దొడ్డబళ్లాపురం: బెంగళూరులో క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. దసరా పండుగ, ట్రాఫిక్ జామ్, వర్షాలు కురుస్తుండటంతో ఇదే అదనుగా ధరలు పెంచేస్తున్నారు. ఒక కిలోమీటర్‌కు రూ.100 వరకూ వసూలు చేస్తున్నట్లు సమాచారం. చాలా వరకూ బుక్ చేసుకున్న క్యాబ్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. అధిక డబ్బు చెల్లిస్తామని ప్రజలు ఒప్పుకున్నా క్యాబ్‌లు సమయానికి లభించడం లేదు. ఆటో డ్రైవర్లు కూడా అసలు చార్జీల కంటే రూ.50 నుంచి రూ.100 అదనంగా డిమాండ్ చేస్తున్నారు.


