సాక్షి, రంగారెడ్డి: దసరా నేపథ్యంలో హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామయ్యింది. దీంతో చౌటుప్పల్ వద్ద హైవే-65 పై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భారీ ట్రాఫిక్ నేపథ్యంలో పోలీసులు వాహనాలను దారిమళ్లించారు.చౌటుప్పల్ ఆర్డీఓ ఆఫీస్ నుంచి మార్కండేయ నగర్, వలిగొండ, తాళ్లసింగారం, లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం పంతంగి మీదుగా వాహనాల మళ్లింపు చేపడుతున్నారు. దానికి తోడు చౌటుప్పల్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు నత్త నడకన సాగుతుండటంతో నిత్యం ట్రాఫిక్ జామ్ జరుగుతుందని వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్కు భారీ వర్ష సూచన


