భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవలి కేరళలో పర్యటించారు. అక్టోబరులో పర్యటన సందర్బంగా శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇరుముడితో వచ్చి అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతి వెంట భద్రతాధికారులు, సిబ్బంది సైతం ఉన్నారు. అయితే, రాష్ట్రపతి ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా.. హెలిప్యాడ్ కుంగిపోయింది. దీంతో ఆమె రోడ్డు మార్గంలో పంబకు వచ్చి.. అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప సన్నిధానానికి చేరుకున్నారు. కాగా, తాజాగా హెలిప్యాడ్ కుంగిపోవడానికి గల కారణాలు ఆర్టీఐ దరఖాస్తుతో బయటకు వచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..
అయితే, సామాజిక కార్యకర్త రషీద్ అనప్పర దాఖలు చేసిన సమాచార హక్కు (ఆర్‌టీఐ) దరఖాస్తు మేరకు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన వివరాలను కలెక్టరేట్, పతనంతిట్ట పబ్లిక్ వర్క్స్ భవన విభాగం సమాధానాలను వెల్లడించింది. ఈ క్రమంలో.. శబరిమల సందర్శనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోసం మూడు హెలిప్యాడ్‌లను సిద్ధం చేశారు. మొదట రాష్ట్రపతిని నిలక్కల్‌లో దించాలని నిర్ణయించారు. కానీ.. భారీ వర్షం, పొగమంచు కారణంగా చివరి నిమిషంలో ల్యాండింగ్‌ను ప్రమదానికి మార్చారు.
అయితే, రాత్రికి రాత్రే అక్టోబర్ 22వ తేదీన హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. సాధారణ నేల ఉపరితలంపై పెద్ద హెలికాప్టర్ దిగితే కూరుకుపోతుందని కారణంతో సుమారు ఒక అడుగు ఎత్తులో మెటల్ చిప్స్ వేసి దానిపై కాంక్రీట్ పోశారు. రాష్ట్రపతికి రాకకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో హెలిప్యాడ్‌పై వేసిన కాంక్రీట్ సరిగా పొడిబారలేదు. ఈ కారణంగా రాష్ట్రపతి కోసం వచ్చిన ఆర్మీ హెలికాప్టర్ హెలిప్యాడ్ వద్ద మట్టిలో కూరుకుపోయింది. కాగా, రాష్ట్రపతి పర్యటన కోసం ప్రమదంలో నిర్మించిన మూడు హెలిప్యాడ్‌ల కోసం రూ. 20.7 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఖర్చు మొత్తాన్ని పరిపాలనా ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపారు. దీన్ని వీఐపీ పర్యటనల కోసం కేటాయించిన నిధుల నుండి తీసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
SCARY 🚨 President Droupadi Murmu’s Helicopter wheels sink into newly concreted landing pad in Kerala.pic.twitter.com/s1jcvJNjZy
— News Algebra (@NewsAlgebraIND) October 22, 2025
హెలిప్యాడ్ నిర్మాణం – సాంకేతిక విశ్లేషణ
హెలిప్యాడ్‌కు అవసరమైన ప్రాథమిక ప్రమాణాలు పాటించాలి. హెలిప్యాడ్ నిర్మాణం సాధారణ కాంక్రీట్ స్లాబ్ కాదు. ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సిందే.
a) నేల బలం (Soil Bearing Capacity–SBC)
హెలికాప్టర్ బరువు + డైనమిక్ లోడ్‌ను తట్టుకునేలా నేల బలం ఉండాలి.
సాధారణంగా 15–20 టన్నుల వరకు లోడ్‌ను తట్టుకునేలా SBC పరీక్షలు చేస్తారు.
b) ఉపరితల సమతలీకరణ (Leveling)
1–2% కంటే ఎక్కువ స్లోప్ ఉండకూడదు.
హెలికాప్టర్ దిగేటప్పుడు చిన్న unevenness కూడా ప్రమాదకరం.
c) కాంక్రీట్ గ్రేడ్
సాధారణంగా M30 లేదా M35 గ్రేడ్ కాంక్రీట్ వాడాలి.
ఇది అధిక బలం, కంప్రెషన్‌కు తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది.
d) రీన్‌ఫోర్స్‌మెంట్ (Steel Mesh)
8mm–12mm స్టీల్ మెష్ తప్పనిసరి.
ఇది కాంక్రీట్ క్రాక్ అవకుండా, లోడ్‌ను సమానంగా పంపిణీ చేస్తుంది.
కాగా, కేరళలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ విషయంలో రాజకీయంగా కూడా విమర్శలకు దారి తీసింది. హెలిప్యాడ్ నిర్మాణం సరిగా చేయకపోవడం నిర్లక్ష్యమే అని అటు రాజకీయ నేతలు, ఇటు నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ పనితీరులో ప్రణాళికల లోపం ఉందని ఆరోపించారు. రాష్ట్రపతి వంటి వారు వచ్చినప్పుడు కూడా సురక్షిత ఏర్పాట్లు చేయలేకపోయారని విమర్శలు చేశారు. పబ్లిక్ మనీ వృథా అయ్యిందని కామె. రాష్ట్రపతి పర్యటనలో అపశృతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. అధికార పక్షం మాత్రం ప్రతిపక్ష నేతల వాదనలను తోసిపుచ్చింది. ఇది అత్యవసర పరిస్థితి, వాతావరణ మార్పుల వల్ల హెలిప్యాడ్‌ను త్వరగా సిద్ధం చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడం వల్ల ఏ ప్రమాదం జరగలేదని వెల్లడించింది.


