శబరిమలలో భక్తుల రద్దీ దృష్ట్యా..రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం.. | Sabarimala Pilgrimage: 30 member NDRF team takes charge at Sabarimala | Sakshi
Sakshi News home page

శబరిమలలో భక్తుల రద్దీ దృష్ట్యా..రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం..

Nov 20 2025 5:15 PM | Updated on Nov 20 2025 5:30 PM

Sabarimala Pilgrimage: 30 member NDRF team takes charge at Sabarimala

శబరిమలలో నెలకొన్న భక్తుల రద్దీ విషయమై ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శబరిమలలో తొలి జాతీయ విపత్తు నిర్వహణ దళం (NDRF) విధుల్లోకి చేరింది. ఈ మేరకు  ప్రాంతీయ రిస్పాన్స్ సెంటర్‌కు చెందిన 4వ బెటాలియన్‌లోని 30 మంది సభ్యుల బృందం నవంబర్ 19న సన్నిధానానికి చేరుకుంది. ప్రస్తుతం వారు మెట్లు ప్రాంతం మరియు నడక మార్గాల వద్ద మోహరించారు. 

ఒకేసారి ప్రతి ప్రాంతంలో ఐదుగురు చొప్పున విధుల్లో ఉన్నారు. చెన్నై నుంచి వచ్చిన 38 మంది సభ్యుల మరో బృందం కూడా నిన్న రాత్రి చేరుకుంది. యాత్రికులకు సీఆర్పీ సహా అత్యవసర వైద్య సహాయం అందించేలా ప్రత్యేక శిక్షణ తీసుకున్న బృందం. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్లు, స్ట్రెచర్లు తదితర సామగ్రిని సిద్ధం చేశారు కూడా. 

అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించడంతో పాటు, రక్షణ కార్యక్రమాలను సమన్వయం చేసేలా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ఈ బృందం శబరిమల ఏడీఎం పోలీసుల ప్రత్యేక అధికారి ఇచ్చే సూచనల మేరకు పనిచేస్తుందని ఇన్‌స్పెక్టర్‌ జీసీ ప్రసాద్‌ తెలిపారు. 

కట్టుదిట్టమైన ఆంక్షలు..
ప్రస్తుతం శబరిమలలో మరిన్ని ఆంక్షలు విధించారు. స్పాట్ బుకింగ్ 20 వేల మందికి పరిమితం చేశారు. పంపా చేరుకున్న భక్తులు తమ శబరిమల దర్శనాన్ని పూర్తి చేసుకుని నిర్ణీత సమయంలోపు తిరిగి వస్తారు. 

అధికంగా వచ్చే వారికి మరుసటి రోజు దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారుల పేర్కొన్నారు. నీలక్కల్ నుంచి పంపా వరకు ప్రవేశం పరిమితం చేసినట్లు తెలిపారు. భక్తులకు నీలక్కల్‌లో వసతి సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొంది ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు.

(చదవండి: ఒక్క నిమిషంలో 80 మంది.. జరగరానిది జరిగితే ఏం చేస్తారు?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement