జార్ఘాండ్‌లో ఘోర ప్రమాదం.. కూలిన ఎయిర్‌ అంబులెన్స్‌ | All 7 On Board Ranchi-Delhi Air Ambulance Die In Crash In Chatra District Forest, More Details Inside | Sakshi
Sakshi News home page

జార్ఘాండ్‌లో ఘోర ప్రమాదం.. కూలిన ఎయిర్‌ అంబులెన్స్‌

Feb 23 2026 11:02 PM | Updated on Feb 24 2026 11:29 AM

Ranchi Air Ambulance Crash

రాంచీ: జార్ఘాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. రాంచి నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్‌ అంబులెన్స్‌ జార్ఘాండ్‌ ఛత్రా జిల్లాలో కూలింది. విమానంలో సిబ్బంది సహా ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి.  

ప్రమాదాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ధృవీకరించింది. ఎయిర్‌ అంబులెన్స్‌లో ఇద్దరు పైలట్లు, ఒక రోగి, ఇద్దరు అటెండెంట్లు, ఒక డాక్టర్, ఒక పారామెడిక్ ఉన్నట్లు తెలిపింది.  

ఈ విమానం బీచ్‌క్రాఫ్ట్ C90 మోడల్‌ది. రెడ్‌బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన ఎయిర్‌ అంబులెన్స్‌ రాంచీ విమానాశ్రయం నుండి సాయంత్రం 7:11 గంటలకు టేకాఫ్ అయింది. 7:34 గంటలకు కోల్‌కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో చివరిసారి సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత సుమారు వారణాసి దక్షిణ-తూర్పు దిశలో 100 నాటికల్ మైళ్ల దూరంలో రాడార్  కమ్యూనికేషన్ సంబంధాలు కోల్పోయింది.

దీంతో డీజీసీఏ అప్రమత్తమైంది. ఛత్రా జిల్లా ప్రభుత్వయంత్రాంగానికి సమాచారం అందించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement