొదటి వాయిదా కింద రూ.20 లక్షలు.. రఘువంశీకి రౌత్ ఇస్తున్నట్లు సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు.. వల వేసి రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. -
అపార్ట్మెంట్ కిటికీ నుంచి 500 నోట్ల వర్షం.. ఏమైందో తెలిసే లోపే ట్విస్ట్..
భువనేశ్వర్: ఒక ప్రభుత్వ ఇంజినీర్ ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. భారీ అవినీతి తిమింగలం విజిలెన్స్‌కు చిక్కింది. విజిలెన్స్ అధికారులు తన ఇంటికి వస్తున్నారన్న విషయం తెలుసుకుని సదరు అధికారి.. ఇంట్లోని నోట్ల కట్టలను కిటికీలోంచి బయటపడేశాడు. ఆ కరెన్సీ నోట్ల వర్షంతో స్థానికులు అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో బైకుంఠనాథ్ సారంగి చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు.. సోదాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి ఒడిశాలోని అంగుల్, భువనేశ్వర్, పూరిలోని పిపిలి సహా మొత్తం ఏడు ప్రాంతాల్లోని సారంగి నివాసాలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు.Odisha Vigilance Raids Chief Engineer of RW Division in DA Case, ₹2.1 Crore Cash Seized@odisha_police pic.twitter.com/fNqSsIveqT— Dr.Somesh Patel🇮🇳 (@SomeshPatel_) May 30, 2025 ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు తన ఫ్లాట్ వద్దకు రాగానే సారంగి ఇంట్లోని నోట్ల కట్టలను కిటికీలోంచి బయటకు పడేశాడు. కింద వెళ్తున్న వారు కిటికిలో నుంచి పడుతున్న నోట్లను చూసి ఖంగుతున్నారు. అనంతరం, నగదును అధికారులు రికవరీ చేశారు. ఈ సోదాల్లో భాగంగా రూ.రెండు కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా 26 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. వారు నోట్ల కట్టలు లెక్క పెడుతోన్న ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి.#WATCH | Bhubaneswar: Odisha Vigilance Department conducted searches at 7 locations of Odisha Rural Works Division Chief Engineer, Baikuntha Nath SarangiAbout Rs 1 crore has been recovered from his flat in Bhubaneswar, while about Rs 1.1 crore has been recovered from his… pic.twitter.com/n8MQxYfU0L— ANI (@ANI) May 30, 2025 Odisha Vigilance Raids on Chief Engineer Baikuntha Nath Sarangi working in RW Dept over disproportionate assetsVigilance recovered approximately Rs. 2.1 crore cash Sarangi threw several bundles of Rs. 500 notes from his Bhubaneswar flat window upon seeing vigilance officers pic.twitter.com/CO3dnWWv8K— S U F F I A N (@iamsuffian) May 30, 2025 -
రోడ్డు పక్కన వదిలేస్తే చేరదీసింది.. అదే ఆమె పాలిట శాపమైంది!
రోడ్డు పక్కన అనాథగా పడి ఉన్న పసికందును మానవత్వంతో ఓ మహిళ చేరదీసింది. చదువు కూడా చెప్పించి.. ఆ బాలికను పెంచి పెద్ద చేసింది. అలా చేయడం.. ఆ మహిళకు శాపమైంది. చివరికి ప్రాణాలు కోల్పోయాంది. ప్రేమ మైకంలో ఓ బాలిక తన పెంపుడు తల్లిని హతమార్చింది. ఈ మర్డర్ మిస్టరీని పోలీసు అధికారులు ఛేదించారు. ఎస్పీ జ్యోతీంద్ర పండా ఆదర్శ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. స్థానిక తెలుగు సొండి వీధిలో రాజ్యలక్ష్మీ కోరో (54) గత నెల 26న అనుమానాస్పదంగా చనిపోయింది. మృతురాలి పెంపుడు కూతురు పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తన ప్రియుడు, స్నేహితుని సహాయంతో మృతదేహాన్ని తరలించింది.ఈ విషయం భువనేశ్వర్‌లో ఉన్న మృతురాలి సోదరుడు ప్రసాద్ మిశ్రాకు ఫోన్ చేసి తెలియజేశారు. ఈ లోగా పెంపుడు కూతురు, అతని ప్రియుడు కలిసి పోలీసు కేసు కాకుండా చూసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో భువనేశ్వర్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు కొద్ది నెలలుగా గణేష్ రథ్ (21) అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. దీన్ని గమనించిన తల్లి ఆమెను మందలించింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో పాటు స్నేహితుడు దినేష్ సాహు అలియాస్ అమన్ సాయంతో తల్లిని చంపడానికి పథకం పన్నారు.పథకం ప్రకారం ఏప్రిల్ 26న ఆమె నిద్రిస్తున్న సమయంలో దిండు సహాయంతో ఇద్దరు స్నేహితులు చంపి, నగదు, బంగారం దొంగిలించి పారిపోయారు. సోదరి చనిపోయాక ఆమె పెంపుడు కూతురిలో మార్పులు గమనించిన ప్రసాద్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు నిందితురాలిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు.దీంతో హత్య జరిగినట్లు నిర్ధారించారు. నిందితులందరినీ గుర్తించి వారిని అరెస్టు చేసి విచారించగా రాజలక్ష్మీ కోరోకు మత్తు మందు ఇచ్చి ఎలా చంపారో వారే పోలీసులకు వివరించారు. మృతురాలి ఇంటి నుంచి 7 తులాల బంగారం వస్తువులు, రూ.60 వేలు నగదు చోరీ కాగా 2.6 గ్రాముల బంగారం, మూడు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ జ్యోతీంద్రనాథ్ పండా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. నిందితులు ఇద్దరు గణేష్ రోథో, దినేష్ సాహులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. -
రేణిగుంటలో 24.5 కిలోల గంజాయి స్వాధీనం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): ఒడిశా నుంచి కేరళకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పశ్చిమ బెంగాల్ మహిళలను రేణిగుంట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రేణిగుంట లాడ్జిలో ఉన్న వారి వద్ద నుంచి 24.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం తిరుపతి జిల్లా ఏఎస్పీ రవిమనోహరాచారి తెలిపిన వివరాల మేరకు.. పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు రైల్వేస్టేషన్ సమీపంలోని ఎస్బీఎస్ లాడ్జిలోని 207 గదిలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జయచంద్ర, ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో సోదాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమోని మొండాల్ (31), నమితా మొండాల్ (37) లను అదుపులోకి తీసుకుని, రెండు సూట్‌కేస్‌లలో ఉన్న రూ.2.45 లక్షల విలువ చేసే 24.5 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి రైల్లో కేరళ తీసుకెళుతుండగా వారి సంబం«దీకుల నుంచి సూచన రావడంతో రేణిగుంటలో దిగి లాడ్జిలో బస చేశారు.వారిద్దరినీ అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో వారు చెప్పిన ఇద్దరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి సీఐ జయచంద్ర, సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు. -
పాక్ సిబ్బందితో భారత్‌కు నౌక
పారాదీప్: సింగపూర్ మీదుగా దక్షిణకొరియా నుంచి భారత్‌కు వచ్చిన చమురు రవాణా నౌకలో మొత్తం సిబ్బందిలో 21 మంది పాక్ జాతీయులు ఉన్నట్లు తేలడంతో ఒడిశాలోని పారాదీప్ ఓడరేవులో ఒక్కసారిగా కలకలం రేగింది. పరస్పర సైనిక చర్యలతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ వ్యతిరేక వర్గాలు నౌకాశ్రయానికి చేరుకుని ఆందోళన చేపట్టకుండా ఉండేందుకు పోర్ట్ అధికారులు వెంటనే అలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం విదేశాల నుంచి తీసుకొచ్చిన ముడి చమురును నౌక నుంచి కిందకు దింపే వరకు నౌకాశ్రయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు చేపట్టారు. పారాదీప్ పట్టణంలో ఒడిశా పోలీసులు వెంటనే భద్రతను పెంచారు. 25 మంది సిబ్బందితో ‘ఎంటీ సైరన్ ఐఐ’ పేరున్న సరకు రవాణా నౌక బుధవారం తెల్లవారుజామున పారాదీప్ పోర్ట్‌కు రాగానే అధికారులు సిబ్బంది గురించి వాకబుచేశారు. వీరిలో ఒక శ్రీలంకన్, ఒక థాయిలాండ్ దేశస్తుడు, ఇద్దరు భారతీయులు, 21 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇమిగ్రేషన్శాఖ నుంచి సంబంధిత సమాచారాన్ని ఒడిశా మెరైన్ పోలీస్‌కు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు చేరవేశామని మెరైన్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ బబితా చెప్పారు. ప్రస్తుతం ఓడ నౌకాశ్రయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రజలాల్లో లంగరు వేసి ఉంది. క్రూడ్ ఆయిల్ అన్లోడింగ్ అవగానే సిబ్బందితో నౌక వెళ్లిపోతుందని జగత్సింగ్పూర్ ఎస్పీ భవానీశంకర్ స్పష్టంచేశారు. అప్పటిదాకా పాకిస్తాన్ సిబ్బందిని నౌక నుంచి బయటకు అనుమతించబోమని చెప్పారు. -
భార్గవాస్త్రం సిద్ధం
న్యూఢిల్లీ: ప్రత్యర్థి దేశాల డ్రోన్లు, మానవ రహిత గగనతల వాహనాలను తుత్తునియలు చేసే స్వదేశీ కౌంటర్–డ్రోన్ సిస్టమ్ ‘భార్గవాస్త్ర’ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల రూపంలో ఎదురవుతున్న ముప్పును సమర్థంగా తిప్పికొట్టడంలో గొప్ప ముందడుగు వేసింది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్(ఎస్‌డీఏల్) అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ల నిరోధక వ్యవస్థను ఒడిశా రాష్ట్రం గోపాల్‌పూర్‌లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్(ఏఏడీ) అధికారుల సమక్షంలో మంగళవారం పరీక్షించారు. మొత్తం మూడు ట్రయల్స్ నిర్వహించగా, అన్నీ విజయవంతమయ్యాయి. ఎక్కడా గురి తప్పలేదు. ‘భార్గవాస్త్ర’లోని నాలుగు మైక్రో రాకెట్లు అన్ని నిర్దేశిత లక్ష్యాలను ఛేదించాయి. తొలుత రెండు రాకెట్లను వేర్వేరుగా ఫైర్ చేశారు. దాంతో రెండు ట్రయల్స్ పూర్తయ్యాయి. మూడో ట్రయల్‌లో భాగంగా.. మరో రెండు రాకెట్లను ఒకేసారి సాల్వో మోడ్‌లో కేవలం రెండు సెకండ్ల వ్యవధిలోనే పరీక్షించారు. నాలుగు రాకెట్ల పనితీరూ అద్భుతంగా ఉన్నట్లు తేలింది. అవి నిర్దేశిత లాంచ్ పారామీటర్లను సాధించాయి. భారీ డ్రోన్లతో దాడులు జరిగినప్పుడు వాటిని గురిపెట్టి కచ్చితంగా నేలకూల్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులపై ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించిన కొన్ని రోజులకే భార్గవాస్త్రను విజయవంతంగా పరీక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది. → భార్గవాస్త్రలో మొదటి దశలో ఆన్‌గైడెడ్ మైక్రో రాకెట్లు ఉంటాయి. ఇవి శత్రుదేశాల డ్రోన్లను కూల్చివేస్తాయి. → ఇక రెండో దశలో గైడెడ్ మైక్రో మిస్సైల్ ఉంటుంది. ఇది పిన్‌పాయింట్ కచ్చితత్వంతో ప్రత్యర్థి డ్రోన్లను చిత్తుచేస్తుంది. శత్రువు డ్రోన్లు తప్పించుకొనే అవకాశమే ఉండదు. గైడెడ్ మైక్రో మిస్సైల్‌ను గతంలోనే పరీక్షించారు. → అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సమర్థంగా పనిచేసేలా భార్గవాస్త్రను అభివృద్ధి చేశారు. సముద్ర మట్టానికి 5 కిలోమీటర్లకుపైగా ఎత్తులోనూ చక్కగా పనిచేయగలదు. భారత సైనిక దళాల అవసరాలను అనుగుణంగా రూపొందించారు. → పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, చాలా తక్కువ ఖర్చుతో భార్గవాస్త్రను డిజైన్ చేయడం విశేషం. త్రివిధ దళాల అవసరాల మేరకు ఇందులో అదనంగా మార్పుచేర్పులు చేసుకోవచ్చని ఎస్‌డీఏఎల్ వెల్లడించింది. → అడ్వాన్స్డ్ సీ4ఐ(కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో భార్గవాస్త్ర పనిచేస్తుంది. గగనతలంలో ఎదురయ్యే ముప్పును రియల్–టైమ్‌లో ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. → ఇందులోని రాడార్ 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తించగలదు. అలాగే ఎలక్ట్రో ఆప్టికల్/ఇన్ఫ్రారెడ్(ఈఓ/ఐఆర్) సెన్సార్లు ‘లో రాడార్ క్రా–సెక్షన్’ లక్ష్యాలను కనిపెట్టగలవు. → కౌంటర్–డ్రోన్ టెక్నాలజీలో భార్గవాస్త్ర ఒక మైలురాయి అని ఎస్‌డీఏఎల్ అధికారులు చెబుతున్నారు. → కొన్ని దేశాలు భార్గవాస్త్ర తరహాలో మైక్రో–మిస్సైల్ సిస్టమ్స్‌ను రూపొందించినప్పటికీ... పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, తక్కువ ఖర్చుతో ఇలాంటి బహుళ దశలతో కూడిన కౌంటర్–డ్రోన్ వ్యవస్థను ఎవరూ తయారు చేయలేకపోయారు. → భార్గవాస్త్రను హార్డ్‌కిల్ మోడ్‌లో రూపొందించారు. భారీ డ్రోన్లతోపాటు చాలా చిన్నస్థాయి డ్రోన్లను కూడా గుర్తించి, కూల్చివేయగలదు. -
సీఎం మమతా బెనర్జీ వేప మొద్దుల్ని దొంగలించారా?
కోల్‌కతా: ఆలయంలో విగ్రహం కోసం ఒడిశా నుంచి సీఎం మమతా బెనర్జీ వేప మొద్దుల్ని దొంగలించారా? అంటే అవుననే అంటున్నారు ఒడిశా బీజేపీ నేతలుపశ్చిమ బెంగాల్ దిఘూలో జగన్నాథుడి పాలరాతి విగ్రహం ప్రతిష్ఠాపన జరిగింది.ఈ ఆలయంలో విగ్రహం కోసం ఒడిశా నుంచి మమతా వేప మొద్దులు దొంగిలించదని ఒడిశా బీజేపీ నేతలు మమతా బెనర్జీపై ఆరోపణలు చేశారు. అయితే, ఆ ఆరోపణల్ని దీదీ ఖండించారు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఇంట్లోనే నాలుగు వేప చెట్లు ఉన్నాయి. దొంగిలించాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. బెంగాల్లో జగన్నాథ స్వామిని పూజించడం నేరమా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ, ఒడిశా బీజేపీ పాలనలో పశ్చిమ బెంగాల్ వలసకూలీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. -
300 ఏళ్ల నాటి ఆలయం..అక్కడ ప్రసాదం పిల్లులకు నివేదించాకే..
కొన్ని ఆలయాల చరిత్ర అత్యంత వింతగా ఉంటాయి. సాధారణంగా అందరూ దేవుడి ప్రసాదాన్ని అత్యంత పరమపవిత్రంగా భావిస్తారు. కానీ ఈ ఆలయంలో ప్రసాదం మాత్రం పిల్లులు స్వీకరించాక భక్తులకు పంచుతారుట. ఇదేంటీ అని ఆశ్చర్యపోకండి. ఇది నమ్మశక్యంగానీ నిజం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది..? దాని కథాకమామీషు ఏంటో చూద్దామా..!.ఒడిశాలో దాదాపు 300 ఏళ్ల నాటి ఆలయం ఉంది. ఆ ఆలయంలో విష్ణుమూర్తి అవతారమైన మదన్ మోహన స్వామి పూజలందుకుంటున్నారు. ఆ స్వామి విగ్రహం తోపాటు పది ఇతర విగ్రహాలు కూడా ఉంటాయి. ఆ గుడి కేంద్రపారా జిల్లాలో ఉంది. ఈ ఆలయాన్ని ఒడిస్సాలో బిలేఖియా మఠం అని పిలుస్తారు. ఒడియా భాషలో పిల్లి 'బెలీ అంటారు. ఆ పేరు మీదుగానే ఈ ఆలయం బిలేఖియాగా స్థిరపడింది. ఇక్కడ స్వామి మదన మోహన్‌కి నైవేద్యం సమర్పించిన వెంటనే ఆ ప్రసాదాన్ని మొదటగా అక్కడే నివాసం ఉండే పది పిల్లులకు సమర్పించాక గానీ భక్తలకు వితరణ చేయరు. దాదాపు మూడు శతాబ్దాల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారట ఆలయ పూజర్లు.ఇలా ఎందుకంటే..స్థానిక పురాణం ప్రకారం, ఆయుల్ రాజ్యానికి చెందిన రాజు బ్రజ సుందర్ దేబ్ ఈ మఠాన్ని సందర్శించాడు. ఆలయ పూజారి వందలాది పిల్లులను సంరక్షించడం చూశాడు. వెంటనే ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కొన్ని ఎకరాల భూమిని ఆ ఆలయానికి కానుకగా ఇచ్చేశాడు. అలా ఆ ఆలయంలో ఆ పిల్లలకు ఆహారం పెట్టడం అనేది ఆచారంగా సాగుతోందట. అంతేకాదండోయ్ చాలావరకు ఆ పిల్లులన్ని ఆ ఆలయంలోనే పుట్టాయట. వాటికి రోజూ బిస్కెట్లు, పాలు, అన్నం తదితరాలు పెడతారట. ప్రస్తుతం ఆ పిల్లుల్లో చాలామటుకు ఇతరులకు పెంచుకోవడానికి ఇచ్చేసినట్లు తెలిపారు ఆలయ నిర్వాహకులు. అవన్నీ ఆలయ ప్రాంగణంలోనే తచ్చాడుతూ ఉంటాయి. అంతేగాదు ఆ పిల్లులు కూడా సరిగ్గా ప్రసాదం నివేదించే సమయాని కల్లా..పూజారి పెట్టే ప్లేటు వద్దకు వచ్చి నిరీక్షిస్తూ ఉండటం విశేషం. నిజంగా అత్యంత విచిత్రంగా ఉంది కదూ ఈ ఆలయం స్టోరీ. పిల్లుల పోషణార్థం రాజు ఎకరాలకొద్దీ భూమిని రాసివ్వడం కూడా అత్యంత వింతగా అనిపిస్తోంది కదూ..!.(చదవండి: మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్లో ఆ ఆహారాలకు చోటు లేదు! రీజన్ ఇదే..) -
ఒడిశాలో నేపాల్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హాస్టల్లో ఏం జరిగింది?
భువనేశ్వర్: ఒడిశాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భువనేశ్వర్‌లోని ప్రతిష్ఠాత్మక కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కిట్)లో విద్యార్థిని మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సదరు విద్యార్థిని నేపాల్‌కు చెందిన యువతిగా గుర్తించారు. ఇక, మూడు నెలల వ్యవధిలో ఇదే క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం అనుమానాలను తావిస్తోంది.వివరాల ప్రకారం.. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కిట్)లో కంప్యూటర్ సైన్స్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి(22)ని మృతిచెందింది. ఆమె స్వస్థలం నేపాల్ రాజధాని ఖాట్మాండుకు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీర్గంజ్. సదరు విద్యార్ధిని గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలికల హాస్టల్లోని తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. దీంతో, యూనివర్సిటీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.మూడు నెలల్లో ఇద్దరు మృతి..ఇక, గత మూడు నెలల్లో కిట్ యూనివర్సిటీలో నేపాల్ విద్యార్థిని మరణించడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 16న బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ప్రకృతి లమ్సాల్ అనే నేపాల్ విద్యార్థిని కూడా ఇదే విధంగా హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించింది. ఆ సమయంలో సహచర విద్యార్థి ఒకరు తనను లైంగికంగా వేధించారని యూనివర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫీస్ (ఐఆర్వో) కు ఫిర్యాదు చేసినట్టు తర్వాత వెలుగులోకి వచ్చింది. అయితే, యూనివర్సిటీ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోలేదని, ఇది ‘తీవ్ర నిర్లక్ష్యం’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) వ్యాఖ్యానించింది. విద్యార్థి సంఘాలు, పౌర సమాజం తీవ్రంగా స్పందించడంతో, ఆమె మరణించిన మరుసటి రోజే నిందితుడిని అరెస్టు చేశారు. బీజేడీ నేత, మాజీ ఎంపీ అచ్యుత సమంత స్థాపించి, నిర్వహిస్తున్న ఈ యూనివర్సిటీపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.A Nepali undergraduate student was found dead in her hostel room in Bhubaneswar’s Kalinga Institute of Industrial Technology (KIIT) on Thursday (May 1) evening. This is the second such case in less than three months.Prisha Shah was studying computer science and hails from… pic.twitter.com/XcCVY9vM6X— News9 (@News9Tweets) May 2, 2025 -
మురికివాడ ప్రజలు వర్సెస్ పోలీసులు
రూర్కేలా: ఒడిశా రాష్ట్రంలోని సుందర్ ఘర్ జిల్లాలో మురికివాడల్లో నిర్వాసితులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మృత్యువాత పడగా, 19 మంద గాయపడ్డారు. గాయపడిన వారిలో అదనపు తహసీల్దార్ కూడా ఉన్నారు. సుందర్ ఘర్ జిల్లాలోని బర్కానీ ఏరియాలో నివాసముండే మురికివాడ నిర్వాసితులను ఖాళీ చేయించే క్రమంలో అధికారులు అక్కడ వచ్చారు. ఈ క్రమంలోనే వారు ఖాళీ చేసేది లేదని తేల్చిచెప్పడంతో అటు పోలీసులకు మురికివాడ నిర్వాసితులకు ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జీ చేయగా, దాన్ని వారు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతం మీదుగా రైల్వే లైన్ మంజూరు కావడంతో అక్కడ ఉండే వారిని ఖాళీ చేయించేందుకు అధికారులు పూనుకున్నారు. దీనిలో భాగంగా పోలీసుల్ని తీసుకునిన అక్కడకు వెళ్లగా అక్కడ ఉద్రిక్త వాతావారణం చోటు చేసుకుంది. -
Puri Jagannath Temple : ఆలయ జెండాతో గద్ద ప్రదక్షిణలు వీడియో వైరల్
ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి (Puri Jagannath temple) ఆలయంలో అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీమందిర్ ఆలయ శిఖరంపై ఉన్న పవిత్రమైన జెండాను ఒక గద్ద తన ముక్కుతో పట్టుకుని ఆకాశంలో ప్రదక్షిణ చేసింది. ఈ అసాధారణ ఘటన భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది అనర్థమా, శుభసూచికగా అనేక చర్చకు దారితీసింది ఇది భక్తులను విపరీతంగా ఆకర్షించడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: షారూక్ ఖాన్ భార్య హోటల్లో ఫేక్ పనీర్ ఆరోపణల దుమారం : టీం స్పందనపూరీ ఆలయ శిఖరంపై ఉన్న (Neela Chakra) నీలచక్రంపైన ఎగిరే జెండాను ముక్కున కరుచుకుని ఓ గద్ద ఆకాశంలో చక్కర్లు కొట్టింది. పూరీకి వచ్చే భక్తులు పవిత్రంగా భావించే ఆ జెండాను దర్శనం చేసుకుని , తరించడం ఆనవాయితీ. అలాంటిది ఇపుడు శ్రీమహావిష్ణువు వాహనమైన గద్ద తన ముక్కుతో ఈ జెండాను జాగ్రత్తగా పట్టుకుని, ఆకాశంలో ప్రదక్షిణం చేయడం విశేషంగా మారింది. ఈ దృశ్యం కెమెరాలో రికార్డ్ అయింది. ఇది దైవిక సంకేతంగా భక్తులు భావించారు.What is going to happen?Eagle takes away flag from Jagannath Temple pic.twitter.com/0AzUZb1uDE— Woke Eminent (@WokePandemic) April 13, 2025 నెటిజన్లు స్పందనఆలయ జెండాను పోలి ఉన్నప్పటికీ, ఆ వస్త్రం నిజానికి జగన్నాథ ఆలయానికి చెందినదా లేదా కేవలం ఒక సాధారణ గుడ్డ ముక్కేనా అనేది ఇంకా నిర్ధారించలేదు. ఆన్లైన్లో చర్చలకు దారి తీసింది. "జగన్నాథ ఆలయం నుండి ఒక గద్ద పవిత్ర జెండాను తీసుకెళ్లినప్పుడు, అది దొంగతనం కాదనీ, అది స్వర్గపు సందేశం. జగన్నాథుని ఆశీర్వాదాలతో గరుడుడు స్వయంగా స్వర్గానికి ఎక్కినట్లుగా. దైవిక జోక్యం, పునరుద్ధరణ ,క్తివంతమైన మార్పుకు సంకేతమన్నవాదనలు వినిపించాయి. సోషల్ మీడియాలో వేలాదిమంది భక్తులు దీన్ని షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. “PuriJagannathEagle” హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది, ఈ ఘటన జగన్నాథుని అనుగ్రహంగా కొంతమంది భావించారు.‘జగన్నాథుని కృప’’, ‘‘గరుడ దర్శనం’’ వంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. మరోవైపు ఈ ఘటనను సహజమైనదని కామెంట్ చేశారు. దాన్ని ఆహారంగానో, మరేదో ఆసక్తికరమైన వస్తువుగా గద్ద భావించి ఉండవచ్చని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఈ ఘటనతో ఒడిశాలోని భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ ఆలయం ఒక్కసారి చర్చల్లో నిలిచింది. ఆలయ వైభవాన్ని, ఖ్యాతిని పలువురు గుర్తుచేసుకున్నారు. చదవండి: రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్ -
Deomali Hills: సినీ దర్శకుడు రాజమౌళి కారణంగా ఫేమస్ అయిన పర్యాటక ప్రాంతం ఇదే..!
ప్రపంచ పర్యాటక రంగంలో పేరు తెచ్చుకుంటున్న దేవమాలి పర్వత పరిరక్షణకు ప్రభుత్వం కఠిన ఆంక్షలు పెడుతోంది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన నూతన చిత్రానికి సంబంధించి ఇక్కడ షూటింగ్ చేయడంతో ఈ ప్రాంతం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆయన షూటింగ్ ముగించుకుని వెళ్లిపోతూ ఈ పర్వతంపై పర్యాటకులు చెత్త వదిలి వెళ్లడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై అనేక విజ్ఞప్తులు వచ్చాయి. అప్పటి నుంచి ప్రభుత్వం ఈ పర్వత పరిరక్షణ పై తీవ్రంగా దృష్టి సారించింది. రాత్రిపూట రాకపోకలు నిషేధం దేవమాలి పర్వతం మీద సూర్యోదయం, సూర్యాస్తమయం చూడడానికి పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అందుకే గుడారాలు వేసి రాత్రి బస చేస్తుంటారు. దీంతో రాత్రి ఇక్కడ పర్యవేక్షణ ఉండేది కాదు. ఈ క్యాంప్ ఫైర్ల వల్ల ఔషధ మొక్కలు కాలిపోయేవి. విందు వినోదాల కారణంగా చెత్త పేరుకుపోయేది. అందుకే రాత్రి 8 నుంచి ఉదయం 5 వరకు దేవమాలిపై పర్యాటకులు ఉండకూడదని నిషేధం విధించారు. 2023 నాటి భారతీయ నాగరిక సురక్ష సంహిత 163 ప్రకారం,1986 నాటి పర్యవరణ పరిరక్షణ చట్టం 15 ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేశారు. వ్యర్థాలపై కఠిన చర్యలు దేవమాలిపైకి వచ్చే పర్యాటకులు తాము తెచ్చే వ్యర్థాలు తామే తిరిగి తీసుకొని వెళ్లేటట్లు సంచులు తెచ్చుకోవాలని రాజమౌళి సూచించారు. దాన్నే ప్రభుత్వం కఠిన నిబంధనగా మార్చింది. ఇకపై పర్యాటకులు అక్కడ వ్యర్థాలు వదల రాదని, తిరిగి తీసుకొని వెళ్లడానికి సంచులు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు పైకి తీసుకురావద్దని హెచ్చరించింది. అధికారుల పర్యటనలు కొరాపుట్ కలెక్టర్ వీ.కీర్తి వాసన్ ఆదివారం దేవమాలి పర్వతంపై ఉన్నత స్థాయి అధికారులతో పర్యటించారు. రక్షణ చర్యల పై ఎస్పీ రోహిత్ వర్మ కూడా వెళ్లారు. ఇదే సమయంలో సీఎల్పీ నాయకుడు రామచంద్ర ఖడం కూడా అదే సమయంలో తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా అక్కడకే వెళ్లారు. వీరంతా అనుకోకుండా కలుసుకోవడంతో అక్కడే సమావేశమయ్యారు. దేవమాలి పై భారీ ఎత్తున పర్యాటక సదుపాయాలు కల్పించడానికి కలెక్టర్ సమీక్ష చేశారు. (చదవండి: ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట రామాలయం..) -
భాగ్యనగరంలో ప్రవాసీ ఒడియా ఫెస్టివల్..!
ఒడిశా వాసులు గచ్చిబౌలి డివిజన్లోని ఖాజాగూడ పెద్ద చెరువు వద్ద సందడి చేశారు. ఉత్కళ ఒడియా యూత్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రవాసీ ఒడియా ఫెస్టివల్ ‘పత్ ఉత్సవం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో నివాసముండే ఒడిశా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్సాహాన్ని ప్రకటించారు. మొదట ఇస్కాన్ బృందం వారిచే కృష్ణ పరమాత్మ, రామలీలలపై గానామృతం నిర్వహించగా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం రోడ్ రంగోలి మురుజా, ఆతోంటిక్, ఒడియా క్యూసిన్, డిస్ప్లే, ఆర్ట్, పైకా ఆర్ట్, టైగర్ నృత్యాలు వంటివి నిర్వహించి తమ సంప్రదాయాన్ని చాటుకున్నారు. అనంతరం శంఖనాథాలతో కూడిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓద్రా, దేహం జుంబా నృత్యాలతోపాటు పిల్లల గ్లోబల్ ఆర్ట్స్ డ్రాయింగ్ పోటీలను నిర్వహించగా ఒడిశా వాసులు ఆసక్తిగా తిలకించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఐపీఎస్ అధికారి సౌమ్యామిశ్రా, సుప్రసిద్ధ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధ పాండ్వా పాల్గొని అందరినీ మరింత ఉత్సాహపరిచారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగరంలోని ఒడిశా వాసులు పాల్గొన్నారు. (చదవండి: సరికొత్త మ్యూజిక్ థెరపీ..'జెంబే'..! ఆ వ్యాధులను నయం చేస్తుందట..!) -
మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాలు..!
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, రాయగడ ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. జంఝావతి నది జలాలు అమ్మవారి చైత్రోత్సవాల ప్రారంభానికి ఒక రోజు ముందు సమీపంలో గల జంఝావతి నది నుంచి జలాలను తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో ఉంచి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. నది వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించిన పురోహితులు పూజా కార్యక్రమాల అనంతరం జలాలను కలశాలతో తీసుకువచ్చి అమ్మవారిని అదేవిధంగా అమ్మవారి గర్భగుడిని శుద్ధి చేస్తారు. అదేరోజు రాత్రి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఆలయ ప్రధాన పూజారి చంద్రశేఖర్ బెరుకొ, బాబుల బెరుకొలు అమ్మవారిని సింధూరంతో అలంకరిస్తారు. సునా భెషొలో అమ్మవారు అమ్మవారి చైత్రోత్సవాల సందర్భంగా ఉత్సవాల ఐదు రోజుల పాటుగా అమ్మవారిని బంగారు నగలతో అలంకరిస్తారు. సునా భెషొను తిలకించి భక్తులు మురిసిపోతారు. ఆంధ్ర భక్తుల తాకిడి ఉత్కళాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా గుర్తింపు పొందిన మజ్జిగౌరి అమ్మవారిని దర్శించుకునేందుకు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లా పార్వతీపురం, విశాఖపట్నంతో పాటు తెలంగాణ, అటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ప్రతీ ఆది, మంగళ ,బుధవారాల్లో వీరి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి సెపె్టంబరు నెల వరకు పొరుగు రాష్ట్రాల భక్తులతో మందిరం కిటకిటలాడుతుంది. భక్తుల తాకిడిని ఉద్దేశించి వారికి సౌకర్యం కల్పించే విధంగా ప్రత్యేక దర్శనాలను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. అందుకు 300 రూపాయల టిక్కెట్లను విక్రయిస్తుంది. స్థల చరిత్ర క్రీస్తుపూర్వం 16 వ శతాబ్దంలో నందపూర్ రాజ వం«శస్తులకు చెందిన విశ్వనాథ్ దేవ్ గజపతి అనే రాజు రాజ్యాలను విస్తరించే దిశలో రాయగడలోనికి అడుగుపెట్టారు. రాయగడలో రాజ్యాన్ని స్థాపించిన ఆయన మజ్జిగౌరి దేవిని ఇష్టాదేవిగా పూజిస్తుండేవారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని కోట మధ్యలో స్థాపించి పూజించేవారు. కోట మధ్యలో కొలువుదీరడంతొ అమ్మవారిని మొఝిఘోరియాణిగా పిలుస్తారు. తెలుగులో మజ్జిగౌరిగా ఒడియాలొ మోఝిఘొరియాణిగా ప్రతీతి. 108 మంది రాణుల సతీసహగమనం రాయగడ రాజ్యాన్ని పాలిస్తుండే విశ్వనాథ్ దేవ్ మహారాజుకు 108 మంది రాణులు ఉండేవారు. గోల్కొండను పాలించే ఇబ్రహిం కుతుబ్‌షా సేనతో రాయగడపై దండెత్తారు. ఈ పోరాటంలో విశ్వనాథ్ దేవ్ హతమవుతారు. దీంతో ఆయన 108 మంది రాణులు అగ్నిలొకి దూకి ఆత్మార్పణం చేసుకుంటారు. ఈ స్థలాన్ని సతీకుండంగా పిలుస్తారు. ప్రస్తుతం అమ్మవారి మందిరానికి పక్కనే ఈ సతీకుండం ఉంది. మందిర కమిటీ దీని ప్రాధాన్యతను గుర్తించి అభివృద్ధి చేసింది. అయితే కోట కూలిపొవడం అంతా శిథిలమవ్వడంతొ అమ్మవారి మందిరం కూడా శిథిలమవుతోంది. బ్రిటీష్ వారి ఆగమనంతో.. 1936 వ సంవత్సరంలొ బ్రిటీష్ వారు విజయనగరం నుంచి రాయిపూర్ వరకు రైల్వే పనులు ప్రారంభించించే సమయంలో జంఝావతి నదిపై వంతెన నిర్మాణం పనులు ప్రారంభిచారు. ఈ క్రమంలో వంతెన నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్ వంతెన పనులను ప్రారంభిస్తారు. వంతెన నిర్మాణం జరగడం అదేవిధంగా కూలిపోవడం క్రమేపీ చోటు చేసుకుంటాయి. దీంతో ఒక రోజు కాంట్రాక్టరు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అమ్మవారు కాంట్రాక్టర్ కలలో కనిపించి తాను ఇక్కడే ఉన్నానని, తనకు చిన్న గుడి ఏర్పాటు చేసి నిత్యపూజా కార్యక్రమాలు జరిపిస్తే జంఝావతి నదిపై తలపెట్టిన వంతెన పనులు పూర్తవుతాయని చెబుతుంది. దీంతో కలలో కనిపించిన అమ్మవారి మాటలు ప్రకారం వెతిక చూడగా ఒక శిథిలమైన మందిరంలో అమ్మవారి విగ్రహం ఉంటుంది. అయితే అప్పటికి అమ్మవారి తల భాగమే కనిపిస్తుంది. దీంతో కాంట్రాక్టరు మందిరాన్ని నిర్మించి అమ్మవారి ముఖభాగమే ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు చేపడతాడు. అనంతరం వంతెన పనులు చకచక పూర్తవుతాయి. ఇప్పటికీ ఈ వంతెన అమ్మవారి మందిరానికి సమీపంలో ఉంది. అప్పటి నుంచి అమ్మవారి ముఖభాగమే భక్తులకు దర్శనం ఇస్తుండటం ఇక్కడి విశేషం. ఇదిలాఉండగా అమ్మవారికి సమీపంలో అమ్మవారి పాదాల గుడి కూడా ఉంది. అదేవిధంగా నడుం భాగం మందిరానికి కొద్ది దూరంలో ఉంది. దీనినే జెన్నా బౌలిగా కొలుస్తుంటారు. రూ.15లక్షలతో ఉత్సవాలు అమ్మవారి చైత్రోత్సవాలకు ఈ ఏడాది రూ.15 లక్షలు వెచ్చించనున్నారు. ఏటా లాగానే గంజాం జిల్లా కవిసూర్యనగర్కు చెందిన జ్యొతిష్య పండితులు నీలమాధవ త్రిపాఠి శర్మ బృందంతో పూజా కార్యక్రమాలను నిర్వహించనుంది. చండీ హోమం, సూర్యపూజ, నిత్య ఆరాధన వంటి పూజలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రూ.30 కోట్లతో అభివృద్ధి అమ్మవారి మందిరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలి్పంచేందుకు ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులను కేటాయించింది. అందుకు పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే టెండర్లను ఆహా్వనించింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులు పూర్తయితే అమ్మవారి మందిరం రూపురేఖలే మారనున్నాయి. -
కానిస్టేబుల్ యశోద అనుమానాస్పద మృతి.. జైలులో ఏం జరిగింది?
భువనేశ్వర్: ఒడిశాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలీసు బ్యారక్ లోపల మహిళా (యువతి) కానిస్టేబుల్ మృతి అనుమానాస్పదంగా మారింది. మృతురాలిని యశోద దాస్‌గా గుర్తించారు. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. రెముణా పోలీస్ ఠాణా పరిధిలోని మందొర్పూర్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ యశోద బాలాసోర్ విధులు నిర్వహిస్తోంది. అయితే, బాలాసోర్ జిల్లా పోలీసు బ్యారక్ లోపలి ప్రాంగణంలో మంగళవారం యశోద వేలాడుతూ ఉండటాన్ని తోటి కానిస్టేబుళ్లు గమనించారు. వారు ఆమెను రక్షించడానికి సమయం వృధా చేయకుండా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు.ఈ సందర్బంగా మృతురాలి సోదరుడు టుటు దాస్ మాట్లాడుతూ ...‘పోలీసులు ఆమె ఫోన్, చాట్ వివరాలను పరిశీలించాలని అభ్యర్థించాడు. తన సోదరితో సంబంధం ఉన్న వారి కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని భోరుమన్నాడు. ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు ప్రకటించారు. బాలాసోర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనపై విచారణ జరుగుతోందని, ప్రారంభ పరిశోధనల ప్రకారం ఈ విషాదం వెనుక వ్యక్తిగత కారణాన్ని సూచిస్తున్నాయని ఆయన ధ్రువీకరించారు. -
ఏఐ చేతుల్లో పిల్లల ఎదుగుదల.. ఒడిశాలో శ్రీకారం
భువనేశ్వర్: వయసుకు తగిన విధంగా పిల్లలు ఎదుగుతున్నారా? ఎత్తు, బరువు సరైన విధంగానే అభివృద్ధి చెందుతోందా? వారు పోషకాహార లోపాలను(Nutritional deficiencies) ఎదుర్కొంటున్నారా? మొదలైనవన్నీ తెలుసుకోవడం ఇకపై చాలా సులభం కానున్నాయి. ఇందుకు కృత్రిమ మేథ తోడ్పాటునందించనుంది. పిల్లల సమగ్ర ఎదుగుదలను పర్యవేక్షించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాధనాన్ని అభివృద్ధి చేసేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టిన తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ‘ఏఐ ఫర్ గ్రోత్ మానిటరింగ్: డెవలప్మెంట్ ఆఫ్ యాన్ ఏఐ టూల్ ఫర్ చైల్డ్ ఆంత్రోపోమెట్రీ’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (కేంద్ర ప్రభుత్వం), వధ్వానీ ఏఐ, ఐసీఎంఆర్-ఆర్ఎంఆర్సీ భువనేశ్వర్, పోషణ్ అభియాన్‌ను సంయుక్తంగా సహకారాన్ని అందిస్తున్నాయి.నూతనంగా రూపొందించబోయే ఈ ఏఐ టూల్(AI tool) సాయంతో అంగన్వాడీ కార్యకర్తలు తమ దగ్గరకు వచ్చే పిల్లల బరువు, ఎత్తు, తల చుట్టుకొలత, ఛాతీ చుట్టుకొలత మొదలైన వాటి పెరుగుదల తగిన విధంగా ఉందో లేదో తెలుసుకోగలుగుతారు. ఈ వినూత్న విధానం ఆంత్రోపోమెట్రిక్ అంచనాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం, పోషకాహార లోపాన్ని ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. అంగన్వాడీ కార్యకర్తలకు ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), ఐసీఎంఆర్-ఆర్ఎంఆర్సీ భువనేశ్వర్, వధ్వానీ ఏఐ నిపుణులు శిక్షణను అందించనున్నారు. శిక్షణ పొందిన ఇన్వెస్టిగేటర్లు(Investigators) నాలుగు నెలల పాటు రాష్ట్రంలోని బాలాసోర్, కటక్, గంజాం, జాజ్‌పూర్, కియోంఝర్, మయూర్భంజ్ జిల్లాల్లోని చిన్నారుల డేటాను సేకరిస్తారు. ఈ డేటా సేకరణ పైలట్ అంచనాకు ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమాన్ని ఒడిశా మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శుభా శర్మ ప్రారంభించారు.ఇది కూడా చదవండి: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ లైఫ్ స్టయిల్ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే.. -
నా భార్య నన్ను టార్చర్ పెడుతోంది.. ‘ఇక నాకు చావే శరణ్యం’
భువనేశ్వర్ : ‘నాకు పెళ్లై రెండేళ్లవుతుంది. పెళ్లైన నాటి నుంచి నా భర్య నన్ను మానసికంగా వేధిస్తోంది. ఆమె వేధింపుల్ని తట్టుకోలేకపోతున్నా. ఇక నాకు చావే శరణ్యం’ అంటూ ఓ భర్త కదులుతున్న ట్రైన్ ఎదురు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ దుర్ఘటన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈస్ట్ కోస్ట్ డివిజన్ రైల్వే పోలీసుల వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం ఖోర్ధాజిల్లా కుంభార్బస్తా (Kumbharbasta) కు చెందిన రామచంద్ర బర్జెనా కదులుతున్న ట్రైన్ నుంచి ప్రాణాలు తీసుకున్నాడు. దుర్ఘటనకు ముందు ఓ వీడియోను తన సెల్ఫోన్లో రికార్డ్ చేశాడు.ఆ వీడియోలో ‘నేను రామచంద్ర బర్జెనాను. నేను కుంభార్బస్తాలో ఉంటాను. ఇవాళ నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. అందుకు కారణం నా భార్య రూపాలీనే. రూపాలీ నన్ను మెంటల్ టార్చర్ చేస్తోంది. ఇక నేను బ్రతకలేను’ అని విలపిస్తూ వీడియోలో చెప్పాడు. వీడియో తీసిన అనంతరం, నిజిఘర్-తపాంగ్ రైల్వే ట్రాక్ సమీపంలో కదులుతున్న రైలు ముందు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామచంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు రామచంద్ర, రూపాలీకి రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికో కుమార్తె. అయితే, పెళ్లైన నాటి నుంచి భార్య రూపాలి.. భర్త రామచంద్రను మానసికంగా వేధిస్తుండేది. అది సరిపోదున్నట్లు మెట్టినింట్లో చిచ్చుపెట్టేది. ఇవన్నీ తట్టుకోలేక రామచంద్ర ప్రాణాలు తీసుకున్నాడు. రామచంద్ర ఆత్మహత్యపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు రామచంద్ర తీసిన వీడియో ఆధారంగా భార్య రూపాలీని అరెస్ట్ చేశారు. Odisha: Unable to endure relentless torture from his wife, a young man tragically ended his life. The incident occurred in Kumarabasta village of Khordha district. The deceased has been identified as Ramchandra Badjena. Before his death, Ramchandra posted a video on social media,… https://t.co/hmwt0hzaEx— ସତ୍ୟାନ୍ୱେଷୀ/सत्यान्वेषी/Satyanweshi (@imsatyanweshi) April 5, 2025 రామచంద్ర ఆత్మహత్య తర్వాత అతని తల్లిదండ్రులు.. కోడలు రూపాలీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నా కుమారుడు రామచంద్రకు రూపాలీతో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి కూడా మా ఇంట్లోనే అంగరంగ వైభవంగా చేశాం. పెళ్లైన నాటి నుంచి రూపాలీ నా కొడుకుని చిత్ర హింసలు పెట్టేది. పాప పుట్టింది. తరుచూ మెట్టి నుంచి పుట్టింటికి వెళ్లేది. పుట్టింటికి వెళ్లకపోతే నన్ను నా కుటుంబ సభ్యుల్ని దూషిస్తుండేది. అయినప్పటికీ, అత్త కుటుంబసభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రూ.20లక్షలు అప్పుగా ఇచ్చాం. కానీ రూపాలీ తీరు మారలేదు. నా కొడుకు ఆమె చేతిలో నరకాన్ని అనుభవించాడు. ఆమె క్రూరత్వానికి ఫలితం ఇదే. మాకు న్యాయం చేయండి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఒడిశా టైటిల్ నిలబెట్టుకునేనా!
ఝాన్సీ (ఉత్తరప్రదేశ్): పురుషుల సీనియర్ హాకీ నేషనల్ చాంపియన్‌షిప్‌నకు వేళైంది. శుక్రవారం ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ ఈనెల 15న జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది. ‘త్రీ డివిజన్’ ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 30 జట్లు పాల్గొంటున్నాయి. గత ఏడాది తమిళనాడులో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ఒడిశా జట్టు టైటిల్ సాధించి సంచలనం సృష్టించింది. వరుసగా రెండో ఏడాది ఒడిశా తమ జోరు కొనసాగించి టైటిల్ నిలబెట్టుకుంటుందో లేదో వేచి చూడాలి. ‘ఎ’ డివిజన్లో ఉన్న 12 జట్లు టైటిల్ కోసం పోటీ పడుతుండగా... ‘బి’ డివిజన్లోని 10 జట్లు, ‘సి’ డివిజన్లోని 8 జట్లు ప్రమోషన్ కోసం ప్రయత్నించనున్నాయి. ప్రదర్శన ఆధారంగా వచ్చే ఏడాది తిరిగి డివిజన్ల మార్పు జరుగుతుంది. ‘సి’ డివిజన్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు... వచ్చే ఏడాది ‘బి’ డివిజన్‌కు... ‘బి’ డివిజన్లో మెరుగైన ప్రదర్శన చేసిన రెండు జట్లు ‘ఎ’ డివిజన్‌కు చేరనున్నాయి. ప్రతి డివిజన్లో కింది స్థానాల్లో నిలిచిన రెండు జట్లు... డిమోషన్ పొందుతాయి. ‘మహిళల సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌ను ఈ ఫార్మాట్లో నిర్వహించడం వల్ల ఆటకు మేలు జరిగింది. అందుకే పురుషుల విభాగంలోనూ దీన్ని కొనసాగిస్తున్నాం. దీంతో ప్రతి డివిజన్లోని జట్టు మరింత మెరుగైన స్థితిలో నిలిచేందుకు ప్రయత్నిస్తుంది’అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అన్నాడు. » ‘ఎ’ డివిజన్లోని 12 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో మూడు టీమ్‌ల చొప్పున పోటీ పడనున్నాయి. లీగ్ దశ ముగిసేసరికి గ్రూప్ అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. » ఈనెల 13న సెమీఫైనల్స్, 15న ఫైనల్ నిర్వహించనున్నారు. » డిఫెండింగ్ చాంపియన్ ఒడిశాతో పాటు రన్నరప్ హరియాణా జట్లు ‘ఎ’ డివిజన్ నుంచి బరిలోకి దిగనున్నాయి. ఈ రెండు జట్లతో పాటు పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బెంగాల్, కర్ణాటక, పుదుచ్చేరి జట్లు ‘ఎ’ డివిజన్లో చోటు దక్కించుకున్నాయి. » ‘బి’, ‘సి’డివిజన్ మ్యాచ్‌లు నేటి నుంచి ప్రారంభం కానుండగా... ‘ఎ’ డివిజన్ మ్యాచ్‌లు ఈ నెల 8న ఆరంభమవుతాయి. » ఇది 15వ పురుషుల సీనియర్ హాకీ జాతీయ చాంపియన్‌షిప్ కాగా... గత ప్రదర్శన ఆధారంగా జట్లను విభజించారు. » తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు ప్రస్తుతం ‘బి’ డివిజన్లో ఉన్నాయి. వీటితో పాటు చండీగఢ్, గోవా, ఉత్తరాఖండ్, ఢిల్లీ, మిజోరం, దాద్రా నగర్ హవేలీ–దామన్ దియు, కేరళ, అస్సాం జట్లు కూడా ఇదే గ్రూప్‌లో రెండు ‘పూల్స్’గా పోటీ పడనున్నాయి. » ‘సి’ డివిజన్లో రాజస్తాన్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశీ్మర్, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, బిహార్, గుజరాత్ జట్లున్నాయి. » ఒక్కో మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు 3 పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ ‘డ్రా’ అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. -
రణరంగంగా మారిన భువనేశ్వర్
భువనేశ్వర్: ఒడిశాలో బీజేపీ అధికారంలో వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీతో గురువారం భువనేశ్వర్ రణరంగంగా మారింది. అసెంబ్లీ దిశగా దూసుకొస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను మహాత్మాగాంధీ మార్గ్‌లో అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. బారికేడ్లను దాటుకుని వస్తున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపైకి వారు రాళ్లు రువ్వారు. కుర్చిలను, బాటిళ్లను విసిరేశారు. ఒక పోలీసు వాహనానికి నిప్పుపెట్టేందుకు యత్నించారు. ఘటనలో 15 మంది పోలీసులతోపాటు ఒక టీవీ రిపోర్టర్ తలకు గాయాలయ్యాయి. దీంతో, పోలీసులు లాఠీచార్జి చేయడంతో 10 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని డీసీపీ జగ్మోహన్ మీనా చెప్పారు. -
ఒడియా ఆహార సంస్కృతిలో ఆణిముత్యం ‘పొఖొలొ’
భువనేశ్వర్: ప్రపంచ పొఖాలొ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, శాసన సభ స్పీకరు సురమా పాఢి, మంత్రి మండలి సభ్యులతో కలిసి పొఖాలొ (చద్దన్నం) ఆరగించారు. దేశ, విదేశాల్లో విస్తరించిన ఒడియా ప్రజలు కూడా పొఖాలొ దిబొసొ వేడుకగా జరుపుకున్నారు. పసి పిల్లలకు చద్దన్న ప్రాసనం కూడ సరదాగా నిర్వహించి ముచ్చట పంచుకోవడం మరో విశేషం. పొఖాలొ ఒడియా ప్రజలకు ఇష్టమైన నిత్య ఆహారం. ప్రతి ఇంటా పొఖాలొ ఉంటుంది. ఈ ఆహారం అనాదిగా ఒడియా ప్రజల ఆహార సంస్కృతిలో ఇమిడి పోయింది. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం విశ్వ విఖ్యాత శ్రీ జగన్నాథునికి కూడా దొహి పొఖాలొ (దద్దోజనం) నివేదించడం సనాతన ధర్మ, ఆచారాలకు ప్రతీకగా పేర్కొంటారు. వ్యవహారిక శైలిలో పొఖాలొ (చద్దన్నం) శరీరానికి చల్లదనం చేకూర్చుతుందని చెబుతారు. కొరాపుట్: పొఖాలొ తినాలని బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పిలుపు నిచ్చారు. ఉత్కళ పకాలి దినోత్సవం సందర్భంగా తాను పొఖాలొ తింటున్న చిత్రం విడుదల చేశారు. వేసవిలో పొఖాలొ తినడం వల్ల చల్లదనం చేస్తుందన్నారు. (చదవండి: అవకాడో: పోషకాల పండు.. లాభాలు మెండు) -
రాజమౌళి, ప్రియాంక చోప్రా ప్రత్యేక లేఖ విడుదల..
-
ఇలాంటి ప్రాంతాలను రక్షించుకోవడం మన బాధ్యత: ఎస్ఎస్ రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 మూవీతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ పర్వత ప్రాంతాల్లో జరిగింది. అక్కడ మొదటి షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్యాకప్ చెప్పేసింది. దీంతో మూవీ టీమ్ అంతా తమ లోకేషన్ నుంచి తిరుగుపయనమయ్యారు. ప్రియాంక చోప్రా తాను ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా తీసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.తాజాగా ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీ షూటింగ్ లోకేషన్ సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒడిశాలోని అత్యంత ఎత్తైన, అద్భుతమైన శిఖరం డియోమాలికి ట్రెక్కింగ్ చేసినట్లు వెల్లడించారు. పైనుంచి చూస్తే అత్యంత ఉల్లాసభరితంగా అనిపించిందని ట్విటర్లో పోస్ట్ చేశారు.అయితే ఆ పర్వతంపై పర్యాటకులు చెత్త చెదారం అలాగే ఉంచడం చూసి నిరుత్సాహానికి గురైనట్లు తెలిపారు. ఇటువంటి సహజమైన అద్భుతమైన ప్రాంతాలను ఎంతో బాగా చూసోకోవాలి.. ఒక ఒక్కరూ పౌరుడు బాధ్యతగా తీసుకుంటే చాలా పెద్ద మార్పు వస్తుంది... ప్రతి సందర్శకుడు ఇలాంటి ఆహ్లాదకరమైన స్థలాలను రక్షించడంలో సహాయపడటానికి మీ వ్యర్థాలను తిరిగి మీరే తీసుకువెళ్లాలని రాజమౌళి సూచించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Had an amazing solo trek to Deomali, Odisha’s highest and most stunning peak. The view from the top was absolutely breathtaking.However, it was disheartening to see the trail marred by litter. Such pristine wonders deserve better. A little civic sense can make a huge… pic.twitter.com/8xVBxVqQvc— rajamouli ss (@ssrajamouli) March 19, 2025 -
రూ. 200కి మనుమడిని అమ్మేసిన నాన్నమ్మ
మయూర్భంజ్: ఆర్థిక పరిస్థితులు మనిషిని ఎంతవరకైనా కుంగదీస్తాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలోనే విషాద ఉదంతాలు చోటుచేసుకుంటాయి. ఒడిశా(Odisha)లోని మయూర్‌భంజ్‌లో హృదయాలను ద్రవింపజేసే ఉదంతం చోటుచేసుకుంది. దీని గురించి తెలుసుకున్నవారంతా కంటతడి పెడుతున్నారు.ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా పరిధిలోని బల్డియా గ్రామానికి చెందిన వితంతువు మంద్ సోరెన్(65)కు ఉండేందుకు ఇల్లు గానీ, కాస్త స్థలం గానీ లేదు. ప్రభుత్వ పథకాల ద్వారా కూడా ఆమెకు ఎటువంటి సాయం అందడం లేదు. గతంలో ఆమె భర్త మరణించాడు. ఆమె కుమారుడు ఎటో వెళ్లిపోయాడు. కోడలు కూడా మృతి చెందింది. దీంతో ఆమె జీవితం దిక్కుతోచని విధంగా తయారయ్యింది. ఇటువంటి పరిస్థితిలో ఆమె ఏడేళ్ల మనుమడిని పెట్టుకుని, రాయ్‌పాల్ గ్రామంలో ఉంటున్న సోదరి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తోంది. #Horrific Due to starvation, a Tribal woman sold her grandson for Rs 200, the incident took place in Odisha's Mayurbhanj district. pic.twitter.com/4j2vhEvetH— The Dalit Voice (@ambedkariteIND) March 19, 2025మంద్ సోరెన్ రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ(Begging) తన మనుమడిని పోషిస్తోంది. అయితే వృద్ధాప్యం కారణంగా ఇటీవలి కాలంలో మనుమడి సంరక్షణ కూడా చూసుకోలేకపోతోంది. ఇదువంటి దుర్భర పరిస్థితుల్లో ఒక అజ్ఞాత వ్యక్తికి రూ. 200కు తన మనుమడిని అమ్మేసింది. ఇకనైనా తన మనుమడికి మంచి ఆహారం దొరుకుతుందనే భావనతో ఇలా చేశానని ఆమె చెబుతోంది. స్థానిక పంచాయతీ సభ్యులకు ఈ విషయం తెలిసింది. వారు ఉన్నతాధికారులకు ఈ సమాచారం చేరవేశారు. దీంతో రాస్గోవింద్ పూర్ పోలీసులు ఆ బాలుడిని రక్షించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.విషయం తెలుసుకున్న చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి, ఆ బాలునితో పాటు నాన్నమ్మను ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు. ఈ సందర్భంగా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ విషయమై పోలీసులు తమకు సమాచారం అందించగానే, తాము వారిని ప్రభుత్వ సంరక్షణా గృహానికి తీసుకువచ్చామని తెలిపారు. ఆ బాలుడిని ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు ఏర్పాట్లు చేస్తామని, మంద్ సోరెన్‌కు ప్రభుత్వ ఫించను వచ్చేలా చూస్తామని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాక్‌కు మద్దతుగా గోడలపై నినాదాలు.. ఇద్దరు యువకులు అరెస్ట్ -
కొరాపుట్‌లో SSMB29.. మహేష్‌బాబుతో ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు (ఫోటోలు)
-
అప్పుడే మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: దేశంలో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఛత్తీస్‌గఢ్-ఒడిశా తదితర రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత(Maximum temperature) 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదవుతోంది. ఢిల్లీలో పెరుగుతున్న వేడి, బలమైన గాలుల కారణంగా గాలి నాణ్యత మెరుగుపడింది. రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో వేడి గాలులు వీయనున్నాయని వాతావరణశాఖ(Meteorological Department) హెచ్చరిక జారీ చేసింది. ఈ సంవత్సరం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే అంచనా వేశారు. ఒడిశాలోని బౌద్‌లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 43.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. ఝార్సుగూడలో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్, బోలాంగీర్లో 41.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ 41.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బౌద్‌లో శనివారం ఉష్ణోగ్రతలు 42.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.ఒడిశాలోని పశ్చిమ ప్రాంతంలో ఆదివారం వేడిగాలులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఏడు ప్రదేశాలలో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఝార్సుగూడ, సంబల్పూర్, కలహండిలకు సోమవారం వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు మార్చి 19 నుండి నాలుగు రోజుల పాటు దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ సమయంలో వేడి నుండి కాస్త ఉపశమనం లభిస్తుందని వాతావరణశాఖ పేర్కొంది.కాగా ఢిల్లీలో గాలి నాణ్యత వరుసగా రెండవ రోజు ఆదివారం సంతృప్తికరమైన విభాగంలోనే ఉంది. ఏక్యూఐ 99 వద్ద నమోదైంది. 2025లో గాలి నాణ్యత సంతృప్తికరమైన విభాగంలో నమోదైన మొదటి రోజు కూడా ఇదే. ఆదివారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని, ఇది సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువని, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వాతావరణశాఖ పేర్కొంది.ఇది కూడా చదవండి: ర్యాపిడ్ రైలు కారిడార్‌పై వర్క్ స్పేస్.. ప్రయోజనమిదే.. -
రామాయణం ఆధారంగా...
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల ఒడిశాలో ప్రారంభమైంది. మహేశ్‌బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి.అలాగే మంగళవారం నుంచి ఈ షెడ్యూల్లో ప్రియాంకా చోప్రా కూడా పాల్గొంటున్నారని తెలిసింది. మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంకల కాంబినేషన్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. కాగా ఈ సినిమా షూటింగ్‌లోని ఓ వీడియో బయటికొచ్చింది. దీంతో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలిసింది.అలాగే ఈ చిత్రానికి మైథలాజికల్ టచ్ ఉందని, రామాయణంలోని కొన్ని ముఖ్య సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని, నేటి ఆధునిక కాలానికి అన్వయించి, ఈ కథను విజయేంద్రప్రసాద్ రెడీ చేశారని సమాచారం. కథలో కాశీ నగరానికి కూడా ప్రాముఖ్యత ఉందట... దాంతో కాశీ నగరాన్ని పోలిన సెట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉందని భోగట్టా. -
సెలవు లేదన్న హెడ్మాస్టర్.. లెక్కల టీచర్ ఏం చేశారంటే?
