ఉత్తరాఖండ్‌లో గుంపునుంచి 70 ఏళ్ల ముస్లిం దుకాణదారుడిని కాపాడి సంచలనంగా మారిన దీపక్ కుమార్‌ను లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని సోమవారం కలిశారు. త్వరలో తన జిమ్‌కు వెళ్తానని రాహుల్ దీపక్‌కు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన నెట్టింట ఆసక్తికరంగా మారాయి.
ఉత్తరాఖండ్ కోట్ద్వార్ పట్టణంలో ఇటీవల ఒక ముస్లిం వ్యాపారిని బజరంగ్ దళ్ కార్యకర్తలు బెదిరిస్తున్న సమయంలో, ఆ వ్యాపారిని రక్షించిన దాదాపు నెల రోజుల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది.
రాహుల్ గాంధీ , సోనియా గాంధీలను కలిసిన తర్వాత విలేకరులతో దీపక్ మాట్లాడుతూ, “రాహుల్ జీ ఫోన్ చేసి, తన కుటుంబంతోమాట్లాడారు. ఏం జరిగినా దాని గురించి చింతించ వద్దని చెప్పారనిగుర్తు చేసుకున్నారు. తాను ఏ తప్పు చేయలేదని ,చేసింది మంచిదేనని రాహుల్ చెప్పారన్నారు. కోట్ద్వార్‌ను సందర్శించి తన జిమ్‌లో సభ్యత్వం తీసుకుంటానని చెప్పారనీ, రాహుల్ జీ జిమ్ సభ్యత్వం తీసుకుని వర్కౌట్స్ చేస్తే చాలా సంతోషిస్తానని కూడా చెప్పారు. ఇంతకు ముందు తనకు వస్తున్న బెదిరింపులు ఆగిపోయాయని కూడా దీపక్ అన్నారు.
नेता विपक्ष श्री @RahulGandhi ने उत्तराखंड के 'मोहम्मद दीपक' से मुलाकात की।
मोहम्मद दीपक ने एकता, भाईचारे और हिम्मत की वो मिसाल पेश की है- जो देश के हर युवा को अन्याय और नफरत के खिलाफ लड़ने का हौसला देगा।
दीपक 'मोहब्बत की दुकान' के योद्धा हैं- पूरे देश को इन पर गर्व है।
📍… pic.twitter.com/pxGkXZCVKI— Congress (@INCIndia) February 23, 2026
ఈ ఏడాది జనవరి 26న, 38 ఏళ్ల దీపక్, పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న ముస్లిం దుకాణదారుడిని వేధిస్తున్న వ్యక్తుల గుంపును ఎదిరించి వకీల్ అహ్మద్ దుకాణాన్ని రక్షించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా భజరంగ్ దళ్ కార్యకర్తలుపేరు అడిగినపుడు‘‘మహ్మద్ దీపక్’’ అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.కాగా వకీల్ అహ్మద్ తన షాపు పేరు ‘‘బాబా స్కూల్ డ్రెస్’’గా పెట్టుకోవడంపై బజరంగ్ దళ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సంఘటన తర్వాత, దీపక్ నిర్వహిస్తున్న హల్క్ జిమ్‌లో సభ్యత్వ సంఖ్య 150 నుండి 15కి పడిపోయింది. జిమ్ నిర్వాహకుడిగా ఉన్న దీపక్ ఆ తరువాత కొన్ని ఇబ్బందుల నెదుర్కున్నాడు. అయితే ‘‘ఇండియా హీరో’’ అంటూ దీపక్‌పై రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. అలాగే సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ మెంబర్ షిప్ తీసుకున్నారు.
राहुल गांधी जी ने मुझे मिलने के लिए बुलाया था।
उन्होंने मेरे परिवार से बात की और मुझे समझाया कि डरने की कोई जरूरत नहीं, आपने कोई गलत काम नहीं किया है।
राहुल जी ने ये भी कहा कि वे कोटद्वार आकर मुझसे मिलेंगे और मेरे जिम की मेंबरशिप लेंगे।
: नेता विपक्ष @RahulGandhi जी से मिलने… pic.twitter.com/9GheWSOyPB— Congress (@INCIndia) February 23, 2026


