మా ఆయన తేడా.. | Wife Shocking Facts On Husband | Sakshi
Sakshi News home page

మా ఆయన తేడా..

Feb 22 2026 8:22 AM | Updated on Feb 22 2026 9:53 AM

Wife Shocking Facts On Husband

ధర్మవరం అర్బన్‌: ‘నా భర్త నపుంసకుడు. అతనికి స్నేహితుడితో అసహజ సంబంధాలున్నాయి. నేను బయట పెడతానన్న భయంతో నన్ను చంపాలని చూస్తున్నారు’ అని ధర్మవరం పట్టణంలోని రామ్‌నగర్‌లో నివాసముండే బాధితురాలు తెలిపింది. ఈ మేరకు ఆమె శనివారం స్థానిక ఎన్జీఓ హోంలో విలేకరులకు వివరాలు వెల్లడించింది. ఆమె మాటల్లోనే... ‘నాకు 13 ఏళ్ల క్రితం రామ్‌నగర్‌కు చెందిన విద్యుత్‌ శాఖ లైన్‌మెన్‌తో పెళ్లయ్యింది. మొదట్నుంచే అతని ప్రవర్తనలో తేడా కనిపించింది. ఏదో ఒక కారణంతో నన్ను దూరం పెడుతూ వచ్చేవాడు. అతని ప్రవర్తనలో రోజురోజుకూ మార్పులు వచ్చాయి. రాత్రిపూట నేను నిద్రపోయిన తర్వాత బీరువాలోని నా బంగారు నగలు తీసి మెడలో వేసుకునేవాడు. 

చీర కట్టుకుని, అద్దం ముందు కూర్చుని సంబరపడిపోయేవాడు. కాళ్లు, చేతుల గోళ్లకు నెయిల్‌ పాలిష్‌ వేసుకుంటూ మురిసిపోయేవాడు. తోటి లైన్‌మెన్‌ నా భర్తకు క్లోజ్‌ ఫ్రెండ్‌. వారిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. రాత్రి నేను నిద్రపోయాక నా భర్త మహిళలా అందంగా అలంకరించుకుని స్నేహితుడికి ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించుకునేవాడు. ఇద్దరూ పక్క గదిలో నగ్నంగా పడుకునేవారు. ఒకరోజు ఈ దృశ్యం చూసి నా గుండె పగిలింది. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల బయటకు చెప్పుకోలేకపోయా. నాలో నేనే కుమిలిపోయా. వారి బాగోతం నాకు తెలిసిపోవడంతో అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధించడంతో నా తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ డబ్బులు ఇచ్చారు.

 అయినా వేధింపులు ఆపలేదు. నేను బతికుంటే ఏదోఒక రోజు వారి బండారం బయటకు వచ్చి జనంలో పరువు పోతుందన్న ఉద్దేశంతో చంపాలని చూస్తున్నారు. నేను భయపడి మూడేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయా. భర్త నుంచి భరణం కావాలని కోర్టును ఆశ్రయించా. అప్పట్నుంచీ నన్ను చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేను, మా నాన్న ఎక్కడికి వెళితే అక్కడికి వస్తూ ఫొటోలు, వీడియోలు తీస్తూ బెదిరిస్తున్నారు. ఈ విషయంపై ఎస్పీ సతీష్‌ కుమార్‌కు ఫిర్యాదు చేయగా..ధర్మవరం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. నా భర్తను, అతని స్నేహితుడిని టూ టౌన్‌ సీఐ పిలిపించి మందలించారు. అయినా మార్పు రాలేదు. వారి నుంచి ప్రాణహాని ఉంది. నన్ను రక్షించాలి. నాలా మరో ఆడపిల్ల మోసపోకూడదని వారి బాగోతం బయట పెడుతున్నా.’ 

భర్త, స్నేహితుడిపై కేసు నమోదు 
రామ్‌నగర్‌కు చెందిన మహిళను చంపుతామని బెదిరించిన భర్తతో పాటు అతని స్నేహితుడిపై కేసు నమోదు చేసినట్లు ధర్మవరం టూ టౌన్‌ సీఐ రెడ్డెప్ప తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టామన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement