విశాఖపట్నం: మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు దీని గురించి వివరాలు తెలిపారు.

ఒక్కో బాధిత కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున అందిస్తామని కేకే రాజు చెప్పారు. ఈ డబ్బును వైఎస్సార్‌సీపీ తరఫున అందిస్తామని అన్నారు. ప్రాణాలతో బయటపడ్డ చిన్నా కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని వివరించారు. చిన్నా కుటుంబానికి రూ.7 లక్షల సాయం చేస్తామని చెప్పారు.

కాగా, ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం(జూలై 14వ తేదీ) పరామర్శించారు. అదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి:
చంద్రబాబు సర్కార్‌కు మానవత్వం ఉందా?: వైఎస్ జగన్
విశాఖ పర్యటనలో జగన్‌కు జై కొట్టిన జనం