భువనేశ్వర్: తీవ్ర అనారోగ్యం పాలైన ఓ ఉపాధ్యాయుడు సెలవు కోసం పెట్టుకున్న దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలు తిరస్కరించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సెలవివ్వడం కుదరదంటూ తెగేసి చెప్పారు. పాపం ఆ ఉపాధ్యాయుడు విధిలేక చేతికి ఐవీ డిప్ సెలైన్ పెట్టుకునే విధులకు హాజరయ్యారు. ఆయన ఆరోగ్యం విషమించడం చూసి తోటి వారే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఒడిశాలోని బొలంగీర్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. బొలంగీర్ ప్రభుత్వ పాఠశాలలో విజయలక్ష్మి ప్రధాన్ హెడ్మాస్టర్ కాగా, ప్రకాశ్ భోయి గణితం టీచర్. ఇటీవల తన తాత అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన అనంతరం ప్రకాశ్ ఆరోగ్యం దెబ్బతింది. విధులకు హాజరు కాలేనందున, సెలవు ఇప్పించమంటూ ఆయన ప్రధానోపాధ్యాయినికి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి, మ్యాథ్స్ టీచర్ అవసరం ఎంతో ఉంటుందని చెబుతూ ఆమె ఆ వినతిని తిరస్కరించారు.అయితే, ఎన్ని సార్లు కోరినా హెడ్మాస్టర్ వినిపించుకోకపోవడంతో ప్రకాశ్ భోయి చేతికి సెలైన్ పెట్టుకునే విధులకు వచ్చారు. ఆయన పరిస్థితి చూసి తోటి టీచర్లే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పటన్గఢ్ బ్లాక్ విద్యాధికారి(బీఈవో) ప్రసాద్ మాఝి స్పందించారు. కాజువల్ లీవ్ కోసం ప్రకాశ్ భోయి పంపించిన దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మీ ప్రధాన్ ఎందుకు తిరస్కరించారనే విషయమై విచారణ చేపట్టామన్నారు. ఆమెదే తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. #ମିଳିଲାନି_ଛୁଟି #ସାଲାଇନ୍_ଧରି_ସ୍କୁଲରେ_ଶିକ୍ଷକଦେହ ଖରାପ ସତ୍ତ୍ବେ ମିଳିଲାନି ଛୁଟି। ମାନିଲେନି ପ୍ରିନ୍ସିପାଲ୍, ଶିକ୍ଷକ ହେଲେ ଗୁରୁତର। ସାଲାଇନ୍ ଲଗାଇ ସ୍କୁଲ ଦୁଆରେ ଛାଡ଼ିଲେ ପରିବାର। ଦେଖନ୍ତୁ ଏ ଦୃଶ୍ୟକୁ, ସ୍କୁଲ ଦୁଆରେ ଛିଡ଼ା ହୋଇଛନ୍ତି ଶିକ୍ଷକ। #Teacher #Leave #Saline #Controversy #Balangir #OTV pic.twitter.com/tlnV7Sxlvj— ଓଟିଭି (@otvkhabar) March 8, 2025 -
ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం.. 30 బోట్లు దగ్ధం
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పారాదీప్ ఫిషింగ్ హార్బర్లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 30 ఫిషింగ్ బోట్లు దగ్థం.. కోట్లలో ఆస్తి నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ఫారెస్ట్‌లో ఫైట్
ఒడిశాలో ల్యాండ్ అయ్యారు మహేశ్‌బాబు. ఎందుకంటే సినిమా షూటింగ్ కోసం. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ ఫారెస్ట్ అడ్వెంచరస్ ఫిల్మ్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం చిత్రయూనిట్ ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతానికి వెళ్లిందని తెలిసింది. దాదాపు ఇరవై రోజుల వరకు ఈ సినిమా చిత్రీకరణ అక్కడే జరుగుతుందని సమాచారం. గత ఏడాది డిసెంబరు నెల చివర్లో ఒడిశా వెళ్లి, అక్కడి ఫారెస్ట్ లొకేషన్స్‌ని రాజమౌళి పరిశీలించారు. బుధవారం ఒడిశా వెళ్లారు. దీంతో ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ కూడా జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ప్రముఖ నటి–నిర్మాత ప్రియాంకా చోప్రా మలయాళ దర్శక–నిర్మాత–నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని, తొలి భాగం 2027లో విడుదలయ్యే అవకాశం ఉందని భోగట్టా. -
రూ.10 కోసం తండ్రిని చంపి.. తలతో పోలీస్ స్టేషన్‌కు..
బారిపడా: ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో దారుణం జరిగింది. 40 ఏళ్ల వ్యక్తి 'గుట్కా' కొనడానికి తన తండ్రిని రూ.10 అడిగాడు. ఇవ్వడానికి నిరాకరించిన తండ్రిని తల నరికి చంపేశాడు. నిందితుడు.. తండ్రి తలను చందువా పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి లొంగిపోయాడు. మృతి చెందిన వ్యక్తిని బైధర్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.తల్లిదండ్రులు, నిందితుడికి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోగా, తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి తండ్రిని దారుణంగా హత్య చేశాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన అతని తల్లి అక్కడి నుంచి పారిపోయింది. పోలీస్ అధికారి మాట్లాడుతూ చిన్న సమస్య హత్యకు దాని తీసిందని తెలిపారు. పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
తృటిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. బోగీలు రెండుగా విడిపోయి..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో(Uttar Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణిస్తున్న రైలు బోగి రెండుగా విడిపోయాయి. 200 మీటర్ల మేర ప్రయాణించాయి. బోగి విడిపోవడంపై అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే ఆ రైలు ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది.పోలీసుల సమాచారం మేరకు..బీహార్ నుంచి ఒడిశాలోని పురి ప్రాంతానికి నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ (Nandan Kanan Express ) బయలుదేరాల్సి ఉంది. అయితే, మార్గం మధ్యలో ఉత్తర ప్రదేశ్‌లో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ్ స్టేషన్ (Pandit Deen Dayal Upadhyaya (DDU) లో నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ బోగీ విడిపోయింది. #WATCH | Chandauli, Uttar Pradesh: The coupling of the Nandan Kanan Express broke near the Pandit Deen Dayal Upadhyaya (DDU) Junction, splitting it into two parts. pic.twitter.com/QjqUHN7tfe— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 4, 2025ట్రైన్ ఆరు బోగీలు విడిపోయి 200 మీటర్లు ముందుకు వెళ్లిపోయాయి. మిగతా 15 బోగీలు వెనకే ఉన్నాయి. బోగీలు విడిపోవడంతో రైల్లోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో కేకలు వేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నిలివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికుల్ని సురక్షితంగా మరో కోచ్‌కు తరలించారు. అనంతరం, రైలు బోగీ విడిపోవడంపై రైల్వే అధికారులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే రైలు కప్లింగ్ విరిగిపోయిన విషయాన్ని గుర్తించారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి దాన్ని మళ్లీ అతికించారు. -
జ్వరం వచ్చిందని చిన్నారికి 40 చోట్ల వాతలు.. చివరకు..
భువనేశ్వర్: ప్రపంచం ఇరవై ఒకటో శతాబ్దంలో ఓవైపు కృత్రిమ మేథతో దూసుకుపోతుంటే మరోవైపు కొందరు ఇంకా మూఢాంధకారంలో మగ్గిపోతున్నారు. తమ మూఢ విశ్వాసాలకు కుటుంబసభ్యులనూ బలిచేస్తున్నారు. ఒడిశాలో ఇలాంటి ఘటన తాజాగా వెలుగుచూసింది.అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నెల వయసు పసికందుకు నిర్దాక్షిణ్యంగా వాతలు పెట్టారు. దాదాపు 40 చోట్ల వాతలతో నరకయాతన పడుతున్న చిన్నారిని ఎట్టకేలకు ఆస్పత్రిలో చేర్పించడంతో బతికి ప్రాణాలతో బయటపడ్డాడు. నబారంగ్పూర్ జిల్లాలోని చందహండీ బ్లాక్ గంభారీగూడ పంచాయతీ పరిధిలోని ఫూన్దేల్పాడా గ్రామంలో ఈ దారుణోదంతం జరిగింది. ప్రస్తుతం చిన్నారిని ఉమెర్కోట్ సబ్–డివిజనల్ ఆస్పత్రిలో చేరి్పంచి చికిత్స అందిస్తున్నామని నబారంగ్పూర్ చీఫ్ డి్రస్టిక్ట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ కుమార్ సోమవారం చెప్పారు. తలపై, పొట్టపై వాతలు.. నెలరోజుల క్రితం జన్మించిన ఈ బాబు గత పదిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఒళ్లు వేడెక్కి కాలిపోతుండటంతో గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో పిల్లాడిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించాల్సిన కుటుంబసభ్యులకు మూఢవిశ్వాసాలపై గురి ఎక్కువ. ఈ గ్రామీణ ప్రాంతంలో పిల్లలకు ఆరోగ్యం బాగోలేకపోతే చెడుగాలి సోకిందని, దుష్టశక్తిని పారద్రోలేందుకు ఉపాయంగా ఇనుప కడ్డీతో ఒంటిపై వాతలు పెడతారు. ఇదే అంధవిశ్వాసంతో కుటుంబసభ్యులు ఈ పిల్లాడికి తలపై, పొట్టపై దాదాపు 40 చోట్ల కాల్చిన ఇనుపకడ్డీతో వాతలు పెట్టారు. కాలిన గాయాలతో పిల్లాడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది.దీంతో చేసేదేమీలేక చివరకు పిల్లాడిని ఉమెర్కోట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పిల్లాడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చందహండీ బ్లాక్ పరిధిలో ప్రజల్లో మూఢవిశ్వాసాలను పోగొట్టి వారిలో సామాజిక చైతన్యం తీసుకొచ్చేందుకు నడుం బిగించారు. వాతలు పెట్టే పురాతన పద్ధతులను విడనాడాలని అవగాహన కార్యక్రమాలు మొదలెట్టారు. -
కోల్‌కతా సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం
-
నేపాలి విద్యార్థిని ఆత్మహత్య.. ఐదుగురు కీలక వ్యక్తులు అరెస్ట్
భువనేశ్వర్: ఒడిశాలోని భువనేశ్వర్ పట్టణంలోని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అయిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండ్రస్టియల్ టెక్నాలజీ(కేఐఐటీ)లో 20 ఏళ్ల నేపాలీ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. అరెస్ట్ అయిన వారిలో కాలేజీ హెచ్ఆర్ విభాగ డైరెక్టర్ జనరల్, పరిపాలనా విభాగ డైరెక్టర్, హాస్టల్స్ డైరెక్టర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.వివరాల ప్రకారం.. విద్యార్థి వేధింపుల కారణంగా కేఐఐటీ హాస్టల్లో ప్రకృతి లాంసాల్ అనే బీటెక్ మూడో ఏడాది విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో అదే కాలేజీలో విద్యనభ్యసిస్తున్న 900 మంది నేపాలీ విద్యార్థులు నిరసన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనకు అణచివేసేందుకు వర్సిటీలోని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు విచక్షణారహితంగా కొట్టడం, తర్వాత 800 మంది విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయించి పంపేయడం చర్చనీయాంశమైంది. ఘటనలో వాస్తవాలను వెలికితీసేందుకు రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ముగ్గురితో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యాశాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖల కార్యదర్శులు ఈ కమిటీలో ఉన్నారు. తోటి నేపాలీ అమ్మాయి చనిపోతే నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సస్పెన్షన్ లేఖలు జారీచేయాల్సినంతగా కాలేజీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో ఈ కమిటీ ఆరాతీసి ప్రభుత్వానికి నివేదించనుంది.ఇక, ఘటనపై నేపాల్ ప్రభుత్వం స్పందించింది. తమ దేశ విద్యార్థులను కలిసి విషయం తెల్సుకుని తదుపరి కార్యచరణ కోసం ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులను ఒడిశాకు పంపింది. విద్యార్థుల నిర్ణయం మేరకు కుదిరితే మళ్లీ హాస్టల్లో చేర్పించడం లేదంటే స్వదేశానికి తీసుకెళ్లడంపై విద్యార్థులకు ఆ అధికారులు సలహాలు, సూచనలు చేస్తారు. విద్యార్థి మరణం వార్త తెల్సి నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి సైతం విచారం వ్యక్తంచేశారు. The tragic death of Nepali student Prakriti Lamsal at KIIT has sparked protests,Alleged harassment led to her suicide, with the college’s mishandling and irresponsible comments from officials raising serious concerns. investigations are ongoing #JusticeForPrakriti#KIITUniversity pic.twitter.com/Bl2GS71Oic— R0ni (@R0ni9801025590) February 18, 2025 -
రష్యా బీర్ క్యాన్‌పై మహాత్ముడి చిత్రం
న్యూఢిల్లీ: అహింస, మద్యపానం నిషేధం కోసం జీవితాంతం పోరాటం సాగించిన జాతిపితి మహాత్మాగాంధీ చిత్రం రష్యా బీర్ క్యాన్‌పై ప్రత్యక్షమైంది. రష్యాకు చెందిన రివార్ట్ అనే బీర్ బ్రాండ్‌పై మహాత్ముడి ఫొటోతోపాటు ఆయన సంతకాన్ని సైతం ముద్రించారు. సదరు కంపెనీ తీరపై సోషల్ మీడియాలో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీర్ క్యాన్ చిత్రాలను మాజీ ముఖ్యమంత్రి నందిని శతపథి మనవడు సుపర్నో శతపథి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని రష్యా దృష్టికి తీసుకెళ్లాలని, బీర్ క్యాన్‌పై గాం«దీజీ ఫొటో తొలగించేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. మద్యపాన వ్యతిరేకి అయిన గాంధీజీ చిత్రాలన్ని బీర్ క్యాన్ ముద్రించి అమ్ముకోవడం తనకు ఆవేదనకు గురి చేస్తోందని పేర్కొన్నారు. ‘మీ మిత్రుడైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సమాచారం చేరవేయండి, వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోండి’అని మోదీని కోరారు. సుపర్నో శతపథి షేర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో గంటల వ్యవధిలోనే చర్చనీయాంశంగా మారింది. లక్షల మంది దీనిపై స్పందించారు. రష్యా బీర్ కంపెనీ తీరును తప్పుపట్టారు. -
శిల్పారామంలో మూడు రోజుల పాటు ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా
మాదాపూర్ : హైదరాబాద్‌లో ఒడిశా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒడియాఫుడ్, క్రాఫ్ట్ మేళాను శిల్పారామంలో శుక్రవారం ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న మేళాను స్వాభిమాన్ ఒడియా ఉమెన్స్ వరల్డ్, శిల్పారామం సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రదర్శనలో ఒడిశా సంప్రదాయ వంటకాలు, హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం యాంఫీథియేటర్‌లో 5.00 గంటలకు ఒడిశా సంప్రదాయ నృత్యాలను కళాకారులు ప్రదర్శించి సందర్శకులను ఆకట్టుకోనున్నారు. మూడు రోజుల ఉత్సవం సందర్శకులకు ప్రత్యేక అనుభవాన్ని అందిస్తుందని సంస్థ అధ్యక్షురాలు సుస్మితా మిశ్ర తెలిపారు. ఒడిశాలోని ప్రసిద్ధ సంబల్పురి, బొమ్కై, కోట్‌ప్యాడ్ అల్లికలతో పాటు, క్లిష్టమైన పెయింటింగ్‌లు, ధోక్రా మెటల్‌వర్క్, ప్రముఖ కళాకారులచే అప్లిక్ వర్క్‌లను ప్రదర్శించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఒడిశా కళాత్మక వారసత్వానికి ప్రాణం పోసే ఒడిస్సీ నృత్యం, జానపద, గిరిజన నృత్య ప్రదర్శనలు సందర్శకులను అలరించనున్నాయి. ఇదీ చదవండి: Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!ఒడిశా సంప్రదాయ వంటకాలు.. రసగొల్ల, చెనపోడ, కిర్మోహణ, ఒడియా స్ట్రీట్‌ఫుడ్ గప్‌చుప్, దహీబారా, ఆలూదమ్, ఆలూచాప్ తదితరులు వంటకాలు అందుబాటులో ఉంచనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ -
ఒడిశాపై గోవా గెలుపు
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో గోవా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) 2–1 స్కోరుతో ఒడిశా జట్టుపై విజయం సాధించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో గోవా తరఫున బ్రిసన్ డ్యూబెన్ ఫెర్నాండెజ్ 29వ నిమిషంలో గోల్ సాధించి గోవాకు తొలి ఆధిక్యం ఇచ్చాడు. ఒడిశా ఆటగాడు లాల్తతంగ ఖవిహ్రింగ్ (47వ నిమిషంలో) చేసిన సెల్ఫ్ గోల్ గోవా ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. 54వ నిమిషంలో ఒడిశా స్ట్రయికర్ కేపీ రాహుల్ గోల్ చేసినప్పటికీ గోవా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో ఒడిశా తమ దాడులకు పదునుపెట్టలేకపోయింది. అవతలివైపు నుంచి గోవా ఎఫ్‌సీ ఆటగాళ్లు మాత్రం పదేపదే ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌వైపు దూసుకొచ్చి ఏకంగా 20 షాట్లు కొట్టారు. లక్ష్యంపై ఆరుసార్లు గురిపెట్టగా ఒకసారి గోల్‌తో విజయవంతమైంది. ఒడిశా 15 షాట్లు ఆడినా... కేవలం ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై రెండే సార్లు దాడి చేసింది. ఇందులో ఒకసారి మాత్రం ఫలితాన్ని సాధించింది. గోవా ఆటగాళ్లు మైదానంలో పాదరసంలా కదిలారు. బంతిని ప్రత్యర్థులకంటే తమ ఆధీనంలో ఉంచుకునేందుకు అదేపనిగా చకచకా పాస్‌లు చేశారు. శుక్రవారం షిల్లాంగ్‌లో జరిగే పోరులో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ జట్టుతో ముంబై సిటీ ఎఫ్‌సీ తలపడుతుంది. -
గుట్టల గుట్టలుగా నోట్ల కట్టలు
-
అలాంటి కార్లు టోల్ గేట్ దాటితే భారీ జరిమానా
ఇన్సూరెన్స్ లేని వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. చాలామంది, వెహికల్ ఇన్సూరెన్స్ (Vehicle Insurance) తీసుకోకుండా కార్లను వినియోగిస్తుంటారు. అలాంటి వారివల్ల ప్రమాదాలు జరిగితే.. ఆ ప్రభావం ఇతరుల మీద కూడా పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఒడిశా స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఓ కొత్త రూల్ తీసుకు వచ్చింది. ఇది తప్పకుండా వాహనదారులు తమ కార్లకు ఇన్సూరెన్స్ తీసుకునేలా చేస్తుందని సమాచారం.వెహికల్ ఇన్సూరెన్స్ లేని, ఏ వాహనమైన టోల్ గేట్ దాటితే.. అలాంటి వాహనదారులకు ఈ చలాన్ జారీ చేయనున్నట్లు ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియమం 2025 ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. తప్పకుండా ఈ విషయాన్ని వాహన వినియోగదారులు గుర్తుంచుకోవాలి.కారు ఇన్సూరెన్స్ లేకుంటే..టోల్ గేట్లపై అమర్చిన ఈ-డిటెక్షన్ సిస్టమ్‌ల ద్వారా.. ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తిస్తారు. అలాంటి వాహనాలకు ఆటోమాటిక్ చలాన్ జారీ చేస్తారు. ఇన్సూరెన్స్ లేకుండా మొదటిసారి టోల్ గేట్ దాటితే వారికు రూ. 2,000 జరిమానా విధిస్తారు. ఇదే రెండోసారి పునరావృతమైతే.. వారు రూ. 4,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా కాకుండా.. మూడు నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో చలానా, జైలు శిక్ష రెండూ పడొచ్చు. కాబట్టి 1988లోని సెక్షన్ 146 ప్రకారం.. పబ్లిక్ రోడ్లపై నడిచే ప్రతి మోటారు వాహనం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.ఆటోమేటిక్ ఈ-డిటెక్షన్ సిస్టమ్ప్రైవేట్, వాణిజ్య వాహనాలు చెల్లుబాటు అయ్యే బీమా లేకుండా రోడ్లపై నడుపుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిని పరిగణలోకి తీసుకుని ఒడిశా (Odisha) స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొత్త రూల్ కింద ఆటోమేటిక్ ఈ-డిటెక్షన్ సిస్టమ్ తీసుకొచ్చింది.నిజానికి ఆటోమేటిక్ ఈ-డిటెక్షన్ సిస్టమ్ అనేది కొత్తేమీ కాదు. కొన్ని నెలల క్రితం, బీహార్ ప్రభుత్వం పొల్యూషన్ సర్టిఫికెట్లు లేని వాహనాలను గుర్తించేందుకు.. రాష్ట్రంలోని 32 టోల్ ప్లాజాలలో ఈ-డిటెక్షన్ సిస్టమ్‌ను ప్రారంభించింది. పీయూసీ లేకుండా పట్టుబడితే.. వాహనానికి రూ. 10వేలు జరిమానా విధిస్తారు. ఈ సిస్టం ట్రయల్స్ ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లోనే 5,000కు పైగా ఈ చలాన్లు జారీ చేశారు. కాబట్టి ఇదే సిస్టం త్వరలో.. పాట్నా, ముజఫర్‌పూర్, భాగల్పూర్, ఇతర స్మార్ట్ సిటీలలో కూడా ప్రారంభించనున్నట్లు బీహార్ ప్రభుత్వం వెల్లడించింది.త్వరలో ఇతర రాష్ట్రాలకు..ప్రస్తుతం ఈ డిటెక్షన్ సిస్టం కేవలం ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో మాత్రమే అమలులో ఉంది. ఈ విధానం త్వరలోనే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సిస్టం ప్రారంభమైతే.. జరిమానాలు లేదా జైలు శిక్షకు భయపడి వాహనదారులు తప్పకుండా నియమానాలకు అనుగుణంగా నడుచుకునే అవకాశం ఉందని భావిస్తున్నాము.టోల్ కలెక్షన్ కోసం శాటిలైట్ విధానంమారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి హైవేల మీద టోల్ గేట్స్ లేకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. టోల్ గేట్స్ మొత్తం తొలగించి.. శాటిలైట్ విధానం ద్వారా టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వాహనదారులు హైవే మీద ఎక్కడా ఆగాల్సిన పనిలేదు.ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపుగ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ద్వారా టోల్ కలెక్షన్ చాలా సులభం. ఈ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ నేషనల్ హైవే275 & హర్యానాలోని పానిపట్-హిసార్ నేషనల్ హైవే709 మధ్యలో శాటిలైట్ విధానం ద్వారా టోల్ వసూలు చేయడానికి సంబంధించిన ట్రైల్ కూడా విజయవంతంగా పూర్తయిందని గడ్కరీ గతంలోనే పేర్కొన్నారు. -
వరల్డ్ రికార్డు.. వికెట్ కోల్పోకుండానే 376 కొట్టేశారు
భారత్‌లోని పిచ్‌లపై నాలుగో రోజు ఆటలో 200 పరుగుల లక్ష్యమైనా కొండంతలా అనిపిస్తుంది. ఆచితూచి ఆడితేనే దానిని ఛేదించే అవకాశం ఉంటుంది. అలాంటిది ఏకంగా 376 పరుగుల లక్ష్యం ముందుంటే... ఏ జట్టయినా విజయంపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే ఒడిశాతో జరిగిన రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నీ మ్యాచ్ సందర్భంగా సర్వీసెస్(Services) జట్టు బ్యాటర్లు మాత్రం అలా అనుకోలేదు. ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు కదా అనే ఉద్దేశంతో బరిలోకి దిగారు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. దాంతో చూస్తుండగానే స్కోరు బోర్డుపై 100, 200, 300 పరుగులు నమోదయ్యాయి. చివరకు 376 పరుగుల లక్ష్యం కూడా కరిగిపోయింది. వెరసి సరీ్వసెస్ జట్టు రంజీ ట్రోఫీ చరిత్రలోనే చిరస్మరణీయ విజయం అందుకుంది. 376 పరుగుల లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 46/0తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్వీసెస్ జట్టు 85.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని అధిగమించింది. సర్వీసెస్ ఓపెనర్లలో శుభం రోహిల్లా (270 బంతుల్లో 209 నాటౌట్; 30 ఫోర్లు) డబుల్ సెంచరీ చేయగా... సూరజ్ వశిష్ట (246 బంతుల్లో 154 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో గెలిచినప్పటికీ సరీ్వసెస్ జట్టు నాకౌట్ దశకు చేరలేకపోయింది. ఆదివారంతో రంజీ ట్రోఫీలో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో గుజరాత్‌తో సౌరాష్ట్ర; ముంబైతో హరియాణా; విదర్భతో తమిళనాడు; జమ్మూ కశ్మీర్‌తో కేరళ తలపడతాయి.సర్వీసెస్ వరల్డ్ రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన సర్వీసెస్ జట్టు పలు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. రంజీ ట్రోఫీ హిస్టరీలోనే వికెట్ కోల్పోకుండా అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా సర్వీసెస్ రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా రంజీల్లో అత్యధిక టార్గెట్‌ను ఛేజ్ చేసిన రెండో జట్టుగా సర్వీసెస్ నిలిచింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో రైల్వేస్ అగ్రస్ధానంలో ఉంది. గతేడాది సీజన్లో అగర్తాల వేదికగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 378 పరుగుల లక్ష్యాన్ని రైల్వేస్ జట్టు 5 వికెట్లు కోల్పోయి చేధించింది. తాజా మ్యాచ్‌తో సర్వీసెస్ రెండో స్ధానానికి చేరింది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నాల్గవ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా సర్వీసెస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్‌కు చెందిన సర్గోధా క్రికెట్ క్రికెట్ క్లబ్ పేరిట ఉండేది. 1998-99 దేశవాళీ సీజన్లో లహోర్ సిటీపై సర్గోధా వికెట్ నష్టపోకుండా 332 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో సర్గోదా ఆల్‌టైమ్ రికార్డును సర్వీసెస్(376) బ్రేక్ చేసింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
అన్వాంటెడ్ గర్ల్ టు ఐఏఎస్ ఆఫీసర్!
మగపిల్లాడు పుట్టాలని బలంగా కోరుకుంది ఆ కుటుంబం. అయితే ఆడపిల్లే పుట్టింది. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. నిర్లక్షంగా చూసేవారు. రూర్కెలాలోని పేద కుటుంబంలో పుట్టిన ఆ అమ్మాయికి బాగా చదువుకోవాలనే కోరిక ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం పెద్దగా లేకపోవడం వల్ల చదువు కొనసాగించడం అనేది అసాధ్యంగా మారినప్పటికీ వెనకడుగు వేయలేదు. ఒడిషాకు చెందిన సంజిత మహాపాత్రో ఎన్నో సమస్యల మధ్య చదువును పూర్తి చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయింది.‘ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి!’ అనిపించుకుంటుంది మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరిషత్ సీయీవో సంజిత మహపాత్రో. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించింది.ముఖ్యంగా పేదింటి బిడ్డల చదువు విషయంలో చొరవ తీసుకుంటుంది. ‘చదువుకోవాలనే కోరిక మీలో బలంగా ఉంటే ఏ శక్తీ అడ్డుకోలేదు’ అంటున్న సంజిత.. ‘చదివింది చాలు. ఇక ఆపేయ్’ అనే పరిస్థితులు ఎన్నోసార్లు ఎదుర్కొంది. అయితే స్వచ్ఛంద సంస్థల సహకారంతో, ఉపకార వేతనాలతో చదువు కొనసాగించింది. మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన సంజిత స్టీల్ అథారిటీ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసింది. వారి కుటుంబం సొంత ఊళ్లో ఇల్లు కట్టుకుంది. ‘ఐఏఎస్ చేయాలి’ అనేది సంజిత చిన్నప్పటి కల. భర్త కూడా ప్రోత్సహించాడు.ఇదీ చదవండి: ఫ్యాషన్‌తో కల సాకారం చేసుకున్న తాన్యాయూపీఎస్సీకి ముందు ఒడిషా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (వోఎఎస్)లో రెండో ర్యాంకు సాధించింది. ఉద్యోగంలో చేరకుండా యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టింది. అయితే విజయం ఆమెకు అంత తేలికగా దక్కలేదు. మొదటిసారి, రెండోసారి, మూడోసారీ ప్రిలిమినరి పరీక్షలలోనే ఫెయిల్ అయింది. చదువులో ‘సక్సెస్’ తప్ప ఫెయిల్యూర్ గురించి పెద్దగా పరిచయం లేని సంజిత వరుస ఫెయిల్యూర్లతో నిరాశపడి ఉండాలి. అయితే ఆమె ఎప్పుడూ నిరాశ పడలేదు. అలా అని అతి ఆత్మవిశ్వాసానికి పోలేదు. ‘ఎక్కడ పొరపాటు జరుగుతుంది’ అనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయం సాధించింది. తాము నడిచొచ్చిన దారిని మరవని వారు మరిన్ని విజయాలు సాధిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ సంజిత మహాపాత్రో ఈ కోవకు చెందిన స్ఫూర్తిదాయకమైన విజేత. చదవండి: Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!ఒక్కో మెట్టు ఎక్కుతూ...పేద కుటుంబంలో పుట్టిన నాకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది చిన్నప్పటి కోరిక. చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం. అనుకున్నవన్నీ నిజం కాకపోవచ్చు. అయితే సాధించాలనే పట్టుదల మనలో గట్టిగా ఉంటే అదేమీ అసాధ్యం కాదు అని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఒక్కోమెట్టు ఎక్కుతూ నా కలను నిజం చేసుకున్నాను.– సంజిత మహాపాత్రో -
చాంపియన్ ఒడిశా వారియర్స్
రాంచీ: మహిళా క్రీడాకారిణుల కోసం తొలిసారి నిర్వహించిన మహిళల హాకీ ఇండియా లీగ్ (డబ్ల్యూహెచ్ఐఎల్) టోర్నమెంట్లో ఒడిశా వారియర్స్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నేహా గోయల్ సారథ్యంలోని ఒడిశా వారియర్స్ 2-1 గోల్స్ తేడాతో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ జట్టును ఓడించింది. రుతుజా దాదాసో పిసాల్ (20వ, 56వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి ఒడిశా వారియర్స్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సలీమా టెటె కెప్టెన్సీలో ఆడిన సూర్మా క్లబ్ జట్టుకు పెన్నీ స్క్విబ్ (28వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది. విజేతగా నిలిచిన ఒడిశా వారియర్స్ జట్టుకు రూ. 1 కోటి 50 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్ సూర్మా క్లబ్ జట్టుకు రూ. 1 కోటి ప్రైజ్‌మనీ దక్కింది. మూడో స్థానంలో నిలిచిన ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. ‘బెస్ట్ గోల్‌కీపర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు సవితా పూనియా (సూర్మా హాకీ క్లబ్)... ‘అప్‌కమింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ పురస్కారం సోనమ్ (సూర్మా హాకీ క్లబ్)... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు జ్యోతి (సూర్మా హాకీ క్లబ్) గెల్చుకున్నారు. ఐదు గోల్స్ చొప్పున సాధించిన యిబ్బీ జాన్సెన్ (ఒడిశా వారియర్స్), చార్లోటి ఎంగ్లెబెర్ట్ (సూర్మా హాకీ క్లబ్) ‘టోర్నీ టాప్ స్కోరర్స్’గా నిలిచారు. ‘టాప్’లో హైదరాబాద్ తూఫాన్స్ పురుషుల హాకీ ఇండియా లీగ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు 17 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. యూపీ రుద్రాస్ జట్టుతో రూర్కెలాలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ 3-1తో నెగ్గింది. తూఫాన్స్ జట్టు తరఫున అర్‡్షదీప్ సింగ్ రెండు గోల్స్... పిలాట్ ఒక గోల్ చేశారు.4 పాల్గొన్న జట్లు 13 మొత్తం జరిగిన మ్యాచ్‌లు 41 నమోదైన మొత్తం గోల్స్ 27 ఫీల్డ్ గోల్స్ 11 పెనాల్టీ కార్నర్ గోల్స్ 3 పెనాల్టీ స్ట్రోక్ గోల్స్ 22 క్రీడాకారిణులకు లభించిన గ్రీన్ కార్డులు 6 క్రీడాకారిణులకు లభించిన ఎల్లో కార్డులు -
బియ్యం కోసం తల్లి హత్య
భువనేశ్వర్:పది కేజీల బియ్యం కోసం జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. అది కూడా కన్నకొడుకు తల్లిని గొడ్డలితో నరికి చంపే దాకా వెళ్లింది. ఈ దారుణ ఘటన ఒడిశాలోని శరత్చంద్రాపూర్లో జరిగింది. అన్నదమ్ములైన రోహిదాస్,లక్ష్మికాంత్సింగ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో రోహిదాస్ 10 కిలోల బియ్యం కోసం తల్లి రాయ్బరిసింగ్తో గొడవ పెట్టుకున్నాడు. బియ్యం ఇవ్వడానికి ఆమె తిరస్కరించడంతో గొడవ కాస్తా సీరియస్ అయి రోహిదాస్ గొడ్డలితో తల్లిపై దాడి చేశాడు. గొడ్డలితో దాడి చేయడంతో తల్లి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.అనంతరం రోహిదాస్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి ఉపయోగించిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: భర్త వివాహేతర సంబంధం..భార్యా,కుమారుడి ఆత్మహత్య -
ఒడిశాలో 1,600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఒడిశాలోని కోణార్క్‌లో జరుగుతున్న మూడో జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సులో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాఝీకి ఆయన విజ్ఞాపన లేఖను అందజేశారు. నైనీ బ్లాకు ఏర్పాటుకు ఒడిశా సీఎం కార్యాలయం మద్దతు ఇచి్చనందుకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. నైనీ గనికి సమీపంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రం స్థాపనకు భూమిని కేటాయించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరగా, ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి సహకరిస్తామని హామీ ఇచ్చారు.‘గత జూలై 24న మీతో జరిగిన సమావేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ చర్చలు ఫలవంతమయ్యాయి’అని భట్టి సంతోషం వ్యక్తం చేశారు. నైనీ గనిలో ఉత్పత్తయిన బొగ్గును 1000 కి.మీ. దూరంలో ఉన్న మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు తరలిస్తే రవాణా ఖర్చులు పెరిగి విద్యుత్ ధరలూ భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో నైనీ గనికి సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉత్పత్తయ్యే బొగ్గును అక్కడే వినియోగించాలని నిర్ణయించామని భట్టి తెలిపారు. 20వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే ప్రకారం వచ్చే మూడు దశాబ్దాలపాటు థర్మల్ విద్యుత్‌కు భారీ డిమాండ్ ఉంటుందన్నారు. బొగ్గు గనుల దగ్గరే కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.దీంతో బొగ్గు రవాణా ఖర్చులను తగ్గించడంతోపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా, పర్యావరణ పర్యవేక్షణకు అవకాశం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు. సింగరేణి, ఒడిశా అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ప్రాథమికంగా జరపాడ/తుకుడ, హండప్ప/బని నాలిని ప్రాంతాల్లో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయానికి వచ్చారన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలతోపాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. 10 ప్రాజెక్టులకు నిధులిప్పించండి తెలంగాణ చేపడుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సాయంతోపాటు అనుమతులు ఇప్పించేందుకు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న పది ప్రాజెక్టులకు మొత్తం రూ.1,63,559 కోట్ల వ్యయం కానుందని తెలిపా రు. మైనింగ్ మంత్రుల సమావేశంలో ఆయా ప్రాజెక్టుల ఆర్థిక అంచనాలు, అనుమతుల ప్రతిపాదనల తో కూడిన వినతిపత్రాన్ని కిషన్‌రెడ్డికి అందజేశారు. 32 ఖనిజ బ్లాకులను వేలం వేస్తాంసున్నపురాయి, మాంగనీసు వంటి 32 మేజర్ ఖనిజ బ్లాకులను 2024–25, 2025–26 సంవత్సరాలకు సంబంధించి వేలం వేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. 2014లో రూ.1958 కోట్లుగా ఉన్న ఖనిజ ఆదాయం 2023–24 నాటికి రూ.5,540 కోట్లకు పెరిగిందన్నారు. జాతీయ ఖనిజ మంత్రుల సమావేశంలో భట్టి ప్రసంగించారు. ‘జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా ఖనిజాన్వేషణ, నిర్వహణ ఉండాలి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ దేశీయంగా ఖనిజ పరిశ్రమలను ప్రోత్సహించాలి. రాష్ట్రంలో మొత్తం 2,552 గనుల లీజుల ఉన్నాయని, చిన్న ఖనిజాల లీజు మంజూరు విషయంలో బ్లాక్‌ల వేలం విధానంలో అనుసరించే నిబంధనలు పాటిస్తున్నాం’అని భట్టి వెల్లడించారు. జిల్లా మినరల్ ఫౌండేషన్ ద్వారా 2015 నుంచి ఇప్పటివరకు రూ. 5,537 కోట్లు వసూలైందని, ఈ నిధిని ప్రభుత్వ పాఠశాలలతో పాటు పలు ప్రాధాన్యతా రంగాల్లో వినియోగిస్తున్నామన్నారు. -
భారమైన జీవనాన్ని పరుగులు తీయిస్తోంది
జీవితం ప్రతి దశలోనూ ఒక అడ్డంకిని సృష్టిస్తుంది. ఆ అడ్డంకిని ఎదుర్కొనే విధానంలోనే విజయమో, అపజయమో ప్రాప్తిస్తుంది. విజయాన్ని సాధించి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది మూడు పదుల వయసున్న సంతోషి దేవ్ జీవన పోరాటం. హర్యానా వాసి సంతోషి దేవ్ ఒడిశాలోని కొయిడా మైనింగ్ గనుల నుండి ఇనుప ఖనిజాన్ని రవాణా చేసే వోల్వో ట్రక్కు నడుపుతోంది. ఈ రంగంలో పురుషులదే ప్రధాన పాత్ర. మరి సంతోషి మైనింగ్‌లో ట్రక్కు డ్రైవర్‌గా ఎలా నియమితురాలైంది?! ముందు ఆమె జీవనం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలి. మలుపు తిప్పిన గృహహింస...పదహారేళ్ల వయసులో సంతోషి దేవ్‌ని ఒడిశాలోని హడిబంగా పంచాయతీ, బాదముని గ్రామంలోని ఒక వ్యక్తితో వివాహం జరిగింది. ఆ వివాహం ఆమె జీవితాన్ని భయంకరమైన మలుపు తిప్పింది. నిత్యం వరకట్న వేధింపులు, గృహహింసతో బాధాకరంగా రోజులు గడిచేవి. కన్నీటితోనే తన పరిస్థితులను తట్టుకుంటూ కొన్నాళ్లు గడిపింది. అందుకు కారణం తల్లిదండ్రులకు తొమ్మిదిమంది సంతానంలో తను ఆరవ బిడ్డ. ఎంతటి కష్టాన్నైనా సహనంతో సర్దుకుపొమ్మని పుట్టింటి నుంచి సలహాలు. కొన్నాళ్లు భరించినా, కఠినమైన ఆ పరిస్థితులకు తల వంచడానికి నిరాకరించి, పోరాడాలనే నిర్ణయించుకుంది. తిరిగి పుట్టింటికి వచ్చింది. కానీ, అక్కున చేర్చుకోవాల్సిన కన్నవారి నుంచి అవమానాల్ని ఎదుర్కొంది. అధైర్యపడకుండా, తన సొంత మార్గాన్ని ఎంచుకోవాలనుకుంది. స్కూల్ వయసులోనే డ్రాపౌట్ స్టూడెంట్. తెలిసినవారి ద్వారా స్పిన్నింగ్ మిల్లులో పని చేయడానికి జీవనోపాధి కోసం తమిళనాడుకు వలస వచ్చింది.కుదిపేసిన పరిస్థితుల నుంచి...భారీ వాహనాలు నడపడంలో శిక్షణ పొందింది. 2021లో క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్్సపోర్ట్ (సిఆర్యుటి) నిర్వహిస్తున్న సిటీ బస్ సర్వీస్ అయిన ‘మో’ బస్‌కు డ్రైవర్‌గా నియమితురాలైంది. ఒడిశాలో ఒంటరి మహిళా బస్సు డ్రైవర్‌గా మహిళా సాధికారతని చాటింది. అయితే ఆశ్చర్యకరంగా, ఆమె విజయగాథ అక్కడి నుంచి తొలగింపుతో ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. ‘తొలి మహిళా బస్సు డ్రైవర్ కావడంతో స్థానిక మీడియా నన్ను హైలైట్ చేసింది. ఒక నెల తరువాత, అధికారులు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు. నా తప్పు ఏమిటో అర్థం కాలేదు. కానీ, మళ్ళీ జీవితం నన్ను పరీక్షించిందని అర్ధమైంది. దీంతో బతకడానికి మళ్లీ ఆటో రిక్షా డ్రైవింగ్‌కు వచ్చేశాను’ అని తన జీవిత ప్రస్థానాన్ని వివరించింది సంతోషి. ఆరు నెలల క్రితం ఓ మైనింగ్ కంపెనీ సంతోషి పట్టుదల, ధైర్యాన్ని గుర్తించింది. వోల్వో ట్రక్కును నడపడానికి ఆఫర్ చేసింది. ‘ఏ కల కూడా సాధించలేనంత పెద్దది కాదు. ఆరు నెలల నుంచి నెలకు రూ.22,000 జీతం పొందుతున్నాను’ అని గర్వంగా చెబుతోంది ఈ పోరాట యోధురాలు. జీవనోపాధిని వెతుక్కుంటూ...‘‘మా అత్తింటిని విడిచిపెట్టిన నాటికే గర్భవతిని. కొన్ని రోజులకు తమిళనాడులోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే అవకాశం వచ్చింది. అక్కడే 2012లో కూతురు పుట్టింది. మూడేళ్లు నా తోటి వారి సాయం తీసుకుంటూ, కూతురిని పెంచాను. ఆమెకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ప్రతి పైసా పొదుపు చేశాను. స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నప్పుడు చెన్నైలో ఆటో రిక్షా నడుపుతున్న ఓ మహిళను చూశాను. ‘ఆమెలా డ్రైవింగ్ చేయలేనా?‘ అని ఆలోచించాను. నా దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపు మొత్తం, చిన్న రుణంతో ఆటో రిక్షా కొనుక్కుని ఒడిశాలోని కియోంజర్కి వచ్చేశాను. నా కూతురుకి మంచి భవిష్యత్తును అందించడానికి ఆమెను హాస్టల్ వసతి ఉన్న స్కూల్లో చేర్పించాను. ఒడిశాలోని అనేక మంది ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు అందుకున్నాను’ అని వివరించే సంతోషి ఆశయాలు అక్కడితో ఆగలేదు. -
యుద్ధంలో కాదు.. బుద్ధుడిలోనే భవిష్యత్తు
భువనేశ్వర్: ఘనమైన వారసత్వం, సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని, నేడు మనం చెప్పే మాట వింటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భవిష్యత్తు అనేది యుద్ధంలో లేదు, బుద్ధుడిలో ఉందని ప్రపంచానికి చెప్పగల శక్తి భారత్‌కు ఉందని తెలిపారు. గురువారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని, మనందరి జీవితాల్లో ప్రజాస్వామ్యం ఒక అంతర్భాగమని స్పష్టంచేశారు. ప్రపంచ స్థాయిలో మన దేశ ప్రతిష్ట ఎంతగానో పెరిగిందని అన్నారు. కేవలం మన మనోగతమే కాకుండా గ్లోబల్ సౌత్ దేశాల అభిప్రాయాలను సైతం ప్రపంచ వేదికపై బలంగా వినిపించగలుగుతున్నామని వెల్లడించారు. ఆయుధ బలంతో సామ్రాజ్యాలు విస్తరిస్తున్న కాలంలో అశోక చక్రవర్తి శాంతి మార్గంలో నడిచారని గుర్తుచేశారు. మన వారసత్వ బలానికి ఇదొక ప్రతీక అని వెల్లడించారు. యుద్ధంలో కాకుండా బుద్ధుడి బోధనల్లోనే భవిష్యత్తు ఉందని భారత్ నమ్ముతున్నట్లు స్పష్టంచేశారు. ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... మీ వల్లే తలెత్తుకొని ఉండగలుగుతున్నా.. ‘‘ప్రవాస భారతీయులను మన దేశానికి రాయబారులుగా పరిగణిస్తున్నాం. వైవిధ్యం గురించి మనకు ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యంపై మన జీవితాలు నడుస్తున్నాయి. భారతీయులు ఎక్కడికి వెళ్లినా అక్కడి సమాజంతో హృదయపూర్వకంగా మమేకమవుతూ ఉంటారు. ఇతర దేశాల నియమ నిబంధనలు మనం చక్కగా గౌరవిస్తాం. మనకు ఉద్యోగం, ఉపాధి కల్పించిన దేశానికి నిజాయితీగా సేవ చేయడం, ఆ దేశ ప్రగతిలో పాలుపంచుకోవడం మనకు అలవాటు. విదేశాల్లో ఉన్నప్పటికీ మన హృదయం భారతీయతతో నిండి ఉంటుంది. భారత్ కోసమే మన గుండె చప్పుడు వినిపిస్తుంది. ప్రవాస భారతీయులు మన దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నారు. వారి వల్లే విదేశాలకు వెళ్లినప్పుడు నేను తలెత్తుకొని ఉండగలుగుతున్నా. మనది యువ భారత్: 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రావడంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్య సాధనకు సహకరించాలని మిమ్మల్ని కోరుతున్నా. మనది యువ భారత్. ఇక్కడ యువ జనాభా అధికం. అంతేకాదు నైపుణ్యం కలిగిన యువత మన దగ్గర ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాల డిమాండ్‌ను తీర్చగల సత్తా ఇండియాకు ఉంది. డిజిటల్ టెక్నాలజీలో మనం ముందంజలో ఉన్నాం. ఆధునిక యుద్ధ విమానాలు, రవాణా విమానాలను మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాం. ‘మేడ్ ఇన్ ఇండియా’ విమానాల్లో మీరంతా ప్రవాసీ భారతీయ దివస్‌కు వచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. భారతదేశ ఆసలైన చరిత్రను విదేశాల్లో చాటి చెప్పండి’’ అని ప్రధాని మోదీ సూచించారు. ప్రపంచానికి ఆయుర్వేదం ఇచ్చిన భారత్: క్రిస్టినా క్లారా ప్రపంచ నాగరికత అభివృద్ధిలో భారత్ వెలకట్టలేని అత్యున్నత పాత్ర పోషించిందని ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా ప్రశంసించారు. ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె గురువారం మాట్లాడారు. గణితం, వైద్యం, సముద్రయానం వంటి రంగాల అభివృద్ధికి భారత్ దోహదపడిందని చెప్పారు. భారత్ అందించిన ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోందని అన్నారు. క్రిస్టిన్ క్లారాకు భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు ప్రకటించింది. -
20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!
ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే...జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లి స్పర్శకోసం మనసు ఆరాట పడుతుంది. అలా చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమైన యువతి ఇపుడు జన్మనిచ్చిన తల్లికోసం అన్వేషిస్తోంది. రెండు దశాబ్దాలక్రితం అనుకోని పరిస్థితుల్లో అమ్మకు దూరమైన, పిల్లల విద్యలో పరిశోధకురాలు స్నేహ భారతదేశానికి తిరిగి వచ్చింది. అసలేంటీ స్నేహ స్టోరీ తెలుసుకుందాం పదండి!స్నేహకు సుమారు ఏడాదిన్నర వయసుండగా ఆమె తల్లి వదిలేసివెళ్లిపోయింది. ఈమెతోపాటు నెలల పసిబిడ్డ సోము కూడా అనాధలైపోయారు. ఇది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఇద్దర్నీ స్థానిక అనాథ ఆశ్రమంలో చేర్పించారు. ఐదేళ్లపాటు అక్కడే పెరిగారు.అయితే స్పెయిన్ నుంచి భారత్‌కు వచ్చిన ఒక జంట వీరి పాలిట దైవాలుగా మారారు. అనాధ ఆశ్రమంలో ఉన్న ఐదేళ్ల స్నేహ , నాలుగేళ్ల సోము ఇద్దర్నీ స్పానిష్ జంట జెమా వైదర్, జువాన్ జోష్ 2010లో దత్తత తీసుకుని తమ దేశానికి తీసుకువెళ్లి పోయారు. వీరిని సొంత బిడ్డల్లా పెంచుకుని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం స్నేహ వయసు 21 ఏళ్లు కాగా, చిన్నారుల విద్యలో పరిశోధనలు చేస్తోంది.అయితే, ఇటీవలే వారి మూలాలు ఒడిశాలో ఉన్నాయని జెమా దంపతులు స్నేహకు తెలిపారు. దీంతో తనకు జన్మనిచ్చిన తల్లి ఆచూకీ ఎలాగైనా తెలుసుకోవాలని స్నేహ పెంపుడు తల్లి జెమాతో కలిసి గత నెల 19న భారత్ (భువనేశ్వర్)కు చేరుకుంది. స్థానిక హోటల్లో ఉంటూ నయాపల్లిలోని ఇంటి యజమాని వద్దకు వెళ్లి అక్కడ తల్లిదండ్రుల పేర్లను తెలుసుకుంది. తల్లి పేరు బనలతాదాస్, తండ్రి సంతోష్ అని తెలిసింది. ఈ వివరాలతో పోలీసుల సాయంతో అమ్మకోసం వెదుకులాట ప్రారంభించింది. అలాగే అనాధాశ్రమంలో ఉన్న వివరాలతో వాటిని దృవీకరించుకుంది. ఈ విషయంలో మహిళా విశ్వవిద్యాలయం రిటైర్డ్ టీచర్ సుధా మిశ్రా ఆమెకు సాయం అందించారు.ఈ విషయాన్ని స్థానిక పోలీస్ కమిషనర్ దేవ్ దత్తా సింగ్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. పోలీసులు విచారణ చేయగా, బానాలత కటక్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే జనవరి 6న స్నేహ తిరిగి స్పెయిన్ కు వెళ్లాల్సి ఉండటంతో తల్లిని కలుసుకోవడం సాధ్యం కాలేదు. అయితే తాను మార్చిలో తిరిగి ఇండియాకు వచ్చి తల్లి ఆచూకీ కోసం ప్రయత్నాలను కొనసాగిస్తానని చెప్పింది స్నేహ. స్నేహ తల్లిదండ్రులను గుర్తించడానికి పోలీసులు , పంచాయతీ కార్యకర్తల సహాయం తీసుకుంటామని ఇన్స్పెక్టర్ అంజలి ఛోట్రే చెప్పారు.స్నేహ అసలు తల్లిదండ్రులు ఎవరు?ఒడిశాకు చెందిన బనలతా దాస్, సంతోష్ స్నేహ తల్లిదండ్రులు. వీరు నలుగురు పిల్లలతో కలిసి భువనేశ్వర్‌లోని నయాపల్లిలో అద్దె ఇంటిలో ఉండేవారు. వంట మనిషిగా పని చేసే ఆమె భర్త, ఏమైందో తెలియదు గానీ పిల్లలు సహా భార్యను వదిలివేసి వెళ్లిపోయాడు. దీంతో బానాలత ఒంటరిదైపోయింది. అటు నలుగురు పిల్లలతో, కుటుంబ పోషణా భారమైంది. దీంతో ఇద్దరి పిల్లల్ని వదిలేసి మరో కొడుకు, కూతుర్ని తీసుకొని ఎటో వెళ్లిపోయింది. స్నేహ మా ఇంటి వెలుగుస్నేహ చాలా బాధ్యతగల కుమార్తె. మంచి విద్యావంతురాలు. ఆమె మా ఇంటి వెలుగు,ఆమెమా జీవితం అంటూ స్నేహ గురించి ప్రేమగా చెప్పుకొచ్చింది దత్తత తల్లి జెమా. అంతేకాదు జీవసంబంధమైన తల్లిని తెలుకోవాలన్న ఆరాటపడుతున్న కుమార్తెతోపాటు ఒడిశాలోని భువనేశ్వర్ రావడం విశేషం. ప్రస్తుతం స్నేహ చేస్తున్న ప్రయత్నం నెట్టింట వైరల్‌వుతోంది. త్వరలోనే తల్లీబిడ్డలిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు నెటిజన్లు -
గోవా ఘన విజయం
భువనేశ్వర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో గోవా ఫుట్‌బాల్ క్లబ్ ఘనవిజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో గోవా 4–2 గోల్స్ తేడాతో ఒడిశాను చిత్తుచేసింది. గోవా జట్టు తరఫున బ్రిసన్ ఫెర్నాండెస్ (8వ, 53వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో విజృంభించగా... ఉదాంత సింగ్ (45+2వ నిమిషంలో), అమెయ్ రణవాడె (56వ ని.లో) ఒక్కో గోల్ కొట్టారు. ఒడిశా తరఫున అహ్మద్ (29వ నిమిషంలో), జెరీ (88వ ని.లో) చెరో గోల్ చేశారు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై గోవా 7 షాట్స్ ఆడగా... ఒడిశా 5 షాట్లు కొట్టింది. తాజా సీజన్లో 13 మ్యాచ్‌లాడిన గోవా 7 ఇజయాలు, 2 పరాజయాలతు, 4 ‘డ్రా’లతో 25 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఒడిశా 14 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 4 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 20 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో జంషెడ్పూర్ ఫుట్‌బాల్ క్లబ్ 2–1 గోల్స్ తేడాతో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది. జంషెడ్పూర్ తరఫున జోర్డన్ ముర్రే (84వ నిమిషంలో), మొహమ్మద్ ఉవైస్ (90వ నిమిషంలో) చెరో గోల్ సాధించగా... బెంగళూరు తరఫున అల్బెర్టో నొగురె (19వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. మ్యాచ్ ఆరంభంలో దూకుడు కనబర్చిన బెంగళూరు 19వ నిమిషంలోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లగా మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా జంషెడ్పూర్ వెంటవెంటనే రెండు గోల్స్ చేసి విజయం సాధించింది. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లాడిన బెంగళూరు 8 విజయాలు 3 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 27 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో కొనసాగుతుండగా... జంషెడ్పూర్ 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు 5 పరాజయాలతో 24 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ ఫుట్‌బాల్ క్లబ్‌తో కేరళ బ్లాస్టర్స్ జట్టు తలపడుతుంది. -
రూ.61,000 కోట్ల పెట్టుబడి.. ఒడిశాలో ఐవోసీఎల్ నాఫ్తా ప్రాజెక్ట్
భువనేశ్వర్: ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) రూ.61,000 కోట్ల పెట్టుబడులతో ఒడిశాలోని పరదీప్‌లో నాఫ్తా క్రాకర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబందించి ఐవోసీఎల్, ఒడిశా (Odisha) ప్రభుత్వం మధ్య జనవరిలో జరిగే ‘ఉత్కర్ష్ ఒడిశా–మేక్ ఇన్ ఒడిశా 2025’ సదస్సు సందర్భంగా అవగాహన ఒప్పందం కుదరనుంది.ఈ మేరకు ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. భద్రక్‌లో రూ.4,352 కోట్లతో ఏర్పాటు చేయనున్న యార్న్ ప్రాజెక్ట్‌కు సైతం ఇదే వేదికగా శంకుస్థాపన చేయనున్నట్టు పేర్కొంది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఐవోసీఎల్ చైర్మన్ ఏఎస్ సాహ్నే మధ్య భువనేశ్వర్‌లో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపింది.‘‘పరదీప్‌లో నాఫ్తా ప్రాజెక్టుకు ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు కోసం ఐవోసీఎల్ రూ.61,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ రంగంలో దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికీ వాటా ఉంటుంది. పన్నులకు అదనంగా, డివిడెండ్ రూపంలో ఆదాయం లభిస్తుంది’’అని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. భద్రక్‌లో రూ.4,352 కోట్లతో ఏర్పాటు చేయనున్న యార్న్ ప్రాజెక్టుతో, పెద్ద ఎత్తున వస్త్రాల తయారీ కంపెనీలు ఇక్కడకు వస్తాయని తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులతో యువకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రకటించింది. -
ఊరు కాదిది... నా కుటుంబం!
రాయ్‌రంగ్‌పూర్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్వేగభరితమయ్యారు. తను పుట్టిన ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లా ఉపర్బేడ గ్రామాన్ని శుక్రవారం ఆమె సందర్శించి, అక్కడి గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు. ఉపర్బేడ గ్రామాన్ని కేవలం ఒక ప్రదేశంగా తానెన్నడూ భావించలేదని, అదొక కుటుంబమని తన మూలాలను గుర్తు చేసుకుంటూ ఉద్వేగంతో అన్నారు. బమన్ఘటి సబ్ డివిజన్లోని ఉపర్బేడలోని సంతాలి కుటుంబంలో ముర్ము 1958 జూన్ 20న జన్మించారు. 2022 జూలై భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ఈ గ్రామానికి రావడం ఇదే మొదటిసారి. గ్రామానికి చేరుకున్న వెంటనే ఆమె తను చదువుకున్న ఉపర్బేడ అప్పర్ ప్రైమరీ స్కూలుకు వెళ్లారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని ఆ పాఠశాలతోపాటు యావత్తు గ్రామాన్ని అందంగా మార్చారు. గ్రామస్తులు, స్కూలు టీచర్లు, విద్యార్థులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. తను పుట్టిన ఇంటికి వెళ్లే దారిలో సంతాలి మహిళలు ఆమెకు గిరిజన సంప్రదాయ వస్త్రధారణతో జానపద నృత్యం చేస్తూ పాటలు పాడుతూ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముర్ము కూడా వారితో కాలు కదిపారు. గ్రామ దేవతకు పూజలు చేశారు. నేనిప్పటికీ ఇక్కడి విద్యార్థినే...స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ముర్ము విద్యార్థులతో ముచ్చటించారు. ‘‘నాకిప్పుడు 66 ఏళ్లు. అయినా మా స్కూల్లో చిన్న విద్యార్థిననే అనుకుంటున్నా. అప్పట్లో మట్టిగోడలుండేవి. మా ఏడో తరగతిలో ఉండగా స్కాలర్షిప్ పరీక్ష కోసం మదన్ మోహన్ సార్ వాళ్లింటికి తీసుకెళ్లారు. తన సొంత పిల్లలతోపాటు నన్ను కూడా పరీక్షకు ప్రిపేర్ చేశారు. ఈ గ్రామం, ఈ స్కూలు నాకు అందించిన అభిమానం మరువలేనిది’’ అంటూ ఉప్పొంగిపోయారు. తోటి వాళ్లు, ఉపాధ్యాయులు కూడా బయటి వ్యక్తిగా కాక, తనను సొంత కుటుంబసభ్యురాలిగా చూసుకునేవారన్నారు. ‘ఆ రోజుల్లో లాంతరు వెలుగులో చదువుకునేదాన్ని. ఆ లాంతరు గ్లాస్ పగిలిపోయి ఉండేది. చదువుకోవడానికి ఇబ్బందయ్యేది. సిరా పెన్నుతో రాయడం కష్టంగా ఉండేది. ఇంకుతో బట్టలు పాడయ్యేవి’’ అని గుర్తు చేసుకున్నారు. గురువులకు వందనం తనకు విద్య నేర్పిన గురువులను రాష్ట్రపతి ఘనంగా సన్మానించారు. స్కూల్ హెడ్మాస్టర్ బిశేశ్వర్ మహంత, క్లాస్ టీచర్ బాసుదేశ్ బెహెరె, 4, 5 తరగతుల్లో ఉండగా క్లాస్‌టీచర్ బసంత కుమార్ గిరిలను సన్మానించారు. ఉపర్బేడ అప్పర్ ప్రైమరీ స్కూల్లోని సుమారు 200 మందికి స్కూల్ బ్యాగులు, చాకెట్లు, టిఫిన్ బాక్సులు అందజేశారు. కష్టపడి చదువుకుని, ఉన్నతస్థానాలకు ఎదగాలని వారిని కోరారు. -
సాగర వీరుల విన్యాసాలు.. నేవీ డే స్పెషల్ (ఫొటోలు)
-
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
గజపతినగరం : వివాహేతర సంబంధం ఇద్దరిని ఆత్మహత్యకు పురిగొల్పింది. ఇందులో ప్రియుడు ప్రాణం కొల్పోగా... ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన శీర పైడిరాజు(31)కు కొత్తవలస మండలానికి చెందిన బొబ్బిలి ఆదిలక్ష్మితో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరి దాంపత్య జీవితంలో సంతానం కలగలేదు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వివాహిత సబుకు రామలక్ష్మితో పైడిరాజుకు ఎనిమిది నెలల కిందట పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. పైడిరాజు పురిటిపెంట సమీపంలో ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పురిటిపెంట రైల్వే గేటు వద్ద వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో తెలియదుగాని ఇద్దరి మధ్య మాటమాట పెరిగి పురుగుల మందు సేవించి అక్కడి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరినీ విజయనగరం మహారాజ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి పైడిరాజు శనివారం మృతి చెందినట్టు తెలిపారు. రామలక్ష్మి వైద్య సేవలు పొందుతున్నట్టు చెప్పారు. మృతుడి తండ్రి శీర అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కె.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామలక్ష్మికి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
రంభా ప్యాలెస్ గురించి తెలిస్తే.. ఇప్పుడే టికెట్ బుక్ చేసుకుంటారు!
ఒడిశాలో చిల్కా సరస్సు. ఆసియా ఖండంలో అతి పెద్ద ఉప్పునీటి సరస్సు. ఆ సరస్సు తీరాన ఉంది రంభా ప్యాలెస్. ఆ ప్యాలెస్ గురించి చెప్పాలంటే రెండు వందల ఏళ్ల వెనక్కి వెళ్లాలి. రండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.అది 1791. మనదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ హవా నడుస్తున్న రోజులవి. ఇంగ్లిష్ ఇంజనీర్ థామస్ స్నోద్గ్రాస్, మన స్థానిక సహాయకులతో కలిసి నిర్మించిన ప్యాలెస్ అది. ఈప్యాలెస్ చక్కటి వెకేషన్ ప్లేస్. కోణార్క్ సూర్యదేవాలయానికి పూరీలోని జగన్నాథ ఆలయానికి కూడా 150 కిలోమీటర్ల దూరాన ఉంది. ఈ ΄్యాలెస్ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా 2018లో న్యూఢిల్లీకి చెందిన హాచ్ వెంచర్ కొన్నది. నిర్మాణాన్ని పునరుద్ధరించే బాధ్యతను శ్రీలంకకు చెందిన ఆర్కిటెక్ట్ చన్నా దాసవాతేకి అప్పగించింది. ఈ ఆర్కిటెక్ట్ ఆరేళ్ల పాటు శ్రమించి ప్యాలెస్ చారిత్రక వైభవానికి విఘాతం కలగకుండా పునరుద్ధరించాడు. జాతీయోద్యమంలో భాగంగా సాగిన ఉత్కళ్ మూవ్మెంట్ జ్ఞాపకాలను పదిలపరుచుకుని ఉందీ ప్యాలెస్. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, బ్రిటిష్ ఉన్నతాధికారులతో సమావేశమైన గుర్తులున్నాయందులో. ప్యాలెస్‌లో నివసించిన అనుభూతి కోసం పర్యాటకులు రాజస్థాన్ వెళ్తుంటారు. ఒకసారి ఒడిశా సంస్కృతి సంప్రదాయాలను కూడా ఆస్వాదించండి’ అంటూ ఈ ప్యాలెస్ సహ యజమాని ఒడిశా రాజవంశానికి చెందిన వారసుడు హిమాన్గిని సింగ్ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నారు. క్రిస్టమస్ వెకేషన్‌కి లేదా సంక్రాంతి వెకేషన్‌కి ప్లాన్ చేసుకోండి. -
అశోకుడి కాలం నాటి కోట.. ఏకంగా ఏథెన్స్ నగరాన్నే..!
