చిమ్మచీకటి.. ఒళ్లంతా గాయాలు | peddapalli court wife and husband incident | Sakshi
Sakshi News home page

చిమ్మచీకటి.. ఒళ్లంతా గాయాలు

Feb 22 2026 12:16 PM | Updated on Feb 22 2026 12:16 PM

peddapalli court wife and husband incident

ముళ్లపొదల్లో రాత్రంతా నరకం 
బండరాయితో మోది.. భర్త హత్యాయత్నం 
చనిపోయిందని భావించి వదిలివెళ్లిన వైనం 
కేసు నమోదు చేసిన పోలీసులు 

పెద్దపల్లిరూరల్‌:  భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలు విడాకుల దాకా వచ్చాయి. సుమారు పన్నెండేళ్లపాటు సంసారం సాఫీగానే సాగినా.. ఆ తర్వాత తలెత్తిన విభేదాలు దంపతుల మధ్య చిచ్చుపెట్టాయి. ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం కోర్డు విచారణకు వచి్చన మొదటి భార్య పద్మను పెద్దపల్లి బస్టాండ్‌ నుంచి నమ్మించి తన వెంట తీసుకెళ్లిన భర్త వెంకటేశ్‌.. కాల్వశ్రీరాంపూర్‌ మండలం జాఫర్‌ఖాన్‌పేట మైసమ్మగుడి ప్రాంతంలో బండరాయితో మోదీ, తీవ్రంగా గాయపర్చి చనిపోయిందనుకుని వెనుదిరిగాడు. ఈ విషయాన్ని పెద్దపల్లి ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. వివరాలు.. 

చిమ్మచీకటి.. మరునాడు రోజంతా.. 
ఈనెల 19న పెద్దపల్లి కోర్డుకు కేసు విచారణకు హాజరైన దంపతులు పద్మ – వెంకటేశ్‌ విచారణ ముగిసిన తర్వాత వెలుపలకొచ్చారు. పద్మ తన తండ్రి మల్లయ్యతో కలిసి వచ్చింది. తిరుగు ప్రయాణంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ వెళ్లేందుకు బస్సు ఎక్కించిన మల్లయ్య.. పనినిమిత్తం ఆయన కాల్వశ్రీరాంపూర్‌ వెళ్లాడు. ఈ విషయాన్ని పసిగట్టిన వెంకటేశ్‌.. బస్సు వెనకాలే వెళ్లి అక్కడ నుంచి పద్మను మాట్లాడాలంటూ కిందకు దించాడు. ఆ తర్వాత కాల్వశ్రీరాంపూర్‌ మండలం జాఫర్‌ఖాన్‌పేట ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చేందుకు నిశ్చయించుకున్నాడు. 

కోర్టులో పెట్టిన కేసు వాపస్‌ తీసుకోవాలని పద్మను బెదిరిస్తూ విచక్షణారహితంగా కొట్టి పెద్దబండ రాయితో మోదాడు. తీవ్రగాయాలతో స్పృహతప్పి పడిపోయిన పద్మ చనిపోయిందనుకుని నిశ్చయించుకున్న వెంకటేశ్‌.. అక్కడి నుంచి వెనుదిరిగాడు. అప్పటికే రాత్రంతా కటికచీకట్లో నరకయాతన అనుభవించిన పద్మ.. మరుసటి రోజు అవే ముళ్లపొదల్లో నిస్సహాయ స్థితిలో పడిఉంది. మల్లయ్య ఫిర్యాదుతో పోలీసులు విచారించగా.. పద్మపై దాడికి పాల్పడ్డాడని అంగీకరించి ఘటనా స్థలాన్ని చూపడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అచేతనావస్థలో ఉన్న పద్మను శుక్రవారం రాత్రి పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. 

హత్యాయత్నం కేసు.. అరెస్టు 
భర్త చేతిలో తీవ్రంగా గాయపడి కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నూనె పద్మను ఆమె భర్త వెంకటేశ్‌ హతమార్చేందుకు యతి్నంచాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి నిందితుడు వెంకటేశ్‌ను అరెస్టు చేసినట్టు ఎస్సై లక్ష్మణ్‌రావు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement