సాక్షి, తిరుపతి: అమరావతిలో అమెజాన్ అడవుల సృష్టిపై వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి సెటైర్లు విసిరారు. ‘‘అమరావతిలో మినీ అమెజాన్ నిర్మించబోతున్నట్లు పచ్చ పత్రిక ప్రచురించింది. 5 ఎకరాల్లో 20 వేలకు పైగా చెట్లు, 400 జాతులు మొక్కలు ఉంటాయని, పొడవైన చెట్లు ఏర్పాటు, జీవ వైవిధ్యం పెంపొందిస్తామని, కృత్రిమ సెలయేళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు.
..శిక్షణ కేంద్రం ఉంటుందని పొగమంచుతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం అంటున్నారు. అమెజాన్ అడవులు వాతావరణంలో 4 డిగ్రీలు తగ్గిస్తామని కూడా చెప్తున్నారు. 7 ఎకరాల్లో పసిఫిక్ మహా సముద్రం కూడా తీసుకురావాలి. టైటానిక్ షిప్‌ను కూడా ఏర్పాటు చేయాలి’’ అంటూ భూమన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
..అమరావతిలో హిమాలయ పర్వతం ఏర్పాటు చేయండి. ఇంద్రుని అమరావతి కంటే.. మీ అమరావతిలో గొప్పగా సృష్టించండి. అన్ని ఎయిర్‌పోర్టుల్లో బార్‌లు తెరడానికి నిర్ణయించారు. ఏపీ అంతా ఏసీ చేయిస్తా అని చెప్పగలరు.. మీ పత్రికలు ద్వారా నమ్మించగలరు.’’ అంటూ భూమన మండిపడ్డారు.


