శబరిమల సన్నిధానం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల గుంపుపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఇవాళ సాయంత్రం(డిసెంబర్ 13, శనివారం) 6:10 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా తొమ్మిది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదానికి గురైన ట్రాక్టర్ వ్యర్థాలను తీసుకెళ్తోంది. భారీ వర్షం కారణంగా ట్రాక్టర్ అదుపు తప్పి భక్తులపైకి దూసుకుపోయింది. సన్నిధానం పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని సన్నిధానం ఆసుపత్రికి రిఫర్ చేశారు. క్షతగాత్రులందరినీ పంబలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు.



