ఒడిశా సీఎంకు ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ లేఖ
భువనేశ్వర్: తన వేతనం, అలవెన్సులను పేదల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని ఒడిశా మాజీ సీఎం, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం సీఎం మోహన్ చరణ్ మాఝీకి రాసిన లేఖలో తెలిపారు. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ప్రకారం..ప్రతిపక్ష నేత నెలవారీ వేతనం, అలవెన్సులు కలిపి రూ.3.62 లక్షలకు చేరాయి.
ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని నవీన్ పట్నాయక్ సీఎంను కోరారు. ఒడిశా ప్రజల ప్రేమ, అభిమానాలు తనకు చాలునన్నారు. కటక్‌లోని తమ పూర్వీకుల నివాసం ఆనంద్ భవన్‌ను కూడా 2015లోనే ప్రజల కోసం దానం చేసినట్లు చెప్పారు. తన తండ్రి బిజూ పట్నాయక్ సీఎంగా ఉన్న 1990–1995 కాలంలో నెల వేతనంగా రూ.1 మాత్రమే తీసుకున్నారని గుర్తు చేశారు.


