అంతర్‌ జిల్లా దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లా దొంగల అరెస్ట్‌

Feb 22 2026 8:07 AM | Updated on Feb 22 2026 8:07 AM

అంతర్‌ జిల్లా దొంగల అరెస్ట్‌

అంతర్‌ జిల్లా దొంగల అరెస్ట్‌

అనంతపురం సెంట్రల్‌: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్‌ జిల్లా దొంగలను అనంతపురం సీసీఎస్‌, మూడో పట్టణ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్‌ చేశారు. పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. పట్టుబడిన నిందితుల్లో అనంతపురంలోని నవోదయకాలనీకి చెందిన బాషా అలియాస్‌ కురబ రామాంజనేయులు, వైఎస్సార్‌ కడప జిల్లా శ్రీరామ్‌నగర్‌కు చెందిన వల్లెపు ప్రసాద్‌ ఉన్నారు. వీరి నుంచి రూ. 25 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కడప, గుత్తి, బుక్కరాయసముద్రం, అనంతపురం తదితర ప్రాంతాల్లో పలు దొంగతనాల కేసులు ఉన్నాయి. బేల్దారి పనులతో జీవనం సాగించే బాషా జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు తెరలేపాడు. గతంలో అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేసి జైలు పంపారు. పోక్సో యాక్ట్‌ కింద పామిడి పీఎస్‌లో ఇతనిపై కేసు నమోదైంది. ఈ కేసులో కడప జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సమయంలో వల్లెపు ప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ కలసి పలు దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బాషా ఇంట్లో దాచిన మొత్తం చోరీ సొత్తును విక్రయించేందుకు శనివారం విక్రయించేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా నడిమివంక వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు పట్టుబడ్డారు. విచారణ అనంతరం నిందితులను అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కార్యక్రమంలో త్రీటౌన్‌సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్‌, సీసీఎస్‌ సీఐలు జయపాల్‌రెడ్డి, శేషగిరి, రాగిరి రామయ్య, ఎస్‌ఐలు రాజశేఖరరెడ్డి, తులశన్న తదితరులు పాల్గొన్నారు.

రూ. 25 లక్షల విలువైన బంగారు,

వెండి ఆభరణాల స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement