సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దసరా సమీపిస్తుండడంతో నగర వాసులంతా సొంతూళ్లకు పయణమవుతున్నారు. దీంతో పెద్దఎత్తున వాహనాలు రోడ్లపైకి చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై నిరీక్షించవలసి వస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


