విశాఖలో వైఎస్‌ జగన్‌.. పోలీసుల వింత ఆంక్షలు | AP Police Over Action On Block Party Leaders Vehicles | Sakshi
Sakshi News home page

విశాఖలో వైఎస్‌ జగన్‌.. పోలీసుల వింత ఆంక్షలు

Jul 14 2026 12:35 PM | Updated on Jul 14 2026 12:44 PM

AP Police Over Action On Block Party Leaders Vehicles

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటనలో ఉన్నారు. వైఎస్‌ జగన్‌ విశాఖ వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టు వద్దకు తరలివచ్చారు. దీంతో, విశాఖ ఎయిర్‌పోర్ట్‌‌లో పోలీసులు వింత ఆంక్షలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. పోలీసుల తీరుపై పార్టీ శ్రేణులు, నెటిజన్లు మండిపడుతున్నారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ విశాఖ వస్తున్న సందర్బంగా ఎయిర్‌పోర్ట్‌‌లో పోలీసులు వింత ఆంక్షలు విధించారు. వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తల్ని అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి.. వింత కారణాలు చెబుతూ వాహనాల్ని అనుమతించలేదు. వాహనాలు నిలిపివేశారు. అయితే, పార్టీ అధినేత వస్తుంటే.. నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకోవడమేంటని నేతలు, అభిమానులు కూటమి ప్రభుత్వం, పోలీసులను ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement