భర్తను కోల్పోయిన మహిళకు పోలీసు అధికారి వేధింపులు! | Young Woman Ends Her Life In Shivamogga Allegedly After Police Harassment, Days After Husband Death | Sakshi
Sakshi News home page

భర్తను కోల్పోయిన మహిళకు పోలీసు అధికారి వేధింపులు!

Feb 23 2026 9:15 AM | Updated on Feb 23 2026 9:50 AM

wife and husband incident

శివమొగ్గ(కర్ణాటక): భర్త ఆత్మహత్య చేసుకుని దుఃఖంలో ఉన్న యువతిని పోలీసు వేధించడంతో ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. వారం రోజులకే దంపతులు పరలోకానికి చేరారు. ఈ విషాదం శివమొగ్గ జిల్లాలోని భద్రావతి నగరంలోని హోస సిద్ధాపురలో జరిగింది. వివరాలు.. స్వాతి (26),  పోలీసు శాఖ ఆఫీసులో డీ–గ్రేడ్‌ ఉద్యోగి అయిన జగదీష్‌ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జగదీష్‌ శివరాత్రి రోజున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

భద్రావతిలోని న్యూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం అతని భార్య స్వాతి కూడా ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. అంతకుముందు స్వాతి తన తల్లికి వాట్సాప్‌ సందేశం పంపింది, తీర్థహళ్లి తాలూకాలోని మలూరు ఠాణాకు చెందిన ఓ పోలీసు అధికారి నీ భర్త మరణానికి నువ్వే కారణమని బెదిరించాడని, పలు రకాలుగా ఒత్తిడి చేశాడని వాపోయింది. ఇది జిల్లాలో చర్చనీయాంశమైంది. తన కూతురి మృతిపై విచారణ జరిపి కారకులను శిక్షించాలని ఆమె తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement