శబరిమల అయ్యప్పస్వామి తిరువాభరణం అభరణాల ఊరేగింపుకు ఎన్నికైన ప్రతినిధుల బృంధాన్ని ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రకటించింది. మెుత్తం మెుత్తం 30 మందితో కూడిన సహాయకుల బృందాన్ని అయ్యప్ప అభరణాల ఊరేగింపుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. జనవరి 12న మద్యాహ్నం ఒంటిగంటకు ఈ ఊరేగింపు ప్రారంభం కానుంది. నారాయణ స్వామిరాజు ఆధ్వర్యంలో మారుతమాన శివన్‌కుట్టి గురుస్వామితో సహా ఇతర భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్నారు.
శబరిమల అయ్యప్పస్వామికి దర్శనంలో ఎంతో తిరువాభరణం అభరణాల ఊరేగింపు ఎంతో ప్రత్యేకమైనది. అయ్యప్ప భక్తులకు మకరసంక్రాంతి రోజున జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తారు. అంతకుముందు స్వామివారిని ఈ అభరణాలతో అలంకారం చేయడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. పంబల రాజుకిచ్చిన మాట ప్రకారం అయ్యప్పస్వామి ప్రత్యేక అభరణాల( కిరీటం, కంఠాభరణాలకు) పందల రాజవంశీయులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వారి చేతుల మీదుగా ఊరేగి్ంపు ప్రారంభమవుతుంది.
రేపు (జనవరి 13) సాయంత్రానికి అభరణాలు శబరిమల సన్నిధానానికి చేరుకుంటాయి. మార్గమధ్యంలో ఉన్న గ్రామాలలో భక్తులు ఈ ఊరేగింపుకు ఘనస్వాగతం పలుకుతారు. జనవరి 14న ఉదయం అయ్యప్పకు ఈ అభరణాలతో అలంకరిస్తారు. అనంతరం సాయంత్రం లక్షలాధి భక్తులకు అయ్యప్ప జ్యోతిరూపంలో దర్శనమిస్తారు. 41రోజుల స్వామివారి దర్శనం కోసం కఠిన దీక్ష చేసిన భక్తజనులు స్వామివారి దర్శనంతో పులకించిపోతారు. ఆ సమయంలో శబరిమల క్షేత్రం స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో మార్మోగిపోతుంది. జ్యోతి దర్శనంతో అయ్యప్ప దీక్ష సంపూర్ణమవుతుందని భక్తుల విశ్వాసం.


