breaking news
Anantapur Latest News
-
తడి, పొడి పద్ధతిలో వరి సాగు చేయాలి
గార్లదిన్నె: రైతులు తడి, పొడి పద్ధతిలో వరి పంట సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కల్లూరు, కనంపల్లిలో ‘పొలం పిలుస్తోంది’ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి ఉమాదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితుల వల్ల వరి పంట సాగు చేయవద్దన్నారు. బీడు భూముల్లో తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలన్నారు. రైతులు ఫారం పాండ్స్ నిర్మించుకుని వర్షపు నీటి వృథాను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ వెంకట్ కుమార్, టెక్నికల్ ఏఓ రాకేష్, ఏఓ సోమశేఖర్, హెచ్ఓ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సరఫరాలో విఫలం
● రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజంరాప్తాడు రూరల్: డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో ఉత్పత్తి తగ్గిపోయి, రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడుతోందని ఆరోపించారు. మంగళవారం హంపాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా విద్యుత్ సరఫరాను పెంచాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. వ్యవసాయానికి రోజుకు 9 గంటల విద్యుత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే రాప్తాడు నియోజకవర్గంలో మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం 7 గంటలైనా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులను చులకనగా చూస్తున్నారు విద్యుత్ ఉత్పత్తి చేసుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, విద్యుత్ కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేవని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. అమరావతి నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. రైతుల కష్టాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ చంద్రకుమార్, రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు, వైఎస్సార్సీపీ నాయకులు సత్తిరెడ్డి, గద్దె కేశవరెడ్డి, మండల కన్వీనరు సాకే వెంకటేశు, మాజీ కన్వీనరు శేఖర్, యూత్ కన్వీనరు విశ్వనాథరెడ్డి, హంపాపురం సింగారప్ప, చుక్కా సంజీవరాయుడు, రామినేపల్లి మాధవరెడ్డి, మన్నల రవికుమార్, రాప్తాడు చిరుతల నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
అనుమతి లేకుండా విక్రయం.. పురుగుల మందుల సీజ్
విడపనకల్లు: మండల పరిధిలోని గడేకల్లు గ్రామంలో మంగళవారం బాలాజీ ఫర్టిలైజర్ షాపుతో పాటు కోరమాండల్, మన గ్రోమోర్ సెంటర్లను అధికారులు తనిఖీ చేశారు. అనుమతి లేని పురుగుల మందులను విక్రయిస్తున్న సాయి బాలాజీ ఫర్టిలైజర్ షాపులో రూ.9,300, కోరమాండల్ షాపులో 40 లీటర్ల పురుగుల మందును సీజ్ చేశారు. రూ.1.3 లక్షల విలువ చేసే మందులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అనంతపురం, ఉరవకొండ ఏడీఏలు విద్యావతి, సత్యనారాయణ, వ్యవసాయాధికారి పెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు. -
కరువు మండలాలపై మల్లగుల్లాలు
అనంతపురం అగ్రికల్చర్: కరువు మండలాలను ప్రకటించేందుకు చంద్రబాబు సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నడుమ ఇప్పటికే కరువు గుప్పిట్లోకి వెళ్లినా.. ముందస్తు ప్రకటన చేయకుండా వేచిచూసే ధోరణి అవలంబిస్తుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా జిల్లా వ్యాప్తంగా కరువు ఛాయలు కమ్మేశాయి. అయినా కరువు మండలాలను ప్రకటించకుండా ఆలస్యం చేస్తుండటం గమనార్హం. ఈ నెలాఖరులోపు వర్షం వస్తే... కొన్ని మండలాలను జాబితా నుంచి తప్పించే ఎత్తుగడే ఆలస్యానికి కారణంగా చెబుతున్నారు. అన్నింటా లోటు వర్షపాతం ఖరీఫ్ సీజన్లో లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో 61.2 మి.మీకు గాను 11.8 శాతం అధికంగా 68.4 మి.మీ నమోదైంది. ఇక విత్తుకు కీలకమైన జూలైలో 64.3 మి.మీకు గాను ఏకంగా 70.8 శాతం తక్కువగా 18.8 మి.మీ నమోదైంది. పంటలు కీలకదశలో ఉండే ఆగస్టులో 84.4 మి.మీకు గాను 54 శాతం తక్కువగా 33.8 మి.మీ వర్షం కురిసింది. ఇక సెప్టెంబర్‌లో 111.6 మి.మీకు గాను కేవలం 1.8 మి.మీ నమోదు కావడం గమనార్హం. ఇలా నెలలు కరిగిపోతున్నా వర్షం జాడ కరువైంది. ఇప్పటి వరకు 230 మి.మీకు గాను 47 శాతం తక్కువగా 123 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థితి కొనసాగితే నాలుగైదు రోజుల్లో వర్షపాతం లోటు 50 శాతానికి చేరువకానుంది. 32 మండలాల్లోనూ సాధారణం కన్నా తక్కువగానే వర్షపాతం నమోదు కావడంతో కరువు జాబితాలోకి చేరాల్సిన పరిస్థితి నెలకొంది. 70 శాతానికి చేరిన ‘ఖరీఫ్’ ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం తాజా నివేదిక ప్రకారం 70 శాతానికి చేరింది. 3.43 లక్షల హెక్టార్లకు గానూ 2.38 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. అందులో కంది మాత్రమే అధికంగా సాగు చేశారు. 78,274 హెక్టార్లు అంచనా వేయగా ఏకంగా 1.18 లక్షల హెక్టార్లకు చేరింది. 1.47 లక్షలు హెక్టార్లు అంచనా వేసిన వేరుశనగ 51 వేల హెక్టార్లకు పరిమితమైంది. ఇక పత్తి 28 వేల హెక్టార్లు, మొక్కజొన్న 14,500 హెక్టార్లు, ఆముదం 11,500 హెక్టార్లు, సజ్జ 2,300 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 430 హెక్టార్లు, ఉలవ 220 హెక్టార్లు, అలసంద 150 హెక్టార్లు, జొన్న 430 హెక్టార్లు, సోయాబీన్ 160 హెక్టార్లలో సాగు చేశారు. ఇక నీటి వసతి కింద 23 వేల హెక్టార్లు అంచనా వేసిన వరి ప్రస్తుతం 10,700 హెక్టార్ల వద్ద ‘సాగు’తోంది. నెలల తరబడి వర్షం లేకపోవడంతో ఒక్క పంట నుంచి కూడా దిగుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇప్పటికే పంటలన్నీ ఎండుముఖం ముందస్తు ‘కరువు’ ప్రకటనపై సర్కారు మౌనముద్ర నెలాఖరులోపు వర్షం వస్తే మండలాలను తగ్గించేందుకు ఎత్తుగడ! -
నేడు వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
అనంతపురం న్యూటౌన్: స్థానిక సంస్థల సమరానికి వైఎస్సార్సీపీ సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా బుధవారం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని నగరంలోని జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసింది. మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాట్లను పర్యవేక్షించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి, రాబోయే ‘స్థానిక’ పోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు బోరెడ్డి నరేష్ కుమార్‌రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మధ్యా హ్నం 3 గంటలకు విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమవుతుందన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం.. ఇద్దరికి షోకాజ్ అనంతపురం ఎడ్యుకేషన్: కుందుర్పి మండలం అప్పిలేపల్లిలో తాగునీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి, డిప్యూటీ ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజ నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరా ఎందుకు నిలిచిపోయింది? అంతరాయానికి కారణాలేమిటి? సమస్య పరిష్కారానికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని డీపీఓ సూచించారు. నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. చుక్కలు చూపుతున్న ‘సర్వర్’ బొమ్మనహాళ్: సామాజిక భద్రత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారికి సర్వర్ పనిచేయకపోవడంతో చుక్కలు కనిపించాయి. రెండేళ్ల తర్వాత కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానించడం.. అదీ ఈ నెల 16వ తేదీలోపు వరకే గడువు ఉండడంతో అర్హులైన వారు సచివాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో రెండవరోజు మంగళవారం నేమకల్లు సచివాలయంలో సర్వర్ మొరాయించడంతో దరఖాస్తుదారులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల అయితే సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మిగిలిన రోజుల్లో పరిస్ధితి ఎలా ఉంటుందోనని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ ప్రక్రియపై అవగాహన లేని వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కుటుంబ సభ్యులు లేదా ఇతరులతో కలిసి సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్ధితులు ఏర్పడ్డాయి. -
కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలి
ప్రజల అవసరాలకు సంబంధించిన తాగునీటి పథకం నిర్వహణకు కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి. దీంతో కార్మికులకు ఉద్యోగ భద్రత, రాజకీయ జోక్యానికి అడ్డుకట్ట పడుతుంది. తొలగించిన 23 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. పూర్తి వేతనాలు, పీఎఫ్ చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలి. కార్మికులకు న్యాయం జరిగే వరకు సీఐటీయూ పోరాటం కొనసాగిస్తుంది. –ఎస్.నాగేంద్రకుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
సమగ్ర విచారణ చేపట్టాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యవేక్షణ పూర్తిగా కుప్పకూలింది. ఆర్డ్డబ్ల్యూఎస్ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజలకు నిరంతర తాగునీరు అందించడం పక్కనబెట్టి.. కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ ప్రజల హక్కులను తాకట్టు పెడుతున్నారు. శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా ప్రాజెక్టుపై హై లెవల్ కమిటీతో సమగ్ర విచారణ జరపాలి. అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. –వెన్నపూస రవీంద్రారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం -
తారస్థాయికి వర్గపోరు
అనంతపురం టౌన్: తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరుతోంది. త్వరలో జరగనున్న అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు చెక్ పెట్టేలా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తనదైన శైలిలో వ్యూహాలు పన్నుతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం కష్టపడి పని చేసిన మైనార్టీలు, బలిజ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు దగ్గుపాటికి దూరంగా ఉన్నారు. అలాంటి నేతలను వైకుంఠం తనవైపు తిప్పుకునేలా రాజకీయం నెరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మసీద్ శంకుస్థాపన కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నారు. శ్రీనగర్‌కాలనీలో ఆదివారం మసీదు శంకుస్థాపన సందర్భంగా కేఎం షకీల్‌షఫీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు. అసమ్మతి నేతలతో అలా జతకట్టి.. దగ్గుపాటికి వ్యతిరేకంగా ఉన్న బలిజ సామాజికవర్గ టీడీపీ ముఖ్య నాయకులతో పాటు ముస్లిం మైనార్టీ నేతలు ఆదివారం శ్రీనగర్ కాలనీలో జరిగిన మసీదు శంకుస్థాపనకు హాజరయ్యారు. వారందరినీ వైకుంఠం ప్రభాకర్‌చౌదరి ఆప్యాయంగా పలకరిస్తూ అక్కున చేర్చుకున్నారు. వారు కూడా చౌదరిని పొగడ్తలతో ముంచెత్తారు. 2024 ఎన్నికల్లో దగ్గుపాటి ప్రసాద్ గెలుపు కోసం పనిచేసిన టీడీపీ సీనియర్ నాయకుడు రాయల్ మురళిని ఎన్నికల అనంతరం దూరంగా పెట్టారు. టౌన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళి, మైనార్టీ నాయకులతోపాటు బీసీ నేతలు ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన అత్యంత సీనియర్ నాయకులు జిల్లా మాజీ అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తితోపాటు ఎమ్మెల్యేకు అన్నీ తానై నడిపించిన గంగారం, ఏపీఐఐసీ డైరెక్టర్ ఇలా అనేక మందిని ఎమ్మెల్యే దూరం పెట్టారు. అలాంటి వారందరినీ ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి రాజకీయాలు చేయడం మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గీయులకు మేయర్ పదవి రాకుండా చెక్ పెట్టే విధంగా వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిని పొగడ్తలతో ముంచెత్తుతూ విందు రాజకీయాలకు తెరలేపారు. అందులో భాగంగానే నెల రోజుల కిందట జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చమన్‌సాబ్ ఇంటిలో ఆయన తనయుడు ముక్తియార్ ఇచ్చిన విందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యతిరేక వర్గం పాల్గొంది. మైనార్టీలు, బలిజలు ఒకతాటిపైకి వచ్చి వచ్చే ఎన్నికల్లో దగ్గుపాటికి వ్యతిరేకంగా తమ సత్తా ఏమిటో చాటి చెప్పే విధంగా ముందుకు వెళ్లాలని చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దగ్గుపాటి – ప్రభాకర్‌చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి. రెండేళ్ల పాలనపై వైకుంఠం ప్రెస్‌మీట్ పెట్టి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దగ్గుపాటి పెద్ద ఎత్తున దందాలు, భూ అక్రమాలకు పాల్పడి రూ.వందల కోట్లు దోచుకున్నాడని దుమ్మెత్తిపోశారు. అధికార పార్టీలో రగులుకున్న అసమ్మతి పోరు ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి. సామాజికవర్గమంతా దూరమే.. ఎమ్మెల్యే దగ్గుపాటి నుంచి తనకు ప్రాణహాని ఉందని గతంలోనే ‘లిక్కర్’ సుధాకర్‌నాయుడు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేతో విభేదించి వైరి వర్గంగా కొనసాగుతున్నాడు. ఇక మున్సిపాలిటీ పరిధిలోని కాంట్రాక్టులన్నీ దగ్గుపాటి ఇన్ఫ్రాకు అప్పగించడంపై శ్రీనివాసచౌదరి అనే కాంట్రాక్టర్ ఇటీవల ఆర్టీఐ యాక్ట్ కింద వివరాలు అడిగాడు. అసలు సీనియార్టీ లేని దగ్గుపాటి ఇన్ఫ్రాకు పనులు ఎలా కేటాయించారని అందులో ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ఫోన్ ద్వారా మంతనాలు నడిపాడు. ఆ ఫోన్‌కాల్ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఎమ్మెల్యే భార్య శ్రీనివాసచౌదరిపై నాలుగో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన అతను..రెండు రోజుల కిందట హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. ఫ్లెక్సీ కడితేనే డీలర్షిప్ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ పెద్దలు స్టోర్ డీలర్ షిప్‌లన్నీ ‘తమ్ముళ్ల’కే ఇప్పించారు. దీంతో డీలర్ల వల్ల తనకేమీ లాభం లేదని భావించిన ఎమ్మెల్యే దగ్గుపాటి తన జన్మదినం.. ఇతరత్ర కార్యక్రమాల సమయంలో తన ఫొటోతో ప్రతి డీలరూ కనీసం 5 బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టాలని హుకుం జారీ చేశారు. అంతేకాకుండా సదరు ఫ్లెక్సీ ఫొటో, వీడియో పెట్టాలని ఆదేశించారు. లేకపోతే డీలర్షిప్ రద్దవుతుందని హెచ్చరించారు. దీంతో డీలర్లంతా ఇష్టం లేకపోయినా టీడీపీ కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యే ఇంటి ఫంక్షన్ల వేళ ఒక్కో ఫ్లెక్సీ రూ. 6 వేల చొప్పున ఖర్చు చేసి ఫెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై డీలర్లంతా ఇప్పటికే తమ గోడును టీడీపీ పెద్దల వద్ద వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటికి చెక్ పెట్టేలా వ్యూహాలు అసమ్మతి నేతలను కూడగడుతున్న ‘వైకుంఠం’ మసీద్ శంకుస్థాపన వేదికగా పావులు కదిపిన వైనం -
వైభవంగా ఆది చెన్నకేశవస్వామి రథోత్సవం
వజ్రకరూరు: కొనకొండ్లలో ఆది చెన్నకేశవ స్వామి రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకం, పల్లకీసేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మడుగు తేరు చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు ఉట్ల ఉత్సవం నిర్వహించారు. పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై కొలువుదీర్చారు. ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి జై ఆది చెన్నకేశవ అంటూ రథాన్ని ముందుకు లాగారు. స్వామివారి రథంపై భక్తులు పండ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. రథాన్ని మారెమ్మ కట్ట వరకు లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మాట్లాడుతూ ఏటా నిర్వహించే రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ప్రజలంతా ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో కలిసి మెలసి జీవించాలని భగవంతుడిని ప్రార్థించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ నాగస్వామి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కాకర్ల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమణాయాదవ్, మాజీ సర్పంచు నంచర్ల ఇందిరమ్మ, మాజీ ఎంపీపీ రామచంద్ర, ఆలయ ఈఓ అంగదాల క్రిష్ణయ్య, ఎంపీటీ సీలు పాపన్న, మునయ్య, ముద్దయ్య, సీనియర్ నేత నంచర్ల లాలెప్ప, మాజీ ఉప సర్పంచులు రామక్రిష్ణ, గురు, మాజీ ఎంపీటీసీ శ్రీరాములు, మాజీ సర్పంచు పెద్దరాజు, క్లర్క్ లాలేష్ పాల్గొన్నారు. నేడు వసంతోత్సవం.. ఆదిచెన్నకేశవ స్వామి రథోత్సవంలో భాగంగా బుధవారం స్వామివారికి అభిషేకం, పల్లకీ సేవ, వసంతోత్సవం, రాత్రి 8 గంటలకు భూదేవి, లక్ష్మమ్మ దోపులు, పల్లకీ సేవ నిర్వహించనున్నట్లు ఈఓ అంగదాల క్రిష్ణయ్య తెలిపారు. -
ఎండుతున్న పంటలను కాపాడండి
అనంతపురం: తీవ్ర వర్షాభావంతో ఎండిపోతున్న పండ్లతోటలను, పంటలను కాపాడుకోవడానికి తక్షణమే హంద్రీ–నీవా నీటితో చెరువులు నింపాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం కలెక్టర్ ఆనంద్‌ను కలిసి జిల్లాలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను వివరించి, వినతిపత్రం అందజేశారు. అనంతరం విశ్వ మాట్లాడుతూ జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రైతులను, ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హంద్రీ–నీవా కింద 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హంద్రీ–నీవా అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులకు జీవనాడి వంటిదన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చెరువులకు నీరు ఇచ్చిన తరువాతే.. ఇతర ప్రాంతాలకు నీరు తరలించాలని కోరారు. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌కు 300 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజూ నీరు వృథాగా కిందకు వెళ్తోందన్నారు. టీబీ డ్యాంలో 96 టీఎంసీల నీరున్నందున సరైన ప్రణాళికతో అనంతపురం జిల్లాకు అదనంగా 5 టీఎంసీల నీటిని మళ్లించే అవకాశం ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కూడేరులో దారుణ పరిస్థితులు జిల్లాలో సగటు వర్షపాతం 550 మి.మీ అయితే, కూడేరు ప్రాంతంలో 350 మి.మీ మాత్రమే కురుస్తుందని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. అయితే ఈ ఏడాది ఎల్–నినో ప్రభావంతో 150 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైందన్నారు. భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లు ఎండిపోవడంతో కన్నబిడ్డల్లా పెంచుకున్న పండ్ల తోటలను కాపాడుకోవడానికి రైతులు రోజుకు ట్యాంకర్‌కు రూ.600 చొప్పున వెచ్చించాల్సి వస్తోందన్నారు. ఈ భారం మోయలేక రైతులు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలే కాకుండా మనుషులకు, పశువులకు కూడా తీవ్రమైన తాగునీటి సమస్య తలెత్తిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాయలసీమ జోనల్ అధికార ప్రతినిధి కేవీ రమణ, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, కూడేరు మండల అధ్యక్షుడు బైరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హంద్రీ–నీవా కింద 3.5 లక్షల ఆయకట్టుకు నీరివ్వాలి ఉమ్మడి జిల్లాలో చెరువులు నిండిన తర్వాతే ఇతర ప్రాంతాలకునీరు తరలించాలి వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ -
దాడి కేసులో ముగ్గురి అరెస్ట్
నార్పల: మామపై దాడికి పాల్పడిన అల్లుడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు నార్పల ఎస్ఐ జి.సాగర్ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా తాతిరెడ్డి పల్లికి చెందిన చరణ్‌కు నార్పల గ్రామానికి చెందిన రమాదేవితో 18 నెలల క్రితం వివాహమైంది. ఇటీవల రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చిన భార్యను చూసేందుకు గత నెల 31న చరణ్ తన తండ్రి శివకుమార్, బంధువు శివకల్యాణ్తో కలిసి నార్పల వచ్చాడు. తన భార్య, పిల్లలను పంపాలని కోరగా, ఇప్పుడు పంపలేమని అత్తామామాలు చెప్పారు. ఆ మాటలకు ఆగ్రహం చెందిన చరణ్ వెంట తెచ్చుకున్న కొడవలితో మామ చిలమకూరి రాజా మెడపై దాడి చేయబోయాడు. గమనించిన రాజా తన చేతిని అడ్డుపెట్టడంతో తీవ్ర గాయమైంది. మిగిలిన ఇద్దరు కూడా రాజాపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చిలమకూరి రాజా కుమార్తె రమాదేవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నాయనపల్లి క్రాస్ వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దాడికి ఉపయోగించిన కొడవలిని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
ప్రొఫెసర్ వైశాలికి విశిష్ట మహిళా ఇంజినీర్ అవార్డు
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) ప్రొఫెసర్ డాక్టర్ వైశాలి జి. ఘోర్పడేను విశిష్ట మహిళా ఇంజినీర్ అవార్డు– 2026కు ఎంపిక చేశారు. మంగళవారం 56వ ఇంజినీర్స్ డే అవార్డులను ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా), ఏపీఎస్సీ ప్రకటించాయి. ప్రస్తుతం వైశాలి జి. ఘోర్పడే జేఎన్టీయూలో రీసెర్చ్ – డెవలప్మెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, మేధో సంపత్తి హక్కులు, సాంకేతికత ఆధారిత పరిశోధనలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. డాక్టర్ వైశాలి ఎంపికపై వర్సిటీ వీసీ డా.హెచ్ సుదర్శనరావు, రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెలోని విద్యా నైపుణ్యం, పరిశోధన ప్రతిభ, ఇంజినీరింగ్ రంగానికి అందిస్తున్న విశిష్ట సేవలు, పరిపాలన నాయకత్వం, సంస్థాగత అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమంపై నిబద్ధతతకు ఈ గౌరవం ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. ఆమె అకడమిక్ ప్రొఫైల్‌లో 70కి పైగా పరిశోధనా ప్రచురణలు, పుస్తక అధ్యాయాలు, బాహ్య నిధులతో కూడిన పరిశోధనా కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేసిన కృషి ఉన్నాయన్నారు. -
రోడ్డు ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలు
గుంతకల్లు రూరల్: స్థానిక టీవీ స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంతకల్లు పట్టణానికి చెందిన జోహా అనే బాలిక తీవ్రంగా గాయపడింది. వివరాలు.. ఎఫ్‌సీఐ గోడౌన్ సమీపంలో నివాసం ఉంటున్న ఎస్కే రియాజ్ బాషా, నసీరున్సీసా దంపతుల కుమార్తె జోహ పట్టణంలోని సాయిబాబా స్కూల్లో 5వ తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం స్కూలు వదలగానే తండ్రి రియాజ్‌బాషా కుమార్తెను స్కూటీపై ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో టీవీ స్టేషన్ వద్ద మలుపు తిరగ్గానే ఎదురుగా వేగంగా వచ్చిన కంటైనర్ లారీ స్కూటీని ఢీకొంది. దీంతో తండ్రి,కుమార్తె పక్కకు పడిపోయారు. అదే సమయంలో కంటైనర్ లారీ టైరు బాలిక కుడికాలిపై వెళ్లడంతో ఛిద్రమైపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన రియాజ్‌బాషా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే ఇద్దరినీ గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం బాలికను అనంతపురం తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. స్థానికుల రాస్తారోకో టీవీ స్టేషన్ సమీపంలో ఇటీవల నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ అక్కడ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆందోళనకు దిగారు. నిత్యం భారీ వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డులో ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, ప్రమాదంలో గాయపడిన బాలిక కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ స్థానికులకు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. -
హనుమ ఆలయాలు కిటకిట
గుంతకల్లు రూరల్:శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో స్వామివారు ఒంటె వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వేకువజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఉత్సవ మూర్తిని ఒంటె వాహనంపై కొలువుదీర్చి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ పురవీధుల్లో ప్రాకారోత్సవం నిర్వహించారు. బొమ్మనహాళ్: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నేమకల్లు, మురడి ఆంజనేయస్వాముల బాలాలయాలకు శ్రావణమాసం చివరి నాల్గో మంగళవారం సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్‌స్వామి, పవన్‌స్వామి ఆధ్వర్యంలో ఆలయాల్లో స్వామివారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహానివేదన, మహామంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తుల కోసం దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బొమ్మనహాళ్, డి.హీరేహాళ్ ఎస్ఐలు నబీరసూల్, గురుప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలంకరణలో నేమకల్లు, మురడి ఆంజనేయస్వామి వార్లు నేమకల్లులో దర్శనం కోసం క్యూకట్టిన భక్తులు మురడిలో భక్తుల రద్దీ ఒంటె వాహనంపై విహరిస్తున్న నెట్టికంటుడు -
ఇసుక అక్రమ రవాణాకు చెక్
పామిడి: వంకరాజుకాలువ గ్రామ పెన్నానది పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతుండటంపై గ్రామస్తులు ఆగ్రహించారు. మూకుమ్మడిగా వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. నది పరీవాహక ప్రాంతం సమీపంలో 150 మంది రైతులు 400 ఎకరాల మాగాణిలో వరి సాగుచేస్తున్నారు. ఇసుక అక్రమ తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటి పంటలకు, తాగడానికి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉండటంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. ఇలాగే ఉంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించి మంగళవారం ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా తవ్వకాలు చేపడతారంటూ ప్రశ్నించారు. ఇంతలో నియోజకవర్గ ప్రజాప్రతినిధి కార్యాలయం నుంచి గ్రామ టీడీపీ నాయకులకు ఫోన్ వచ్చింది. సిక్స్‌వే నిర్మాణంలో భాగంగా గుడ్డాలపల్లి వద్ద చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణం కోసం ఇసుక తరలిస్తున్నట్లు తెలపగా.. సాగు–తాగునీటికి ఇబ్బంది ఏర్పడే అవకాశమున్నందున తవ్వకాలకు గ్రామస్తులు ససేమిరా అన్నారు. గత్యంతరం లేక ప్రజాప్రతినిధి ఆదేశాలతో ఇసుక రవాణాదారులు హిటా చీ, టిప్పర్లను పెన్నానది నుంచి తీసుకెళ్లిపోయారు. -
అగ్ని ప్రమాదంలో పశుగ్రాసం దగ్ధం
బెళుగుప్ప: మండల కేంద్రానికి చెందిన రైతు శివ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో అగ్ని ప్రమాదం జరిగింది. పశుగ్రాసంతో పాటు గృహోపకరణాలు, పశువుల షెడ్డు మంటల్లో కాలిపోయాయి. కళ్యాణదుర్గం అగ్నిమాపక స్టేషన్ ఇన్చార్జ్ వసంతనాయక్, సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో ఘటనాస్థలికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను చుట్టుపక్కల గడ్డివాములకు విస్తరించకుండా ఫైర్ సిబ్బంది అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదంతో రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు శివ పేర్కొన్నారు. రైలు కింద పడి యువతి ఆత్మహత్య గుత్తి: పట్టణంలోని చెర్లోపల్లి కాలనీకి చెందిన మునిస్వామి కుమార్తె హేమ(20) కాల్వగడ్డ ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హేమ కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా నయం కాలేదు. ఇటీవల హేమకు పెళ్లి ఖాయమైంది. దసరాకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే ఘోరం జరిగిపోయిందని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మునిస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. డీఎస్సీ అవకతవకలపై విచారణ జరపాలి ● ఎస్ఎఫ్ఐ డిమాండ్ అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలో డీఎస్సీ నియామకాలు, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తరిమెల గిరి, ఓతూరు పరమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఒకవైపు అవకతవకలు జరగలేదని చెబుతూనే మరోవైపు కొంతమందిని అరెస్టు చేయడం, పలు ఘటనలపై విచారణకు ఆదేశించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎంపికై న అభ్యర్థుల విజయగాథలను మంత్రులు, ఎమ్మెల్యేలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం కంటే, అన్యాయానికి గురైన అభ్యర్థుల సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ఏళ్ల తరబడి చదువుతూ, లక్షల రూపాయలు ఖర్చు చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం జరిగితే వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారిపై కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు అంగన్వాడీ కేంద్రాల బలోపేతమే లక్ష్యం ● ఐసీడీఎస్ పీడీ సాజిదా బేగం అనంతపురం సిటీ: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టినట్లు ఐసీడీఎస్ పీడీ సాజిదాబేగం తెలిపారు. ‘నా అంగన్వాడీ – నా బాధ్యత’ నినాదంతో అక్టోబర్ 8 వరకూ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రీయ పోషణ్ మహోత్సవాలను బుధవారం ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో రాష్ట్రీయ పోషణ్ మహోత్సవాలను నిర్వహించనున్నామన్నారు. పోషకాహారం, ఆరోగ్యం, తల్లులు, చిన్నారుల సంరక్షణతో పాటు బాలల సమగ్ర అభివృద్ధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ప్రధానంగా ఆహార వైవిధ్యం – తగినంత ప్రోటీన్, అంగన్వాడీ కేంద్రాల్లో తాజా వేడి వంటకాల పంపిణీ, సమాజ భాగస్వామ్యం – జవాబుదారీతనం, పోషణ– చిన్నారుల ప్రాథమిక అభివృద్ధి, ప్రధానమంత్రి మాతృవందన యోజన అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో తల్లిదండ్రులు, తల్లుల కమిటీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కిశోర బాలికలు, కమ్యూనిటీ వలంటీర్లు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటినా పట్టదా?
ఉరవకొండ: నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూలైతో పోలిస్తే ఆగస్టు చివరి నాటికి అనేక రకాల సరుకుల ధరలు 40 నుంచి 75 శాతం వరకూ పెరిగాయన్నారు. బియ్యం, పప్పులు, పంచదార, నూనె, కూరగాయలు, వంటగ్యాస్ ఇలా అన్ని ధరలు ఆకాశాన్నంటాయన్నారు. గ్రామాల్లో కూలి పనులు తగ్గడంతో పాటు పట్టణాల్లో ఉపాధి దొరక్కపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. వైద్యం, ఇతర ఖర్చులు పెరగడంతో పేద, సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందన్నారు. ప్రతి కుటుంబంపై సగటున రూ. 4 వేల నుంచి రూ.7 వేల అదనపు భారం పడిందన్నారు. జీఎస్టీ 2.0తో నిత్యావసరాల ధరలు తగ్గి ఊరట లభిస్తుందని చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నేతలు గొప్పలు చెప్పారని, క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా మేల్కొని పేదలకు రేషన్ షాపుల ద్వారా పంచదార, పప్పు, వంటనూనె, ఉల్లిపాయలు వంటివి అందించి ఆదుకోవాలని కోరారు. చంద్రబాబు సర్కారుపై ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఆగ్రహం -
గాండ్లపాడు ఘటనలో నిందితుడిని శిక్షించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాలలోకి చొరబడి ఉపాధ్యాయుడిపై దాడి చేయడంతో పాటు విద్యా పరికరాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ (వైఎస్ఆర్టీఏ) డిమాండ్ చేసింది. పుట్లూరు మండలం గాండ్లపాడు ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఘటనను సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోమవారం డీఈఓ అయ్యూబ్హుస్సేన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాలతో ఎలాంటి సంబంధం లేని ఓ వ్యక్తి మద్యం తాగేందుకు డబ్బు కావాలంటూ ఉపాధ్యాయుడిని వేధించాడని, డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో దాడి చేసి తలపై గాయపరిచాడని తెలిపారు. అంతటితో ఆగకుండా పాఠశాలలోని ఐఎఫ్బీ ప్యానల్ బోర్డు, బెంచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. ఈ ఘటనతో ఉపాధ్యాయులు విధులు నిర్వహించేందుకు భయపడుతున్నారని తెలిపారు. పోలీసులు, విద్యాశాఖ అధికారులు ఘటనను తీవ్రంగా పరిగణించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాలలో ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని కోరారు. అశోక్‌కుమార్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి వైఎస్ఆర్టీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్‌రెడ్డి సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని నాయకులు డీఈఓను కోరారు. టెట్‌కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చే సమయంలో డీఎస్సీపై ఫిర్యాదు చేశారనే కారణంతో సంబంధం లేని అంశాన్ని ముడిపెట్టి సస్పెండ్ చేయడం విచారకరమన్నారు. నిరాధార ఆరోపణలతో విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. డీఈఓను కలిసిన వారిలో వైఎస్ఆర్టీఏ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్‌రెడ్డి, రాధాకృష్ణాడ్డి, ఉపాధ్యక్షులు వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు విశ్వనాథరెడ్డి, కృష్ణానాయక్, రామకృష్ణ ఉన్నారు. డీఈఓకు వైఎస్సార్‌టీఏ వినతి -
వైభవంగా దొణగంగమ్మ జాతర
గుమ్మఘట్ట: రాయదుర్గం మండలంలోని టీ.వీరాపురం గ్రామ సమీపంలో వెలసిన దొణ గంగమ్మ జాతర సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. జాతరకు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంలో కొలువుదీర్చి పురవీధులలో మేళతాళాల నడుమ ఊరేగింపుగా దొణవద్దకు చేర్చారు. తిరిగి సాయంత్రం రథాన్ని ఆలయం వద్దకు లాగారు. అంతకుమునుపు మహిళలు భక్తిశ్రద్ధలతో దొణవద్దకు చేరుకుని గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు కాంట్రాక్టర్ నేత్రపల్లి ఆర్టీ లక్ష్మీకాంతారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మల్లికార్జున, మాజీ సర్పంచ్ ఓబుళమ్మ, మాజీ ఎంపీటీసీ రాజమ్మ, మెట్టు ధనుంజయరెడ్డి, గొల్ల రామాంజినేయులు, తిమ్మారెడ్డి, అనుమేష్, రామన్నయాదవ్ లక్ష్మీరెడ్డి, చిత్రయ్య, మహేష్, అశోక్, ప్రకాష్, దుబాయ్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
కలశం చిచ్చు.. ఇరువర్గాల ఘర్షణ
డి.హీరేహాళ్ (బొమ్మనహాళ్): ఆలయంపై కలశం ఏర్పాటు చిచ్చు రేపింది. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో నలుగురికి గాయాలయ్యాయి.. డి.హీరేహాళ్ మండలం పులకర్తిలో జంబన్న తాత గుడి వెనుక ఉన్న మడివాల మాచిదేవ ఆలయ విషయంలో రజకులు, కురుబల మధ్య కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఆలయ హక్కులు, నిర్వహణ తదితర అంశాలపై ఇరువర్గాలు రాయదుర్గం కోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్ధానం పరిధిలో ఉంది. ఈ క్రమంలో సోమవారం రజక వర్గానికి చెందిన వారు ఆలయంపై కలశం ఏర్పాటు చేశారు. కోర్టులో వివాదం నడుస్తున్న సమయంలో కలశం ఎలా ఏర్పాటు చేస్తారంటూ కురుబ వర్గానికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కలశాన్ని తొలగించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని చివరకు పరస్పరం దాడులకు దారితీసింది. సమాచారం అందుకున్న రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, డి.హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి సిబ్బందితో వెంటనే గ్రామానికి చేరుకున్నారు. ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘర్షణలో గాయపడిన రజకవర్గానికి చెందిన ఎర్రిస్వామి, హేమంతరాజు, కురుబ వర్గానికి చెందిన లోకేష్, మంజునాథ్‌ను రాయదుర్గం, బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
చీనీ తోటలో విధ్వంసం
గుంతకల్లు రూరల్: మండల పరిధిలోని ఓబుళాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మైనాపురం గ్రామంలో రైతు వెంకటేష్‌కు చెందిన తోటలోకి ఆదివారం రాత్రి దుందగులు చొరబడి చీనీ చెట్లను నరికివేశారు. రైతు వెంకటేష్ తన 9.5 ఎకరాల పొలంలో నాలుగు సంవత్సరాల క్రితం చీనీ తోట సాగు చేశాడు. పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. ఈ ఏడాది మొదటికోతను తీయాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తోటలోకి జేసీబీతో చొరబడి మొక్కలపై ఇష్టారాజ్యంగా నడిపిస్తూ 200 మొక్కలను నాశనం చేశారు. ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు వెంకటేష్ చీనీ మొక్కలు నేలకు ఒరిగి ఉండటాన్ని గమనించి హతాశుడయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనాపురం గ్రామానికి చెందిన శేఖర్‌కు, తనకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, ఈ విషయంలో ఆదివారం అర్ధరాత్రి శేఖర్ తనకు ఫోన్ చేసి దుర్భాషలాడాడని బాధితుడు తెలిపాడు. శేఖర్ తన జేసీబీతో ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపించాడు. బైకును ఢీకొన్న టిప్పర్.. వృద్ధురాలి మృతి● మరొకరికి తీవ్రగాయాలు బత్తలపల్లి: ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బత్తలపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. సోమవారం ధర్మవరం పట్టణం కొత్తపేటకు చెందిన వెంకటరమణ, అతని తల్లి లక్ష్మీనారాయణమ్మ (60) ద్విచక్రవాహనంలో తాడిపత్రికి వెళుతున్నారు. మార్గమధ్యంలో మండల పరిధిలోని పోట్లమర్రి ఆంజనేయస్వామి ఆలయం వద్ద టిప్పర్ వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీనారాయణమ్మ మృతి చెందగా, వెంకటరమణ చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న బత్తలపల్లి పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ●బత్తలపల్లి నుంచి ధర్మవరం వైపు వెళ్లే టిప్పర్ల వేగానికి అంతేలేకుండా పోతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇసుక, బంకమట్టి, కంకర లోడుతో వెళ్లే టిప్పర్లకు స్పీడ్ బ్రేకర్ల వద్ద కూడా ఏమాత్రమూ అడ్డూఅదుపు ఉండదన్నారు. వీటిపైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఏడీసీసీబీకి టోకరా
● నకిలీ బంగారంతో రూ.కోట్ల రుణాలు? చిలమత్తూరు: అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఏడీసీసీ)కే టోకరా వేశారు. ఆ బ్యాంకు హిందూపురం శాఖలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి ఏకంగా రూ.8 కోట్ల దాకా రుణాలు పొందినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. బ్యాంకు అధికారుల ప్రమేయంతోనే ఈ స్కాం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల తనిఖీల్లో ఈ ఘరానా మోసం బయట పడ్డట్టుగా తెలుస్తోంది. పదుల సంఖ్యలో గోల్డ్‌లోన్ ఖాతాలను తెరిచి నకిలీ బంగారంతో సుమారు రూ.8 కోట్ల వరకూ రుణాలు పొందారనే చర్చ సాగుతోంది. ఆ బ్యాంకులో అంతపెద్ద మొత్తంలో రుణాల మంజూరుకు అనుమతి లేదని అధికార వర్గాలు చెబుతుండగా, ఇంత పెద్ద స్కాం ఎలా జరిగిందనే దానిపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు తనిఖీలు చేసే సమయంలో బంగారం నాణ్యతలో తేడాలొచ్చినట్టుగా సమాచారం. అధికారులకు అనుమానం వచ్చి గోల్డ్ లోన్ కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని తనిఖీ చేయగా... ‘నకిలీ’ గుట్టు రట్టయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అధికారులు రహస్యంగా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకు ఉన్నతాధికారులు మాత్రం ఈ గోల్డ్ స్కాం అంశాన్ని ధ్రువీకరించడం లేదు. త్వరలో ‘స్థానిక’ ఎన్నికలు అనంతపురం న్యూటౌన్: త్వరలో గడువు ముగియనున్న మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నోటిఫికేషన్ (నం.515) జారీ చేశారు. మండల ప్రజా పరిషత్‌ల ఐదేళ్ల పదవీ కాలం ఈ నెల 23తోనూ, జిల్లా పరిషత్‌ల గడువు ఈ నెల 24తోనూ ముగియనుందని, త్వరలోనే మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలకు ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్న నియమ నిబంధనల మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితాలను మండల ప్రాదేశిక నియోజక వర్గాల వారీగా ఆయా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, జిల్లా పరిషత్ ఫొటో ఓటర్ల జాబితాలను జెడ్పీటీసీల వారీగా సీఈఓలు తయారు చేస్తారు. ప్రజల పరిశీలన నిమిత్తం ఈ నెల 11న ఎంపీపీ, జెడ్పీ కార్యాలయాల్లో ప్రచురించాలి. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు సమన్వయంతో పర్యవేక్షించి, ఎస్ఈసీ ఆదేశాలను అమలుచేయాలని ఆ నోటిఫికేషన్లో స్పష్టంచేశారు. విద్యార్థులకు బాలల బీమా అమలు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి బాలల బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. బాలల బీమా కింద ప్రమాదవశాత్తు మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25వేల ఆర్థికసాయం అందజేస్తారు. ప్రమాదంలో తీవ్ర వైకల్యానికి గురైన విద్యార్థులకు రూ.10 వేలు చెల్లిస్తారు. ప్రతి విద్యార్థి నుంచి ప్రీమియం కింద రూ.5 చొప్పున ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు వసూలు చేసి సంబంధిత మండల విద్యాశాఖ అధికారికి అందజేయాలని సూచించారు. పాఠశాలల వారీగా విద్యార్థుల జాబితాతో పాటు అసలు రశీదును అక్టోబర్ 31లోగా సమగ్ర శిక్ష అనంతపురం కార్యాలయంలో అందజేయాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకూడదు అనంతపురం అర్బన్: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఎల్–నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు. నీటి సమస్య తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీఓలు, సంక్షేమ వసతి గృహాల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా తాగునీటి సమస్య ఉన్నట్లు తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జాబ్‌కార్డులున్న ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని ఆదేశించారు. ఈ–పంట నమోదు వందశాతం జరగాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ సాలురెడ్డి, ఉద్యానశాఖ ఏడీ ఉమాదేవి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ శైలజ తదితరులు పాల్గొన్నారు. -
చీనీ రైతు ఉక్కిరిబిక్కిరి
వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటడం, చీనీ తోటలు వాడుముఖం పట్టడం, తెగుళ్లతో కాయలు దెబ్బతినడం వెరసి చీనీ రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మార్కెట్లో చీనీ ధరలు భారీగా పడిపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. చీనీ తోటలో తెగుళ్ల నివారణకు పురుగుల మందులు పిచికారీ చేయాలంటే ధరలు పెరిగిపోయాయి. మార్కెట్లో చీనీ ధరలు కూడా తగ్గిపోయాయి. ధరలు ఉంటే అప్పు చేసి తెచ్చయినా మందులు పిచికారీ చేసేవాడిని. దిగుబడి వచ్చిన తరువాత చెల్లించేవాడిని. అయితే, కాయలు కొనుగోలు చేయడానికి వ్యాపారులు తోటల వద్దకు రాకపోవడంతో దిక్కుతోచడం లేదు. – థామస్‌రెడ్డి, రైతు, తాడిపత్రి తాడిపత్రి రూరల్: జిల్లాలో 1.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో చీనీ తోటలు విస్తరించాయి. యల్లనూరు, పుట్లూరు, తాడిపత్రి, పెద్దపప్పూరు, గార్లదిన్నె, నార్పల, కళ్యాణదర్గం తదితర మండలాల్లో భారీగా చీనీ పంట సాగవుతోంది. తెగుళ్లు, పెరిగిన పెట్టుబడులు, ధరల హెచ్చుతగ్గులు, మారిన వ్యవసాయ పరిస్థితులు, అడుగంటుతున్న భూగర్భజలాలు తదితర కారణాలతో ఇటీవల కొంతమంది రైతులు తోటల్లోని చీనీ చెట్లను కొట్టివేస్తున్నారు. వాటి స్థానంలో అరటి, దానిమ్మ, బొప్పాయి, మొక్కజొన్న తదితర పంటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితం ఏదీ..? చీనీ తోటలకు ఇటీవల బోరాన్, ఎండుతెగులు, తెల్లదోమ ఆశించడంతో పంట దిగుబడి తగ్గుతోంది. బోరాన్ లోపం వల్ల కాయలు పగులుతున్నాయి. గట్టిగా మారి రసం తగ్గిపోతోంది. ఎండు తెగులు కారణంగా చెట్లు ఎండిపోతున్నాయి. తోటలకు తెల్లదోమ పోటు ఎక్కువగా ఉంది. కాయలు, ఆకులపై తెల్లగా పిండి చల్లినట్టుగా కనిపిస్తోంది. దీన్ని రైతులు పిండినల్లిగా కూడా పిలుస్తారు. కాయలు మచ్చలుగా ఏర్పడి రంగు మారుతుండడంతో డిమాండ్ ఉండదు. తెగుళ్ల నివారణకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితమివ్వకపోవడంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పడిపోయిన ధర అరకొర దిగుబడి వచ్చినా ఎలాగోలా అప్పులు తీర్చుకుందామని ఆశించిన రైతులను తగ్గిన చీనీ ధరలు మరింత ఆవేదనలోకి నెడుతున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం చీనీ టన్ను రూ.14 వేలు పలుకుతోంది. ధర తగ్గినా విక్రయించేందుకు రైతులు ముందుకొచ్చారు. అయితే, వ్యాపారులు చీనీ పంటను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపడం లేదు. గతంలో తోటల వద్దకే వచ్చి కాయలను కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. మరిన్ని రోజులు చెట్లపైనే కాయలు ఉంచితే పాడవుతాయన్న భయాందోళన రైతుల నుంచి వ్యక్తమవుతోంది. మార్కెట్‌కు తీసుకెళ్లడానికి కూలి, వాహన ఖర్చులకు సరిపోతుందన్న భయంతో చెట్లపైనే కాయలు ఉంచి మంచి ధర కోసం ఎదురుచూస్తున్నారు. పంటకు తెగుళ్లతో సతమతం ఎన్ని మందులు కొట్టినా అదుపులోకి రాని వైనం మార్కెట్లో ధరలు పడిపోవడంతో మరింత ఆవేదన -
ఎన్ఆర్ఎల్ఎం నిధులు సద్వినియోగం చేసుకోవాలి
పామిడి: పట్టణ ఐకేపీ భవనాన్ని ఎన్ఆర్ఎల్ఎం (నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్) ఢిల్లీ బృందం సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా మండల సమాఖ్య నిర్వహణ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పోగ్రామ్ మేనేజర్ పంకజ్ సుయల్ మండల సమాఖ్య ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ఆర్ఎల్ఎం నిధుల సద్వినియోగంపై సమీక్షించారు. భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. కార్యక్రమంలో ఎస్ఈఆర్పీ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్‌రెడ్డి, ఆ సంస్థ పీఈ శోభ, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు రాధారాణి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఓవరాల్ చాంపియన్ ‘కళ్యాణదుర్గం’ ● ముగిసిన స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ పోటీలు అనంతపురం: రెండు రోజులుగా అనంత క్రీడాగ్రామంలో జరుగుతున్న స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ 2026 పోటీలు సోమవారం ముగిశాయి. ఓవరాల్ చాంపియన్ షిప్‌ను కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు దక్కించుకున్నారు. సోమవారం నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఎర్రగుంట జెడ్పీహెచ్ఎస్, రన్నర్స్‌గా నెలగొండ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు నిలిచారు. హాకీ విన్నర్స్‌గా దురదకుంట జెడ్పీహెచ్ఎస్,రన్నర్స్‌గా పాల్తూరు జెడ్పీహెచ్ఎస్, ఫుట్‌బాల్ విన్నర్స్‌గా రాయదుర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రన్నర్స్‌గా ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ నిలిచాయి. అథ్లెటిక్స్ విభాగంలో 600 మీటర్ల పరుగులో ప్రభంజన్ (ఉరవకొండ) బంగారు పతకం, అభిలాష్ (బీకేఎస్) సిల్వర్, రాజదీప్ నాయక్ (కళ్యాణదుర్గం) బ్రాంజ్ పతకాన్ని దక్కించుకున్నారు. వంద మీటర్ల పరుగులో కళ్యాణదుర్గం అభిరామ్‌కు బంగారు పతకం, రాయదుర్గం భానుతేజాకు వెండి పతకం, కార్తీక్ నాయక్ (అనంతపురం)కు కాంస్య పతకం దక్కాయి. లాంగ్‌జంప్‌లో శ్రీనాథ్ (కళ్యాణదుర్గం), టి.కార్తీక్ నాయక్ (అనంతపురం), భానుతేజ (రాయదుర్గం) వరుసగా బంగారు, వెండి, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. 400 మీటర్ల పరుగులో సందీప్ (శింగనమల), కార్తీక్ (గుంతకల్లు), చందు (రాయదుర్గం) వరుసగా బంగారు, వెండి, కాంస్య పతకాలను దక్కించు కున్నారు. షాట్‌పుట్‌లో రంజిత్ (శింగనమల)కు బంగారు, హిమేష్ (ఉరవకొండ)కు వెండి, యశ్వంత్ (అనంతపురం)కు కాంస్య పతకం దక్కాయి. డిస్క్ త్రోలో ఉరవకొండ హిమేష్, గుంతకలుల తిరుదీప్, శింగనమల సందీప్ వరుసగా మూడు స్థానాల్లో నిలిచి పతకాలను కై వసం చేసుకున్నారు. 200 మీటర్ల పరుగులో రాయదుర్గం భానుతేజ (బంగారు), అనంతపురం కార్తీక్ నాయక్ (వెండి), కళ్యాణదుర్గం మంజునాథ్ (కాంస్య) పతకాలను దక్కించుకున్నారు. వంద మీటర్ల (4) రిలే పరుగులో శింగనమల, రాయదుర్గం, కళ్యాణదుర్గం క్రీడాకారులు వరుసగా బంగారు, వెండి, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. ముఖ్య అతిథులుగా కేజీఎఫ్ స్టేట్ సెక్రటరీ రామకృష్ణ,డీఈఓ అయూబ్ హుస్సేన్,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎస్.ఎం మంజుల, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ, ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాసులు, శకుంతల పాల్గొని పతకాలు అందజేశారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని లారీ దగ్ధం
గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో సోమవారం వేకువజామున ఓ లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని దగ్ధమైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నుంచి బెంగళూరులోని మాలూరుకు ఆలు గడ్డల లోడుతో లారీ బయలుదేరింది. కొత్తపేట గ్రామ శివారులోకి రాగానే సర్వీస్ రోడ్డులో వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదంలో విద్యుత్ తీగలు తెగి లారీపై పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్‌రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై అనుమానాలు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు లారీ హైవే మీదుగా వెళ్లాలి. అయితే సర్వీస్ రోడ్డులోకి రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగినప్పటి నుంచి డ్రైవర్, క్లీనర్లు అదృశ్యమయ్యారు. పొరపాటుగా లేదా నిద్రమత్తులో లారీని సర్వీస్ రోడ్డులోకి తిప్పి ఉంటే ప్రమాదం జరిగిన అనంతరం డ్రైవర్, క్లీనర్ అక్కడే ఉండేవారు. దీనిపైనా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పేలుడు పదార్థాలు తీసుకెళ్తూ మంటలు రావడంతో డ్రైవర్ లారీని కావాలనే సర్వీస్ రోడ్డులోకి తీసుకెళ్లి పల్టీ కొట్టించాడా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
రైతులను ఆదుకోవాలి
● హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరు ఇవ్వాలి ● మాజీ మంత్రి శైలజానాథ్ డిమాండ్ ● రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతపురం : కరువు కరాళ నృత్యం చేస్తోందని, రైతులను తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఎండిపోయిన వేరుశనగ, కంది మొక్కలను ప్రదర్శిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి రెండు గంటలపాటు మండుటెండలోనే ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ శింగనమల నియోజకవర్గంలోని కాలువల దిగువ ఆయకట్టు ప్రాంతాలకు, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్, సుబ్బరాయ సాగర్‌కు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని కోరారు. కణేకల్లు చెరువు, హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ ఆయకట్టుకు మాత్రమే నీరు అందిస్తామని ఐఏబీ సమావేశంలో నిర్ణయించారన్నారు. మరి హెచ్చెల్సీ దిగువన ఉన్న ఎంపీఆర్ పరిధిలోని శింగనమల, తాడిపత్రి తదితర నియోజకవర్గాల రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సెప్టెంబర్ మొదటి వారం గడిచినా తగిన వర్షాలు కురవలేదన్నారు. బోర్లు ఎండిపోతున్నాయని, మెట్టభూముల్లో పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ట్యాంకరు నీరు రూ.900 వెచ్చించి పంటలకు పెట్టాల్సి వస్తోందన్నారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పశువులకు నీటి సమస్య అధికమైందన్నారు. ఇంతటి దుర్భర పరిస్థితులు కళ్లకు కనిపిస్తున్నా సాగుకు నీరు ఇవ్వలేమని చెప్పడం బాధ్యతారాహిత్యమేనని మండిపడ్డారు. కర్ణాటకలో హెచ్చెల్సీ ఎగువన ఆరుతడి పంటలకు 90 రోజులపాటు నీరందించే అవకాశం ఉన్నప్పుడు.. దిగువ ప్రాంతంలోని జిల్లా రైతులకు నీరు ఎందుకు అందించరని ప్రశ్నించారు. తుంగభద్రలో ప్రస్తుత నీటి లభ్యత ఆధారంగా అదనంగా నీటిని వినియోగించుకునే అవకాశాలు ఉంటే పరిశీలించి, హెచ్చెల్సీ చివరి ఆయకట్టు రైతులకు కూడా న్యాయం చేయాలని కోరారు. పంట వేయలేకపోయినా, వేసిన పంట ఎండిపోయినా అది రైతు తప్పు కాదని.. నీటిని సకాలంలో అందించాల్సిన వ్యవస్థదే వైఫల్యమని అన్నారు. నీటిని విడుదల చేయడం సాధ్యం కాకపోతే, పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకోబోయే ప్రత్యామ్నాయ చర్యలేవో ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఆనంద్‌కు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, నాయకులు నార్పల సత్యనారాయణరెడ్డి, బొమ్మన శ్రీరామ్‌రెడ్డి, వంశీ గోకులరెడ్డి, బోగాతి ప్రతాపరెడ్డి, సరిబాల ప్రతాప్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు, ఎల్లారెడ్డి, పరంధామరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, అంకె ముసలన్న, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మంజునాథ్, విష్ణు నారాయణ, నాగేశ్వరరావు, పద్మావతి, బోనాల హరికృష్ణ, ఓబిరెడ్డి, కాటమయ్య, శ్రీనివాసులురెడ్డి, ఆంజనేయులు, నాగలింగారెడ్డి, పుల్లారెడ్డి, కొండ్రెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పట్నం ఫణీంద్ర, నాగభూషణ, రామాంజనేయులు, నాగలింగారెడ్డి, పురుషోత్తం, మల్లికార్జున, ముత్యాల శ్రీనివాస్, బయపరెడ్డి, వెంకటరామిరెడ్డి, నారాయణరెడ్డి, శేఖర్, రమణారెడ్డి, భీమేశ్వర్రెడ్డి, బాలరాజు, శివరామిరెడ్డి, ప్రభుదాస్, రాజా, శేషానందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఆ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి
● వేధిస్తే క్రిమినల్ కేసు నమోదు చేయండి ● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశంఅనంతపురం న్యూ టౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా ప్రాజెక్టు కార్మికులను వేధిస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టి.. నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 20 నుంచి సమ్మెలోకి వెళతామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏటీఎం నాగరాజు, శ్రీరామరెడ్డి తాగునీటి పథకం వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎర్రిస్వామి, వన్నూరుస్వామి సోమవారం కలెక్టర్ ఆనంద్‌ను కలిసి నోటీసు అందజేశారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ట్రంక్‌లైన్ ఫేజ్–1 కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, 2025 సంవత్సరానికి సంబంధించి ఒక్కొక్కరికి రూ. 22 వేలు బకాయిలు పెట్టారని, 40 నెలల పీఎఫ్ సొమ్ము జమ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు. ట్రంక్‌లైన్ ఫేజ్–4లో పనిచేసే కార్మిక కార్మికులకు 11 నెలల జీతంతో పాటు 11 నెలల పీఎఫ్ నిధులను జమ చేయకుండా కాంట్రాక్టర్ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. సమ్మె నోటీసుపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు, కార్మిక శాఖ ఉప కమిషనర్ లక్ష్మీనారాయణలను పిలిపించుకొని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిబంధనల మేరకు పనిచేయకుండా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టర్లను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. వేధింపులకు గురిచేస్తున్న కాంట్రాక్టర్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఒకవేళ అలా చేయకుండా కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క కార్మికుల కడుపు కొట్టే చర్యలకు పాల్పడితే మీపై చర్యలు తీసుకుంటానంటూ అధికారులను హెచ్చరించారు. -
పంటలు ఎండుతున్నాయ్
● కలెక్టర్‌కు సమస్య విన్నవించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి రాప్తాడు రూరల్: అనధికారిక కోతలతో వ్యవసాయానికి విద్యుత్ సక్రమంగా అందడం లేదని, బోర్లు పనిచేయక పంటలు నిలువునా ఎండిపోతున్నాయని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వాపోయారు. సోమవారం అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు మండలాలకు చెందిన పలువురు రైతులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ కరెంటు సమస్యలపై రైతులు సబ్స్టేషన్లకు వెళ్లి ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయానికి నిర్దేశించిన సమయంలో విద్యుత్ సరఫరా చేయకుండా కోతలు విధిస్తున్నారన్నారు. ఇప్పటికే ఎల్–నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉన్న భూగర్భ జలాలతో పంటలను కాపాడుకుందామంటే కరెంటు కోతలు వేధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు 2–3 గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదని, 300 ఓల్టేజీ ఉండాల్సిన చోట 150–200 మాత్రమే ఉంటోందని తెలిపారు. ఎల్–నినో ప్రభావం ఉంటుందని ముందే పేరూరు డ్యాంకు నీళ్లు నింపాలని కోరినా ఎమ్మెల్యే పరిటాల సునీత, అధికారులు పట్టించుకోలేదన్నారు. హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేయొద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా రైతులకు తీరని అన్యాయం చేశారన్నారు. గతేడాది 7 నెలల పాటు హంద్రీ–నీవా ద్వారా చిత్తూరు జిల్లాకు 5.5 టీఎంసీల నీరు ఇస్తే.. కేవలం 2.5 టీఎంసీలు మాత్రమే చెరువులకు చేరాయని, మిగిలిన 3 టీఎంసీలు లాసెస్ అయ్యాయని తెలిపారు. ఆ నీటిని ఇక్కడికి ఇస్తే పీఏబీఆర్ కుడికాలువ కింద ఉన్న చెరువులన్నీ నిండేవన్నారు. ఇప్పటికై నా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తాగు–సాగునీరు, విద్యుత్ సమస్యలపై దీర్ఘకాళిక ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ను కోరారు. -
మొదటి రోజే ఏడి‘పింఛన్’
ఆత్మకూరు: కొత్త పింఛన్ల కోసం సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో దరఖాస్తు చేసుకోవడానికి పలువురు ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయాల వద్ద వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. ఇంటింటి సర్వేలో భాగంగా ఆత్మకూరు మండల వ్యాప్తంగా 2 వేల మంది వరకు కొత్త పింఛన్లకు అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. కేవలం ఆత్మకూరులోనే 500 మందికి పైగా ఉన్నారు. ఈ క్రమంలోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలియజేయడంతో సచివాలయాల వద్ద సోమవారం వారంతా బారులు తీరారు. అయితే, ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్ పని చేయకపోవడంతో వద్ద నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. సచివాలయ ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 16 వరకే దరఖాస్తుకు అవకాశం ఉండటంతో అర్హులు ఆందోళనకు గురవుతున్నారు. కుష్టును నిర్మూలించాలి అనంతపురం అర్బన్: కుష్టువ్యాధిని నిర్మూలించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. కుష్టు నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు. అనుమానిత కేసులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధారింపజేసుకోవాలన్నారు. వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిన వారికి ఉచితంగా ఎండీటీ మందులను అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కట్టా వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీపీఓ నాగరాజు నాయుడు, కుష్టు నివారణ అధికారి జయలక్ష్మి, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్ గంగాధర్‌రెడ్డి, డీఐపీఆర్ఓ బాలకొండయ్య, పారామెడికల్ అధికారి నాగన్న, ఆరోగ్య విద్య అధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అయినవారు ఉన్నా అనాథలా మృతి! పామిడి: అయినవారు పట్టించుకోకపోవడంతో మనసు చంపుకొని ఇల్లు వదిలివచ్చిన ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పామిడి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం ఈరన్నపల్లికి చెందిన అశోక్ (65) 25 ఏళ్ల క్రితం వ్యాపార రీత్యా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లి స్థిరపడ్డాడు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఇటీవల అశోక్ అనారోగ్యం బారిన పడ్డాడు. కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై 6 నెలల క్రితం ఇల్లు వదిలి వచ్చాడు. రెండు రోజులుగా పామిడి కమ్యూనిటీ ఆసుపత్రిలో తిరుగుతూ ఆసుపత్రి ప్రాంగణంలో నిద్రించేవాడు. ఆదివారం రాత్రి నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచాడు. పామిడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుమారుడు, ప్రొద్దుటూరుకు చెందిన హరికృష్ణకు సమాచారం చేరవేశారు. ఆటో బోల్తా.. వృద్ధుడి మృతి ఉరవకొండ: ఆటో బోల్తా పడి వృద్ధుడు మృతి చెందిన ఘటన ఉరవకొండ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి గ్రామం నుంచి సోమవారం ఆటో ప్రయాణికులతో బయలుదేరింది. ఉరవకొండ సమీపంలో గొర్రెల మంద అడ్డురావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పీసీ ప్యాపిలి గ్రామానికి చెందిన అంజయ్య (70) తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ బాషాతో పాటు మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంజయ్యకు భార్య తిప్పమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడా పోటీల్లో జిల్లాకు 36 పతకాలుఅనంతపురం సెంట్రల్: రాష్ట్రస్థాయి పోలీసు క్రీడా పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. 4 స్వర్ణ, 22 రజత, 10 కాంస్య పతకాలు సాధించారు. సోమవారం ఎస్పీ జగదీష్ తన చాంబర్లో క్రీడాకారులను అభినందించారు. క్రీడల్లో రాణించడం ద్వారా పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయని తెలిపారు. జిల్లాకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉల్లికల్లులో ఆగని ఇసుక తరలింపు
శింగనమల: ఉల్లికల్లు పెన్నానది నుంచి ఇసుక అక్రమ తరలింపు నిరాటంకంగా సాగుతోంది. పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు దాడులు చేసినా రాజకీయ నాయకుల అండదండలతో వెనక్కు తగ్గడం లేదు. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అక్రమార్జనే ధ్యేయంగా ఇసుక రవాణా చేస్తున్నారు. పెన్నానదిలో జేసీబీ పెట్టి ట్రాక్టర్లతో ఒక చోటకు డంప్ చేసుకుని, అక్కడి నుంచి రాత్రిపూట టిప్పర్లతో తరలిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో దాదాపు రూ.3 కోట్లు విలువ చేసే ఇసుకను అమ్ముకున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. సీజ్ చేసిన ఇసుకనూ వదల్లేదు ఉల్లికల్లు పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా గత నెల 18న దాడులు చేసి, ఇసుక డంప్‌లను గుర్తించారు. దాదాపు 300 టన్నుల ఇసుక ఉందని లెక్క కట్టారు. కొద్దిరోజుల విరామం అనంతరం అక్రమార్కులు మళ్లీ ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఈసారి ఇసుక తవ్వకంతో పాటు సీజ్ చేసిన ఇసుకనూ రాత్రికి రాత్రే తరలించారు. సీజ్ చేసిన ఇసుక ఆనవాళ్లు లేకుండా చేశారు. ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తే భూగర్భజలాలు తగ్గిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుదాం
అనంతపురం: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల అభ్యున్నతే అంతిమ లక్ష్యమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటుదామని పార్టీ శ్రేణులకు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అనుబంధ విభాగాలన్నీ దీటుగా పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నగరంలోని 1, 2, 19, 27, 28, 29, 43, 44, 45, 46, 47, 48 డివిజన్ల యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అనంత హాజరై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ‘జెన్‌జీ’ నడుస్తోందని, యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ స్పోర్ట్ కోటా నియామకాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. వీటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల అమలులో సీఎం చంద్రబాబు విఫలమయ్యారన్నారు. నిరుద్యోగభృతి, ఆడబిడ్డ నిధి అమలు చేయకుండా ఆయా వర్గాలను వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొండ్రెడ్డి ఓబిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు చంద్రమోహన్‌రెడ్డి, ఇసాక్, సంపంగి రామాంజినేయులు, మాలపాటి శ్రీనివాసులు, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ నేతలు హనుమంతు, రామచంద్ర, రాజు, నిమ్మల నాగరాజు, నారాయణరెడ్డి, అరవింద్, ప్రసన్న లక్ష్మి, అబ్బాస్, మనోజ్, కుమార్, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదాఖలందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకనాథ్‌రెడ్డి, మణిరాయల్, జిల్లా కార్యదర్శి హర్షవర్దన్, నగర అధ్యక్షుడు దత్త, ఉపాధ్యక్షుడు వినీత్, ఉదయ్, నగర ప్రధాన కార్యదర్శి మసూద్, మైను, నగర కార్యదర్శి రాం భూపాల్‌రెడ్డి, బబ్లూ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత -
మట్టిని తవ్వి.. రూ.కోట్లు దోచి
గుంతకల్లు: సహజ వనరులను ‘పచ్చ’ నేతలు ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అండతో చెలరేగిపోతున్నారు. గుంతకల్లు మండలలోని పలుచోట్ల మట్టి అక్రమ తవ్వకం, అమ్మకం జోరుగా సాగుతోంది. పట్టణ శివారులోని నెల్లూరు– అంకోలా జాతీయ రహదారిలోని పవర్ గ్రిడ్ సమీపాన సర్వే నం.191,193లో గల కొండ గుట్టను కొల్లగొడుతున్నారు. కసాపురం పంచాయతీలోని మండేకుల కొట్టాల సమీపంలోని సర్వే నంబర్ 426లో గల గుట్టతో పాటు వైటీ చెరువులో నిరంతరాయంగా జేసీబీతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే పక్కన ఉండే టీడీపీ సీనియర్ నేత అండదండలతో గుట్టలో తవ్విన మట్టిని రైల్వే పనులకు వాడుతున్నారు. పవర్ గ్రిడ్ సమీపంలో గుట్టను గుమ్మనూరు ఈశ్వర్ ప్రధాన అనుచరులైన ఇద్దరు కొల్లగొట్టి.. మట్టిని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. టిప్పర్ మట్టి ధర రూ.7వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయిస్తున్నారు. వైటీ చెరువులోని మట్టిని సైతం ట్రాక్టర్ల ద్వారా తరలించారు. ఇలా ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు చేపట్టి నెలానెలా రూ.కోట్లు గడిస్తూ.. ప్రభుత్వ ఆదాయనికి గండి కొడుతున్నారు. అయినా మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. మా దృష్టికి రాలేదు.. గుంతకల్లు మండలలో జరుగుతున్న మట్టి దందాపై తహసీల్దార్ రమాదేవిని వివరణ కోసం ‘సాక్షి’ ఫోన్ ద్వారా సంప్రదించగా ఆమె స్పందించలేదు. దీంతో పవర్ గ్రిడ్ సమీపంలో జరిగే అక్రమ తవ్వకాలపై సంబంధిత వీఆర్ఓ కృష్ణను సంప్రదించగా అక్కడ గుట్టను తవ్వి.. మట్టి తరలిస్తున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. ‘గుమ్మనూరు’ అండతో మట్టిని తవ్వేస్తున్న టీడీపీ నాయకులు -
●పచ్చని చెట్ల నరికివేత
ఉరవకొండ: అధికారం ఉంది కదా అని ఏకంగా తన కాంప్లెక్స్ కనిపించకుండా చెట్లు అడ్డువస్తున్నాయని 30 నుంచి 40 చెట్లను ఓ టీడీపీ సీనియర్ నేత నరికించేశాడు. వివరాలు.. స్థానిక శ్రీకృష్ణదేవరాయుల విగ్రహం వద్ద ప్రధాన రోడ్డు డివైడర్ మధ్యలో పంచాయతీ అధికారులు గుంతకల్లు రోడ్డు నుంచి అనంతపురం బైపాస్ వరకూ మొక్కలు నాటారు. అవి ప్రస్తుతం పెద్ద చెట్లుగా మారాయి. అయితే చెట్టు పెరగడంతో తన కాంప్లెక్స్‌కు అడ్డంగా మారాయని గుర్తించి అటవీశాఖ అధికారులు, మేజర్ పంచాయతీ అధికారుల అనుమతులు తీసుకోకుండా దాదాపు 20 నుండి 30 చెట్లు నరికించాడు. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. -
ఖోఖోలో చిన్నహోతూరు... వాలీబాల్‌లో బూదగవి జట్ల విజయం
అనంతపురం: జిల్లా స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ –2026 పోటీల్లో భాగంగా తొలిరోజు ఆదివారం అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగిన ఖోఖోలో చిన్నహోతూరు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు, వాలీబాల్‌లో బూదగవి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు విజయం సాధించారు. ఖోఖో, వాలీబాల్ రన్నర్స్‌గా వడియంపేటలోని కేశవరెడ్డి స్కూల్ నిలిచింది. అలాగే బాస్కెట్‌బాల్‌లో కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల జట్టు విజయం సాధించగా, రన్నర్స్‌గా ఉరవకొండలోని వివేకానంద ఉన్నత పాఠశాల జట్టు నిలిచింది. వివిధ కేటగిరిల్లో సాగిన జూడో పోటీల్లో బంగారు పతకాలను ఉరవకొండకు చెందిన సుగంధం, కిషోర్ మణికంఠ, చంద్రశేఖర్ నాయక్, వశీకర్, అనంతపురం విద్యార్థి అబ్దుల్ ఖాదర్, శింగనమల విద్యార్థి రిషివర్దన్ దక్కించుకోగా, వెండి పతకాలను చక్రి (అనంతపురం), ఖలీద్ బాషా, రాఘవేంద్రనాయక్, సూర్యనారాయణ (శింగనమల), ఎండీ ఖలీల్ (అనంతపురం), శంకర్, విజయ్‌కుమార్ (ఉరవకొండ), కాంస్య పతకాలను పురుషోత్తం, రంజిత్‌కుమార్ (శింగనమల), కుళ్లాయిస్వామి (అనంతపురం), హేమంత్ నాయక్, విశాల్ (కళ్యాణదుర్గం), అభిలాష్ (ఉరవకొండ), కై వసం చేసుకున్నారు. ఫుట్‌బాల్ పోటీల్లో రాయదుర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు తెలియజేయాలని సూచించారు. భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అధికారులకు అందజేయాలని తెలిపారు. ‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం చేయండి అనంతపురం న్యూటౌన్: స్థానిక సంస్థలకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందుకు క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ సుధాకర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా ప్రజా పరిషత్, డీడీఓలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు తదితరులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే గ్రామాలను గుర్తించి, ఎంపీపీల సరిహద్దుల మేరకు మ్యాపింగ్ చేయాలని సూచించారు. అలాగే 2026 జనవరి ఒకటవ తేదీ నాటికి ప్రచురించిన ఓటర్ల జాబితాలను ఆన్లైన్ చేయడంతో పాటు మూడు సెట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి స్టేజ్–1, స్టేజ్–2 ఎన్నికల అధికారుల జాబితాలతో జిల్లా, మండల, గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచాలని స్పష్టంచేశారు. వర్షాకాలంలో వేసవితాపంఅనంతపురం అగ్రికల్చర్: వర్షాకాలమైనా జిల్లాలో వాతావరణ పరిస్థితులు విచిత్రంగా మారుతున్నాయి. నాలుగు రోజులుగా వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా మండలాల్లో 38 డిగ్రీలు రికార్డు కాగా... ఉక్కపోత కూడా అధికంగా నెలకొంది. ఉదయం 10 గంటల సమయానికే ఎండలు దంచికొడుతున్నాయి. ఉన్నపళంగా మేఘాలు కమ్ముకోవడం, బలమైన గాలులు వీయడం, వర్షం వచ్చేలా కనిపించినా చివరకు తేలికపాటి కూడా నమోదు కాని పరిస్థితులు నెలకొన్నాయి. సూపర్ ఎల్–నినో ప్రభావంతో జూన్ నుంచి ఇప్పటి వరకు రోజురోజుకూ భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సమృద్ధిగా వర్షాలు పడాల్సిన సమయంలో వరుణుడి జాడే కరువైపోయింది. నాలుగు రోజులుగా గాలివేగం కొద్దిగా తగ్గింది. ఉక్కపోత, ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. కరెంటు కోతలపై ఆగ్రహండి.హీరేహాళ్(బొమ్మనహాళ్): లోడ్ రిలీఫ్ పేరుతో కరెంట్ కట్ చేయడంపై రైతులు ఆగ్రహించారు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో డి.హీరేహాళ్ మండలం బాదనహాల్, దొడగట్ట గ్రామాల రైతులు గొడిసెలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. కరెంటు కట్ చేయడంతో మోటర్లు ఆడక పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. నిర్దేశిత తొమ్మిది గంటల్లో నాలుగు గంటలు మాత్రమే సరఫరా ఇచ్చి.. మిగిలిన గంటలు లోడ్ రిలీఫ్ పేరుతో కరెంటు సరఫరా ఆపితే ఎలా అని మండిపడ్డారు. అధికారులు స్పందించి విద్యుత్ సక్రమంగా ఇచ్చి పంటలు కాపాడాలని కోరారు. -
నిధులు తేవడంలో విఫలం
బీటీపీ కాలువ పనులు పూర్తి చేసేందుకు నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే అమిలినేని విఫలమయ్యారు. సొంత డబ్బుతో కాలువలు తవ్వుతామని గొప్పలు చెప్పిన ఆయన.. మరి ఎందుకో పనులు ఆపేశారు. చంద్రబాబు మెప్పు కోసం కుప్పంలో పనులు చేస్తావు... కానీ ఇక్కడ ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం కాలువ పనులు చేయడానికి తీరక లేదా? ఆగస్టు చివరి నాటికి రైతులకు పరిహారం అందిస్తామని చెప్పిన హామీ ఏమైంది..? – డాక్టర్ తలారి రంగయ్య, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, కళ్యాణదుర్గం -
వైభవం.. అంజన్న బ్రహ్మ రథోత్సవం
బొమ్మనహాళ్: నేమకల్లు అంజన్న ఉత్సవం, బ్రహ్మ రథోత్సవం కమనీయంగా సాగింది. శ్రావణ మాసం ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున నేమకల్లు ఆంజనేయస్వామి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భభక్తులు పెద్ద ఎత్తున ఉత్సవంలో పాల్గొన్నారు. బాలాలయంలో అర్చకుల ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక అలంకరణ, ఆకుపూజ, గంగాభిషేకం, బంగారు కిరీటం, వెండి పాదాలు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహామంగళ హారతి, ప్రసాద వినియోగ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు సునీత, శివారెడ్డి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆంజనేయస్వామి బ్రహ్మ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి బ్రహ్మ రథంపై కొలువు దీర్చారు. ఈ సందర్భంగా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు రథాన్ని లాగారు. చుట్టు పక్కన ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు బ్రహ్మ రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత లంకాదహనం కార్యక్రమం జరిగింది. ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్ఐ నబీరసూల్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ నరసింహారెడ్డి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు సెల్: 8977716661 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ.. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు ఫోన్ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం టౌన్: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజా ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి 16వ తేదీలోపు స్థానిక సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులపై విచారణ చేపట్టి అర్హత ఉన్న వారి వివరాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్‌లో కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో పది గొర్రెల మృతి విడపనకల్లు: రోడ్డు ప్రమాదంలో పది గొర్రెలు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని మాళాపురం సమీపంలో 42వ జాతీయ రహదారి మీదుగా కర్ణాటకలోని బళ్లారి జిల్లా యాళపి గ్రామానికి చెందిన పెద్దన్న గొర్రెలను తరలిస్తుండగా.. అనంతపురం వైపు నుంచి బళ్లారికి వెళ్లే ఓ పేపర్ వ్యాన్ అతి వేగంతో వెళ్తూ జీవాలను ఢీకొట్టింది. ఘటనలో పది గొర్రెలు అక్కడికక్కడికే మృతి చెందాయి. దాదాపు రూ.రెండు లక్షల నష్టం వాటిల్లినట్లు గొర్రెల యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్లమ్మ ఆలయంలో చోరీ శెట్టూరు: మండలంలోని కై రేవు గ్రామంలో శనివారం అర్ధరాత్రి గ్రామ దేవత ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. శనివారం రాత్రి కై రేవులో వీధినాటకాన్ని ప్రదర్శించారు. ఇదే అదునుగా భావించిన దుండుగులు ఆలయంలోకి చొరబడి సుమారు 60 తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. అర్చకులు గుర్తించి గ్రామస్తుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సుమన్ ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హామీ మరచిన ‘అమిలినేని’
