అరసవల్లి ఆదిత్యాలయానికి వచ్చే భక్తులను గూగుల్ మ్యాప్ పరీక్షిస్తోంది. అరసవల్లి ఆలయ లొకేషన్ కోసం జీపీఎస్ ఆన్ చేస్తే ఆలయ సింహద్వారం కంటే ముందుగా బొంపాడ వీధి (బ్రాహ్మణ వీధి రోడ్డు) కూడలి నుంచి ఆలయానికి మార్గం అంటూ మ్యాపింగ్ డైరెక్షన్ చూపిస్తోంది. దీంతో భక్తులు బొంపాడ వీధిలోకి తిప్పేస్తున్నారు. ఇరుకు రోడ్లు కావడంతో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆదివారం సమస్య మరీ ఎక్కువవుతోంది.
–శ్రీకాకుళం

గూగుల్ మ్యాప్‌లో చూపిస్తున్న అడ్డదారి వీధి రోడ్డు ఇదే


