సాక్షి శబరిమల: సన్నిధానం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ రాత్రికి నాడ మూసివేస్తే రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు యాత్రికులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతించరు. ఆ తర్వాత భద్రతలో భాగంగా, పోలీసులు, కేంద్ర దళాలు CRPF, RAF, NDRF, యాంటీ టెర్రర్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సంయుక్తంగా రూట్ మార్చ్ నిర్వహించనున్నారు.
నాడ మూసివేత అంటే..
నాడ అంటే శబరిమల అయ్యప్ప ఆలయానికి వచ్చే ప్రధాన మర్గం. ఇది అయ్యప్ప భక్తులకు, ముఖ్యంగా దీక్షధారులకు అతి ముఖ్యమైనది. సింపుల్‌గా చెప్పాలంటే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునే మెట్ల మార్గం. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచే ఆలయ ప్రవేశ మార్గం. అందువల్ల ఈ మెట్లమార్గం గుండా ఉండే ప్రధాన ద్వారాన్ని మూసివేస్తే..భక్తులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతించరు. ఇక్కడే స్వామివారికి ఆలయ పూజారులు విశేష పూజలు జరుపుతారు. భక్తులు తెచ్చే ఆవునేతితో అయ్యప్పకు అభిషేకం చేస్తారు.
ఇదిలా ఉండగా, సన్నిధానం పంపా, నీలక్కల్ వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. రాత్రి నాడ మూసివేశాక, తిరుముట్టం, దాని పరిసరాలు ప్రత్యేక పోలీసుల రక్షణలో ఉంటాయి. ఎప్పుడైతే నాడ మూసివేస్తారో ఆ తదనంతరం యాత్రికులను పాపంతల్ వద్ద క్యూలో నిలబెడతారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు నాడ తెరిచిన తర్వాత మాత్రమే భక్తులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతిస్తారు.
సన్నిధానం వైపు ట్రాక్టర్ల తరలింపును రెండు రోజులుగా పరిమితం చేశారు. ట్రాక్టర్లలో తీసుకువచ్చిన వస్తువులను కూడా తనిఖీ చేస్తారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని సిబ్బంది ద్వారం గుండా తిరుముట్టంలోకి ప్రవేశించడానికి అనుమతించరు. ఈ ప్రాంతంలో నిఘా ముమ్మరంగా ఉంటుంది. ఇక ఫుట్‌పాత్ వద్ద దర్శనం ప్రారంభంలో స్కానర్లు డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హోల్డ్ మెటల్ డిటెక్టర్లు ఉపయోగించే స్రీనింగ్ తనిఖీ తదితరాలు పర్యవేక్షణ ఉంటుంది.
(చదవండి: పులిమేడు రూట్‌లో భక్తుల రద్దీ)


