ఇంటికో బైక్‌.. కుదిరితే కారు | Greater Hyderabad Nears 1 Crore Mark in Vehicle Registrations | Sakshi
Sakshi News home page

ఇంటికో బైక్‌.. కుదిరితే కారు

Feb 22 2026 8:02 AM | Updated on Feb 22 2026 8:02 AM

Greater Hyderabad Nears 1 Crore Mark in Vehicle Registrations

గ్రేటర్‌లో వాహనాల జోరు

హైదరాబాద్‌: జనాభాలో కోటి దాటేసిన గ్రేటర్‌... ఇప్పుడు వాహనాల్లోనూ ఆ సంఖ్యకు చేరువవుతోంది.  సగటున ప్రతి ఇంటికి కనీసం ఒకటి లేదా రెండు వాహనాలు ఉన్నాయి. కార్ల వినియోగమూ భారీగా పెరిగింది. ప్రజారవాణా సదుపాయాలను విస్తరించకపోవడంతో ఏటా వాహనాల సంఖ్య అధికమవుతోంది. నిత్యం వందల సంఖ్యలో కొత్తవి వచ్చి చేరుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు వ్యక్తిగత వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వేతనజీవులు, మధ్యతరగతి వర్గాలు  సొంత కార్ల వైపు మొగ్గు చూపుతుండగా, చిరుద్యోగులు, అల్పాదాయ వర్గాలు ద్విచక్ర వాహనాలను విస్తృతంగా కొనుగోలు చేస్తున్నారు.      

Advertisement
 
Advertisement
Advertisement