జార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్(Jharkhand Air Ambulance Crash) లో ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాంచీ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంలో రోగి సంజయ్ కుమార్ షా (41), అతని భార్య అర్చన దేవి, బంధువు ధ్రువ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, నర్సు సచిన్ కుమార్ మిశ్రా , ఇద్దరు పైలట్లు కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కెప్టెన్ సావ్‌రాజ్‌దీప్ సింగ్ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన అత్యంత విషాదకరమైన సంగతులు వెలుగులోకి వచ్చాయి.
సంజయ్ గత సోమవారం, జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలోని చాంద్‌వాలోని తన హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకున్నాడు. 65 శాతం కాలిన గాయాలతో రాంచీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో, వైద్యులు అతన్ని ఢిల్లీలోని శ్రీ గంగా రామ్ ఆసుపత్రికి పంపించాలనుకున్నారు. రోడ్డు మార్గంలో ప్రయాణించే అవకాశం లేకపోవడంతోఅతని కుటుంబం బంధువులను సంప్రదించి ఎయిర్ అంబులెన్స్ కోసం రూ. 7.5 లక్షలు అప్పుగా తీసుకున్నారు.
క్షణాల్లో అంతా అయిపోయింది
రాంచీ విమానాశ్రయంలో సంజయ్‌ను అలా పంపించి ఇంటికి వచ్చారో లేదో ప్రమాదం జరిగిందని, అంతా ఒక్క క్షణంలో ముగిసిపోయిందంటూ సంజయ్ అన్నయ్య విజయ్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో సంజయ్‌తోపాటు, అతని భార్య అర్చన కూడా చనిపోవడంతో ఇద్దరు పిల్లలను అనాథలుగా మారారని కుటుంబం వాపోయింది. రాంచీలో మెరుగైన వైద్య సౌకర్యాలు ఉంటే, సంజయ్‌ను ఎయిర్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదనీ,అతనికి సరైన చికిత్స అందించి ఉంటే, విలువైన ప్రాణాలను కాపాడగలిగేవారమని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

#WATCH | Chatra, Jharkhand | On air ambulance crash, father of deceased pilot Vikas Bhagat, DS Bhagat says," My son saved many lives by piloting an air ambulance, but today he has lost his life. He had spoken to his mother before the incident...I saw my only son's mortal… pic.twitter.com/8mq5ffk5wv
— ANI (@ANI) February 24, 2026
మరోవైపు ఈ ప్రమాదంలో మరణించిన డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా కుటుంబం ఆవేదన వర్ణనాతీతం. తన కొడుకును డాక్టర్‌గా చేయడానికి ఉన్న భూమ నంతా అమ్మేశానని, ఇపుడు అతనే లేకుండా పోయాడని భావోద్వేగానికి లోనయ్యారు. అతని ఏడేళ్ల కొడుకు ఉన్నాడు... అతను ప్రతిభావంతుడు మరియు ఒడిశాలోని కటక్ నుండి MBBS పూర్తి చేసి రాంచీలోని సదర్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా చేరారని గుప్తా తండ్రి బజరంగీ ప్రసాద్ తెలిపారు.

VIDEO | Jharkhand air ambulance crash: A relative of one of the deceased, says, "My younger brother, Sachin Kumar Mishra, was everything to me. He was like my own child. He was my whole life and my entire world. Since my father is no more, he was my only support. He worked as a… pic.twitter.com/oamIF8qdu2
— Press Trust of India (@PTI_News) February 24, 2026
ఎంతోమంది ప్రాణాలు కాపాడిన పైలట్ దుర్మరణం
ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంలో మరణించిన పైలట్ వికాస్ భగత్ తండ్రి డీఎస్ భగత్ తన కొడుకు మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ అంబులెన్స్ నడపడం ద్వారా చాలా మంది ప్రాణాలను కాపాడిని తన కొడుకు ఈ రోజు అతను ప్రాణాలు కోల్పోయాడని వాపోయారు. సంఘటనకు ముందు తన తల్లితో మాట్లాడాడు అంటూ తన ఏకైక కుమారుడి మరణాన్ని తలుచుకుని కుమిలిపోయారు.


