ప్రకాశం,సాక్షి: సింగరాయకొండలో విషాదం చోటుచేసుకుంది. గూడ్స్ రైలుకింద పడి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు మృతిచెందారు. కాగా మృతిచెందిన కుటుంబం గత నెలలో హత్యకు గురైన ఏవో శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా తెలుస్తోంది. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.


