25 ఏళ్ల యువతిని లొంగదీసుకున్న 50 ఏళ్ల వ్యక్తి..! | Ameerpet Woman Incident | Sakshi
Sakshi News home page

25 ఏళ్ల యువతిని లొంగదీసుకున్న 50 ఏళ్ల వ్యక్తి..!

Feb 22 2026 10:11 AM | Updated on Feb 22 2026 10:11 AM

Ameerpet Woman Incident

హైదరాబాద్: వివాహితను బెదిరించి లొంగదీసుకున్న ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం... గుంటూరుకు చెందిన యువతి(25) ఎస్‌ఆర్‌నగర్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే క్రమంలో బంజారాహిల్స్‌కు చెందిన మల్లికార్జున్‌రెడ్డి(50) పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2024లో ఆమెకు వేరే వ్యక్తితో వివాహమైంది. గతేడాది నుంచి మల్లికార్జున్‌రెడ్డి మళ్లీ ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. 

ఇటీవల మధురానగర్‌లోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, చెప్పినట్లు వినకపోతే వాటిని కుటుంబసభ్యులకు పంపుతానని భయపెట్టి లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించుకోవాలని వేధించాడు. స్నేహితురాలి సాయంతో ఆమె హైకోర్టును ఆశ్రయించడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును మధురానగర్‌ పీఎస్‌కు బదిలీ చేశారు. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement