breaking news
Sabarimala devotees
-
శబరిమల: అయ్యప్పస్వాముల కారులో మంటలు
పతనంతిట్ట: శబరిమల యాత్రికులకు తృటిలో ప్రమాదం తప్పింది. శబరిమల యాత్రికులతో వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. పంపా చలకాయం సమీపంలో కారు నుంచి పొగలు వస్తున్నట్లు గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తయ్యారు.కారును నిలిపివేసి భక్తులను అలర్ట్ చేయడంతో వారు కారు నుంచి వెంటనే బయటకు దిగిపోయారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలం వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది కారులో చెలరేగిన మంటలను ఆర్పివేశారు. ఈ కారులో హైదరాబాద్ భక్తులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
విమానంలో శబరిమల వెళ్లే స్వాములకు శుభవార్త
సాక్షి, ఢిల్లీ: విమానంలో శబరిమలకు వెళ్లే స్వాములకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇరుముడిని తమతో పాటు తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో చెక్ఇన్ లగేజీగా పంపేలా ఇంతకాలం ఉన్న ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో కేబిన్ బ్యాగేజీగా తమ వెంట తీసుకెళ్లడానికి స్వాములకు వీలు కలగనుంది. తాజా నిర్ణయంతో.. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం, తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్లో తమతో పాటు తీసుకువెళ్ళవచ్చు. భక్తుల విశ్వాసానికి విలువ ఇస్తూ.. సంబంధిత భద్రతా శాఖలతో సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు. జనవరి 20వ తేదీ వరకు ఇది వర్తిస్తుందని అన్నారాయన.శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లుకునే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించనున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా పంపాల్సి రావడం వల్ల భక్తులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటూ వచ్చారు. ఈ కారణంగానే చాలామంది స్వాములు విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటూ వచ్చేవారు.అయితే భక్తుల ఇక్కట్ల నేపథ్యంలో ప్రత్యేక మినహాయింపు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేక సడలింపు ఈ రోజు నుంచే(నవంబర్ 28, 2025) అమల్లోకి వస్తూ, మండల పూజల కాలం నుంచి మకర విలక్కు ముగిసే జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని, భక్తులు సహకరించాలని పౌర విమానయాన విజ్ఞప్తి చేసింది. -
శబరిమలలో ఏపీ యాత్రికుల బస్సు ప్రమాదం.. 11 మందికి గాయాలు
పథనంతిట్ట: ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల బస్సు కేరళలోని మావత్తుపుళ సమీపంలోని త్రికలత్తూర్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 11 మంది అయ్యప్ప భక్తులు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ నుంచి శ్రీదుర్గా ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సులో ఇద్దరు చిన్నారులు సహా.. 33 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు బయలుదేరారు.వీరి బస్సు గురువారం తెల్లవారుజామున త్రికలత్తూర్‌లోని ఎంసీ రోడ్డు మీదుగా వెళ్తుండగా.. అటుగా వేగంగా దూసుకువచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పాలక్కాడ్‌కు చెందిన లారీ డ్రైవర్ రెమీ, బస్సు డ్రైవర్ గౌతమ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు వైపు సీట్లలో కూర్చున్న అయ్యప్ప భక్తులు బాలాజీ, వెంకటేశ్, మోహన్ బాబు, గోవింద్, చంద్రారెడ్డి, శ్రీనివాసులు, ఉమాపతి, ఉదయ్‌కుమార్, దీపికలకు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను అలువాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. యాత్రికులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని వెల్లడించారు.తప్పిన పెను ప్రమాదంలారీ బస్సును వేగంగా ఢీకొనడంతో.. బస్సు డ్రైవర్ నియంత్రణను కోల్పోయి, పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టారు. దాంతో విద్యుత్తు స్తంభం సగానికి విరిగిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్లిన స్థానికులు వెంటనే పోలీసులు, విద్యుత్తు శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో.. అధికారులు వెంటనే విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఈ ఘటనతో ఉదయం వరకు ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు గురువారం ఉదయం క్రేన్ సాయంతో లారీని రోడ్డు నుంచి తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
శబరిమలలో భక్తుల రద్దీ దృష్ట్యా..రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం..
శబరిమలలో నెలకొన్న భక్తుల రద్దీ విషయమై ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శబరిమలలో తొలి జాతీయ విపత్తు నిర్వహణ దళం (NDRF) విధుల్లోకి చేరింది. ఈ మేరకు ప్రాంతీయ రిస్పాన్స్ సెంటర్‌కు చెందిన 4వ బెటాలియన్‌లోని 30 మంది సభ్యుల బృందం నవంబర్ 19న సన్నిధానానికి చేరుకుంది. ప్రస్తుతం వారు మెట్లు ప్రాంతం మరియు నడక మార్గాల వద్ద మోహరించారు. ఒకేసారి ప్రతి ప్రాంతంలో ఐదుగురు చొప్పున విధుల్లో ఉన్నారు. చెన్నై నుంచి వచ్చిన 38 మంది సభ్యుల మరో బృందం కూడా నిన్న రాత్రి చేరుకుంది. యాత్రికులకు సీఆర్పీ సహా అత్యవసర వైద్య సహాయం అందించేలా ప్రత్యేక శిక్షణ తీసుకున్న బృందం. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్లు, స్ట్రెచర్లు తదితర సామగ్రిని సిద్ధం చేశారు కూడా. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించడంతో పాటు, రక్షణ కార్యక్రమాలను సమన్వయం చేసేలా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ఈ బృందం శబరిమల ఏడీఎం పోలీసుల ప్రత్యేక అధికారి ఇచ్చే సూచనల మేరకు పనిచేస్తుందని ఇన్స్పెక్టర్ జీసీ ప్రసాద్ తెలిపారు. కట్టుదిట్టమైన ఆంక్షలు..ప్రస్తుతం శబరిమలలో మరిన్ని ఆంక్షలు విధించారు. స్పాట్ బుకింగ్ 20 వేల మందికి పరిమితం చేశారు. పంపా చేరుకున్న భక్తులు తమ శబరిమల దర్శనాన్ని పూర్తి చేసుకుని నిర్ణీత సమయంలోపు తిరిగి వస్తారు. అధికంగా వచ్చే వారికి మరుసటి రోజు దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారుల పేర్కొన్నారు. నీలక్కల్ నుంచి పంపా వరకు ప్రవేశం పరిమితం చేసినట్లు తెలిపారు. భక్తులకు నీలక్కల్లో వసతి సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొంది ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు.(చదవండి: ఒక్క నిమిషంలో 80 మంది.. జరగరానిది జరిగితే ఏం చేస్తారు?) -
శబరిమల బస్సులు: కేరళ వర్సెస్ తమిళనాడు
చెన్నై: శబరిమలకు నడిచే ప్రైవేటు బస్సుల విషయంలో తమిళనాడు వర్సెస్ కేరళ అన్నట్లుగా పరిస్థితులు మొదలయ్యాయి. దీంతో 10 రోజుల పాటు కేరళకు బస్సులను నడిపేది లేదంటూ తమిళనాడు ప్రైవేటు బస్ ఆపరేటర్లు భీష్మించుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పటికే తమకు రూ.22 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రైవేట్ బస్ ఆపరేటర్లు చెబుతున్నారు. వివాదమేంటి??శబరిమల సీజన్ ప్రారంభం కావడంతో.. ఎప్పటిలాగే తమిళనాడు ప్రైవేటు బస్ ఆపరేటర్లు కేరళకు సర్వీసులను ప్రారంభించారు. నిజానికి ప్రభుత్వ రవాణా సంస్థలు నడిపే బస్సుల సంఖ్య డిమాండ్‌కు అనుగుణంగా లేకపోవడంతో.. ఆ భర్తీని ప్రైవేటు బస్ ఆపరేటర్లు తీరుస్తున్నారు. 150 వరకు బస్సులు తమిళనాడులోని వేర్వేరు ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులను శబరిమలకు తీసుకువస్తుంటాయి. అయితే.. ఈసారి సీజన్ ప్రారంభమైనా.. తమిళనాడు బస్ ఆపరేటర్లకు కేరళ రాష్ట్ర రవాణా శాఖ పర్మిట్లు ఇవ్వలేదు. పర్మిట్లు లేకుండా.. ఆల్-ఇండియా టూరిస్టు అనుమతి పత్రాలతో తమ రాష్ట్రంలోకి వచ్చే బస్సులకు భారీ జరిమానాలు విధించింది. దీంతో.. బస్ ఆపరేటర్లు కేరళకు బస్సులు నడిపేది లేదని తేల్చిచెప్పారు. 10 రోజుల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు ప్రైవేటు బస్సుల యజమానుల సంఘం అధ్యక్షుడు ఎన్.అంబలగన్ మీడియాకు తెలిపారు. కేరళీయులకూ ఇబ్బందులే..అయ్యప్ప భక్తులను శబరిమలకు తీసుకువచ్చే ప్రైవేటు బస్సులు.. తిరుగు ప్రయాణంలో తమిళనాడుకు వచ్చే కేరళీయులకు సేవలు అందిస్తున్నాయి. తమిళనాడులోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ బస్సులు సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ విషయంలో భక్తులు, ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, కేరళ సర్కారు ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని, ప్రైవేటు బస్ ఆపరేటర్లపై వేధింపులను ఆపాలని అంబలగన్ డిమాండ్ చేశారు. భక్తుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, మినీ బస్సులకు కూడా అనుమతినివ్వాలని కోరారు. ఇందుకోసం కేరళ సర్కారుతో చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు. -
తెరుచుకున్న శబరిమల.. భక్తులకు సూచనలివే..!
పథనంతిట్ట: శబరిమలలో కొలువైన హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి సన్నిధానం ఈరోజు (నవంబరు 16) సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది. మేల్శాంతిగా ఎంపికైన ప్రసాద్ నంబూద్రి శనివారం ఉదయం పంపా బేస్ వద్ద ఇరుముడి కట్టుకుని, ఆదివారం సాయంత్రానికి సన్నిధానం చేరుకున్నారు. పద్దెనిమిది మెట్లను అధిరోహించిన తర్వాత ఆయన శబరిమల సన్నిధానం ద్వారాలకు హారతి ఇచ్చి, ఆలయం తలుపులును తెరిచారు. ఆ వెంటనే.. ‘స్వామియే.. శరణం అయ్యప్పా’ అనే భక్తుల శరణుఘోషలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది.మండల పూజ సీజన్లో శబరిమలకు వచ్చే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు మౌలిక సదుపాయాలను కల్పించింది. అదేవిధంగా కేరళ వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. వైద్య కళాశాల ప్రొఫెసర్లు మొదలు.. పీజీ విద్యార్థులను రంగంలోకి దింపి.. శబరిమల మార్గంలో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు, తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంపాబేస్‌లో 24 గంటలూ పనిచేసేలా వైద్య కేంద్రం పనిచేస్తుందని అధికారులు తెలిపారు. వైద్య శిబిరాలు ఎక్కడెక్కడున్నాయి? భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అనే అంశాలపై దీర్ఘకాలిక వ్యాధులు, కొమార్బరిటీస్తో బాధపడే భక్తులు అత్యవసర స్థితిలో ఎవరిని సంప్రదించాలి? అనే అంశాలపై మళయాలంతోపాటు.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో పైన పేర్కొన్న భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.ట్రెకింగ్ మార్గంలో..పంపాబేస్ నుంచి శబరిమల సన్నిధానం వరకు పలు చోట్ల అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా సముద్రమట్టానికి ఎత్తులో వెళ్తున్నప్పుడు శ్వాస ఇబ్బందులు ఎదురయ్యే భక్తుల కోసం ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మార్గంలో కొన్ని వైద్య కళాశాలలు బేస్ ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పథనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ కార్డియాలజీ ట్రీట్ మెంట్, క్యాథ్ ల్యాబ్ ట్రీట్ మెంట్ అందుబాటులో ఉన్నట్లు వివరించారు. పంపాబేస్ వద్ద అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. పంపాకు సమీపంలో ఉన్న అన్ని ఆస్పత్రులలో డీఫిబ్రిలేటర్లు, వెంటిలేటర్లు, కార్డియాక్ మానిటర్లు ఉంటాయని తెలిపారు. నీలక్కల్ బేస్ వద్ద పూర్తిస్థాయి ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. శబరిమల చరిత్రలోనే తొలిసారి పంపాబేస్, సన్నిధానం వద్ద ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు. అటు అయ్యప్పస్వామి వంశస్తుల రాజ్యంగా పేర్కొనే పందలం వద్ద కూడా తాత్కాలిక డిస్పెన్సరీలు ఏర్పాటయ్యాయి. శబరిమలకు వచ్చే మార్గాల్లో అడూర్, వడసేరిక్కర, పథనంతిట్టల్లోనూ 24 గంటలు పనిచేసే ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయి. భక్తులకు ప్రభుత్వ సూచనలుప్రస్తుతం వివిధ వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు తమ వైద్య రికార్డులను వెంట తెచ్చుకోవాలిశబరి యాత్రకు కొద్దిరోజుల ముందు నుంచి నడక, తేలికపాటి వ్యాయామాలు చేయాలిపంపాబేస్ నుంచి కొండను ఎక్కేప్పుడు వేగం పనికిరాదు. నిదానంగా కొండను అధిరోహించాలి. అవసరమైతే.. తరచూ విశ్రాంతి తీసుకోవాలికొండను అధిరోహించేప్పుడు అలసట, ఛాతీ నొప్పి రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే.. తక్షణం వైద్య సాయం కోసం 04735 203232 నంబరుకు కాల్ చేయాలికాచి, చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలివివిధ వ్యాధులతో బాధపడేవారు బహిరంగ ప్రదేశాల్లో లభించే చిరుతిళ్లను తినకూడదునీలిమల, శరణ్గుత్తి ప్రాంతాల్లో పాములను పట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ విషకీటకాలు కరిస్తే.. వెంటనే 04735 203232 నంబరుకు కాల్ చేయాలి. తాత్కాలిక వైద్య శిబిరాల్లో పాముకాటుకు విరుగుడు ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి -
కేరళకు భారీ వర్ష సూచన.. అయ్యప్ప భక్తులకు అలర్ట్
తిరువనంతపురం: తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కేరళను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. దీంతో మూడు నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు తప్పవని భారతీయ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది(IMD). శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు రేపు (నవంబర్ 16) సాయంత్రం 5 గంటలకు మండల పూజల కోసం తెరుచుకోనున్నాయి. వేలాది మంది భక్తులు పంబా, నిలక్కల్ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం భక్తులను అప్రమత్తం చేస్తోంది. రాబోయే మూడు రోజులు నవంబర్ 16 నుంచి 18 దాకా కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఐఎండీ పేర్కొంది. ఇడుక్కి, కొట్టాయం, పత్తనంతిట్ట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో 64.5 మిల్లీమీటర్ల నుండి 115.5 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. శబరిమల యాత్రకు వచ్చే భక్తులు ఈ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారుల సూచనలు:భక్తులు రెయిన్‌కోట్, టార్చ్‌లైట్, మెడికల్ కిట్ వంటి అవసరమైన వస్తువులు వెంట ఉంచుకోవాలివర్షాల కారణంగా మార్గాల్లో మట్టి జారే ప్రమాదం ఉండవచ్చు.. అప్రమత్తంగా ఉండాలిపంబా, ఎరుగుమలై, నిలక్కల్ ప్రాంతాల్లో వాతావరణ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలిఅంతేకాదు.. కల్లకడల(Kallakkadal) కారణంగా(సముద్రంలో అలజడి) ఆలప్పుఝా, ఎర్నాలకుం, త్రిస్సూర్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్ తీరప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చే అవకాశం ఉందని, అలలు ఎగసిపడే నేపథ్యంలో మత్య్సకారులు, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం రేపు (నవంబర్ 16) సాయంత్రం 5 గంటలకు మండల-మకరవిళక్క యాత్రా కాలానికిగానూ తలుపులు తెరుచుకోనుంది. ఈ పవిత్ర యాత్రా కాలం జనవరి 20 వరకు కొనసాగనుంది. అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేపట్టింది. దేశంలో వరుసగా తొక్కిసలాట ఘటనలు జరుగుతున్న క్రమంలో.. భక్తుల ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. రోజుకు 90,000 భక్తులకు రోజువారీ పరిమితి విధించారు. నిలక్కల్, పంబా ప్రాంతాల్లో తాత్కాలిక గుడిసెలు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. -
శబరిమల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
-
శబరిమలకు పోటెత్తిన భక్తులు
-
Special Trains: శబరిమలకు ప్రత్యేక రైళ్లు..
రైల్వేస్టేషన్(విజయవాడ)/లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం డిసెంబర్, జనవరి నెలల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్–కొట్టాయం (07119) డిసెంబర్ 2, 9, 16, 30, జనవరి 6, 13 తేదీల్లో, కొట్టాయం–నర్సాపూర్ (07120) డిసెంబర్ 3, 10, 17, 31, జనవరి 7, 14 తేదీల్లో, హైదరాబాద్–కొల్లాం (07133) డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9, 16 తేదీల్లో, కొల్లాం–హైదరాబాద్ (07134) డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో, సికింద్రాబాద్–కొట్టాయం (07125) డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8 తేదీల్లో, కొట్టాయం–సికింద్రాబాద్ (07126) డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9 తేదీల్లో నడుస్తాయని వివరించారు. విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం వెల్లడించారు. మచిలీపట్నం–కర్నూలు సిటీ (07067) డిసెంబర్ 1 నుంచి 31 వరకు ప్రతి శని, మంగళ, గురువారాలు, కర్నూలు సిటీ–మచిలీపట్నం (07068) డిసెంబర్ 2 నుంచి 2023 జనవరి 1 వరకు ప్రతి ఆది, బుధ, శుక్రవారాల్లో నడుస్తుంది. మచిలీపట్నం–తిరుపతి (07095) డిసెంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో, తిరుపతి–మచిలీపట్నం (07096) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి సోమ, మంగళ, గురు, శనివారాలు, తిరుపతి–ఔరంగాబాద్ (07637) డిసెంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి ఆదివారం, ఔరంగాబాద్–తిరుపతి (07638) డిసెంబర్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–సికింద్రాబాద్ (07481) డిసెంబర్ 4 నుంచి జనవరి 29 వరకు ప్రతి ఆదివారం, సికింద్రాబాద్–తిరుపతి (07482) డిసెంబర్ 5 నుంచి జనవరి 30 వరకు ప్రతి సోమవారం నడుస్తాయి. హైదరాబాద్–తిరుపతి (07643) డిసెంబర్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–హైదరాబాద్ (07644) డిసెంబర్ 6 నుంచి 27 వరకు ప్రతి మంగళవారం, విజయవాడ–నాగర్సోల్ (07698) డిసెంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం, నాగర్సోల్–విజయవాడ (07699) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి శనివారం, కాకినాడ టౌన్–లింగంపల్లి (07445) డిసెంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాలు, లింగంపల్లి–కాకినాడ టౌన్ (07446) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాలు, హైదరాబాద్–నర్సాపూర్ (07631) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి శనివారం, నర్సాపూర్–హైదరాబాద్ (07632) డిసెంబర్ 4 నుంచి జనవరి 1 వరకు ప్రతి ఆదివారం, విశాఖపట్నం–మహబూబ్‌నగర్ (08585) డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో, మహబూబ్‌నగర్–విశాఖపట్నం (085856) డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. -
శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం
తిరువనంతపురం: శబరిమలలోని పొన్నాంబలమేడు కొండల్లో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. భక్తుల నామస్మరణతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. మకర జ్యోతిని దర్శించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అన్న శరణు ఘోషతో కొండ ప్రాంతం మార్మొగుతుంది. కోవిడ్ నేపథ్యంలో.. కరోనా నిబంధలను పాటిస్తూ భక్తులకు ఆలయ కమిటీ దర్శనం కల్పించింది. ఈనెల 20న తిరిగి ఆలయం మూసివేయనున్నారు. చదవండి: ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కన్నుమూత -
