అచ్చం.. అలాగే!
సందర్భం : నేడు ప్రపంచ కవలల దినోత్సవం
అనంతపురం కల్చరల్/గుత్తి రూరల్: ఒకే పోలిక.. ఒకే డ్రెస్. అచ్చం ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే! జిరాక్స్ టూ జిరాక్స్... ఇలా చెప్పుకుంటూ పోతే కవలల గురించి ఎన్నో అంశాల్ని పోల్చి చెప్పినా తక్కువే అవుతుంది. తల్లిగర్భంలో ఒకేసారి, ఒకే రూపంతో మొదలై.. క్షణాల వ్యవధిలో బయటి ప్రపంచానికి పరిచయమై.. ఒకే ముఖకవళికలతో అందరినీ అమితంగా ఆకట్టుకోవడం కవలల ప్రత్యేకత. ముద్దులొలికే పసికందులను చూడగానే వారి పేర్లను కూడా దరిదాపు ఒకేలా పెట్టేయడం పరిపాటిగా మారింది. రామయ్య.. లక్ష్మయ్య, రమేష్.. నరేష్, జలజ.. శైలజ లాంటి పేర్లతోనూ తికమక పట్టించేస్తుంటారు. ప్రపంచ కవలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సైన్స్ ఏమి చెబుతోందంటే..
సృష్టి లోని ఎన్నో వింతలు, అద్భుతాల్లో కవలల జననం కూడా ఒకటిగా ఉంటోంది. బాగా తెలిసిన వారు సైతం కవలలను ఎవరెవరో పోల్చుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఫలదీకరణ సమయంలో వచ్చే మార్పుల కారణంగా కవలల జననం సంభవిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రత్యుత్పత్తి ప్రక్రియలో అండం ఏర్పడిన తర్వాత శుక్రకణం రెండుగా విడిపోయి జన్మించిన కవలలను మోనోజైగోటిక్ లేదా యూని ఓవిలార్ ట్విన్స్ అంటారు. వీరిలో ఇద్దరూ ఆడ లేదా, మగ అయి ఉంటారు. వీరికి చాలా దగ్గర పోలికలుంటాయి. రెండు శుక్ర కణాలు ఏర్పడి జన్మించే కవలలను ‘డై జైగోటిక్ లేదా బైనోవిలార్ ట్విన్స్ అంటారు. వీరిలో ఒకరు ఆడ, మరొకరు మగ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కవలల దినోత్సవ ఆవిర్భావమిలా..
ప్రథమంగా కవలల దినోత్సవాన్ని పోలెండు దేశస్థులు 1976లో నిర్వహించారు. మోజెస్, విల్‌కాక్స్ అనే కవల సోదరులు తాము నిసిస్తున్న ఊరికి ‘ట్విన్స్ బర్గ్’ అని పేరుపెట్టుకున్నారు. కవలలనే పెండ్లాడి, మళ్లీ కవలలకే జన్మనిచ్చారు. దురదృష్టమైన విషయమేమంటే ఒకే రకమైన వ్యాధి సోకి వారిద్దరూ ఒకే రోజు మరణించారు. వీరి గుర్తుగా ప్రతి ఫిబ్రవరి 22న అంతర్జాతీయ కవలల దినం జరపడం పరిపాటిగా మారింది.
అందరినీ ఆశ్చర్యానికి
గురిచేస్తున్న కవలలు
ఒకే పోలికతో తికమక పెట్టిన
సందర్భాలు అనేకం