ఇది అత్యంత ప్రాచీనమైన కోటల్లో ఒకటి. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఉన్న ఈ కోట పేరు శిశుపాలగడ. క్రీస్తుపూర్వం ఏడో శతాబ్ది నాటి కోట ఇది. ఈ కోట, దాని చుట్టు ఏర్పడిన నగరానికి చెందిన శిథిలాలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి. అశోకుడు కళింగ యుద్ధం చేసేనాటికి ముందు దాదాపు క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది కాలంలో ఈ నగరం అద్భుతంగా వర్ధిల్లినట్లు ఇక్కడ దొరికిన ఆధారాల వల్ల తెలుస్తోంది. మౌర్యుల కాలానికి ముందు నిర్మించిన ఈ కోట ఆనాటి కాలంలోని ఏథెన్స్ నగరానికి మించి ఉండేదని చరిత్రకారులు ఎం.ఎల్.స్మిత్, ఆర్.మహంతి తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. అప్పట్లో శిశుపాలగడ జనాభా దాదాపు పాతికవేల వరకు ఉంటే, అదేకాలంలో ఏథెన్స్ జనాభా పదివేల వరకు మాత్రమే ఉండేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఇక్కడి చారిత్రక ఆధారాలను పరిరక్షిస్తున్నారు. (చదవండి: రోబో చిత్రానికి రూ.9 కోట్లు) -
ఒడిశా పురుషుల హాకీ జట్టు సంచలనం... తొలిసారి జాతీయ టైటిల్ సొంతం
సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ సీనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్‌లో కొత్త చాంపియన్ అవతరించింది. చెన్నైలో శనివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షి ప్లో ఒడిశా జట్టు తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఒడిశా జట్టు 5–1 గోల్స్ తేడాతో మూడుసార్లు చాంపియన్ హరియాణా జట్టును బోల్తా కొట్టించి జాతీయ చాంపియన్‌గా నిలిచింది. ఒడిశా తరఫున శిలానంద్ లాక్రా (48వ, 57వ, 60వ నిమిషాల్లో) మూడు గోల్స్ సాధించగా... రజత్ ఆకాశ్ టిర్కీ (11వ నిమిషంలో), ప్రతాప్ లాక్రా (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. హరియాణా జట్టుకు జోగిందర్ సింగ్ (55వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు.96 ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ఒడిశా జట్టుకిదే తొలి టైటిల్ కావడం విశేషం. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ జట్టు 2–1తో మణిపూర్ జట్టును ఓడించింది. -
ఆంధ్రా ఒడిషా బోర్డర్లో పెద్దపులి కలకలం
సాక్షి,శ్రీకాకుళం: ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి కదలికలతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. కాశీబుగ్గ రేంజ్ ఫారెస్ట్ అధికారి ఏ.మురళీకృష్ణ ఆదేశాల మేరకు ఇచ్ఛాపురం మండలంలోని పలు గ్రామాలలో పులి కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.ఒంటరిగా రాత్రిపూట పొలాలకు వెళ్లొద్దని గ్రామస్తులకు అటవీ అధికారులు సూచించారు.ఇటీవలే ఒడిశాలోని గంజాం జిల్లా జయంతిపురంలో యువకుడిపై పెద్దపులి దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది.ఇదీ చదవండి: AP: ఆమెకు టెర్రర్ -
Namami Gange గంగానదిపై మహిళా జవాన్లు
శుభ్రత ఎక్కడుంటే మహిళలు అక్కడుంటారు. లేదా, మహిళలు ఎక్కడుంటే శుభ్రత అక్కడ ఉంటుంది. శుభ్రంగా ఉంచటం అన్నది మహిళల సహజ నైజం. మహిళలే కాదు, దైవత్వం కూడా శుభ్రత ఉన్న చోట కొలువై ఉంటుంది. ‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్›్ట టు గాడ్లీనెస్’ అనే మాట వినే ఉంటారు.ఇంటిని, సమాజాన్ని శుభ్రంగా ఉంచటంలో కీలక బాధ్యతను వహిస్తున్న మహిళలే ఇప్పుడు తాజాగా దైవకార్యం వంటి ‘స్వచ్ఛ గంగా’ ఉద్యమ ప్రచారాన్ని చేపట్టారు. గంగానదిని ప్రక్షాళన చేయవలసిన అవసరం గురించి, గంగా ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించటం గురించి ప్రజల్లో అవగాహన కలిగించటం కోసం మొత్తం 20 మంది మహిళలు గంగానదిపై నవంబర్ 4న రెండు తెప్పల్లో ర్యాలీగా బయల్దేరారు! ఉత్తరాఖండ్, తెహ్రీ ఘరేవాల్ జిల్లాలోని దేవప్రయాగ పట్టణం నుంచి మొదలైన ఈ ‘ఆల్ ఉమెన్ రివర్ ర్యాఫ్టింగ్’... మొత్తం 2,500 కి.మీ. దూరాన్ని 53 రోజుల పాటు ప్రయాణించి డిసెంబర్ 26న పశ్చిమబెంగాల్లోని గంగా సాగర్ వద్ద ముగుస్తుంది. అందరూ మహిళలే ఉన్న ఇలాంటి ఒక సుదీర్ఘమైన రివర్ ర్యాఫ్టింగ్ దేశంలో జరగడం ఇదే మొదటిసారి. మరొక విశేషం కూడా ఉంది. వీళ్లంతా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బి.ఎస్.ఎఫ్) దళానికి చెందిన మహిళలు. బి.ఎస్.ఎఫ్. మహిళా విభాగం, ‘నమామి గంగే’ ప్రాజెక్టు కలిసి ఉమ్మడిగా ఈ రివర్ ర్యాఫ్టింగ్ను నిర్వహిస్తున్నాయి. ర్యాఫ్టింగ్ ప్రారంభానికి ముందు మహిళా శక్తికి, సాధికారతకు సంకేతంగా 11 మంది బాలికల పాదాలకు నమస్కరించి పూజలు జరిపారు. ఆ తర్వాత ‘తెప్పలు’ కదిలాయి. ఈ ప్రచారానికి బి.ఎస్.ఎఫ్. సబ్ ఇన్స్పెక్టర్ ప్రియా మీనా నాయకత్వం వహిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న మహిళా జవాన్లలో 20 మందిని కఠిన ర్యాఫ్టింగ్ శిక్షణ తర్వాత ఇందుకోసం ఎంపిక చేశామని మీనా అన్నారు. ‘‘రెండు తెప్పలుగా సాగే ఈ బోటింగ్ యాత్రలో భాగంగా గంగా తీరం వెంబడి 43 పట్టణాలలో ఈ తరం యువతీ యువకులకు ‘పరిశుభ్రతకు, నిరంతరాయ ప్రవాహానికి’ అనువుగా గంగానదిని ప్రక్షాళన చేయాలన్న సందేశాన్ని అందిస్తాం’’ అని ఆమె తెలి΄ారు. మరొక విశేషం.. వీరితో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ’ చేతులు కలపటం. శుభ్రత దైవంతో సమానం అన్నప్పుడు, దైవ సమానంగా భారతీయులు కొలిచే గంగానదిని శుభ్రంగా ఉంచాలన్న సందేశంతో ప్రచారోద్యమం చేపట్టిన మహిళాశక్తి కూడా కొలవదగినదే. స్తుతించతగినదే. వారి మాట ఆలకించతగినదే. -
కోణార్క్ సూర్య రథచక్రం రాష్ట్రపతి భవనంలో...
ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఈ కోణార్క్ సూర్య రథ చక్రాన్ని పోలిన నాలుగు ఇసుకరాయి ప్రతిరూపాలను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ అమృత్ ఉద్యాన్ లో ఏర్పాటు చేశారు.కోణార్క్ చక్రం భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. సాంస్కృతిక, చారిత్రక అంశాలను సందర్శకులకు పరిచయం చేసే దశల్లో భాగంగా, భారతదేశం గొప్ప వారసత్వాన్ని తెలుసుకోవడానికి ప్రోత్సహించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.కోణార్క్ సూర్య దేవాలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటి. ఒడిషా ఆలయ నిర్మాణ శైలికి పరాకాష్టగా దీనిని చెప్పుకోవచ్చు. ఇది సూర్య భగవానుడిని మోసుకెళ్లే బృహత్తర రథం ఆకారంలో నిర్మించబడింది. (చదవండి: అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు) -
బాలాసోర్ దుర్ఘటన కేసు: ముగ్గురు నిందితులకు బెయిల్
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గతేడాది జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ విషాద ఘటనలో 290 మందికి పైగా మృతిచెందారు. ఈ ప్రమాద ఘటన కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు ఒరిస్సా హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.నిందితులు మొహమ్మద్ అమీర్ ఖాన్, అరుణ్ కుమార్ మహంత , పప్పు యాదవ్‌లను జులై 7, 2023న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ).. ప్రమాదం జరగడానికి నిర్లక్ష్యం వహించిన కారణంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఆదిత్య కుమార్ మోహపాత్ర నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్.. ఒక్కొక్కరికి రూ.50 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించింది.షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు 2 జూన్, 2023న బాలాసోర్‌లోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ఘనటలో 290 మందికి పైగా మరణించగా.. సుమారు 1,200 మందికి పైగా గాయపడ్డారు.అయితే.. ఉన్నత స్థాయి రైల్వే విచారణలో ప్రమాదానికి ప్రధాన కారణం.. తప్పు సిగ్నలింగ్ అని తేలింది. -
కృనాల్ పాండ్యా సెంచరీ.. హ్యాట్రిక్ విజయాలు.. హార్దిక్ పోస్ట్ వైరల్
రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. తాజాగా శతకంతో మెరిశాడు. ఒడిశాతో మ్యాచ్‌లో 143 బంతులు ఎదుర్కొని 119 పరుగులు సాధించాడు. కృనాల్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.ఇక ఈ మ్యాచ్‌లో బరోడా ఒడిషాపై ఏకంగా ఇన్నింగ్స్ 98 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన అన్న కృనాల్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. ‘‘మా అన్నయ్య.. ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. టాప్ సెంచరీ.. నీ శ్రమకు తగ్గ ఫలితం’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.కాగా రంజీ తాజా సీజన్లో కృనాల్ పాండ్యా సారథ్యంలోని బరోడా వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్‌లో ముంబైని 84 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఈ జట్టు.. రెండో మ్యాచ్‌లో సర్వీసెస్‌ను 65 రన్స్ తేడాతో ఓడించింది. ఈ క్రమంలో వడోదర వేదికగా ఒడిశా జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన బరోడా తొలుత బౌలింగ్ చేసింది.అయితే, బరోడా బౌలర్ల ధాటికి ఒడిశా బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడాకు ఓపెనర్ శైవిక్ శర్మ(96) శుభారంభం అందించగా.. మిడిలార్డర్లో విష్ణు సోలంకి(98) దుమ్ములేపాడు. ఇక వీరికి తోడుగా కృనాల్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఫలితంగా బరోడా మొదటి ఇన్నింగ్స్‌లో 456 పరుగులు చేసి.. 263 పరుగులు ఆధిక్యంలో నిలిచింది.అయితే, బరోడా బౌలర్లు మరోసారి చెలరేగడంతో ఒడిశా 165 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆటలోనే ఫలితం తేలింది. బరోడా ఒడిశాపై ఇన్నింగ్స్ 98 రన్స్ తేడాతో జయభేరి మోగించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. కాగా హార్దిక్ పాండ్యా సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా పునరాగమనం చేయనున్నాడు.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ View this post on Instagram A post shared by Krunal Himanshu Pandya (@krunalpandya_official) -
ఒడిశాకు తప్పిన తుఫాను ముప్పు: సీఎం మోహన్
న్యూఢిల్లీ:'దానా' తుఫాను ఒడిశా తీరం దాటిన నేపధ్యంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పరిస్థితిని సమీక్షించారు. ఇకపై రాష్ట్రం సురక్షితమని, అధికారుల టీమ్ వర్క్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు.విలేకరుల సమావేశంలో సీఎం మాఝీ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ‘ఒడిశా ఇప్పుడు సురక్షితంగా ఉంది. తుఫాను తాకిడి తరువాత, పరిస్థితిని సమీక్షించాము. అధికారుల సమిష్టి కృషి కారణంగా, ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. మేము ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. సహాయ కేంద్రాల్లో వారికి వసతి కల్పించాం. విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు జరుగుతున్నాయి. 1.75 లక్షల హెక్టార్లలో పంటలు నాశనమైనమయ్యాయి. బుధబలంగ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది’ అని పేర్కొన్నారు. The deep depression (remnant of severe cyclonic storm “DANA”) over north Odisha remained practically stationary during past 6 hours, weakened into a Depression over the same region and lay centred at 2330 hrs IST of yesterday, the 25th October near latitude 21.4°N and longitude… pic.twitter.com/Bb7LrXjHTT— India Meteorological Department (@Indiametdept) October 25, 2024'దానా' తుఫాను గంటకు ఏడు కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ ఒక పోస్ట్‌లో ఒకటి తెలిపింది. ఇది ఉత్తర ఒడిశా మీదుగా పశ్చిమ దిశలో పయనించి, రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను ప్రభావం గురించి భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సోమనాథ్ దత్తా మాట్లాడుతూ ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక తుపాను ప్రభావం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఇది కూడా చదవండి: అందరి చూపు షిల్లాంగ్ వైపే -
దానా దంచేస్తోంది
-
దానా తుపాను : 86 రైళ్లు రద్దు చేయడంతో ప్రయాణికులు తిప్పలు (ఫొటోలు)
-
భోజనం తింటే..బుల్లెట్ బండి ఫ్రీ
-
దానా తుఫాన్ ఉగ్రరూపం
-
ఒడిశా-బెంగాల్లో 'దానా' విధ్వంసం (ఫొటోలు)
-
తీరం దాటిన ‘దానా’ తీవ్ర తుపాను
సాక్షి, విశాఖపట్నం: తీవ్ర తుపాను ‘దానా’ తీరం దాటింది. అర్ధరాత్రి 1:30 నుండి 3:30 మధ్య తీరాన్ని తాకింది. ఒడిశాలోని బిత్తర్‌కని నేషనల్ పార్క్, ధమ్రా మధ్య తీరాన్ని తాకినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఒడిశా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఉత్తరాంధ్ర పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్‌లో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఒడిశాలో 7వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లొతట్టు ప్రాంతాల్లోని హైరిస్క్ జోన్ల నుంచి ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావంతో ఏకంగా 400లకు పైగా రైళ్లు రద్దు అయ్యాయి. కోల్‌కతా, భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌ల్లో సేవలను గురువారం సాయంత్రం నుంచే నిలిపివేశారు.బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను కదలికలను ఇస్రో ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–06), ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వస్తున్నాయని ఇస్రో తన అధికారిక వెబ్సైట్లో గురువారం తెలియజేసింది. 2022 నవంబర్ 26న పీఎస్ఎల్వీ సీ–54 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఈఓఎస్–06, 2016 సెప్టెంబర్ 8న జీఎస్ఎల్వీ ఎఫ్–05 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలు విపత్తులను ముందస్తుగా గుర్తించి మానవాళికి మేలు చేస్తుండటంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం.ఈ నెల 20న బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సముద్రపు గాలి నమూనాలను బట్టి ఈఓఎస్–06 ఉపగ్రహం ముందస్తుగా గుర్తించింది. మేఘాలను బట్టి ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహం ఈ తుపానును ముందస్తుగా గుర్తించింది. తుపాను బెంగాల్, ఒడిశా మీదుగా వెళ్లి తీరం దాటింది. ఈ విషయాన్ని ఈ రెండు ఉపగ్రహాలు ముందస్తుగా ఇచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడ్డాయి. దీనివల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకునే అవకాశం చిక్కింది. -
భయపెడుతున్న దానా.. ప్రచండ గాలులతో వర్ష సూచన!
Dana Cyclone Updates:తీవ్ర తుఫానుగా ‘దానా’ వాయువ్య బంగాళాఖాతంలో కదులుతోంది. గడిచిన 6 గంటల్లో 12 కి.మీ వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తుపాను కదులుతోంది. పారాదీప్ (ఒడిశా)కు ఆగ్నేయంగా 260 కి.మీ, ధమర (ఒడిశా)కి 290 కి.మీ, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణంగా 350 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతం అయినట్లు వాతావరణ అధికారుతెలిపారు.దానా తుపాను ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ మనోరమా మొహంతి తెలిపారు. ఈ రాత్రి (గురువారం) అత్యధిక వేగంతో గాలి వీస్తుందని చెప్పారు.‘‘ దానా తుపాను గత అర్ధరాత్రి తీవ్ర తుఫానుగా మారింది. ఇది గత 6 గంటల్లో 12 కి.మీ/గంట వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. బంగాళాఖాతం వాయువ్య దిశలో తీవ్ర తుపానుగా కదులుతోంది’’అని అన్నారు.#WATCH | Bhubaneswar, Odisha | On cyclone 'Dana', Director IMD, Manorama Mohanty says, "The cyclone Dana has intensified into a severe cyclonic storm in last midnight and it is moving north-westward with the speed 12km/hr during last 6 hours and now it is lying over central and… pic.twitter.com/Cff2mVTNgh— ANI (@ANI) October 24, 2024దానా తుపాను భయపెడుతున్న నేపథ్యంలో తీరం దాటకముందే ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. సుమారు 10 లక్షల మందిని తరలించాలని ప్రభుత్వం అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దానా తుపాను.. గురువారం లేదా శుక్రవారం భిటార్కనికా , ధమ్రా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారలు తెలిపారు. మరోవైపు.. దానా తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అప్రమత్తమై.. కోల్‌కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో నేటి నుంచి రేపు(శుక్రవారం) ఉదయం వరకు కార్యకలాపాలు నిలిపివేసింది.#CycloneDanaLies around 200kms off #Odisha coast at 5.30 am IST on 24th Oct. It is likely to landfall today evening/night (a tough time for relief personnel due to darkness) as a very severe cyclonic storm with expected windspeed of 120 kmph.Take care.@Windycom @zoom_earth pic.twitter.com/6PxsR7MGnS— Prof RV (@TheTechocrat) October 24, 2024 ఒడిశాలోని అనేక తీర జిల్లాల నుంచి దాదాపు 10 లక్షల మంది ప్రజలను తరలించడానికి ఒడిశాలోని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. 120 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ దానా తుపాను ఒడిశాలోని సగం జనాభా ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.It appears that #Dana is approaching #Cyclone strength and Category 2+ is on the cards as it approaches #India. Hopefully dry air will weaken it before landfall#wx #wxtwitter #tropicswx #CycloneDana #CycloneAlert pic.twitter.com/R8McN71Fnv— Hurricane Chaser Chase (@hurricane_chase) October 24, 2024 ఈ తుపాను బుధవారం రాత్రి 11.30 గంటల సమయానికి పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 330 కి.మీల దూరంలో, ధమర (ఒడిశా)కి 360 కి.మీ దక్షిణ-ఆగ్నేయంగా, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ-ఆగ్నేయంగా 420 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. ఈ తుపాను ఒడిశాలోని భిటార్కనికా నేషనల్ పార్క్ , ధామ్రా ఓడరేవుల మధ్య తీరం దాట వచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.In view of Cyclone DANA's impact on the coastal region of West Bengal, including Kolkata, it has been decided to suspend the flight operations from 1800 IST on 24.10.2024 to 0900 IST on 25.10.2024 due to predicted heavy winds and heavy to very heavy rainfall at Kolkata. pic.twitter.com/jhd4E7S3NS— Kolkata Airport (@aaikolairport) October 23, 2024 మరోవైపు.. దానా తుపాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, పుర్బా , పశ్చిమ మెదినీపూర్, ఝర్గ్రామ్, కోల్‌కతా, హౌరా , హుగ్లీ జిల్లాల్లో గురువారం, శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కోల్‌కతా విమానాశ్రయం గురువారం సాయంత్రం 6 గంటల నుండి రేపు(శుక్రవారం) ఉదయం 9 గంటల వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేసింది.🚨 Breaking NewsDon't be alarmed by potential storm 'seeds'.Be careful,be safe. Life is precious.I strongly believe that we all can successfully face the storm this time together as before. #EveryLifeIsPrecious #CycloneDana #Odisha#CycloneDana#BRICS2024 pic.twitter.com/a4bGjDLG3L— Akhilesh Yadav (@Akhiles61939129) October 24, 2024 అదేవిధంగా భువనేశ్వర్ విమానాశ్రయం ఈరోజు సాయంత్రం 5 నుండి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు తెలుస్తోంది. ఇక.. దానా తుపాను నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా నడిచే దాదాపు 200 రైళ్లను రద్దు చేశారు. ఒడిశాలో, బుధవారం సాయంత్రం నాటికి సుమారు 3 లక్షల మందిని, పశ్చిమ బెంగాల్ 1.14 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
‘దానా’ తుపాన్ టెన్షన్.. ఏపీకి భారీ వర్ష సూచన
సాక్షి విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘దానా’ టెన్షన్ పెడుతోంది. బుధవారం ఉదయానికి తుపానుగా, గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.దానా తుపాను ముప్పు ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడుకు పొంచి ఉంది. ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ భావిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మరో నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇక, తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు.. బెంగాల్లో ఏడు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించారు. రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. సహయక చర్యలు చేపట్టారు. ఇక, తుపాను నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది. 23, 24, 25వ తేదీల్లో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. గురువారం అత్యధికంగా 37 సర్వీసులు రద్దయ్యాయి. అలాగే, విశాఖ-భువనేశ్వర్ మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును 24న రద్దు చేశారు.24న రద్దు చేసిన రైళ్లు..సికింద్రాబాద్ - భువనేశ్వర్హైదరాబాద్ - హౌరాసికింద్రాబాద్ - హౌరాసికింద్రాబాద్ - మల్దాటౌన్25న రద్దు చేసిన రైళ్లు:..హౌరా - సికింద్రాబాద్షాలిమార్ - హైదరాబాద్సిల్చార్ - సికింద్రాబాద్ #CycloneDana beauty in bay. Massive intensification seen under favorable conditions. First set of rains from cyclone feeder bands will commence in coastal parts of #Odisha from today evening. Stay tuned for more updates. #Danacyclone pic.twitter.com/o0oro4X4ZX— Eastcoast Weatherman (@eastcoastrains) October 23, 2024 -
64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటు : రిటైర్డ్ ఉద్యోగి సక్సెస్ స్టోరీ
ఒక్కసారి ఉద్యోగంలో చేరి సంసార బాధ్యతల్లో చిక్కుకున్న తరువాత తమ కిష్టమైంది చదువుకోవడం అనేది కలే, దాదాపు అసాధ్యం అనుకుంటాం కదా. కానీ ఈ మాటలన్నీ ఉత్తమాటలే తేల్చి పారేశాడు ఒక రిటైర్డ్ ఉద్యోగి. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? నమ్మలేకపోతున్నారా? అయితే ఒడిశాకు చెందిన జైకిశోర్ ప్రధాన్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈయన సక్సెస్ స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైర్డ్ ఉద్యోగి జై కిశోర్ ప్రధాన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ 64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ కోర్సులో చేరారు. 2020లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG)లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు. ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగ విధులు నిర్వర్తించిన ఆయన రిటైర్మెంట్ తరువాత అందరిలాగా రిలాక్స్ అయిపోలేదు. డాక్టరవ్వాలనే తన చిరకాల వాంఛను తీర్చుకొనేందుకు రంగంలోకి దిగారు. వైద్య విద్య ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి నిబంధన లేకపోవడంతో దృఢ సంకల్పంతో నడుం బిగించారు. అందుకోసం పెద్ద వయసులోనూ కూడా కష్టపడి చదివి జాతీయ స్థాయిలో వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ లో అర్హత సాధించారు.ఎవరీ జై కిశోర్ ప్రధాన్జై కిశోర్ ప్రధాన్ స్వస్థలం ఒడిశాలోని బార్ గఢ్ ప్రాంతం. బాల్యం నుంచే డాక్టర్ అవ్వాలని కలలు కనేవారు. 1974లో మెడికల్ ఎంట్రన్స్ ర్యాంకు రాకపోవడంతో ఆశలు వదిలేసుకున్నారు. బీఎస్సీడిగ్రీ పూర్తి చేసి ఎస్బీఐలో ఉద్యోగం సంపాదించారు. ఈ సమయంలో తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో తండ్రి అనుభవించిన బాధ, కళ్లారా చూసిన జై కిశోర్ ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నారట.జై కిశోర్ జీవితంలో మరో విషాదం వైద్య వృత్తిపై ఉన్న ప్రేమతో తన పెద్దకుమార్తెను డాక్టర్న చేయాలని ఎంతగానో ఆశపడ్డారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆమె ఎంబీబీఎస్ చదువుతుండగా, అనారోగ్యంతో కన్నుమూయడం విషాదాన్ని నింపింది. అయితే తన రెండో కుమార్తెను కూడా మెడిసిన్ చదివిస్తుండటం విశేషం. సాధించాలన్న పట్టుదల ఉండాలేగానీ అనుకున్న లక్ష్యం చేరేందుకు వయసుతో సంబంధం లేదని జై కిశోర్ చాటి చెప్పారు. -
Visakhapatnam: 30 షాపులకు దరఖాస్తు చేసిన ఒడిశా మద్యం వ్యాపారి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో మద్యం వ్యాపారంపై ఆధిపత్యం చెలాయించాలనుకున్న సిండికేట్‌కు తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఒడిశాకు చెందిన వ్యాపారి వివేక్ సాహు సిండికేట్‌కు ఊహించని షాక్‌నిచ్చారు. నోయిడాకు చెందిన కొంత మంది మద్యం వ్యాపారులు కూడా ఇక్కడ వ్యాపారంపై కన్నేశారు. విశాఖలో మద్యం దుకాణాల కోసం కొంత మంది సిండికేట్‌గా ఏర్పడి ఎక్కువ దరఖాస్తులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరెవరు ఏయే షాపులను దక్కించుకోవాలనే విషయంపై సోమవారం రాత్రి సీతమ్మధారలోని ఒక మద్యం వ్యాపారి గెస్ట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ప్రధానంగా 8 మంది మద్యం సిండికేట్ల మధ్య ప్రాథమికంగా అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. అయితే.. ఇందుకు భిన్నంగా ఒడిశాకు చెందిన మద్యం వ్యాపారి వివేక్ సాహు ఏకంగా 30 షాపులకు దరఖాస్తు చేశారు. నోయిడాకు చెందిన వ్యాపారులు 10 షాపుల వరకూ దరఖాస్తు చేస్తున్నట్టు సమాచారంతో స్థానిక సిండికేట్ కంగుతింది. ఆయా వ్యాపారులకు లాటరీలో షాపులు దక్కితే... వాటిని ఏ విధంగా చేజిక్కించుకోవాలనే అంశంపై తాజాగా సిండికేట్ సభ్యులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.సిండికేట్ నేతృత్వంలో మార్పు.. కొత్త ఎమ్మెల్యే ప్రవేశంవిశాఖ మద్యం సిండికేట్ మొదటగా దరఖాస్తులు ఎక్కువ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం మద్యం వ్యాపారంలో ఉన్న ప్రధానమైన 8 మంది సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఈ సిండికేట్ మొన్నటివరకు ముందుండి నడిపించిన ఎమ్మెల్యే స్థానంలో.. కొత్త ఎమ్మెల్యే సారథ్యం వహించేలా ప్రణాళిక రచించారు. తద్వారా షాపులకు ఎక్కువ పోటీ రాకుండా జాగ్రత్తపడ్డారు. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణం నడుస్తున్న భవనాల వద్ద వ్యవహారం మొదలుపెట్టారు. ఆయా భవన యజమానులతో మాట్లాడుకుని.. అవి తమకే వచ్చేలా చూసుకున్నారు. ఇందుకోసం ఎకై ్సజ్ శాఖలోని కొద్ది మంది అధికారులు కూడా సహకరించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణాలున్న భవనాన్ని ఫలానా మద్యం వ్యాపారులకే అద్దెకు ఇవ్వాలని కొద్ది మంది అధికారులు చర్చలు జరిపారు. అలా అయితేనే మీకు పాత అద్దెలను సక్రమంగా వచ్చేలా చూస్తామని.. లేని పక్షంలో ఇబ్బందులు తప్పవని కొద్ది మందిని బెదిరించినట్టు తెలుస్తోంది. కాగా.. లాటరీ పూర్తయిన తర్వాత వ్యాపారులు షాపులను 12నే తెరిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రధానమైన ప్రాంతాలన్నింటిలో తమ షాపులే ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఒకవేళ ఎవరైనా కొత్తవాళ్లకు షాపులు వస్తే.. భవనాలు దక్కకుండా, ప్రధానమైన ప్రాంతాల్లో వారు వ్యాపారం చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఒడిశా, నోయిడా నుంచి మద్యం వ్యాపారులు రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు.విశాఖలో తక్కువ దరఖాస్తులుఉమ్మడి విశాఖ జిల్లాలో 331 మద్యం షాపులకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో విశాఖ జిల్లా పరిధిలోని 155 షాపులకు గానూ మంగళవారం సాయంత్రం 5 గంటల సమయానికి 878 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో షాపునకు సగటున 6 దరఖాస్తులు కూడా రాలేదు. అనకాపల్లి జిల్లాలో 136 షాపులకుగానూ 1,076 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో షాపునకు 8 దరఖాస్తులు వచ్చాయి. అల్లూరి జిల్లాలో 40 మద్యం షాపుల్లో 36 షాపులకు మాత్రమే దరఖాస్తులు రాగా... మరో 4 షాపులకు దరఖాస్తులు రాలేదు. 36 షాపులకు మొత్తం 330 దరఖాస్తులు వచ్చాయి. సాధారణంగా విశాఖలో మద్యం వ్యాపారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. ఒక్కో షాపునకు కనీసం 40 నుంచి 50 మంది పోటీపడతారని ఊహించారు. ఇందుకు భిన్నంగా దరఖాస్తుల ప్రక్రియ ముగిసే సమయానికి సగటున 10 మందికి మించి పోటీపడే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒడిశా, నోయిడాల నుంచి పోటీ రావడంతో సిండికేట్ సభ్యులు తర్జనభర్జన పడుతున్నారు. ఎలాగైనా వారికి షాపులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వేళ లాటరీలో షాపులు వస్తే వాటిని ఎలా చేజిక్కించుకోవాలనే విషయంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
మహాలక్ష్మి కేసులో షాకింగ్ ట్విస్ట్
భువనేశ్వర్: బెంగళూరులో సంచలనం సృష్టించిన మహలక్ష్మి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు ముక్తి రంజన్ రాయ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఒడిషాలోని తన సొంత ఊరికి పారిపోయిన అతను.. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళను చంపి ముక్కలుగా నరికి ఫ్రిడ్జిలో దాచిన ఉదంతం గురించి తెలిసిందే. ఈ కేసులో ముక్తీ రంజన్ రాయ్‌ను తొలి నుంచి అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో భద్రక్(ఒడిషా) జిల్లా పాండి గ్రామానికి పారిపోయిన రాయ్.. సమీపంలోని కూలేపాడు గ్రామానికి వెళ్లి ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. ఘటనా స్థలంలో ఓ స్కూటీ, అందులో నోట్ బుక్ ఉన్నాయని ఒడిషా పోలీసులు చెబుతున్నారు. అందులో మహాలక్ష్మిని తానే చంపానని, ఆ బాధతోనే బలవనర్మణానికి పాల్పడుతున్నట్లు ముక్తి రంజన్ రాయ్ రాసినట్లు నోట్ దొరికిందని తెలిపారు. అయితే.. బెంగళూరు పోలీసులు దీనిని ధృవీకరించుకోవాల్సి ఉంది. గత శనివారం ఫ్రిజ్‌లో ఉన్న శవం వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. అయితే చాలా తొందరగానే బెంగళూరు పోలీసులు ఈ కేసును చేధించగలిగారు. సెప్టెంబర్ 1 నుంచి మహాలక్ష్మి మాల్‌కు వెళ్లడం లేదు. అదే రోజు నుంచి ముక్తి కూడా పనికి వెళ్లలేదు. బహుశా హత్య సెప్టెంబర్2వ తేదీనే జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మి(26) బెంగళూరులోని ఓ మాల్లో పని చేస్తోంది. భర్త నుంచి ఆమె దూరంగా ఉంది. ఈ క్రమంలో మాల్లోనే పని చేస్తున్న ముక్తి రంజన్‌కు దగ్గరైంది. అయితే గత కొంతకాలంగా మహాలక్ష్మి.. మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని భర్త హేమంత్ దాస్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రియురాలిపై కోపం పెంచుకున్న ముక్తి రంజన్.. ఆమెను కిరాతకంగా హత్య చేసి ఉంటాడని బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
వరద బాధితులకు అండగా..!