శబరిమలలో పాడైన ఆహారమిస్తే చర్యలు
శబరిమల: శబరిమలలో ఉన్న హోటళ్లు తమ కస్టమర్లకు తాజాగా ఉన్న ఆహారాన్ని కాకుండా, పాడైన ఆహారాన్ని అందిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు హెచ్చరించింది. నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువకు అమ్మినా చర్యలు తప్పవని స్పష్టంచేసింది. స్థానికంగా ఉన్న హోటళ్లలోని ఉద్యోగులకు హెల్త్ కార్డులను తప్పనిసరి చేస్తూ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నామని టీడీబీ అధ్యక్షుడు వాసు తెలిపారు. -
శబరిమలలో మకరజ్యోతి దర్శనం..పోటెత్తిన భక్తులు
సాక్షి, శబరిమల : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతిని అయప్పభక్తులు దర్శించుకున్నారు. పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇవ్వడంతో భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు.‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి. మకరజ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు పెద్దసంఖ్యలో శబరిమల చేరుకున్నారు. సుమారు 18 లక్షల మంది శబరిమలకు వచ్చినట్లు సమాచారం. మకరజ్యోతి దర్శనం నిమిత్తం ట్రావెన్ కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. దర్శనం కోసం పంపా నది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద ఏర్పాట్లు చేశారు. భక్తులు ఈనెల 19వరకు అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వీలు కల్పించారు. ఈనెల 20న పందళ రాజవంశీకులు స్వామివారి దర్శనం తర్వాత ఆలయం మూసివేస్తారు. -
శబరిమల చరిత్రలోనే తొలిసారి..!
శబరిమల : మకరవిలక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు నేడు తెరుచుకోనున్నాయి. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సన్నిధానం తెరుచుకోవడం ఇది రెండోసారి. గతనెల మాసపూజల సందర్భంగా గుడిలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించడంతో... శబరిమల పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయ చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వం 15 మంది మహిళా పోలీస్ ఉద్యోగులను ఆలయం వద్ద భద్రతా విధుల నిర్వహణ కోసం నియమించింది. అయితే వీరంతా 50 ఏళ్ల పైబడిన వారు కావడం గమనార్హం. ఆలయ సాంప్రదాయం ప్రకారం 10 సంవత్సరాల లోపు బాలికలు.. 50 ఏళ్ల పైబడిన మహిళలను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా 50 ఏళ్ల పైబడిన మహిళా పోలీసు అధికారులను నియమించింది. వీరిలో చాలా మంది ఇప్పటి వరకు ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకోలేదని తెలిపారు. మరోక ఉద్యోగిని ఆమె చిన్నతనంలో అయ్యప్ప దర్శనం చేసుకున్నానని చెప్పారు. ఈ విషయం సదరు ఉద్యోగినులు మాట్లాడుతూ ‘మేము ఇక్కడ మాకు కేటాయించిన విధులు నిర్వహించడానికి వచ్చాము. ఆలయ నిబంధనలు ఉల్లంఘించి దర్శనం కోసం ప్రయత్నించే మహిళలను అడ్డుకోవడమే మా ప్రధాన బాధ్యత’ అని తెలిపారు. అయితే ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి ప్రస్తావించగా ‘నో కామెంట్స్’ అంటూ సమాధానమిచ్చారు. మకరవిలక్కు పూజల కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. రేపు సాయంత్రం 10 గంటలకు వరకూ తెరుచుకుని ఉంటుంది. -
రేపు తెరుచుకోనున్న శబరిమల.. భారీ భద్రత!
శబరిమల : మకరవిలక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు సోమవారం తెరుచుకోనున్నాయి. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకూ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సన్నిధానం తెరుచుకోవడం ఇది రెండోసారి. గతనెల మాసపూజల సందర్భంగా గుడిలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించడంతో... శబరిమల పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 10 నుంచి 50ఏళ్ల వయసు మధ్య మహిళలను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులపైనా దాడులకు తెగబడ్డారు. సన్నిధానానికి వెళ్లేందుకు ప్రయత్నించిన 10మందికిపైగా మహిళలను బలవంతంగా వెనక్కి పంపించారు. ఈ నేపథ్యంలో రేపు ఆలయ ద్వారాలు మళ్లీ తెరుచుకోనున్నాయి. దీంతో కేరళ పోలీసులు భద్రతను కట్టుదిట్టంచేశారు. శబరిమల పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. శబరిమల పరిసరాల్లో 2,300మంది పోలీసులు పహారా కాస్తున్నారు. నీలక్కల్, ఎలవున్కల్, పంబ, సన్నిధానం ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. నీలక్కల్ నుంచి పంబ బేస్ క్యాంప్ వరకూ ఉన్న అటవీ ప్రాంతంలోనూ పోలీసులు ప్రత్యేక పికెటింగ్స్ ఏర్పాటుచేశారు. కొండపైకి వెళ్తున్న వాహనాలను తనిఖీలు చేసి పంపిస్తున్నారు. ఆందోళనకారులు సన్నిధానం వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులతోపాటు 20మంది సభ్యుల కమాండో టీమ్‌ను కూడా సన్నిధానం వద్ద మోహరించారు. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న నాయర్ సర్వీస్ సొసైటీ, పందలం రాజకుటుంబంతో చర్చలు జరిపేందుకు పినరయి విజయన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. -
‘అయ్యప్ప గుళ్లోకి ప్రవేశిస్తే నరికేస్తా’
తిరువనంతపురం : కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించే సాహసం చేసిన మహిళలను అడ్డంగా నరికేస్తానంటూ బీజేపీ మద్దతుదారుడు, సినీ నటుడు కొల్లం తులసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల స్ర్తీలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఎన్డీయే నిర్వహించిన ర్యాలీలో తులసి ఈ వ్యాఖ్యలు చేశారు. అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే మహిళలను నరికేసి ఒక సగం కేరళ ముఖ్యమంత్రికి మరో సగం ఢిల్లీకి పంపిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. (‘శబరిమల’ నిరసన హింసాత్మకం) శబరిమల దేవాలయంలోకి స్త్రీలను అనుమంతిచడమంటే అయ్యప్ప పవిత్రతని దెబ్బతీయడమేననీ, సుప్రీం తీర్పు పట్ల మహిళలే విముఖంగా ఉన్నారని తులసి వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీం తీర్పుపై నిరసనలకు తోడు ఇప్పటికే పలువురు రివ్యూ పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే, శబరిమల తీర్పుపై అత్యవసరంగా రివ్యూ పిటిషన్లను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. భక్తులను తొక్కుతూ లోనికి ప్రవేశించండి.. ప్రతినెల అయ్యప్పకు పూజలుంటాయి. వచ్చే బుధవారం (అక్టోబర్ 17) జరిగే పూజా కార్యక్రమంలో వేలాది భక్తులు పాల్గొంటారు. దేవాలయంలో భక్తులందరు నేలపై పడుకొని మొక్కులు చెల్లించుకుంటారు. సుప్రీం తీర్పుకు అనుగుణంగా మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించాలనుకుంటే.. నేలపై పడుకున్న భక్తులను చెప్పులతో, బూట్లతో తొక్కుతూ.. లోనికి వెళ్లండని అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్ వ్యాఖ్యానించారు.(తీర్పులు కాదు..సంప్రదాయాలే ముఖ్యం!) Women coming to #Sabarimala temple should be ripped in half. One half should be sent to Delhi and the other half should be thrown to Chief Minister's office in Thiruvananthapuram: Actor Kollam Thulasi, in Kollam #Kerala. pic.twitter.com/r4cL72mzJm — ANI (@ANI) October 12, 2018 -
శబరిమల భక్తుల కోసం 128 ప్రత్యేక రైళ్లు
-
శబరిమల భక్తుల కోసం 128 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: శబరిమల భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 128 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు హైదరాబాద్, కాకినాడ, నిజామాబాద్, విజయవాడ, మచిలీపట్నం, నర్సాపూర్, సిర్పూర్ కాగజ్‌నగర్, కరీంనగర్, ఔరంగాబాద్, ఆదిలాబాద్, అకోల స్టేషన్ల నుంచి కొల్లాం వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 25వ తేదీ ఉదయం 8 గంటలకు శబరి ప్రత్యేక రైళ్ల అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవుతుంది. నిజామాబాద్-కొల్లాం (07613/07614) మధ్య 2 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. డిసెంబర్ 22న మధ్యాహ్నం ఒంటి గంటకు నిజామాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30కు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 24న తెల్లవారుజామున 1.45 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.35 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు కామారెడ్డి, మేడ్చల్, బొల్లారం, మల్కాజిగిరి, కాచిగూడ, షాద్‌నగర్, జ డ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూలు, డోన్, గుత్తి, తా డిపత్రి, కొండాపురం, మద్దునూరు, ఎర్రగుంట్ల, కడప, రాజం పేట్, కోడూరు, రేణిగుంట, తిరుపతి స్టేషన్లలో ఆగుతాయి. కాకినాడ-కొల్లాం (07211/07212) మధ్య 38 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లు డిసెంబర్ 12,13,15,16, 18,18,19,21,22 జనవరి 1,2,4,5,7,8,10,11,13,14,15 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 14,15,17,18, 20,21,23,24 జనవరి 3,4,6,7,9,10,12,13,15,16,17 తేదీ ల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు కాకినాడ చేరుకుంటాయి. సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. నర్సాపూర్-కొల్లాం (07217/07218) మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. డిసెంబర్ 30,31 తేదీల్లో రాత్రి 8.50 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జనవరి 1,2 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.35కు నర్సాపూర్ చేరుకుంటాయి. పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ,తరిగొప్పుల, విజయవాడ, తెనాలి, నిడుబ్రోలు, బాప ట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. విజయవాడ-కొల్లాం (07219/07220) మధ్య 4 సర్వీసులు నడుస్తాయి. జనవరి 3,9 తేదీల్లో రాత్రి 11.55 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జనవరి 5, 11 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటాయి. తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు తదితర స్టేషన్లలో ఆగుతాయి. మచిలీపట్నం-కొల్లాం (07221/07222) మధ్య 4 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. జనవరి 6,12 తేదీల్లో రాత్రి 11.20 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జనవరి 8,14 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటాయి. చిలకలపూడి, పెడన, కౌతారం, గుడ్లవల్లేరు, గుడివాడజంక్షన్, తరిగొప్పుల, విజయవాడ, తెనాలి మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. విజయవాడ-కొల్లాం (07213/07214) మధ్య గుంటూరు, తిరుపతి మీదుగా 6 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. డిసెంబర్ 7,11,18 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రెండవ రోజు తెల్లవారు జామున 3.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 9,13,20 తేదీల్లో ఉదయం 5.55 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు విజయవాడ చేరుకుంటాయి. కరీంనగర్-కొల్లాం (07113) వరకు డిసెంబర్ 30న ఒక ప్రత్యేక రైలు బయలుదేరి వెళ్తుంది. ఇది రాత్రి 9.15 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి రెండవ రోజు తెల్లవారు జామున 3.45 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబ్‌బాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ మీదుగా వెళ్తుంది. ఔరంగాబాద్-కొల్లాం (07505) కు డిసెంబర్ 6,20 తేదీల్లో రెండు రైళ్లు వెళ్తాయి. ఉదయం 10.15 గంటలకు ఔరంగాబాద్ నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 3.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, బొల్లారం, మల్కాజిగిరి, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి తదితర స్టేషన్ల మీదుగా వెళ్తాయి. ఆదిలాబాద్-కొల్లాం (07509) వరకు నిజామాబాద్, డోన్, రేణిగుంట, తిరుపతి మీదుగా డిసెంబర్ 27 మధ్యాహ్నం 12 గంటలకు ఒక రైలు బయలుదేరుతుంది. ఇది రెండవ రోజు తెల్లవారు జామున 3.45 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.


