సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ | Minors Stabs Student 27 Times In 30 Seconds At Snooker Club | Sakshi
Sakshi News home page

సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌

Feb 23 2026 11:33 AM | Updated on Feb 23 2026 12:54 PM

Minors Stabs Student 27 Times In 30 Seconds At Snooker Club

భోపాల్‌ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక స్నూకర్ క్లబ్‌లో మైనర్ల మధ్య వివాదం, ప్రతీకార దాడి తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. అక్కడితో వారి ప్రకోపం చల్లారలేదు. నిందితులే స్వయంగా సీసీటీవీ ఫుటేజ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడం తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది.

పోలీసుల సమాచారం ప్రకారం టీనేజర్ల మధ్య వివాదం పెరిగి ప్రాణాంతక దాడికి దారితీసింది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించారు. గౌతమ్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్నబాధిత 16 ఏళ్ల 10వ తరగతి విద్యార్థి స్నూకర్ క్లబ్‌కు రెగ్యులర్‌గా వెళ్లేవాడు. నిందితులు, బాధితుడు ఇద్దరూ  ఒకే  కోచింగ్ సెంటర్‌లోనే చదువుకుంటున్నారు. 

సినిమా ఫక్కీలో దాడి,  30 సెకన్లలో 27 సార్లు
ఇద్దరు మైనర్లు క్లబ్‌లోకి ప్రవేశించి సినిమా ఫక్కీలో దాడిచేశారు. 30 సెకన్లలో 27సార్లు కత్తితో పొడిచారు. అనంతరం అంతే వేగంగా అక్కడి నుండి పారిపోయారు. 10 కంటే ఎక్కువ లోతైనగాయాలయ్యాయి. రెండు వేళ్లు తెగి పోయాయి. భుజం, వీపుపై కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి తరువాత ఏదో విధంగా తప్పించుకున్నాడు. ప్రస్తుతం చికిత్స పొందు తున్నాడు. 

ఇదీ చదవండి: పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకి

దర్యాప్తు అధికారుల ప్రకారం, ఈ దాడికి కారణం ప్రతీకారమే కారణం. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు, పూల్ గేమ్ సందర్భంగా ఆధిపత్యం కోసం గొడవ జరిగింది. ఈ సమయంలో బాధితుడు ఇద్దరు నిందితులను చెంపదెబ్బ కొట్టాడట. దీంతో కక్ష పెంచుకున్న విద్యార్థులు ఫిబ్రవరి 15 రాత్రి పథకం ప్రకారం దాడి  చేశారు. ఈ ఫుటేజ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసు కున్నారు. నోటీసుల  అనంతరం విడుదల చేశారు. వైద్య నివేదిక ఆధారంగా మరిన్ని అభియోగాలు నమోదు చేస్తామని సబ్-ఇన్‌స్పెక్టర్ మణిపాల్ సింగ్ భడోరియా తెలిపారు.
ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం

Advertisement
 
Advertisement
Advertisement