కర్నూలులో ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి | AP Special Battalion Constable Killed After Lorry Hits Him On Kurnool Flyover, More Details Inside | Sakshi
Sakshi News home page

కర్నూలులో ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

Jul 14 2026 8:48 AM | Updated on Jul 14 2026 10:33 AM

Constable Dies In Kurnool Road Accident

ఆంధ్రప్రదేశ్‌: కర్నూల్‌ జిల్లాలో ఈరోజు ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగరంలో లారీ ఢీకొనడంతో ఓ కానిస్టేబుల్‌ మృతిచెందాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా ఫ్లైఓవర్‌పై ఏపీ స్పెషల్ బెటాలియన్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి వాకింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో వెనుకనుంచి వచ్చిన లారీ అతనిని బలంగా ఢీకొనడంతో ఫ్లైఓవర్ పై నుండి క్రిందపడి కానిస్టేబుల్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఏపీ స్పెషల్ బెటాలియన్‌లో  పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement