వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు బలి | Sun City Hospital 6-Month-Old Baby Incident | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు బలి

Feb 22 2026 8:27 AM | Updated on Feb 22 2026 8:27 AM

 Sun City Hospital 6-Month-Old Baby Incident

గడువు ముగిసిన ఇంజక్షన్‌ 

ఇచ్చిన డాక్టర్‌ .. బండ్లగూడలో ఘటన

 కుటుంబసభ్యుల ఆందోళన 

రంగారెడ్డి జిల్లా: గడువు ముగిసిన ఇంజక్షన్‌ ఇవ్వడంతో ఆరు నెలల బాలుడు మృతి చెందాడు. రాజేంద్రనగర్‌ పోలీసులు, బాలుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం... చేవెళ్ల ప్రాంతానికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి తన భార్య అఖిల, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు(ఆరు నెలలు)తో కలిసి బండ్లగూడ అభ్యుదయనగర్‌ కాలనీలో నివసిస్తున్నాడు. మూడు రోజుల క్రితం కుమారుడికి జ్వరం రావడంతో  స్థానికంగా ఉన్న క్రేయాన్స్‌ చిన్న పిల్లల ఆసుపత్రికి తీసుకొచ్చాడు. 

డాక్టర్‌ అభిõÙక్‌ మహంతి ఆధ్వర్యంలో చిన్నారికి చికిత్స అందించి ఇంటికి పంపించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో మరుసటిరోజు శిశువును మళ్లీ ఆసుపత్రికి తీసుకురాగా కొన్ని మందులు ఇచ్చి పంపించారు. జ్వరం తగ్గకపోవడంతో శనివారం ఉదయం విష్ణువర్ధన్‌రెడ్డి మరోసారి కుమారుడిని ఆసుపత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు సెలైన్‌ ద్వారా వ్యాసోకన్‌ ఇంజక్షన్‌ ఇవ్వగా, కొద్దిసేపటికే శిశువు మృతి చెందాడు. తల్లిదండ్రులు అనుమానంతో ఇంజక్షన్‌ ను పరిశీలించగా, దాని గడువు ముగిసి ఉంది. 

విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి శిశువు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇద్దరు కుమార్తెల అనంతరం పుట్టిన మగబిడ్డ కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని తల్లిదండ్రులు బోరున విలపించారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కుమారుడు మృతి చెందాడని, వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన మందులపై తేదీని సైతం గుర్తించలేని డాక్టర్ల సరి్టఫికెట్లను రద్దు చేసి, ఆసుపత్రిని సీజ్‌ చేయాలని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement