పీడియాట్రిక్ సర్జరీ విభాగానికి పీజీ సీట్ల మంజూరు
అనంతపురం: స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని పీడియాట్రిక్ సర్జరీ విభాగానికి కొత్తగా నాలుగు పీజీ సీట్లు మంజూరయ్యాయి. 2025 –26 విద్యా సంవత్సరానికి గాను ఈ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ జి చలపతి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి మృదుల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి స్వాతి, ట్యూటర్ డాక్టర్ భాస్కర్, ఎన్‌ఎంసి కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్, డాక్టర్ ప్రవీణ్ దీన్, డాక్టర్ ప్రవీణ తదితరులు ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం విజయశ్రీ, సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ మల్లీశ్వరిను శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ బెనెడిక్ట్, వైస్ ప్రిన్సిపళ్లు డాక్టర్ షంషాద్ బేగం, డాక్టర్ ఎస్ షారోన్ సోనియా, డాక్టర్ టి మధు, అనాటమీ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.
పీడియాట్రిక్ సర్జరీ విభాగానికి పీజీ సీట్ల మంజూరు


