మధ్యప్రదేశ్‌లో 5.39 కోట్ల ఓటర్లతో తుది జాబితాను ఈసీ శనివారం విడుదలచేసింది. పాత జాబితా నుంచి మరణాలు, వలసలు, డూప్లికేట్ల వంటి కారణాలతో 34,25,078 ఓట్లను ఈసీ తొలగించింది. దీంతో గతంలో 5,74,06,143గా ఉన్న ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 5,39,81,065కు దిగొచ్చింది. వీరిలో 2,79,04,975 మంది పురుషులుకాగా 2,60,75,186 మంది మహిళలు ఉన్నారు.
మరోవైపు అండమాన్ నికోబార్‌లో ముసాయిదా జాబితా నుంచీ 5,269 ఓట్లను ఈసీ తొలగించింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ తర్వాత 5,269 ఓట్లు తొలగించి 2,58,040 ఓట్లతో తుది జాబితాను ఈసీ శనివారం పబ్లిష్ చేసింది. వాస్తవానికి 2025 అక్టోబర్ 27 నాటికి ఇక్కడ 3,10,404 ఓటర్లు ఉండేవారు. ఎస్‌ఐఆర్ మొదలయ్యాక మసాయిదా జాబితా తయారీ దశలోనే 64,014 ఓట్లు తొలగించారు. తాజాగా మరో 5,269 ఓట్లు తొలగించారు. తర్వాత మార్పులు చేర్పులతో చివరకు 2,58,040 ఓట్లతో తుది జాబితాను శనివారం ముద్రించింది.