భువనేశ్వర్: రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలతో భారీ నష్టం సంభవించింది. ప్రధానంగా బాలాసోర్ జిల్లాలో పంటలు, ఇళ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. దీంతో బాధితులకు ప్రభుత్వ సాయం అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రకటించారు. పూర్తిగా దెబ్బ తిన్న ఇళ్లకు రూ.1.20 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న పక్కా ఇళ్లకు రూ. 6,500, మట్టి ఇళ్లకు రూ.4 వేలు చొప్పున ఆర్థిక సాయం లభిస్తుందని పేర్కొన్నారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న బాధితులకు దుస్తులు, వంట పాత్రల కోసం చెరో రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం అందుతుందన్నారు.రైతులకు మేలుపంట నష్టానికి గురైన చిన్న, సన్నకారు రైతాంగానికి 1 హెక్టారు విస్తీర్ణపు వర్ష ఆధార పొలాల్లో పంట నష్టానికి రూ.8,500, సాగు నీటి వనరుల పొలాల్లో పంట నష్టానికి హెక్టారు విస్తీర్ణానికి రూ.17 వేలు, నిత్య పంట పొలాలకు హెక్టారుకు రూ.22,500 చొప్పున పరిహారం లభిస్తుంది. అయితే ఈ సాయం గరిష్ట పరిమితి 2 హెక్టార్లకు మాత్రమే పరిమితంగా పేర్కొన్నారు. ఇసుక మేట వేసిన పంట పొలాలకు పరిహారం కింద అతి తక్కువగా రూ.2200, గరిష్టంగా రూ.18 వేలు సన్నకారు, బలహీన రైతాంగానికి చెల్లిస్తారు. నదిగట్లు తెగి పొలాల్లో వరద నీరు పొంగిపొర్లి నష్టం ఏర్పడిన పరిస్థితుల్లో పీడిత వర్గాలకు కనీస పరిహారం రూ.5,000 కాగా, గరిష్ట పరిహారం రూ.47 వేలుగా పేర్కొన్నారు.మత్స్యకారులకు ప్యాకేజీవరదల ప్రభావంతో మత్స్యకారులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. పూర్తిగా దెబ్బ తిన్న చేపల వేట పడవకు రూ.15 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న పడవలకు రూ.6 వేలు చొప్పున పరిహారం చెల్లిస్తారు. పాక్షికంగా దెబ్బ తిన్న చేపల వలకు రూ.3 వేలు చొప్పున, పూర్తిగా దెబ్బతిన్న వలకు రూ.4 వేలు చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేస్తారు. చేపల సాగు ఒక హెక్టార్ విస్తీర్ణం నష్టానికి రూ.10 వేలు చొప్పున పరిహారం మంజూరవుతుందని ప్రకటించారు.పాడి పశువులకు పరిహారంవరద తాకిడితో నష్టాలు సంభవించిన పాడి రైతులకు పరిహారం ప్రకటించారు. ఒక్కొక్క ఆవు, గేదెకి రూ.37,500, ఒక్కొక్క మేక, గొర్రెకి రూ.4 వేలు చొప్పున పరిహారం చెల్లిస్తారు. బండ్లు లాగే ఎడ్లు, బర్రెలు వంటి పశువుల నష్టానికి రూ.32 వేలు చొప్పున, దూడలు, గాడిద వంటి పశువుల నష్టానికి రూ.20 వేలు చొప్పున నష్ట పరిహారం నిర్ధారించారు. పశువులశాల పునరుద్ధరణ కోసం రూ.3 వేలు ఆర్థిక సాయం అందజేస్తారు. ఒక్కో కుటుంబానికి అత్యధికంగా 3 పెద్ద పాడి పశువులు లేదా 30 చిన్న పాడి పశువులు లేదా బండ్లు లాగే 3 పెద్ద పశువులు లేదా 6 చిన్న పశువులకు పరిహారం పరిమితం అవుతుందని స్పష్టం చేశారు.చేనేత వర్గాలకు సాయంవరద పీడిత చేనేత, హస్తకళ వర్గాలకు ముఖ్యమంత్రి సాయం ప్రకటించారు. ఈ వర్గపు యంత్ర పరికరాలు, పనిముట్ల నష్టానికి ఒక్కో వ్యక్తికి రూ.5 వేలు, అనుబంధ సరంజామా నష్ట పరిహారం కింద రూ.5 వేలు చొప్పున ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు.అపార నష్టంబాలాసోర్ జిల్లాలో వరదలతో రహదారులు, స్తంభాలు, పాఠశాలలు, ప్రాథమిక, సామూహిక ఆరోగ్య కేంద్రాలు, 11 కేవీ విద్యుత్ వ్యవస్థ, తాగునీరు పంపిణీ వ్యవస్థ, లఘు సాగు నీటి ప్రాజెక్టులు యువజన కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు ఇతరేతర కట్టడాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అనుబంధ విభాగాలు, శాఖల క్షేత్ర స్థాయి నివేదిక ఆధారంగా వీటి పునరుద్ధరణ కోసం సముచిత ప్యాకేజీ ప్రకటించడం జరుగుతుందని ముఖ్యమంత్రి వివరించారు. -
పెన్షన్ కోసం 2 కిలోమీటర్లు పాక్కుంటూ వెళ్లిన 80 ఏళ్ల బామ్మ
కియోంఝర్(ఒడిశా): వృద్ధాప్య పెన్షన్ కోసం పండుటాకులాంటి బామ్మ పడరాని పాట్లు పడుతున్న దృశ్యం ఒడిశాలో కనిపించింది. పెన్షన్ కావాలంటే పంచాయతీ ఆఫీస్‌దాకా వచ్చి నువ్వే తీసుకో అని అధికారులు తెగేసి చెప్పడంతో 80 ఏళ్ల బామ్మ 2 కి.మీ.లు పాక్కుంటూ వెళ్లింది. శనివారం జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ కావడంతో అధికారులపై అందరూ మండిపడుతున్నారు. ఒడిశా రాష్ట్రంలోని సీఎం మోహన్ చరణ్ మాఝీ సొంత జిల్లా కియోంఝర్లోని రైసాన్‌లో ఘటన జరిగింది. గ్రామంలోని పథూరీ దేహరీ అనే బామ్మ నడవలేని దుస్థితి. ఇలాంటి వృద్ధులకు ఇంటి వద్దే పెన్షన్ అందజేయాలని ఉత్తర్వులు ఉన్నాయి. కానీ వాటిని అమలుచేసిన నాథుడే లేడు. శనివారం గ్రామ పంచాయతీలో పెన్షన్లు ఇస్తున్న విషయం తెల్సుకుని బామ్మ బురద ఉన్న ఎర్రమట్టి బాట గుండా పాకుతూ వచ్చి పెన్షన్ తీసుకున్నారు. వృద్ధురాలు ఇంత కష్టపడి కార్యాలయానికి వస్తుంటే పట్టించుకోరా? అని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గీతా ముర్మును కొందరు నిలదీశారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఇకపై బామ్మకు ఇంటి వద్దే పెన్షన్ ఇస్తామని మాటిచ్చారు. ఆమెకు ఒక చక్రాల కుర్చీని సైతం అందజేశారు. ఇకపై ఇంటి వద్దే రేషన్ సైతం అందిస్తామని స్పష్టంచేశారు. -
అయ్యో.. బామ్మా..!
ఈ చిత్రంలో కనిపిస్తున్న బామ్మ పేరు పథురి దెహురి. ఈమె వయస్సు దాదాపు 80 ఏళ్లు. వయోభారంతో నడవలేని పరిస్థితి ఆమెది. కానీ ప్రభుత్వం మంజూరు చేసే పింఛన్ డబ్బులే జీవనాధారం. దీంతో రోడ్డుపై పాకుకుంటూనే దాదాపు 2కి.మీ పాటు పింఛన్ డబ్బులు కోసం ప్రయాసలు పడుతూ మంగళవారం పింఛన్ ఇచ్చే ప్రదేశానికి వెళ్లింది. ఈ హృదయ విదారక ఘటన కెంజొహర్ జిల్లా రయిసుంవా గ్రామ పంచాయతీలో చోటుచేసుకుంది. ఇది చూసిన పలువురు ఆమెకు ఇంటి వద్దనే పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. – భువనేశ్వర్ -
రక్తదాన శిబిరం
పర్లాకిమిడి: స్థానిక బిజూ కల్యాణ మండపంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి మంగళవారం ప్రారంభించారు. రక్తదానం వల్ల అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులకు మేలు జరుగుతుందన్నారు. శిబిరంలో 72 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమంలో ఏడీఎం రాజేంద్ర మింజ్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా పరిషత్ అదనపు సీడీఎం పృథ్వీరాజ్ మండల్, జిల్లా చికిత్సా అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ పండా తదితరులు పాల్గొన్నారు.రాయగడ: జాతీయ సేవ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని గుణుపూర్‌లో ఉన్న గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వవిద్యాలయంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో 602 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. బీడీవో సుభ్రాంజలి ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో రిజిస్ట్రార్ ఎన్వీ జగన్నాథరావు, విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ ఏవీఎన్ఎల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘నెలసరి’ సెలవులకూ వేతనం: గళమెత్తిన ప్రియదర్శిని
నెలసరి లేదా పీరియడ్, ఈ సమయంలో మహాళలు అనుభవించే బాధ, వేదన వారికే మాత్రమే తెలుసు. ఇన్ని రోజులూ అదేదో పాపంలాగా, దేవుడిచ్చిన శాపంలాగా అనుకుంటూ ఆడవాళ్లు పంటి బిగువున ఆ బాధనంతా భరిస్తూ వచ్చారు. కానీ ఆ సమయంలో వారు పడే కష్టాలు ఇంట్లోని పురుషులకు, సమాజానికి కూడా అర్థం కావాలనే ఆరాటం ఎన్నాళ్ల నుంచో ఉంది. ఇందులో భాగంగా వచ్చిందే పీరియడ్ పెయిడ్ లీవ. దీనిపై ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని (Ranjeeta Priyadarshini) ఐక్యరాజ్యసమితి (UN) సమావేశంలో గళమెత్తారు. నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆమె కోరారు. దీంతో జీతంలో కోత పడుతుందనే సంకోచం, భయం లేకుండా వారు సెలవు తీసుకోగలుగుతారని ఆమె తెలిపారు.రంజీతా ప్రియదర్శిని, న్యూయార్క్‌లోని 79వ యుఎన్‌జిఎలో జరిగిన ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో మహిళలకు చెల్లింపు రుతుస్రావ సెలవుల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నెలసరి విషయంలో సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. పెయిడ్ పీరియడ్ లీవ్‌ల కోసం ఆమె పోరాడుతున్నారు. తాను పని చేస్తున్నపుడు తనకెదురైన అనుభవం నుంచే ఆలోచన వచ్చినట్టు ప్రియదర్శిని తెలిపారు. ఈ సందర్బంగా తన అనుభవాన్ని పంచుకున్నారు. పీరియడ్స్ సమయంలో తన ఇబ్బంది కారణంగా సెలవు కోరినపుడు తనపై అధికారినుంచి అవమానాన్ని ఎదుర్కొన్నారు. దీంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆమె ప్రయత్నాలు రుతుక్రమ ఆరోగ్యం, మహిళల పరిస్థితిపై చర్చకు దారితీసింది.. మార్పునకు పునాది పడింది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రుతుక్రమం సమయంలో మహిళలను అర్థం చేసుకునేందుకు, అవగాహన పెంచేందుక బాటలు వేసింది. మరోవైపు ఇదే అంశంపై త్వరలో బాలీవుడ్ చిత్రం కూడా విడుదల కానుంది. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య కిల్లింగ్ లుక్స్, తొలిసారి అలియా అదుర్స్ -
ఉల్లంఘనులను వదలం
మిమ్నల్ని ఎవరూ చూడటం లేదంటూ ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపడం, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా? అయితే మీకు ఫైన్ పడినట్లే. జయపురంలో ఇటీవల సీసీ కెమెరాల పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే ఉల్లంఘనులను గుర్తించి జరిమానా విధిస్తున్నారు. శనివారం ఒక్కరోజే 18 మందికి ఫైన్ విధించినట్లు పట్టణ పోలీసు అధికారి రశ్మీరంజన్ దొలాయి ఆదివారం వెల్లడించారు.– జయపురం -
నువాఖాయి..ఆనందమోయి..
పశ్చిమ ఒడిశాలో సంప్రదాయ పండగల్లో ఒకటైన నువాఖాయి ఉత్సవాన్ని పురస్కరించుకుని రాయగడలోని బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ‘నువాఖాయి భేట్ ఘాట్’ పేరిట జరిగిన కార్యక్రమం ఆద్యంతం ఆనందోత్సాహాల నడుమ సాగింది. పశ్చిమ ఒడిశా నువాఖాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంబల్పూరి నృత్యాలు, నాటక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి నిహారి రంజన్ కుహోరొ, వాటర్‌షెడ్ డైరెక్టర్ డాక్టర్ దయానిధి బాగ్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంతకుమార్ ప్రధాన్, విద్యావేత్త డాక్టర్ డి.కె.మహంతి, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.– రాయగడ -
రత్న భండార్‌లో రెండో సర్వే ప్రారంభం
పూరీ: భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) ఒడిశా పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్‌లో శనివారం మధ్యాహ్నం రెండో దఫా టెక్నికల్ సర్వే ప్రారంభించింది. మూడు రోజులపాటు ఈ సర్వే కొనసాగుతుందని, మధ్యాహ్నం ఒంటి నుంచి సాయంత్రం 6 గంటల ద్వారా భక్తులను ఆలయంలోకి అనుతించబోమని శ్రీజగన్నాథ్ ఆలయ పరిపాలనా విభాగం అధికారులు వెల్లడించారు. సర్వే జరుగుతున్న సమయంలో ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. రత్న భండార్‌లో రహస్య గది గానీ, సొరంగం గానీ ఉన్నా యా? అనేది తేల్చబోతున్నామని రత్న భండార్ ఇన్వెంటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. ఈ సర్వే కోసం అత్యాధునిక రాడార్‌ను ఉపయోగిస్తున్న ట్లు వివరించారు. రత్న భండార్‌లో మొదటి దఫా సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. -
ఛాతీపై కొట్టి, లైంగికంగా వేధించి.. ఆర్మీ ఆఫీసర్‌కు కాబోయే భార్యపై పోలీసుల దాష్టీకం
భువనేశ్వర్: న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం చేసిన దారుణ ఘటనలో విస్తుగొలిపే వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారులను ఒడిశా సర్కార్ సస్పెండ్‌చేసి కేసును సీఐడీకి అప్పగించింది. అసలేం జరిగింది? పశ్చిమ బెంగాల్లో ఆర్మీ మేజర్‌గా పనిచేసే ఒక యువ ఆర్మీ అధికారి తన కాబోయే భార్యను భువనేశ్వర్‌లో సెప్టెంబర్ 14వ తేదీన ఆమెకు చెందిన రెస్టారెంట్ వద్ద కలిశారు. తర్వాత రెస్టారెంట్ మూసేసి ఇద్దరూ అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కారులో ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో కొందరు ఆకతాయిలు వీరిని కారు ఆపి వేధించారు. ఆకతాయిలపై ఫిర్యాదుచేసేందుకు వీరిద్దరూ దగ్గర్లోని భరత్పూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే అక్కడ తమకు ఘోర అవమానం జరిగిందని బాధిత మహిళ చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో గురువారం బెయిల్‌పై విడుదలయ్యాక గాయాలతో ఆమె ప్రస్తుతం భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ‘‘ఆకతాయిలపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. ఎఫ్ఐఆర్ నమోదుచేయడానికి నిరాకరించారు. పైగా బూతులు తిట్టారు. వాగ్వాదానికి దిగిన ఆర్మీ ఆఫీసర్‌ను లాకప్‌లో పడేశారు. అదేంటని ప్రశ్నించినందుకు నన్ను అక్కడి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కట్టేసి లాకప్‌లో పడేశారు. చాలా సేపటి తర్వాత ఒక పోలీసు అధికారి ఒకతను గదిలోకి వచ్చి నా ఛాతీ మీద చాలా సార్లు కొట్టాడు. తర్వాత నా ప్యాంట్ విప్పి అతని ప్యాంట్ కూడా విప్పాడు. జననాంగం చూపిస్తూ ‘‘అరవకుండా నువ్వు నోరు మూసుకుని ఉండటానికి నీకు ఎంత సమయం కావాలి?’ అని బెదిరించాడని వివరించింది. ఘటనను జాతీయ మహిళా కమిషన్ సూమోటోగా స్వీకరించింది. మూడ్రోజుల్లోగా ఘటనపై నివేదించాలని ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) వైబీ ఖురానియాను ఆదేశించింది. జ్యుడీషియల్ విచారణ జరపాలి: పటా్నయక్ ఘటనపై మాజీ సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘హేయమైన ఘటనలో జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలి. కోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు జరిపించాలి’’ అని శాసనసభలో పట్నాయక్ డిమాండ్‌చేశారు. శనివారం రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తామని బీజేడీ ప్రకటించింది. ‘‘కాషాయపార్టీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ పోలీసులు రక్షకులుగా కంటే భక్షకులుగా తయారయ్యాయి. మహిళకు పోలీస్‌స్టేషన్‌లో ఇంతటి అవమానం జరిగితే, ఆర్మీ కెప్టెన్‌ను అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రధాని ఒక్కమాటైనా మాట్లాడరా?. బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోంది?’’ అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీస్భవన్ వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు ధర్నాకు దిగారు.పోలీసుల సస్పెన్షన్ ఘటనపై భారత సైన్యం సైతం స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని ఒడిశా సర్కార్‌ను కోరింది. దీంతో ఈ ఉదంతంలో సంబంధం ఉన్న భరత్పూర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జ్ దినకృష్ణ మిశ్రా, సబ్ ఇన్స్పెక్టర్లు వైశాలిని పాండా, సలిలామయీ సాహో, సాగరికా రథ్, కానిస్టేబుల్ బలరాం హన్స్డాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేసును సీఐడీకి బదిలీచేయగా సస్పెండ్ అయిన పోలీసులపై శుక్రవారం కేసు నమోదుచేశారు. ‘‘నా కూతురును దవడ కదిలిపోయేలా దారుణంగా కొట్టారు. న్యాయం కోసం వస్తే అన్యాయంగా అరెస్ట్ చేశారు’’ బాధిత మహిళ తండ్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన సైన్యంలో బ్రిగేడియర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ జంటను వేధించిన ఏడుగురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆర్మీ అధికారి కాబోయే భార్యపై పోలీసుల వేధింపులు
భువనేశ్వర్: భారత ఆర్మీకి చెందిన అధికారికి కాబోయే భార్యపై పోలీసుల దాడి ఘటన ఒడిషాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. అలాగే, జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.వివరాల ప్రకారం.. గత ఆదివారం రాత్రి బాధితురాలు తన రెస్టారెంట్‌ను మూసివేసి ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో కొంత మంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఆమెను వేధింపులకు గురిచేశారు. దాడి చేసే ప్రయత్నం చేశారు. అనంతరం, ఈ దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఆమె భరత్పూర్ పోలీసు స్టేషన్ వెళ్లారు. ఈ సందర్బంగా పీఎస్ కేవలం ఒక్క మహిళా కానిస్టేబుల్ మాత్రమే సివిల్ డ్రెస్‌లో ఉన్నారు. జరిగిన విషయం చెప్పి కేసు నమోదు చేయాలని కోరగా అందుకు కానిస్టేబుల్ నిరాకరించింది. కాసేపటి తర్వాత కొందరు పోలీసులు స్టేషన్‌కు వచ్చారు.Army officer’s fiance alleges sexual assault in #Odisha. The woman spoke about the #attack on her and her fiance, an army officer, on Thursday after being discharged from #AIIMS #Bhubaneswar pic.twitter.com/xfQ7HmIz65— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) September 20, 2024ఈ సందర్భంగా తనపై దాడికి సంబంధించిన ఘటనపై కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఇద్దరు మహిళా పోలీసులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆమెను లాకప్‌లో వేసి దారుణంగా హింసించారు. ఇన్స్‌స్పెక్టర్ ర్యాంక్ ఉన్న పోలీసు, మరో నలుగురు ఆమె వద్దకు వెళ్లి బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. దారుణంగా సైగలు చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల దెబ్బల కారణంగా ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన తర్వాత ఆమె ఎయిమ్స్ చికిత్స పొందుతూ తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో తనతో పోలీసులు ప్రవర్తించిన తీరును వివరిస్తూ కంటతడి పెట్టుకున్నారు.ఇక, ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు మహిళా పోలీసులతో పాటు, మరో ఇద్దరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆమెకు కాబోయే భర్త కోల్‌కతాలోని 22 సిక్కు రెజిమెంట్‌లో ఆర్మీ అధికారిగా పనిచేస్తున్నారు.ఇది కూడా చదవండి: కోల్‌కతా: సీఎం మమతకు ఊరట.. రేపటి నుంచి విధుల్లోకి జూడాలు -
27 ఏళ్లకే ప్రముఖ సింగర్ మృతి.. కారణమేంటి?
ప్రముఖ లేడీ సింగర్ రుక్సానా బానో (27) చనిపోయింది. ఒడిశా సంబల్‌పూర్‌కి చెందిన ఆల్బమ్ సాంగ్స్ పాడుతూ బాగానే గుర్తింపు తెచ్చకుంది. అనారోగ్య సమస్యలతో ఆగస్టు 27న ఆస్పత్రిలో చేరిన ఈమె.. ఇప్పుడు ఇలా చనిపోవడం అభిమానులకు షాక్‌కి గురిచేసింది. మరి చిన్న వయసులోనే తనువు చాలించడంపై ఆమె తల్లి, సోదరి చేసిన కామెంట్స్ మాత్రం చర్చనీయాంశంగా మారిపోయాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)ఒడియా సాంగ్స్ పాడుతూ ఫేమస్ అయిన రుక్సానా బానో.. కొన్నాళ్ల క్రితం షూటింగ్ కోసం బోలంగిర్ అనే ఊరు వెళ్లింది. జ్యూస్ తాగిన తర్వాత అనారోగ్యానికి గురైంది. వెంటనే భవానీపట్నలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఇదంతా ఆగస్టు 27న జరిగింది. బోలంగిర్‌లోని పెద్దస్పత్రిలో చూపించినప్పటికీ ఫలితం లేకపోవడంతో బార్గర్ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. అక్కడి కూడా అవ్వకపోయేసరికి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కి తరలించారు. అప్పటినుంచి చికిత్స అందించారు కానీ ఫలితం కనిపించలేదు. ఈ బుధవారం రాత్రి చనిపోయింది.ఆస్పత్రి వర్గాలు.. రుక్సానా బానో విషపురుగు కాటుకి గురైందని అంటుడగా ఈమె తల్లి, సోదరి మాత్రం ప్రత్యర్థి సింగర్ ఈమెకు విషమిచ్చి చంపేసిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఒడిశా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్) -
గణపతి పూజలో పాల్గొన్నా కాంగ్రెస్‌కు నచ్చట్లేదు
భువనేశ్వర్: సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజలో పాల్గొన్నందుకు తనపై విమర్శలు పెంచిన కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ మంగళవారం దీటుగా బదులిచ్చారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ గణేశ్ ఉత్సవం దేశంలో కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన వేడుక కాదు. దేశ స్వాతం్రత్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉత్సవం. ఆకాలంలో బ్రిటిష్ పాలకులు సైతం గణేశ్ ఉత్సవాలను ద్వేషించాలంటూ భారత్‌లో విభజించు, పాలించు కుట్రను అమలుచేశారు. ఇప్పుడు కూడా అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్న కొందరు గణపతి పూజలో పాల్గొంటే సమస్యలొస్తాయంటూ సమాజాన్ని విభజించే పనిలో బిజీగా మారారు. గణపతి పూజలో పాల్గొన్న నాపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాల్లో పీకలదాకా కోపముంది. కాంగ్రెస్‌పాలిత కర్ణాటకలో గొడవలు జరుగుతాయంటూ ఏకంగా గణపతి విగ్రహాన్నే కటాకటాల వెనక్కి నెట్టారు. పోలీస్‌వ్యాన్‌లో గణపతి విగ్రహం ఫొటో చూసి యావత్భారతావని బాధపడింది. ఇక ఇలాంటి విద్వేష శక్తుల ఆట కట్టించాల్సిందే. దేశాన్ని కుల, మత ప్రాతిపదికన బ్రిటిషర్లు విభజించాలని చూస్తే లోకమాన్య తిలక్ గణేశ్ ఉత్సవాలతో దేశ సమైక్య స్ఫూర్తిని మరింతగా రగిల్చారు. కుల మతాలకతీతంగా ఐక్యంగా ఎలా ఉండాలో గణేష్ ఉత్సవాలు మనకు చాటిచెప్పాయి’’ అని మోదీ అన్నారు. రూ.2,871 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభం తన నాయకత్వంలో మూడోదఫా పాలన మొదలై 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం మోదీ ఒడిశాలో రూ.2,871 కోట్ల విలువైన రైల్వే, జాతీయరహదారులకు సంబంధించిన పలు ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపనలు చేసి కొన్నింటిని ప్రారంభించారు. ఒడిశా బీజేపీ ప్రభుత్వ కీలక పథకం ‘ సుభద్ర యోజన’ను ప్రారంభించారు. భువనేశ్వర్‌లోని సబర్ సాహీ మురికివాడలో ప్రధానమంత్రి ఆవాస్‌యోజన(పట్టణ) 20 మంది లబి్ధదారుల ఇళ్లను మోదీ స్వయంగా ప్రారంభించి వారితో మోదీ ముచ్చటించారు. పుట్టినరోజున తమ ఇంటికొచి్చన మోదీకి ఆ గిరిజనులు అంగవస్త్రం ఇచ్చి ఆహా్వనించి నుదుటిన గంధం»ొట్టు పెట్టారు. ప్రేమతో తనకు వారు ఇచి్చన తీపి వంటకం ఖీర్‌ను మోదీ రుచిచూశారు. -
డయాబెటిక్ రోగుల కోసం పోర్టబుల్ కూలింగ్ క్యారియర్!
డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఇన్సులిన్‌ను ఎప్పుడూ తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. కానీ ఇంట్లో ఫ్రిజ్ లేనివారికి ఇది కొంత ఇబ్బందికరమే. వాళ్ల విషయంలో దీనికి పరిష్కారమెలా? ఈ అంశంపైనే పరిశోధనలు చేసి ఓ కూలింగ్ క్యారియర్‌ను రూపొందించిన ఒడిశా అమ్మాయి కోమల్ పాండాకు జేమ్స్ డైసన్ అవార్డు వరించింది. స్థానికంగా లభ్యమయ్యే సులభమైన సాంకేతికతతో కొత్త ఉపకరణాలను రూపొందించేవారికి ఈ అవార్డును ప్రకటిస్తారు. మన దేశం నుంచి కోమల్ పాండాకు ఈ అవార్డుతోపాటు రూ. 5 లక్షలు బహూకరిస్తారు. కోమల్ రూపొందించిన ‘నోవోక్యారీస్’ అనే ఈ ఉపకరణంతో ఇన్సులిన్‌ను చాలాసేపు చల్లదనంలో ఉంచవచ్చు. అంతేకాదు దూరప్రయాణాల్లో, విద్యుత్ సౌకర్యాలూ, బ్యాటరీ సౌలభ్యాలు లేనిచోట్ల కూడా ఇన్సులిన్‌తోపాటు చల్లదనంలోనే ఉంచాల్సిన చాలా రకాల మందుల్ని సుదీర్ఘకాలంపాటు నిల్వ చేయవచ్చు. ‘నోవోక్యారీస్’ రూపకల్పనకు తన తండ్రి నుంచే కోమల్‌కు స్ఫూర్తి లభించింది. ఆయన ఓ డయాబెటిస్ బాధితుడు. ఆఫీసులో ఫ్రిజ్ లేదు. దూరప్రయాణాలప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. ఆయన మాత్రమే కాదు... ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టుల ప్రకారం దాదాపు 20 శాతం మందులు ఇలా దూర్రప్రాంతాలకు ప్రయాణం చేసేవారి విషయంలో, రిఫ్రిజిరేటర్ సౌకర్యం లేకపోవడం వల్ల చెడిపోతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంటోంది. ఇలాంటి వారికి ఇదెంతో ప్రయోజనం. (చదవండి: కమ్మటి కబుర్ల కమ్యూనిటీ కిచెన్..! వంటరికి విస్తరి.. ) -
చెన్నైయిన్ ఎఫ్‌సీ శుభారంభం
ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా భువనేశ్వర్‌లో ఒడిశా ఎఫ్‌సీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు 3–2 గోల్స్ తేడాతో గెలిచింది. చెన్నైయిన్ తరఫున ఫారుఖ్ (48వ, 51వ ని.లో) రెండు గోల్స్... డేనియల్ (69వ ని.లో) ఒక గోల్ చేశారు. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 1–0 గోల్‌తో ఈస్ట్ బెంగాల్ క్లబ్ జట్టును ఓడించింది. -
పూరీ జగన్నాథ ఆలయంలో కలకలం
పూరీ: ఒడిశాలోని పూరిలో గల జగన్నాథ ఆలయంలో కలకలం చెలరేగింది. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపధ్యంలో ఆలయంలో నిత్యం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయితే తాజాగా జరిగిన ఒక ఉదంతం ఆలయ భద్రతపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆలయ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయ శిఖరంపైకి చేరుకున్నాడు. దీనిని చూసినవారంతా షాకయ్యారు. సాయంత్రం వేళ ఆలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేచి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆలయ గోపురంపైకి ఎక్కిన వ్యక్తిని చూసిన ఆలయ సిబ్బందితో పాటు అక్కడున్న భక్తులంతా ఆశ్చర్యపోయారు.పూరీలోని శ్రీ మందిరం చుట్టూ గట్టి భద్రతా వలయం ఉంది. దీనిని తప్పించుకుని ఆ వ్యక్తి ఆలయంపైకి ఎలా ఎక్కగలిగాడనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. కాగా శిఖరాన్ని అధిరోహించిన ఆ వ్యక్తి పైననే కొద్దిసేపు ఉన్నాడు. ఆలయ అధికారులు అతనిని కిందకు తీసుకువచ్చారు. తరువాత పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి తాను ఒడిశాలోని ఛత్రపూర్నకు చెందినవాడినని తెలిపాడు. 1988 నుంచి తాను ఆలయానికి వస్తున్నానని, తన కోరిక ఒకటి నెరవేరాక, ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రాన్ని తాకి, అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: Karnataka: గణపతి నిమజ్జనంలో ఉద్రిక్తత -
బీజేడీ నుంచి ఎంపీ బహిష్కరణ.. కాసేపటికే బీజేపీలోకి
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న కారణంతో రాజ్యసభ ఎంపీ సుజీత్ కుమార్‌ను మాజీసీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(బీజేపీ) పార్టీ నుంచి బహిష్కరించింది. ఎంపీ సుజీత్ కుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, ఈ బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బీజేపీ చీఫ్ నవీన్ పట్నాయక్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. తనను రాజ్యసభకు పంపిన పార్టీని, కలహండి జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను అతను నెరవేర్చడంలో విఫలమయ్యాడని ఉత్తర్వుల్లో పేర్కొంది.దీంతో సుజీత్‌కుమార్ వెంటనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుజీత్ కుమార్ రాజీనామా లేఖను భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కఢ్ ఆమోదించారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పార్టీ ఒడిశా ఇన్ఛార్జ్ విజయపాల్ సింగ్ తోమర్, ఎంపీ భర్తృహరి మహతాబ్, పార్టీ సీనియర్ నేతల సమక్షంలో సుజీత్ కుమార్ కాషాయ కండువా కప్పుకున్నారు.అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుమార్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా, 2036 నాటికి ఒడిశాను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కృషి, ఆయన దృక్పథానికి ఆకర్షితుడై తాను కాషాయ పార్టీలో చేరానని చెప్పారు.‘నాకు దేశమే ప్రథమం. నేషన్ ఫస్ట్ అనేది నా ఫిలాసఫీ. నేను చాలా సంవత్సరాలు విదేశాల్లో నివసించాను . యునైటెడ్ నేషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి సంస్థల కోసం పనిచేశాను. దేశ అభివృద్ధి కోసం 2011లో భారతదేశానికి తిరిగి వచ్చాను.ఒడిశాలోని కలహండి జిల్లా అనేక అవినీతి కారణంగా అభివృద్ధి చెందలేదని నేను. ఇందులో జిల్లాకు చెందిన పలువురు బీజేడీ నాయకుల హస్తం ఉంది. ఈ విషయాన్ని బీజేడీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చాలాసార్లు ప్రయత్నించాను. కానీ సాధ్యపడలేదు. అందుకే బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నాను.’ అని పేర్కొన్నారు. BJD expels party leader Sujeet Kumar for "anti-party activities."He resigned from Rajya Sabha and his resignation has been accepted by Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar. pic.twitter.com/asjLLxpnOw— ANI (@ANI) September 6, 2024 -
Odisha: ఘర్షణల్లో యువకుని మృతి.. ఖుర్దాలో నిషేధాజ్ఞలు
ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఒక యువకుని మృతికి దారితీసింది. ఈ ఘటన నేపధ్యంలో మరిన్ని అల్లర్లు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ (బీఎన్‌ఎస్‌స్)లోని సెక్షన్ 163 కింద జిల్లాలో నిషేధాజ్ఞలు విధించారు. ఖుర్దా పట్టణ శివార్లలోని ముకుంద్ ప్రసాద్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని, ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.ఈ ఘర్షణల్లో గాయపడిన వ్యక్తిని ఖుర్దా జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరిశీలించి, అతను మృతిచెందినట్లు ప్రకటించారు. ఇరువర్గాల మధ్య జరిగిన హింసాకాండలో పలు వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఎస్.కె. ప్రియదర్శి పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.ఈ హత్య అనంతరం స్థానికులు రోడ్డుపై బైఠాయించి వీరంగం సృష్టించారని పోలీసు సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ మీడియాకు తెలిపారు. అయితే నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో జనం అక్కడినుంచి వెళ్లిపోయారన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ చంచల్ రాణా మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఘర్షణల దరిమిలా ఖుర్దా మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో తక్షణమే నిషేధాజ్ఞలు విధించినట్లు ఆయన చెప్పారు. దీంతో ఈ ప్రాంతంలో పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వాణిజ్య సంస్థలు మూతపడనున్నాయి. అయితే అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. -
కొత్త రైలు.. కొండ కోనల్లో హొయలు
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఒడిశాలోని మల్కనగిరి నుంచి భద్రాచలం సమీపంలోని పాండురంగాపురం వరకు సుమారు 173 కిలోమీటర్ల కొత్త రైల్వే లైను ఇటీవల మంజూరైంది. ఈ లైనుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఈ రైల్వేలైను నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ఒడిశాలోని మల్కనగిరి నుంచి ఆంధ్రాలోని విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా తెలంగాణలోని పాండురంగాపురం వరకు కొత్త లైను నిర్మించనున్నారు. లైను నిర్మాణంలో భాగంగా 213 వంతెనలు నిర్మించనున్నారు. వీటిలో 48 పెద్ద వంతెనలు, 165 చిన్న వంతెనలున్నాయి. ముంపు మాటేంటి? విలీన మండలాల్లో ప్రతిపాదించిన రైల్వేలైను పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవనుంది. చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరుగట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో నిర్మించనున్న స్టేషన్లు సైతం ముంపునకు గురయ్యే అవకాశముంది. దీంతోపాటు శబరినదిపై నిర్మించే వంతెన సైతం ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్వే చేసిన మార్గం గుండా కాకుండా ముంపునకు గురికాని మార్గంలో లైను నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. లైనుతో పాటు స్టేషన్లు ముంపు పరిస్థితిపై రైల్వే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని స్థానికులు వేచి చూస్తున్నారు. విలీన మండలాల మీదుగా.. మల్కనగిరి నుంచి భద్రాచలం వరకు నిర్మించనున్న రైల్వేలైను విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక గుండా సాగనుంది. దీనిలో భాగంగా ఒడిశాలోని మల్కనగిరి, కోవాసిగూడ, బదలి, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లి, లూనిమన్‌గూడలో, ఆంధ్రాలోని అల్లూరి జిల్లా చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరు గట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో స్టేషన్లు నిర్మించనున్నారు. అనంతరం నందిగామ నుంచి తెలంగాణలోని భద్రాచలం అక్కడి నుంచి పాండురంగాపురం వరకు ఈ రైల్వేలైను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయిలో సర్వే పనులు పూర్తి చేశారు. దీనిలో భాగంగా కూనవరం మండలం జగ్గవరం వద్ద మహరాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ నుంచి వచి్చన ప్రత్యేక బృందాలు 50 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి మట్టి శాంపిల్స్ పంపారు. కాగా ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించేందుకు శబరి నదిపై ఒడిశాలోని మోటు, చింతూరు మండలం వీరాపురం నడుమ వంతెన నిర్మించాల్సి ఉంది. -
వివేక్‌కు కోటి.. అతడికి రూ. 4 కోట్లు: ప్రభుత్వాల భారీ నజరానాలు
భారత హాకీ క్రీడాకారుడు వివేక్ సాగర్ ప్రసాద్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కోటి రూపాయల రివార్డుతో సత్కరించనుంది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు. జాతి మొత్తాన్ని గర్వపడేలా చేశారంటూ వివేక్‌తో పాటు భారత హాకీ జట్టు ఆటగాళ్లందరినీ ప్రశంసించారు.వరుస ఒలింపిక్స్లోకాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. స్పెయిన్‌తో గురువారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన 2-1తో విజయం సాధించింది.టోక్యో ఫలితాన్ని పునరావృతం చేస్తూ మరోసారి మెడల్‌ను కైవసం చేసుకుంది. తద్వారా 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించిన హాకీ జట్టుగా నిలిచింది. విశ్వ క్రీడల్లో హాకీలో ఘనచరిత్ర ఉన్న భారత్‌కు ఒలింపిక్స్‌లో ఇది 13వ పతకం.వివేక్‌కు ఇప్పటికే డీఎస్పీ ఉద్యోగంఈ నేపథ్యంలో హాకీ ఇండియా కాంస్యం గెలిచిన జట్టులోని ఆటగాళ్లకు నజరానా ప్రకటించింది. ప్లేయర్లలో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి ఏడున్నరల లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపింది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత వివేక్ సాగర్ ప్రసాద్‌కు ఫోన్ చేసిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్.. ‘‘అద్బుతమైన ప్రదర్శన. దేశం మొత్తం మిమ్మల్ని చూసి సంతోషిస్తోంది. జట్టుకు అభినందనలు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మీ అకౌంట్‌కు కోటి రూపాయలు రివార్డుగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీసుగా మీరు పనిచేస్తున్నారు. మీకు ఈ కోటి రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.అమిత్‌కు రూ. 4 కోట్లుకాగా టోక్యోలో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడైన వివేక్‌కు నాటి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో పాటు కోటి రూపాయలు ఇచ్చింది. మరోవైపు.. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ తమ హాకీ స్టార్ అమిత్ రోహిదాస్‌కు రూ. 4 కోట్ల నజరానా ప్రకటించారు. జట్టులోని ఇతర సభ్యులకు రూ. 15 లక్షల చొప్పున అందిస్తామని తెలిపారు. -
మధ్యాహ్న భోజనంలో బల్లి.. వంద మంది విద్యార్థులకు అస్వస్థత
భువనేశ్వర్: ఒడిశాలో ఓ స్కూల్లో మధ్యాహ్నభోజనం తిన్న వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా బాలాసోర్‌లోని సిర్పూర్ గ్రామంలో ఉన్న ఉదయనారాయణ్ స్కూల్లో పిల్లలకు గురువారం(ఆగస్టు8) అన్నం, కూర వడ్డించారు. భోజనంలో బల్లి పడిన విషయాన్ని కొద్దిసేపటి తర్వాత పిల్లలు గుర్తించారు.దీంతో ఎవరూ భోజనాలు తినొద్దని స్కూల్ సిబ్బంది ఆదేశించారు. అయితే అప్పటికే కొందరు పిల్లలు భోజనం తినేయడంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరికి కడుపునొప్పితో పాటు ఛాతినొప్పి సమస్యలు వచ్చాయి. వారందరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. భోజనం విషతుల్యమవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని బ్లాక్ విద్యాధికారి తెలిపారు. -
బంగ్లాదేశ్ సంక్షోభం: ఒడిశా అప్రమత్తం.. తీరంలో గస్తీ పెంపు
అశాంతితో దెబ్బతిన్న బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి చొరబడాలని చూస్తున్న అక్కడి ప్రజలను అడ్డుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 480 కిలోమీటర్ల తీరప్రాంతంలో నిఘాను మరింతగా పెంచింది. ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.ఒడిశా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు చిన్న పడవలను ఉపయోగించి ఒడిశాలోకి అక్రమంగా ప్రవేశిస్తుంటారన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అశాంతి నెలకొన్న సమయంలో, అక్కడి నేరస్తులు జైలు నుండి బయటకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. అలాంటి వారు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించే అవకాశాలున్నయని, అందుకే తాము మరింత అప్రమత్తం అయ్యామన్నారు.నేరస్తులలో పాటు సామాన్యులు కూడా ఒడిశాలోకి చొరబడే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని 18 మెరైన్ పోలీస్ స్టేషన్లను హై అలర్ట్‌లో ఉంచామన్నారు. మరోవైపు ఒడిశాలోకి బయటి వ్యక్తుల అక్రమ ప్రవేశాన్ని నిరోధించేందుకు ప్రత్యేకించి రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోస్తా జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించింది. కేంద్రపారా, జగత్సింగ్పూర్, భద్రక్ తదితర జిల్లాలపై నిఘా సారించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. -
బీజేడీ ఎంపీ మొహంతా రాజీనామా
న్యూఢిల్లీ: బిజూ జనతాదళ్ రాజ్యసభ ఎంపీ మమతా మొహంతా బుధవారం ఎగువసభలో తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. మమత స్వదస్తూరీతో రాజీనామా లేఖను రాసి, తనను కలిసి అందజేశారని, నిబంధనల ప్రకారమే ఉండటంతో ఆమె రాజీనామాను తాను ఆమోదించానని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు. మమత బీజేపీలో చేరనున్నారని పారీ్టవర్గాలు వెల్లడించాయి. మమత రాజీనామాతో రాజ్యసభలో బీజేడీ బలం ఎనిమిదికి పడిపోయింది. ఒడిశాలో అధికారంలోకి వచి్చన బీజేపీ ఆ స్థానాన్ని దక్కించుకోనుంది. -
ఒడిశాలో భారీ వర్షాలు.. 18 గ్రామాలకు సంబంధాలు కట్
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే కొండచరియలు విరిగిపడటంతో మల్కన్‌గిరి జిల్లాలోని 18 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ వివరాలను అధికారులు మీడియాకు తెలియజేశారు.మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ బ్లాక్ పరిధిలోని బయపదర్ ఘాట్ రోడ్డులోని తుంబపదర్ గ్రామ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మల్కన్‌గిరి, కోరాపుట్‌లోని లమటాపుట్, నందాపూర్ ప్రాంతా నుంచి వాహనాల రాకపోకలపై ప్రభావం పడింది. ఉత్తర ఒడిశాలోని గంగా మైదానాల్లో అల్పపీడనం ప్రభావంతో జూలై 31 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బులెటిన్‌లో పేర్కొంది. ఆదివారం(నేడు) మల్కన్‌గిరి, కోరాపుట్, నబరంగ్‌పూర్, బోలంగీర్, నువాపాడా, సోన్పూర్, ఝర్సుగూడ, సుందర్ఘర్, సంబల్పూర్, కియోంజర్, అంగుల్, డియోగర్, కలహండి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ కార్యాలయం తెలిపింది.ఆదివారం బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. బార్గఢ్, జార్సుగూడ, సుందర్ఘర్, నుపాడా, నబరంగ్‌పూర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
ఎన్నికల ఎఫెక్ట్: ఒడిశా పీసీసీ రద్దు
భువనేశ్వర్: లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫలితాలు వైఫల్యంపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ( ఒడిశా పీసీసీ)ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రద్దుచేశారు. ఒడిశా అధ్యక్షుడితో సహా మొత్తం పీసీసీని రద్దు చేయాలన్న ప్రతిపాదనను ప్రెసెడెంట్ ఖర్గే ఆదివారం ఆమోదం తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు, పీసీసీ, ఆఫీసు బేరర్లు, ఎగ్జిక్యూటీవ్ కమిటీ, జిల్లా, బ్లాక్, మండల్ కాంగ్రెస్ కమిటి, ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు, పలు విభాగాలు, సెల్స్‌ను రద్దుచేసినట్లు అధ్యక్షుడు ఖర్గే ఒక ప్రకటనలో వెల్లడించారు.తిరిగి పీసీసీని ఎంపిక చేసే వరకు డీసీసీ ప్రెసిడెంట్లను పీసీపీ ప్రెసిండెంట్లుగా నియమిస్తున్నట్లు తెలిపారు. రద్దు అయిన ఒడిశా పీసీసీకి ఇప్పటివరకు ప్రెసిడెంట్‌గా సరత్ పాట్నాయన్ పనిచేశారు.ఒడిశాలో మొత్తం 21 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కేవలం 1 స్థానంలో మాత్రమే గెలుపొంది. బీజేపీ 20 స్థానాల్లో విజయం సాధించింది. ఇక.. బీజేడీ ఖాతా తెరవలేదు. పార్లమెంట్‌తో పాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మూడోస్థానాకి పరిమితమైంది. మొత్తం147 సీట్లు ఉన్న ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ కేవలం 14 సీట్లకే పరిమితమైంది. ఇక్కడ బీజేడీ ప్రభుత్వం దించేసిన బీజేపీ 78 స్థానాల్లో విజయం సాధించింది. బీజేడీ 51 స్థానాలను గెలుచుకొని రెండో స్థానంతో నిలిచింది. -
నవీన్ పట్నాయక్ పొలిటికల్ ప్లాన్.. ‘షాడో కేబినెట్’ సభ్యులు వీరే..
భువనేశ్వర్: దేశంలో ఒడిశా రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఒడిశాలో తొలిసారి ఏర్పాటైన బీజేపీ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సరికొత్తగా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలతో ‘షాడో కేబినెట్’ను ఏర్పాటు చేశారు. దీంతో ఒడిశా రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.కాగా, ఒడిశాలో సీఎం మోహన్ మాంఝీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు నవీన్ పట్నాయక్ షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు తాజాగా పలు శాఖలను కేటాయించారు. షాడో మంత్రివర్గానికి సంబంధించిన ఒక ఉత్తర్వును బీజేడీ జారీ చేసింది. దీంతో, మాజీ ఆర్థిక మంత్రి ప్రసన్న ఆచార్యకు ఆర్థిక శాఖ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పరిపాలన, ప్రజా ఫిర్యాదులను ప్రతాప్ దేబ్, మాజీ మంత్రి నిరంజన్ పూజారి గృహ, ఆహారం, వినియోగదారుల సంక్షేమ శాఖలను పర్యవేక్షిస్తారు. ବିରୋଧୀ ଦଳ ହେଉଛି ଜନସାଧାରଣଙ୍କ ସ୍ୱାର୍ଥର ଜାଗ୍ରତ ପ୍ରହରୀ। ବିଜୁ ଜନତା ଦଳ ବିରୋଧୀ ଦଳ ଭାବେ ରାଜ୍ୟ ସରକାରଙ୍କ ବିଭିନ୍ନ ବିଭାଗର କାର୍ଯ୍ୟ କଳାପ ଉପରେ ତୀକ୍ଷ୍ଣ ନଜର ରଖିବ। ଏଥିପାଇଁ ବିରୋଧୀ ଦଳ ନେତା ଶ୍ରୀ @Naveen_Odisha ବିଜୁ ଜନତା ଦଳର ୫୦ ଜଣ ନିର୍ବାଚିତ ସଦସ୍ୟଙ୍କୁ ନିମ୍ନ ସୂଚୀ ଅନୁଯାୟୀ ଦାୟିତ୍ୱ ପ୍ରଦାନ କରିଛନ୍ତି।… pic.twitter.com/uCnpIuxMj7— Biju Janata Dal (@bjd_odisha) July 17, 2024 ఇక, ఒడిశాలో జూలై 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని ఆయా శాఖల నిర్ణయాలు, విధానాలను నిశితంగా పరిశీలించే బాధ్యతను ఈ షాడో మంత్రివర్గానికి అప్పగించారు. దీంతో అసెంబ్లీలో చర్చ సమయంలో ఆయా శాఖలను పర్యవేక్షించే బీజేడీ ఎమ్మెల్యేలు సంబంధిత మంత్రులను ఎదుర్కొంటారు. వారిని ప్రశ్నలు అడగడానికి, వారి అడిగే ప్రశ్నలకు సమాధానాలను కూడా షాడో కేబినెట్ ఇస్తుంది. అయితే, నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేసిన ఈ షాడో కేబినెట్ ప్రభుత్వ అధికారిక సంస్థ. కేవలం బీజేడీకి చెందిన తాత్కాలిక వ్యవస్థ వంటిది.ఇదిలా ఉండగా.. మన దేశంలో ఇలా షాడో కేబినెట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అయితే.. బ్రిటన్, కెనడా, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ప్రతిపక్ష పార్టీలకు షాడో కేబినెట్ మాదిరిగానే కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక, కెనడాలో షాడో మంత్రి పదవులు కలిగిన వారిని ‘ప్రతిపక్ష విమర్శకుడు’గా వ్యవహరిస్తారు. మరోవైపు.. బ్రిటన్‌లోని షాడో క్యాబినెట్లో ఎక్కువ మంది సీనియర్ ప్రతిపక్ష సభ్యులు ఉంటారు. -
నేడు మరోసారి తెరుచుకోనున్న పూరీ రత్నభాండాగారం గది
-
పూరీ రత్నభాండాగరం ఇవాళ మళ్లీ ఓపెన్ చేయనున్న అధికారులు
-
46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయ వజ్రాభరణాల నిధి గది. మొదటిరోజు గది పరిశీలన. త్వరలో వజ్రాభరణాల లెక్కింపు మొదలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రత్న భాండాగారం రహస్యం ఇదే
-
పూరీ: రత్నభాండాగారంలో ఆభరణాల లెక్కింపు నిలిపివేత
👉 పూరీ రత్నభాండగారంలో ఆభరణాల లెక్కింపును అధికారులు నిలిపివేశారు.👉 ఇవాళ చీకటి పడటంతో లెక్కింపును నిలిపివేసినట్లు తెలిపారు. 👉 రేపు (సోమవారం) తిరిగి ఆభరణాలను అధికారులు లెక్కించనున్నారు. 👉 ‘‘ రత్నభాండాగారం రహస్య గది తాళాలు పగలగొట్టి లోపలి వెళ్లాము. బయటి రత్నభాండాగారంలోని ఆభరణాలను మార్చేశాము. లోపలి భాండాగారంలోని ఆభరణాలను మార్చుతున్నామని అధికారులు తెలిపారు. ఆభరణాల లెక్కింపుకు ఇవాళ సమయం మించిపోయింది. ఆభరణాల లెక్కింపు ప్రక్రియను రేపు(సోమవారం) చేపట్టాలని నిర్ణయించుకున్నాం’’ అనిశ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (SJTA)చీఫ్ అరబింద పాధీ మీడియాకు తెలిపారు. Puri, Odisha: The Ratna Bhandar of the Shri Jagannath Temple opened today.Sri Jagannath Temple Administration (SJTA) Chief Arabinda Padhee says, "All the ornaments of outer Ratna Bhandar have been shifted; the inner Ratna Bhandar was opened after breaking the locks. The… pic.twitter.com/R0TandjiG3— ANI (@ANI) July 14, 2024 👉 ఈసారి లెక్కింపు తర్వాతే ఆభరణాల విలువపై అంచనాకు వచ్చే అవకాశం ఉంది. సంపదను మరోచోటుకు తరలించి పటిష్టమైన భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది. వివరాల నమోదును డిజిటలైజేషన్ చేస్తామని ఒడిశా ప్రభుత్వంలో చెబుతోంది.👉రత్న భాండాగారం రహస్య గది లోపలికి 11 మంది కమిటీ సభ్యులు వెళ్లారు. రత్న భాండాగారంలో ఉన్న ఆభరణాలను పెట్టెల్లో కమిటీ సభ్యులు భద్రపర్చనున్నారు.👉 బంగారం నాణ్యతను ఆర్బీఐ ప్రతినిధులు పరిశీలించనున్నారు. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామని ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.👉 పూరీ జగన్నాథ్ ఆలయ రత్న భాండాగారం రహస్య గదిని అధికారులు తెరిచారు. ఈ మేరకు రహస్య గది తలుపులు తెరిచినట్లు సీఎంవో అధికారికంగా ప్రకటించింది. 👉 46 ఏళ్ల రత్న భాండాగారం రహస్య గదిని అధికారులు ఓపెన్ చేశారు. చివరగా 1978లో రహస్య గదిని అధికారులు తెరిచారు. 👉కాగా, ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. ఈనెల 19వ తేదీ వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది?అనే విషయాలు తెలియాల్సి ఉంది.👉ఇక, రత్న భాండాగారం తెరిచిన సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందుగానే ఏర్పాట్లు చేశారు. రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియంతా డిజిటలైజేషన్ చేయనున్నారు. 👉 మరోవైపు.. నిధిని తెరిచి అందులోని వస్తువులను తరలించేందుకు ఆరు పెట్టెలను అధికారులు సిద్ధం చేశారు. #WATCH | Odisha | Ratna Bhandar of Sri Jagannath Temple in Puri re-opened today after 46 years.Visuals from outside Shri Jagannath Temple. pic.twitter.com/BzK3tfJgcA— ANI (@ANI) July 14, 2024 👉 ఇక, అంతకుముందు పూరీ జగన్నాథ్ ఆలయ రత్నభాండాగరాన్ని తెరిచే ప్రయత్నాల్లో తాళం చెవి తెరిచే ప్రక్రియలో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. కానీ, కాసేపటికే విజయవంతంగా తెరిచారు. 👉 నిధి ఉన్న గదికి చేరుకున్న ఆలయ కమిటీ సభ్యులు 👉జగన్నాథుని సేవలకు అంతరాయం కలగకుండా తెరిచేందుకు ఏర్పాట్లు చేశారు.👉రత్నభాండాగరాన్ని తెరించే ప్రారంభమైన ప్రయత్నాలు👉పాములుంటాయన్న భయంతో స్నేక్ క్యాచర్స్‌ను సిద్ధంగా ఉంచిన అధికారులు👉ఉదయం 11 గంటల నుంచే భక్తులకు దర్శనాలు నిలిపివేసిన అధికారులు👉అంతరాయలంలోకి ప్రత్యేక కమిటీ ఛైర్మన్ విశ్వనాథ్ రథ్, కమిటీ సభ్యులు 👉ఇప్పటికే ఆలయంలోకి 15 కమిటీ సభ్యులు,నిపుణులు, ఆలయ అర్చుకులు ప్రవేశించారు.👉గజపతి రాజుల చేతిలో ఉన్న ఒకతాళం, జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలోని ఖజానా శాఖ వద్ద ఒక తాళం, ఆలయం ప్రధాన అధికారి వద్ద ఉన్న మూడో తాళం.. ఈ మూడు తాళాలు ఒకేసారి తెరుచుకోవాలి. అయితే అందులో ఒకతాళం లేకపోవడం, ఆతాళానికి సంబంధించిన తలుపుల్ని బద్దలు కొట్టేందుకు ఆయల కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. పూరి జగన్నాథ్ ఆయలయంలో ట్రస్ట్ బోర్డ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం రత్నభాంఢాగారాన్ని మధ్యాహ్నం 1.28గంటలకు తెరవాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. 46 ఏళ్ల తర్వాత రత్నభాండాగారాన్ని ఆలయ అధికారులు, ట్రస్ట్ కమిటీలు,నిపుణుల పర్యవేక్షణలో తెరుచ్చుకోనున్నాయి.ఇందులో భాగంగా ఎన్ఆర్ఆర్ఎఫ్ బృందాలు పూరీ ఆలయానికి చేరుకున్నాయి. భాండాగారం గది తలుపులు తెరుచుకోకపోతే భారీ సెర్చ్ లైట్స్, ఎక్విప్మెంట్ తీసుకొచ్చాయి. -
పూరి రత్న భాండాగారంలో విష సర్పాలు !
-
మరికొద్ది గంటల్లో తెరుచుకోనున్న పూరీ రత్నభాండాగారం
దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది రేపే తెరుచుకోనుంది.ఈ రత్న భాండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తోంది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని.. వీటి విలువ వెలకట్టలేనిదని అంచనాలున్నాయి.ఆదివారం పూరీలోని ప్రముఖ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని తెరవనున్నారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. అక్కడ ఉంచిన విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు.46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా.. సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. అయితే.. పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భండారంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సేవకుడు హరేకృష్ణ మహాపాత్ర అంటున్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు కూడా.👉పూరీ జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. 👉అయితే.. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. అయితే.. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో.. ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.👉భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రబీంద్ర నారాయణ్ మిశ్రా వెల్లడించారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటిని పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్‌లకు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ.. ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్కకట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు.👉ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే.. హైకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ రఘుబీర్ దాస్ కమిషన్ బృందం భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న పరిశీలనకు వెళ్లింది. అయితే, రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందం.. పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. 👉జగన్నాథుని రత్న భాండాగారాన్ని గురించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి పూరీ కలెక్టర్ చార్లెస్ గోమ్స్ నివేదికలో వచ్చింది. ఆ సమయంలో రత్న భాండాగారంలో రత్నాలు పొదిగిన బంగారు, వెండి ఆభరణాలు, 128 బంగారు నాణేలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1333 రకాల వస్త్రాలు లభించాయి. 👉కాగా, 1978లో జగన్నాథ ఆలయంలోని రత్నాల దుకాణాన్ని తెరిచినప్పుడు అక్కడ 454 బంగారు ఆభరణాలు, 293 వెండి వస్తువులు లభించాయి. 1982 – 1985 సంవత్సరాలలో రత్న భండాగారం తెరచుకుంది. కానీ అప్పటికి విషయాలు లెక్కించలేదు.👉జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 2021లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా మాట్లాడుతూ.. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం, 12,831 భరీల బంగారం (ఒక భరీ సుమారు 12 గ్రాములతో సమానం), 22,153 భరీల వెండితోపాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. ఎంతో విలువైన రాళ్లతో కూడిన 22,153 భరీల వెండి కూడా నిపుణులు గుర్తించారు. వీటితోపాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి. అయితే, పలు కారణాల వల్ల 14 బంగారు, వెండి ఆభరణాలను కొలవలేకపోయినందున వాటిని ఈ జాబితాలో పొందుపరచలేదని చెప్పారు.👉రఘుబీర్ కమిటీ నివేదికపై జులై 10లోగా స్పందన తెలియజేయాలంటూ ఒడిశా హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాళాలు ఎలా మాయమయ్యాయని.. డూప్లికేట్ తాళాలతో వాటిని తెరవాల్సిందేనని విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. రాజకీయం చేయొద్దని బీజేడీ కోరినా.. బీజేపీ, కాంగ్రెస్‌లు వెనక్కి తగ్గలేదు. అయితే ఈలోపే ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీ.. ఎన్నికల హామీ మేరకు రత్న భాండాగారం తెరిపించేందుకు సిద్ధమైంది.👉ఒడిశా పూరీ జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారాన్ని తెరిపించి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రథ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో.. ఈ నెల 14న(ఆదివారం) రత్న భాండాగారం రహస్య గదిని తిరిగి తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి ఆ కమిటీ సిఫార్సు చేసింది.👉జగన్నాథ ఆలయంలోని రత్నాల భాండాగారాన్ని తెరిచే బాధ్యతను బిశ్వనాథ్ కమిటీనే తీసుకుంది. ఆయన నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీకి ఈ బాధ్యతను అప్పజెప్పారు. ఈ కమిటీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఉంచిన వస్తువులను లెక్కించి వాటిపై నివేదికను రూపొందిస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో.. రత్న భాండాగారం తెరిచి అక్కడున్న వస్తువులను లెక్కిస్తారని తెలుస్తోంది. -
గవర్నర్ కొడుకు ఓవరాక్షన్.. లగ్జరీ కారు కోసం రాజ్‌భవన్ అధికారిపై దాడి
భువనేశ్వర్: ఒడిశా రాజ్‌భవన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గవర్నర్ రఘుబర్ దాస్ కుమారుడు రాజ్‌భవన్‌లోకి ఓ అధికారిపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సదురు అధికారి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.ఈ ఘటనపై బాధితుడి భార్య సయోజ్ తెలిపిన వివరాల ప్రకారం.. బైకుంత్ ప్రధాన్(47) ఒడిశా రాజ్‌భవన్‌లోని గవర్నర్ సెక్రటేరియట్, డొమెస్టిక్ సెక్షన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. కాగా, బైకుంత్ ప్రధాన్ ఏడో తేదీన గవర్నర్ రఘుబర్ దాస్ కుమారుడు లలిత్ కుమార్‌ను పూరీ రైల్వే స్టేషన్ నుంచి రాజ్‌భవన్‌కు తీసుకురావాల్సి ఉంది. అయితే, అదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో రాజ్‌భవన్‌లో సన్నాహకాలు జరుగుతున్నాయి. #WATCH | Sayoj, wife of Baikuntha Pradhan, who works in Odisha's Raj Bhavan, has accused the Governor's son and others of beating her husband.She said, "...On the night of June 7, the Governor's son called my husband to his room and beat him badly. He came out to save himself,… pic.twitter.com/PmWmVs3hqh— ANI (@ANI) July 13, 2024ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో ఉన్న లగ్జరీ కార్లు అన్నీ బయటకు వెళ్లిపోవడంతో అందుబాటులో ఉన్న మారుతీ సుజుకీ కారును తీసుకుని బైకుంత్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అనంతరం, కారు ఎక్కిన లలిత్.. బైకుంత్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మారుతీ కారును తీసుకురావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో వారు రాజ్‌భవన్‌కు చేరుకోగానే లలిత్ కుమార్, అతడి స్నేహితులు(ఐదుగురు) బైకుంత్పై దాడి చేశారు. అతడిని తీవ్రంగా గాయపరిచారు. ఇక, ఈ ఘటనపై రాజ్‌భవన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తాము పోలీసులను ఆశ్రయించినట్టు ఆమె తెలిపారు. సయోజ్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పూరీ పోలీసులు చెప్పారు. -
4 దశాబ్దాల తరువాత.. రేపే ఓపెన్
-
ఒడిశాలో బస్సు ప్రమాదం.. హైదరాబాద్ టూరిస్టులు మృతి
సాక్షి,హైదరాబాద్: తీర్థ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక నుంచి 23 మంది కలిసి ఒక ట్రావెల్ బస్సులో తీర్థయాత్రకు వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు ఒడిశాలోని బరంపురం సమీపంలో ప్రమాదానికి గురైంది. హైవేపై బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ఇద్దరు యాత్రికులు మృతి చెందారు. మృతులను ఉదయ్‌సింగ్,క్రాంతిభాయ్, ఉప్పలయ్యగా గుర్తించారు. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మొత్తం 20 మంది గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నైనీ గనులకు ఒడిశా సర్కారు ఓకే
సాక్షి, హైదరాబాద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైనీ బొగ్గు గనిలో బొగ్గు ఉత్పత్తికి పూర్తిగా సహకరిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాంజీ స్పష్టం చేశారు. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుకు హామీ ఇచ్చారు. దశాబ్దం కిందట ఆ బొగ్గు గనిని సింగరేణికి కేటాయించినా అక్కడ ఒక్క తట్ట బొగ్గు కూడా ఉత్పత్తి చేయ లేదు.ఇప్పుడు బొగ్గు తవ్వకాలకు అన్ని రకాల అనుమతులు వచి్చన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ప్రభు త్వ సహకారాన్ని కోరేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో మాంజీని కలిసి విజ్ఞప్తి చేశారు. బొగ్గు గని ఆవశ్యకతను తెలంగాణ డిప్యూటీ సీఎం వివరించారు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన లేఖను ఒడిశా సీఎంకు అందజేశారు. స్పందించిన ఒడిశా సీఎం మోహన్‌చరణ్ మాంజీ.. భూముల బదలాయింపు, విద్యుత్, రహదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తమ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ సమస్య పరిష్కారమైతే తవ్వకాలు: భట్టి నైనీ బ్లాకులో గనుల తవ్వకానికి పారిశ్రామిక, పర్యావరణ అనుమతులు సైతం వచ్చాయని డిప్యూ టీ సీఎం భట్టి ఈ సందర్భంగా తెలిపారు. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయించాల్సిన అంశం పెండింగ్‌లో ఉందని, ఈ సమస్య పరిష్కారమైన వెంటనే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందని వివరించారు. నైనీ బ్లాక్‌లో తవ్వకాలు చేపట్టడం ద్వారా 1,200మందికి ఉపాధితో పాటు పన్నుల రూపంలో రూ.600 కోట్ల వరకు ఒడిశాకు రాయల్టీ రూపంలో ఆదాయం సమకూరుతుందని మాంజీ దృష్టికి తెచ్చారు.ప్రతీ ఏటా ఇక్కడ నుంచి పది మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. బొగ్గు గనుల వద్దనే 2 ్ఠ800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను సింగరేణి ఏర్పాటు చేస్తుందని భట్టి ప్రకటించారు. సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఇంధన శాఖ ఓఎస్డీ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
జగన్నాథ రహస్యం!
లక్షలాది భక్తజనం పాల్గొనే విశ్వవిఖ్యాత రథయాత్రతో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పూరీ జగన్నాథుని ఆలయం మరోమారు పతాక శీర్షికలకెక్కింది. రాజుల నుంచి మొదలుకుని సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథస్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. ఆదివారం ఆలయం దిగువన ఉన్న ఆభరణాల నిల్వ గది(రత్న భండార్)ని దాదాపు 40 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు. విషసర్పాలు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో అత్యయిక ఔషధాలను సిద్ధంచేసి వైద్యులు, పాములు పట్టే వాళ్లను వెంటబెట్టుకునిమరీ పురావస్తు, ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్లబోతున్నారు. జగన్నాథుడికి చెందిన వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాల బరువును తూచి, వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు. చాన్నాళ్ల క్రితం గది తాళం చెవులు పోగొట్టి ఒడిశాలోని బిజూజనతాదళ్ సర్కార్ ఆలయ సంపద సంరక్షణలో విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఎన్నికలవేళ ఆరోపణలు గుప్పించడంతో గది తలుపులు తెరచి సంపదను సరిచూడాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. అయితే గది తెరవడంపై శనివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శుక్రవారం చెప్పారు.180 రకాల ఆభరణాలు1978లో గదిని తెరచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టింది. గదిలో 180 రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు సమాచారం. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కోటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలూ ఉన్నాయి. ‘‘ 1978లో సంపద లెక్కించారు. అయితే జీర్ణావస్థకు చేరిన కొన్ని ఆభరణాల రిపేర్ పనుల కోసం 1985 జూలై 14వ తేదీన గది తెరిచారు. అప్పుడు నేనూ వెళ్లా. 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 15 చెక్కపెట్టెల్లో ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచారు. వెలకట్టలేని ఆభరణాలతోపాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు గదిలో దాచారు. పెద్ద సింహాసనం, ఉత్తరభారత భక్తులు జగన్నాథ, బలభద్రులకు సమర్పించిన అరటిపువ్వు ఆకృతి చెవిదిద్దులు ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడున్నాయి. తర్వాత గది తలుపులు మూసి రెండు రకాల తాళాలు వేసి సీల్‌వేశారు. తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుంచి వచ్చిన కలెక్టర్‌కు అందజేశాం’ అని ఆనాటి ఆలయ నిర్వహణ అధికారి రవీంద్ర నారాయణ మిశ్రా రెండేళ్ల క్రితం ఒక టీవీచానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. 12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు, యుద్ధంలో గెల్చుకున్న విలువైన సొత్తునూ రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది.2018లో మరోసారి ప్రయత్నించి..పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్ 4వ తేదీన 16 మంది సభ్యుల భారత పురావస్తుశాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది. అయితే తాళం చెవి అదృశ్యమయిందన్న వార్తల నడుమ వెనుతిరిగింది. అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లు, పైకప్పు పెచ్చులు ఊడినట్లు నిర్ధారించుకున్నారు. ఈ తతంగం అంతా 40 నిమిషాల్లో ముగిసింది. చీకటిగదిని మళ్లీ 40 ఏళ్ల తర్వాత తెరుస్తున్న నేపథ్యంలో ఈసారైనా అన్ని ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలను సరిచూసి శిథిల గదికి బదులు నూతన గదిలో సురక్షితంగా దాచాలని సగటు పూరీ జగన్నాథుని భక్తుడు కోరుకుంటున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ సంచలన నిర్ణయం..
-
46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ భాండాగారం
భువనేశ్వర్: ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత శ్రీ జగన్నాథుని రత్న భాండాగారం తెలుస్తామని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అన్నారు. పూరీ శ్రీజగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం జూలై 14న తెరవాలని ఆయన ఆధ్వర్యంలోని 16 మంది సభ్యుల తనిఖీ పర్యవేక్షక కమిటీ మంగళవారం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. 46 ఏళ్ల తర్వాత భాండాగారంలో భద్రపరిచిన ఆభరణాలతో సహా విలువైన వస్తువుల వివరాలతో జాబితా రూపకల్పన కోసం పర్యవేక్షించేందుకు ఒడిశా హైకోర్టు విరామ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి కమిటీ రెండో సమావేశంలో రత్న భండార్‌ను తెరవడంపై నిర్ణయం తీసుకున్నారు. శ్రీ మందిరం పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి తనిఖీ పర్యవేక్షక కమిటీ ప్రతిపాదనపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ఏకగ్రీవ తీర్మానం జులై 14న రత్న భాండాగారం లోపలి గది తాళం తెరవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినందుకు విస్తృ్తతంగా చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం మరమ్మతు పనులు, అమూల్య రత్న సంపద మరియు విలువైన వస్తువుల లెక్కింపు రెండింటికీ ఎస్వోపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రతిపాదించినట్లు తెలిపారు. ఉన్న తాళం చెవితో రత్న భాండాగారం తాళం తెరవలేకపోతే పగులగొట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా పూరీ జిల్లా ఖజానాలో అందుబాటులో ఉన్న రత్న భాండాగారం తాళం చెవిని ఉన్నత స్థాయి కమిటీ సమావేశానికి ముందు సమర్పించాల్సిందిగా శ్రీ జగన్నాథ ఆలయ ప్రధాన పాలన అధికారి (సీఏవో)ని అభ్యర్థించారు. రత్న భాండాగారం తెరిచే సమయంలో తోబుట్టువులతో శ్రీజగన్నాథుని రత్న వేదికపై దర్శించుకోవడంలో భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నారు. అలాగే తమ వంతు చర్యలు చేపట్టేందుకు భక్తుల సహకారం కోరినట్లు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. మరమ్మతులు పూర్తి చేస్తాం: మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ రథయాత్ర తర్వాత దేవతలు రత్న సింహాసనంకు తిరిగి వచ్చేలోపు ఖచ్చితంగా మరమ్మతు పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ అన్నారు. కమిటీ నిర్ణయించిన రోజునే రత్న భాండాగారం తెరిచి విలువైన వస్తువుల లెక్కింపు, తూకం మొదలవుతుందని తెలిపారు. కమిటీ ఎస్ఓపీని ప్రభుత్వం పరిశీలించి తదనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రత్న భాండాగారం తెరిచే సమయంలో దేవస్థానంలో దేవుళ్ల దైనందిన కార్యకలాపాలకు ఏమాత్రం అంతరాయం లేకుండా చూడాల్సి ఉందన్నారు. రత్న భాండాగారం సమగ్ర వివరాలు డిజిటల్ డాక్యుమెంట్ చేయబడుతుందన్నారు. అందుబాటులో ఉన్న తాళం చెవితో తాళం తెరవకుంటే, మేజి్రస్టేట్ సమక్షంలో పగలగొడతామని స్పష్టం చేశారు. ఇకపై రథయాత్రలో ప్రతి సంవత్సరం గర్భ గృహ, రత్న భాండాగారం మరమ్మతులు చేయనున్నట్లు వెల్లడించారు. రంగంలోకి ఏఎస్ఐ బృందం మరోవైపు శ్రీ మందిరం వార్షిక నిర్వహణ కార్యకలాపాలు పురస్కరించుకుని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) సాంకేతిక కమిటీ పరిశీలన నిమిత్తం ఆలయానికి చేరుకుంది. నిర్వహణ కార్యకలాపాల విధివిధానాలను అనుబంధ కమిటీ ఖరారు చేయడంతో ప్రత్యక్షంగా రంగంలోకి దిగేందుకు సన్నద్ధత ప్రకటించింది. గర్భగుడి, నాట్య మండపం, జగ్మోహన్, రత్న సింహాసనం మరమ్మతుల పనులను ఏఎస్ఐ సాంకేతిక నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుంది. -
5 దశాబ్దాల తర్వాత తెరుచుకోనున్న రత్న బండార్
-
ఒడిశా జగన్నాథుడి రథయాత్రలో అపశృతి
ఒడిశా జగన్నాథుడి రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథం లాగుతుండగా ఒక్కోసారిగా తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం పూరీ శంఖారాచార్య స్వామి నిశ్చలనానంద సరస్వతిలు జగన్నాథుడిని,దేవీ శుభద్రను సందర్శించుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5.20 గంటలకు రథయాత్ర ప్రారంభమైంది. అయితే పూరీలోని గ్రాండ్ రోడ్ బారా దండాలో సంప్రదాయబద్ధంగా బలభద్ర స్వామి రథాన్ని లాగుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.#WATCH | Odisha | Devotees throng in large numbers to witness the two-day Lord Jagannath Yatra that begins today in Puri. pic.twitter.com/Z65j3iM2H1— ANI (@ANI) July 7, 2024 -
పూరీ జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధం.. భారీగా తరలివచ్చిన భక్తులు
Live Updates..🙏జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్.🙏హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.🙏ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం అందరిది.. సర్వమతాలకు స్వేచ్ఛ, అవకాశాలను ఇస్తుంది. మా ప్రభుత్వం మత సామరస్యాన్ని పాటిస్తుంది. ఇస్కాన్ సంస్థ ప్రార్ధనలతో రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా. మానవ సేవే మాధవ సేవ అనే సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు కూడా పాల్గొన్నారు. 🙏 నేడు ఒడిశాలోని పూరీ జగన్నాథుడి విశ్వప్రసిద్ద రథయాత్ర జరుగనుంది. ఈ వేడుకలను చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పూరీ చేరుకున్నారు. రథయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. #WATCH | Odisha: Two-day Lord Jagannath Rath Yatra in Puri to commence today. Along with lakhs of devotees, President Droupadi Murmu will also attend the annual festival. pic.twitter.com/7Q9WYQCJw5— ANI (@ANI) July 7, 2024 🙏ఇంత వరకు భారత రాష్ట్రపతులు ఎవరూ పూరీ రథయాత్రలో పాల్గొనలేదు. తొలిసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు. ఆమె గవర్నర్ రఘుబర్‌దాస్‌తో కలిసి సుభద్రమ్మ రథం లాగుతారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. రెండురోజుల రథయాత్రలో 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకొని పూరీ పట్టణానికి మూడంచెల భద్రత కల్పించారు. #WATCH | Odisha: Security around Lord Jagannath temple in Puri increased ahead of the Rath Yatra which will commence today. pic.twitter.com/ExMFCNfAuu— ANI (@ANI) July 7, 2024 🙏కాగా, నేడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా వెళ్లి పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. గర్భగుడిలోని దివ్య(దారు) విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై మూడు కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి. #WATCH | Bhubaneswar: Odisha-based miniature artist L Eswar Rao crafts an eco-friendly chariot in connection with the Jagannath Puri Rath Yatra. (06.07) pic.twitter.com/Hgpxl8Eym2— ANI (@ANI) July 7, 2024 🙏ఇక, ఈసారి రథయాత్రకు ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకేరోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. మూడు వేడుకలు ఆదివారం ఉండడంతో జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన్ రథాలు ఆదివారం సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకొనే పరిస్థితి లేదు. #WATCH | Ahmedabad, Gujarat: Union Home Minister Amit Shah along with his wife Sonal Shah at Jagannath Temple. pic.twitter.com/FQ6FeFytyz— ANI (@ANI) July 6, 2024 🙏మరోవైపు.. పూరీ రథయాత్ర నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని జగన్నాథుని ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. గుజరాత్‌లోని పూరీ ఆలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఐదుగురు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్
చింతపల్లి రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న 759 కిలోల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు స్థానిక ఏఎస్పీ ప్రతాప్‌శివకిశోర్ తెలిపారు. ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో గంజాయి లభ్యం కాకపోవడంతో ధారకొండ పంచాయతీ గంగవరం గ్రామానికి చెందిన వండలం బాలు బద్దర్ తనకు పరిచయం ఉన్న ఒడిశాలోని చిత్రకొండ బ్లాక్ బరడబందకు చెందిన చేపల వ్యాపారి లింగుఖిలా (బాబూరావు)ను ఆశ్రయించాడు. అతని ద్వారా 759 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి రెండు బొలోరా వాహనాల్లో గూడెం, చింతపల్లి మీదుగా తాళ్లపాలెం చేర్చేందుకు లింగుఖిలాతో రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు వ్యాన్లలో గంజాయి తీసుకొస్తుండగా గూడెం కొత్తవీధిలోని సంస్థ కాలనీ వద్ద సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ అప్పలసూరి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వ్యాన్లలో ఉన్న బాలుబద్దర్‌తోపాటు రింతాడ పంచాయతీ కుమ్మరివీధికి చెందిన పాంగి గోవర్దన్, మాలిగుడకు చెందిన కొర్రలైకోన్ (లక్ష్మణ్), ఊబలపాలెంకు చెందిన కిల్లో శంకర్రావు, చింతపల్లి మండలం కడశిల్పకి చెందిన మైనర్ (17)ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.38 లక్షల విలువైన 759 కిలోల గంజాయి, రెండు వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, రూ.16,900 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు లింగుఖిలా (బాబూరావు) కోసం గాలిస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు. -
ఇక బీజేపీకి మద్దతిచ్చేది లేదు.. ప్రతిపక్షపాత్రే: బీజేడీ
భువనేశ్వర్: తమ పార్టీకి చెందిన తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలతో బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ సోమవారం సమావేశం నిర్వహించారు. జూన్ 27వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల సమయంలో.. శక్తివంతమైన, చురుకైన ప్రతిపక్షంగా రాజ్యసభలో వ్యవహరించాలని తమ పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి చెందిన సమస్యలపై కూడా సభలో కేంద్ర సర్కారును నిలదీయాలని చెప్పారు.నవీన్ పట్నాయక్‌తో జరిగిన సమావేశం అనంతరం రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ .. ఈసారి బీజేడీ ఎంపీలు కేవలం సమస్యలపై మాత్రమే మాట్లాడరని, ఒడిశా ప్రయోజనాలను కేంద్రం విస్మరిస్తే, అప్పుడు బీజేపీ సర్కారుపై తీవ్ర పోరాటం చేస్తామని చెప్పారు. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను లేవనెత్తనున్నట్లు చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ కనెక్టివిటీ బలహీనంగా ఉందని, బ్యాంకులకు చెందిన బ్రాంచీలు కూడా తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. బొగ్గు రాయాల్టీని కూడా సవరించాలన్న ఒడిశా డిమాండ్‌ను గత పదేళ్ల నుంచి కేంద్రం విస్మరించిందని, దీని వల్ల రాష్ట్ర ప్రజలకు సరైన వాటా దక్కకుండా పోతుందని మండిపడ్డారు. రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తారని, పార్లమెంటులో రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడాలని నవీన్ పట్నాయక్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.BJD President & Leader of Opposition @Naveen_Odisha today chaired a meeting of party's Rajya Sabha MPs at Naveen Nivas MPs have been directed to vociferously raise issues affecting the State's interests in the Upper HouseBJD now has 9 Rajya Sabha members pic.twitter.com/ssuoULUqnU— Soumyajit Pattnaik (@soumyajitt) June 24, 2024కాగా దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఒడిశాను పాలించిన బిజు జనతాదళ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చవిచూసిన విషయం తెలిసిందే. మొత్తం 147 స్థానాలకు గాను బీజేపీ 78 సీట్లతో అధికారం కైవసం చేసుకోగా.. బిజు జనతాదళ్ 51, కాంగ్రెస్ 14, స్వతంత్రులు 1, సీపీఎం 1 స్థానాలు చొప్పున గెలుచుకున్నాయి. దీంతో బీజేపీకి చెందిన ఆదివాసీ నేత మోహన్‌చరణ మాఝి ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అటు లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ ఒక్క సీటు కూడా గెలవలేదు. 21 స్థానాలకు గానూ బీజేపీ 20 చోట్ల విజయ కేతనం ఎగురవేయగా.. కాంగ్రెస్ ఒక చోట గెలుపొందింది. -
దటీజ్ నవీన్ పట్నాయక్
నవీన్ పట్నాయక్.. దేశంలో సుదీర్ఘకాలం(24 ఏళ్లపాటు) ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి. రాజకీయాల్లో మృదుస్వభావిగా ఆయనకంటూ ఓ ట్యాగ్‌లైన్ ఉంది. అలాగే.. మెచ్యూర్డ్ స్టేట్స్‌మన్‌గా వాజ్‌పేయి లాంటి రాజకీయ ఉద్ధండులతో ప్రశంసలు అందుకున్నారాయన. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోయినప్పటికీ.. ఒడిశాలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం నెలకొల్పుతూ మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారాయన.తాజాగా ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన రాకను గమనించి.. సీఎం మోహన్ మాఝి సహా ఎమ్మెల్యేలంతా లేచి నిలబడ్డారు. వాళ్లందరికీ నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్లబోయారు. ఆ సమయంలో కంటాబంజి ఎమ్మెల్యే లక్ష్మణ్ బాగ్ లేచి నిలబడి తనను తాను పరిచయం చేసుకున్నారు. అది చూసి.. ‘‘మీరేనా నన్ను ఓడించింది. మీకు అభినందనలు’’ అని నవీన్ అన్నారు. దీంతో అక్కడున్న వాళ్లంతా చిరునవ్వులు చిందించారు.Naveen Patnaik & CM Mohan Majhi greet each other in assembly. Beautiful Video pic.twitter.com/6BL21FAZP5— Times Algebra (@TimesAlgebraIND) June 18, 2024ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల(గంజాం జిల్లాలోని హింజలి, బొలంగీర్ జిల్లాలోని కంటాబంజి)నుంచి నవీన్ పట్నాయక్ పోటీ చేశారు. అయితే కంటాబంజిలో భాజపా అభ్యర్థి లక్ష్మణ్ బాగ్ చేతిలో ఓడిపోయారు. హింజలిలో గెలిచిన ఆయన మంగళవారం ప్రమాణస్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు. Naveen Patnaik’s dignity is a touchstone in political relationships. Here’s how he greeted the party that has all but wiped him out. Yes, they weren’t the kind of political enemies we’re accustomed too, but Naveen has been nothing but an image of grace. pic.twitter.com/VzYQKJ5WnS— Shiv Aroor (@ShivAroor) June 12, 2024 ఇదే కాదు.. సీఎంగా మోహన్ మాఝి ప్రమాణ స్వీకారానికి నవీన్ పట్నాయక్ హాజరై ఆశీర్వదించిన తీరు రాజకీయ శ్రేణుల్ని ఆశ్చర్యపరిచింది కూడా. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనేది ఒక మాట. అలాగే.. ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండాలో నవీన్‌ను చూసి నేర్చుకోవాలన్నది రాజకీయ విశ్లేషకుల మాట. -
తెరుచుకున్న ‘పూరీ’ ద్వారాలు.. తొలి హమీ నిలబెట్టుకున్న బీజేపీ
ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయాలనికి గల నాలుగు ద్వారాలు వేదమంత్రోచ్ఛారణల నడుమ నేటి (గురువారం) ఉదయం తెరుచుకున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన దరిమిలా జరిగిన క్యాబినెట్ భేటీలో తొలుత పూరి ఆలయ నాలుగు ద్వారాలు తెరవాలని నిర్ణయించారు. దీనిని సర్కారు వెంటనే అమలులోకి తెచ్చింది. నూతన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితోపాటు మంత్రులంతా పూరీ దేవాలయ నాలుగు ద్వారాలను తెరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు కూడా ప్రవేశం కల్పించారు. ప్రస్తుతం ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. 12 వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో నేటి వరకూ ఒక్క ద్వారం నుంచే భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.కరోనా మహమ్మారి వ్యాప్తి ముందునాటి వరకూ పూరీ ఆలయంలోని నాలుగు ద్వారాల నుంచి కూడా భక్తుల ప్రవేశానికి అనుమతి ఉండేది. కోవిడ్-19 విజృంభణ సమయంలో కేవలం ఒక్క ద్వారం నుంచే భక్తుల ప్రవేశానికి అనుమతి కల్పించారు. నాటి నుంచి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఆలయానికి గల మూడు ద్వారాలను తెరవలేదు.ఈ నేపధ్యంలో భక్తులకు ఏర్పడుతున్న ఇబ్బందులకు గమనించిన బీజేపీ.. పూరీ ఆలయంలోని నాలుగు ద్వారాలను తెరిపిస్తామని ఎన్నికలకు ముందు హామీనిచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీజేపీ ఈ హామీని నిలబెట్టుకుంది. బుధవారం జరిగిన తొలి క్యాబినెట్ భేటీలో పూరీ ఆలయానికి రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సీఎంతో పాటు మంత్రులంతా పూరీకి చేరుకున్నారు. #WATCH | Puri: Morning visuals from the Puri Jagannath Temple where all four gates are to be opened for devotees in the presence of CM Mohan Charan Majhi and all of the Ministers of Odisha.Odisha CM Mohan Charan Majhi along with Deputy Chief Ministers KV Singh Deo and Prabhati… pic.twitter.com/zyQFTKrG8x— ANI (@ANI) June 13, 2024 -
ఒడిశా సీఎంగా ‘మాఝీ’ ప్రమాణస్వీకారం
భువనేశ్వర్: ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ బుధవారం(జూన్ 12) సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఇతర ముఖ్యమంత్రులు హాజరయ్యారు.ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తన ప్రమాణస్వీకారానికి హాజరవ్వాల్సిందిగా మాజీ సీఎం నవీన్‌పట్నాయక్‌ను సీఎం మోహన్ చరణ్ ఆహ్వానించారు. బుధవారం ఉదయం స్వయంగా నవీన్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానాన్ని అందించారు.ఆహ్వానాన్ని మన్నించి నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఇటీవల లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిషాలో బీజేపీ 78 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. బిజుజనతాదల్ 51 సీట్లతో సరిపెట్టుకుని అధికారాన్ని కోల్పోయింది. -
ఒడిశాలో బీజేపీ సంచలన నిర్ణయం
-
ఒడిశాకు కొత్త సీఎం.. ఎవరీ మోహన్ చరణ్ మాఝీ?
భువనేశ్వర్ : ఒడిశాకు కాబోయే ముఖ్యమంత్రి? ఎవరనే ఉత్కంఠతకు బీజేపీ అధిష్టానం తెరదించింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని ఎంపిక చేసింది.ఇటీవల రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ రాష్ట్ర నాయకులు ధర్మేంద్ర ప్రధాన్, జోయల్ ఓరంలకు కేంద్ర నాయకత్వం కేబినెట్ పదవుల్ని కట్టబెట్టింది. దీంతో ఒడిశా కొత్త సీఎంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన,పార్టీ గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ ఎంపిక ఖరారైంది. మోహన్ చరణ్ మాఝీతో పాటు డిప్యూటీ సీఎంలగా కేవీ సింగ్ డియో,ప్రవతి పరిదాలకు అవకాశం కల్పించింది. కియోంఝర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాఝీ ప్రజా సేవ, సంస్థాగత నైపుణ్యాలు ముఖ్యమంత్రి పదవి వరించేలా చేశాయి.డిప్యూటీ సీఎంలుగాకేవీ సింగ్ డియో బోలంగీర్ నియోగజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా,బీజేపీ-బిజూ జనతాదళ్ కూటమి 2009 వరకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు.తీవ్ర కసరత్తుఇక 24ఏళ్ల తర్వాత ఒడిశా కొత్త ముఖ్యమంత్రి నియామకంపై కేంద్రం తీవ్ర కసరత్తు చేసేంది. సీఎం నియామకంపై కమలం అధిష్టానం పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్‌లను పంపింది. భువనేశ్వర్‌లోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి కీలక నేతలు, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జువల్ ఓరమ్ కూడా హాజరయ్యారు. -
ఒడిశా కొత్త సీఎంగా గిరిజన నేత మోహన్ మాఝీ
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెర దించుతూ బీజేపీ అధిష్ఠానం.. మోహన్ చరణ్ మాఝీని సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభా పక్షం మోహన్ చరణ్ మాఝీని సీఎంగా ఎన్నుకుంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ మాఝీకి బీజేపీ అధిష్టానం సీఎం పగ్గాలు అప్పగించింది. డిప్యూటీ సీఎంలుగా కనకవర్థన్ సింగ్ దేవ్, ప్రవతి పరిడా ఎన్నికయ్యారు. ఈ భేటీకి బీజేపీ అధిష్ఠానం తరఫున కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార బీజేడీ పరాజయం పాలైంది. 24 ఏళ్లుగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ప్రతిపక్షానికి పరిమితయ్యారు. ఒడిశా 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాల్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక బీజేడీ 51 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించగా, మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులకు దక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గాను బీజేపీ 20, కాంగ్రెస్ 1 గెలుచుకోవడంతో బీజేడీ ఘోర పరాజయం పాలైంది.రేపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం రేపు సాయంత్రం 5 గంటలకు ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుని విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు.అనంతరం సాయంత్రం 5 గంటలకు జనతా మైదాన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
24 ఏళ్ల తర్వాత.. ‘కౌన్ బనేగా ఒడిశా సీఎం?’
ఒడిశా కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఆయన అధికార నివాసం ఎక్కడా అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజూ జనతాదళ్ ఓటమి పాలైంది. దీంతో 24 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టనుంది. ఈ తరుణంలో కాబోయే సీఎం ఎవరు? ఆయన అధికారిక నివాసం ఎక్కడా అనే చర్చ మొదలుగా కాగా.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసే బాధ్యతల్ని బీజేపీ అధిష్టానం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించింది. సొంత ఇంటి నుంచే బాధ్యతలుమాజీ సీఎం నవీన్ పట్నాయక్ 24ఏళ్ల పదవీ పదవీకాలంలో తన వ్యక్తిగత ఇల్లు నవీన్ నివాస్ నుండి పనిచేశారు. పట్నాయక్ 2000లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వం కేటాయించిన ఇంటిలో కాకుండా తన సొంత ఇంటి నుంచే పని చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు పావు శతాబ్ద కాలం పాటు అన్ని అధికారిక, పరిపాలనా నిర్వహణ పనులను నవీన్ నివాస్ నుంచే నిర్వహించారు. ఆ భవనాన్ని నవీన్ పట్నాయక్ తండ్రి,మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ నిర్మించారు. 24 ఏళ్ల తర్వాత కొత్త ప్రభుత్వంతాజా ఎన్నికల ఫలితాలతో కొలువుతీరునున్న బీజేపీ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, అధికారిక నివాసం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి గ్రీవెన్స్ సెల్‌తో సహా అనేక ఖాళీ క్వార్టర్లను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. 78 స్థానాల్లో బీజేపీ విజయంఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార బీజేడీ పరాజయం పాలైంది. 24 ఏళ్లుగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ప్రతిపక్షానికి పరిమితయ్యారు. ఒడిశా 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాల్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక బీజేడీ 51 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించగా, మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులకు దక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గాను బీజేపీ 20, కాంగ్రెస్ 1 గెలుచుకోవడంతో బీజేడీ ఘోర పరాజయం పాలైంది.సీఎం రేసులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒడిశా కొత్త సీఎం ఎవరవుతారనే దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. బీజేపీ సీనియర్ నేత, కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేశ్ పుజారితో పాటు ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తున్నది.రేపు సాయంత్రమే ఒడిశా కొత్త సీఎం ప్రమాణ స్వీకారం రేపు సాయంత్రం 5 గంటలకు ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుని విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు.అనంతరం సాయంత్రం 5 గంటలకు జనతా మైదాన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.