అర్థరాత్రి వేళ, కాన్పూర్ పోలీసులు స్థానిక టవర్ సమీపంలో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో బయటపడిన దాన్ని చూసిన పోలీసు అధికారులతోపాటు, చలిని కూడా లెక్క చేకుండా పనిలో నిమగ్నమైన కూలీలకూ చెమటలు పట్టాయి. నేలమాళిగలో ఏడు అడుగుల లోతులో దారుణమైన స్థితిలో అస్థిపంజరం దొరికింది. ప్రేమో, వ్యామోహమో, నమ్మిన వ్యక్తికి జరిగిన తీరని ద్రోహం తాలూకు విషాద గాథ ఇదీ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన తల్లి కనిపించడం లేదని కొడుకు ఫిర్యాదు చేయడం ఈ విషయం వెలుగు చూసింది. దొరికిన అస్థిపంజరం ఏడుగురు పిల్లల తల్లి అయిన 45 ఏళ్ల రేష్మాదిగా పోలీసులు భావిస్తున్నారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా నిర్ధారించేందుకు సిద్ధమవుతున్నారు. రేష్మా భర్త రాంబాబు సంఖ్వార్ మూడేళ్ల క్రితం మరణించాడు. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త మరణం తర్వాత, రేష్మా తన పొరుగువాడైన గోరాలాల్‌తో అనుబంధం పెంచుకుంది. ఆ తరువాత కొద్దికాలానికే, తన పిల్లలను వదిలి గోరాలాల్‌తో కలిసి జీవించడం ప్రారంభించింది. దీంతో మనస్తాపం చెందిన రేష్మా పిల్లలు ఆమెతో సంబంధాలు తెంచుకుని విడిగా జీవిస్తున్నారు.
ఎలా బయటపడింది?
తల్లితో సంబంధాలు తెంచుకున్న రేష్మా కుమారుడు గత ఏడాది నవంబర్ 29న కుటుంబంలో జరగబోయే ఒక పెళ్లికి ఆహ్వానం పంపాడు. రేష్మా పెళ్లికి రాలేదు. దీంతో బబ్లూకు అనుమానం వచ్చింది. గోరాలాల్ ఇంటికి వెళ్లి రేష్మా గురించి ఆరా తీశాడు."నీ అమ్మ ఇక తిరిగి రాదు" అని గోరాలాల్ బదులిచ్చాడు. జోక్ చేస్తున్నాడనుకుని మొదట్లో పెద్దగా అనుమానం రాలేదు. కానీ పదే పదే అడిగినా, కచ్చితమైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ వచ్చాడు. ఇక లాభం లేదనుకుని బబ్లూ పోలీసులను ఆశ్రయించాడు.డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దిగ్భ్రాంతికరమైన నిజం
బబ్లూ ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, పోలీసులు గోరాలాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. చివరికి, అతను నిజం చెప్పాడు. గత సంవత్సరం ఏప్రిల్‌లో తనకు, రేష్మాకు మధ్య గొడవ జరిగిందని, దీంతో ఆమెను రేష్మాను వదిలించు కోవాలనుకున్నాడు. ఇంట్లోంచి వెళ్లిపొమ్మని బెదిరించాడు. రేష్మా నిరాకరించింది. దీనివల్ల తరచుగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే అతడు రేష్మాను గొంతు నులిమి చంపేశాడు. రెండు రోజుల పాటు అతను మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి, దానిని ఎలా వదిలించుకోవాలో ఆలోచించాడు.
ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్!
దానిని కాలువలో పడేయాలని ప్లాన్ చేశాడు, కానీ కొన్ని రోజుల్లో మృతదేహం నీటిపై తేలుతుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఆ తర్వాత గ్రామంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పాతిపెట్టాలనుకున్నాడు. విచారణ సమయంలో ఆ ప్రదేశం గురించి పొరపాటున చెప్పడంతో, ఈ భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆభరణాలు , బట్టల ద్వారా ఆమెను గుర్తించారు. అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని, రేష్మా ఎముకలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు.
ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్
పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె?


