పతనంతిట్ట: శబరిమల యాత్రికులకు తృటిలో ప్రమాదం తప్పింది. శబరిమల యాత్రికులతో వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. పంపా చలకాయం సమీపంలో కారు నుంచి పొగలు వస్తున్నట్లు గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తయ్యారు.
కారును నిలిపివేసి భక్తులను అలర్ట్ చేయడంతో వారు కారు నుంచి వెంటనే బయటకు దిగిపోయారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలం వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది కారులో చెలరేగిన మంటలను ఆర్పివేశారు. ఈ కారులో హైదరాబాద్ భక్తులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.


