సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తి మండలం రామవరంలో కూటమినేతల అరాచకం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై కూటమి నేతలు దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత కృష్ణారెడ్డి ఇంటిపై కూటమి నేతలు దాడి చేశారు. కూటమి నేతల ఆగడాలను అదుపు చేయాలంటూ వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి రామవరంలో రోడ్డుపై బైఠాయించారు.
సూర్యనారాయణ రెడ్డిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన పోలీసులు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను కూడా పీకేశారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే ఈ దారుణానికి టీడీపీ నేతలు ఒడిగట్టారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు.


