పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె? | Why this womans photo used in Karnataka construction sites Viral story | Sakshi
Sakshi News home page

పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె?

Jan 6 2026 6:17 PM | Updated on Jan 7 2026 6:12 PM

Why this womans photo used in Karnataka construction sites Viral story

సోషల్ మీడియా రోజుకో వింత వైరల్‌గా మారుతుంది. తాజాగా  మరోసారి వైరల్ వింత మిస్టరీగా మార్చింది. ఎక్కడ చూసినా ఆమె ఫోటోనే.  ఇంతింత కళ్లతో ఉన్న  ఒక మహిళ ఫోటోను దిష్టి  బొమ్మలా కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలలో తెగ వాడేస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ  వైరల్‌​ అవుతోంది.

మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ దీనిపై ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పంచుకోవడంతో చర్చ జోరందుకుంది. బెంగళూరు వెలుపల ఉన్న ఒక నిర్మాణ స్థలంలో ఈ ఫోటో చూశాననీ, Google Lens, ఆన్‌లైన్ శోధనలను ప్రయత్నించానని, కానీ స్పష్టమైన సమాధానాలు దొరకలేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ "ఆమె ఎవరు?" కోరింది. దీంతో ఆన్‌లైన్‌లో  హాస్యాస్పదమైన ఊహాగానాలతోపాటు, రకరకాల సమాధానాలువచ్చాయి.

 కర్ణాటకలో నిర్మాణ ప్రదేశాలు, దుకాణాలు,  పొలాలలో కూడా పదే పదే కనిపించే ఒక మహిళ ఫోటోపై దృష్టి సారించింది. సగం నిర్మించిన ఇళ్ల నుండి వ్యవసాయ భూమి వరకు ఈ మహిళ  ఫోటోను ఎందుకు పెట్టారనే  చర్చ ఇంటర్నెట్ వినియోగదారులను  ఆశ్చర్యపర్చింది. ఆఖరికి AI చాట్‌బాట్‌లు కూడా  అడిగేశారు. ఈఫోటోను'దిష్టి పరిహారం'గా  వాడుతున్నారని కొందరంటే, చిక్కబల్లాపుర సమీపంలోని ఒక పొలంలో  దిష్టిబొమ్మలా ఇదే ఫోటోలను చూశానని మరొకరు కమెంట్‌ చేశారు.

ఇదీ చదవండి: గ్వాలియర్‌లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్‌

 ఇంతకీ ఆమె ఎవరంటే
గణేష్ అనే వినియోగదారు వివరణాత్మక వివరణ  ఇవ్వడంతో దీనిపై ష్టత వచ్చింది. అతని ప్రకారం, ఫోటోలు  ఉన్న మహిళ పేరు నిహారిక రావు. ఒక యూట్యూబర్. స్థానికులు ఆమె ఫోటోను ఇళ్ళు, దుకాణాలు, పొలాలు, నిర్మాణ ప్రదేశాల వెలుపల ఉంచిన తరువాత నెగిటివిటీ పోయిందట,మంచి జరిగిందట. ఇది ఆ నోటా ఈ నోటా పాకి దీన్ని దిష్టిబొమ్మగా వాడేస్తున్నారన్నమాట.  

ఇదీ చదవండి: సీనియర్‌ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement