11 ఏళ్ల తర్వాత... | Karnataka in Ranji Trophy final | Sakshi
Sakshi News home page

11 ఏళ్ల తర్వాత...

Feb 20 2026 4:06 AM | Updated on Feb 20 2026 4:06 AM

Karnataka in Ranji Trophy final

రంజీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక

లక్నో: పరుగుల వరద పారిన రంజీ ట్రోఫీ రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. ఉత్తరాఖండ్‌ జట్టుపై 503 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించిన కారణంగా కర్ణాటక జట్టుకు ఫైనల్‌ బెర్త్‌ ఖరారైంది. 11 ఏళ్ల తర్వాత కర్ణాటక జట్టు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఫైనల్‌ చేరడం విశేషం. ఈనెల 24 నుంచి హుబ్లీలో జరిగే ఫైనల్లో జమ్మూకశ్మీర్‌ జట్టుతో కర్ణాటక తలపడుతుంది. 

జమ్మూకశ్మీర్‌ జట్టు తొలిసారి ఫైనల్‌ ఆడనుండగా... కర్ణాటక జట్టు ఎనిమిదిసార్లు టైటిల్‌ సాధించి, నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఉత్తరాఖండ్‌తో చివరి రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 299/6తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కర్ణాటక జట్టు 74.3 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ (123 బంతుల్లో 86 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయంగా నిలిచాడు. 

అనంతరం 827 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఉత్తరాఖండ్‌ జట్టు 62 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 260 పరుగులు సాధించింది. ఫలితం తేలకపోవడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందిన కర్ణాటక జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటక 736 పరుగులు చేయగా... ఉత్తరాఖండ్‌ 233 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ చేసిన కర్ణాటక కెప్టెన్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement