తార్నాకలో ఉద్రిక్తత.. బీజేపీ రామచందర్ రావు అరెస్ట్‌ | BJP Ramacharder Rao House Arrest | Sakshi
Sakshi News home page

తార్నాకలో ఉద్రిక్తత.. బీజేపీ రామచందర్ రావు అరెస్ట్‌

Feb 22 2026 7:04 AM | Updated on Feb 22 2026 12:37 PM

BJP Ramacharder Rao House Arrest

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాం చందర్‌ రావు కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఆయనను అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. దీంతో, తార్నాకలోని రాంచందర్‌ రావు నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. బీజేపీ చీఫ్‌ రాంచందర్‌ రావు నేడు కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయనతో పాటు బీజేపీ శ్రేణులు కామారెడ్డికి ప్రారంభమవుతున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల వాహనాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement