శబరిమలలో అంతకంతకు పెరుగుతున్న భక్తుల జనసందోహం. కేవలం నిన్న ఒక్కరోజే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా శబరిమలకు తరలివచ్చారు. స్థానిక సంస్థల ఓటింగ్ రోజు(పంచాయతీ ఎన్నికలు) అయినప్పటికీ.. సన్నిధానం, పంపా, శబరిపీఠం, శరణ్‌గుత్తి ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచినప్పుడూ.. ఒక గంటలో ఏకంగా 13 వేల మందికి పైగా భక్తులు శబరికొండ ఎక్కారు.
సాయంత్రం 6 గంటలకు దర్శనం కొచ్చే వారి సంఖ్య 75,463 కు చేరుకుంది. 18వ మెట్టు ఎక్కేందుకు శరణ్‌గుత్తి, మరంకూట్ట మధ్య భారీ క్యూ ఉంది. గత కొన్ని రోజులతో పోలిస్తే.. నిన్న ఒక్కరోజే రద్దీ అధికం. శబరిమలకు వస్తున్న భక్తుల్లో 50 శాతం మంది ఆంధ్ర, తెలంగాణకు చెందినవారే ఉంటున్నారు. అలాగే నిన్న దర్శనానికి వచ్చిన మలయాళీలలో చాలామంది మలబార్ ప్రాంతానికి చెందినవారే కావడం గమనార్హం.
(చదవండి: Sabarimala: ‘ఉరక్కుళి జలపాతం వైపు వెళ్లొద్దు’)