కళ్యాణదుర్గం : తనను గెలిపిస్తే కళ్యాణదుర్గ ప్రాంత ప్రజల చిరకాల కల బీటీపీ కాలువ తవ్వకం పనులను పూర్తి చేస్తానని, లాభాపేక్ష లేకుండా, అవసరమైతే తన సొంత డబ్బు ఖర్చు పెట్టడానికై నా వెనకాడబోనని అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. రెండేళ్లు దాటినా ఆశించినస్థాయిలో పనులు జరగడం లేదు. తమను మభ్యపెట్టడానికే అలవికాని హామీలిచ్చారని ప్రజలు, ప్రజాసంఘాలు, విపక్ష పార్టీల నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రాజెక్టుకు రూపకల్పన ఇలా.. బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్ నుంచి రాయదుర్గం నియోజకవర్గంలోని భైరవానితిప్ప ప్రాజెక్టు(బీటీపీ)కు కృష్ణా జలాలను తరలిచేందుకు ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి 3.7 టీఎంసీల నీటిని తరలించేందుకు వీలుగా 93 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం, 8 లిఫ్ట్‌లు, 8 సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టాలి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువుల్లో నీరు నింపడానికి 1.7 టీఎంసీలు, బీటీ ప్రాజెక్టుకు 2 టీఎంసీలను తరలించి ఆ ప్రాంత రైతులకు తాగు, సాగు నీటి కష్టాలు తీర్చడమే ప్రాజెక్టు లక్ష్యం. కాలువ తవ్వకం కోసం 1462.37 ఎకరాల భూమి కావాలని ప్రతిపాదించారు. భూ సేకరణకు రూ.208.85 కోట్ల నిధులు అవసరం. 2018లో ప్రాజెక్టు పనులను అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ పనుల కాంట్రాక్ట్ ప్రస్తుత కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ సంస్థ దక్కించుకుంది. అప్పట్లో రూ.30 కోట్ల వరకు మాత్రమే నిధులు ఖర్చు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలువ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు రూ.80కోట్ల పరిహారం పంపిణీ చేసింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయి. హడావుడి తవ్వకాలు.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో అమిలినేని ఇచ్చిన హామీ మేరకు 2027 ప్రారంభానికల్లా బీటీపీ కాలువ తవ్వకం పనులు పూర్తి కావాలి. అయితే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు చూపించేందుకు ఎమ్మెల్యే అమిలినేని హడావుడి చేశారు. ఈ క్రమంలోనే కళ్యాణదుర్గం – అనంతపురం ప్రధాన రహదారిలో ఒంటిమిద్ది వద్ద, కళ్యాణదుర్గం– ఉరవకొండ ప్రధాన రహదారిలో బోరంపల్లి వద్ద, కళ్యాణదుర్గం– కంబదూరు ప్రధాన రహదారిలో నారాయణపురం వద్ద, కళ్యాణదుర్గం – శెట్టూరు ప్రధాన రహదారిలో ఉప్పవంక దాటిన తర్వాత అలా పనులు చేపట్టి.. ఇలా ఆపేశారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి కాలువలు తవ్వుతామని, రెండున్నరేళ్లకే పనులు పూర్తి చేస్తామని చేసిన ప్రకటనలు ఉత్తివేనని తేలిపోయింది. 2028 మార్చి నాటికి బీటీపీ పనులు పూర్తి చేస్తానని తాజాగా హామీ ఇవ్వడం గమనార్హం. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో వెనుకబడిన ప్రాంతాల సాగు–తాగునీటి అవసరాలు తీర్చడం కోసం ఉద్దేశించిన బీటీపీ కాలువ తవ్వకం పనులు ముందుకు సాగడం లేదు. రెండున్నరేళ్లలో కాలువ తవ్వకం పనులు పూర్తి చేస్తానని ఎన్నికలకు ముందు, ఆ తర్వాత అమిలినేని సురేంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. కాలువ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఈ ఏడాది ఆగస్టులోగా పరిహారం చెల్లిస్తామని చెప్పినా.. ఇప్పటి వరకు ఎవ్వరికీ అందలేదు. హామీలు అమలు చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన అమిలినేని సురేంద్రబాబు.. తర్వాత కాలువ పనుల పూర్తి డెడ్‌లైన్‌ను పొడిగించడం విమర్శలకు తావిస్తోంది. ముందుకు సాగని బీటీపీ కాలువ తవ్వకం పనులు రెండున్నరేళ్లలో పూర్తిచేయకపోతే రాజీనామా చేస్తానన్న అమిలినేని నిర్వాసిత రైతులకు గడువు దాటినా అందని పరిహారం ఆర్భాటాలు తప్ప.. ఆచరణలో కనిపించని పురోగతి -
కేపీఎస్ వెంచర్లో మళ్లీ దొంగతనం
గుత్తి: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎస్ కేపీఎస్ వెంచర్లో మళ్లీ దొంగతనం జరిగింది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి దక్షణామూర్తి ఇంట్లోని బీరువాలో దాచి ఉంచిన కొంత నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి కూడా దొంగలు హల్ చల్ చేశారు. దొంగలు హల్ చల్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ముగ్గురు దొంగలు ముసుగు ధరించి ఒకే దుస్తుల్లో చోరీకి వచ్చారు. చేతుల్లో ఇనుప రాడ్లు పట్టుకున్న దృశ్యాలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాలనీవాసులే చందాలు వేసుకుని నలుగురు సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నా దొంగలు రెచ్చిపోతుండటం కలకలం రేపుతోంది. ఇదే కాలనీలో సీఐ రామారావు, ఎస్ఐ అమీర్ ఖాన్ కూడా నివాసముంటున్నారు. పోలీసులు నివాసముండే ప్రాంతమైనా చోరీలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. -
అమిలినేని మాటలు నమ్మే స్థితిలో లేరు
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన కాంట్రాక్ట్ సంస్థ ఎస్ఆర్సీ ద్వారా బీటీపీ కాలువ పూర్తి చేస్తానని ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. 2018 నుంచి ఆయనే కాంట్రాక్టర్. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు. పనుల పునఃప్రారంభం పేరిట నాటకాలు ఆడుతున్నారు. మట్టి అమ్ముకునేందుకే అక్కడక్కడా కాలువ తవ్వి వదిలేస్తున్నారు. నేటికీ రైతులకు పరిహారం అందలేదు. మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. – గోపాల్, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి, కళ్యాణదుర్గం -
బంగారు గొలుసు అపహరణ
గుంతకల్లు: పట్టపగలే ఓ మహిళా మెడలోని 2.5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన కసాపురంలో చోటు చేసుకుంది. బాధితురాలి వివరాలమేరకు.. కంబదూరుకు చెందిన వడ్డే ఽశివశంకర్, గంగమ్మ దంపతులు ఆదివారం కసాపురం క్షేత్రంలో సమీప బంధువుల కేశఖండన కార్యక్రమానికి వచ్చారు. మధ్యాహ్నం భోజన తర్వాత ఎండ ఎక్కువగా ఉండటంతో కూల్ డ్రింక్ తాగాలని నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వద్ద ఉన్న షాపునకు గంగమ్మ వచ్చింది. అయితే అప్పటికే ఆమైపె నిఘా పెట్టిన దొంగ కూడా కూల్‌డ్రింక్ కోనుగోలు చేశాడు. గంగమ్మ కూల్‌డ్రింగ్ తాగుతుండగా ఆమె మెడలోని బంగాచు చైన్ లాక్కొని కొంతదూరంలో ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉన్న మరో దొంగతో కలిసి ఉడాయించాడు. ఘటనపై భర్త శివశంకర్‌తో కలిసి గంగమ్మ కసాపురం పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వెంకటస్వామి కేసు దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి కళ్యాణదుర్గం రూరల్: మండల పరిఽధిలోని బోరంపల్లి వద్ద కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో కంబదూరు మండలం వెంకటంపల్లికి చెందిన హనుమంతురెడ్డి(42) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు... కంబదూరు మండలానికి చెందిన హనుమంతురెడ్డికి కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన ప్రవీణతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి కళ్యాణదుర్గంలో నివాసం ఉంటూ ట్రాక్టర్ షోరూంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం హనుమంతురెడ్డి బోరంపల్లికి తన ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. బోరంపల్లి సమీపంలోకి రాగానే వేగంగా అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపు వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ప్రమాదంలో హనుమంతురెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య ప్రవీణ, ఇంటర్ చదువుతున్న కుమారుడు చరణ్ ఉన్నారు. మాకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చికిత్స పొందుతూ విద్యార్థి.. రాయదుర్గం రూరల్: మండలంలోని కాశీపురం గేటు వద్ద బొలెరో వాహనం, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఘటనలో బెళుగుప్ప మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన ముగ్గురు పదో తరగతి విద్యార్థులు శనివారం తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రామ్‌చరణ్ అనే విద్యార్థి శనివారం రాత్రి మృతి చెందాడు. అర్బన్ సీఐ దేవానంద్ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. మరో ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ తెలిపారు. కల్వర్టు పై నుంచి పడి కూలీ.. యాడికి: కల్వర్టుపై నుంచి పడటంతో కూలీ మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి మండలంలోని పెద్దపేట–యాడికి రహదారిలోని ఆదినారాయణరెడ్డి కోళ్ల ఫారం వద్ద చోటు చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు... కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన పెద్ద కుళ్లాయప్ప (45), లక్ష్మిదేవి దంపతులు 20 ఏళ్ల క్రితం యాడికి మండలానికి వచ్చారు. ఆదినారాయణరెడ్డి కోళ్ల ఫారంలో దినసరి కూలీలుగా పని చేస్తూ అక్కడే ఉన్న రూమ్‌లలో నివసిస్తున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శనివారం రాత్రి భోజనం తిన్న తర్వాత పెద్ద కుళ్లాయప్ప కోళ్ల ఫారం బయట రోడ్డుపై ఉన్న బ్రిడ్జి వద్ద గల కల్వర్టుపై కూర్చున్నాడు. అయితే ప్రమాదవశాత్తూ కల్వర్టుపై నుంచి కుళ్లాయప్ప కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం తెల్లవారు జామున భర్త కుళ్లాయప్ప కనిపించడంలేదని లక్ష్మిదేవి తన కుమారుడికి చెప్పటంతో కల్వర్టు, పరిసర ప్రాంతాల్లో చూడగా కుళ్లాయప్ప కల్వర్టు కింద పడిఉండటాన్ని గమనించారు. వెంటనే పెద్ద కుళ్లాయప్పను ఓ వాహనంలో తాడిపత్రిలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. జేఎన్టీయూ అనంతపురంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ అనంతపురం: జర్మనీలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు జేఎన్టీయూ అనంతపురంలో ఈ నెల 7, 8 తేదీల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వీసీ హెచ్. సుదర్శనరావు తెలిపారు. నేరుగా జర్మన్ వర్సిటీ ప్రతినిధులతో మాట్లాడే అవకాశం కల్పించామన్నారు. జర్మన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు విద్యార్థులకు అందుబాటులో ఉండి, ప్రోగ్రామ్‌కు సంబంధించిన వివిధ అంశాలపై నేరుగా అవగాహన కల్పిస్తారన్నారు. ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్‌లర్ , మాస్టర్ ప్రోగ్రామ్ (ఐఐబీఎంపీ) ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 90441 15999, 90441 17999ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
‘అయ్యో రామ’న్న ఎంత పనిచేస్తివయ్యా!
● ఇంజక్షన్ వికటించి వృద్ధురాలి మృతి అనంతపురం సిటీ/బ్రహ్మసముద్రం: ‘అయ్యో రామా.. ఎంత పని చేస్తివయ్యా!! ప్రాణం పోస్తారని ఆస్పత్రికి వస్తే ఊపిరి తీసేశారు కదయ్యా..?’ అంటూ బాధిత కుటుంబ సభ్యుల రోదనలతో అనంతపురంలోని రామ్‌నగర్‌లో ఉన్న కేసీ రామన్న ఆస్పత్రి ప్రాంతం దద్దరిల్లింది. ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ వృద్ధురాలి ప్రాణాలు బలిగొంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. బ్రహ్మసముద్రం మండలం గుడిపల్లికి చెందిన చిత్రలింగప్ప, గుండమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. తమకున్న పొలంలో పంటల సాగుతో జీవనం సాగించేవారు. 16 ఏళ్ల క్రితం చిత్రలింగప్ప మృతి అనంతరం గుండమ్మనే ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది. కొన్నేళ్లుగా ఆయాసంతో బాధపడుతున్న గుండమ్మ (60)కు అనంతపురంలోని రామ్‌నగర్‌లో ఉన్న కేసీ రామన్న ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. మూడేళ్లుగా నెలకోసారి ఆమెను పిలుచుకొచ్చి చికిత్స చేయించుకుని వెళ్లేవారు. ఆయాసంతో పాటు జ్వరంతో బాధపడుతున్న గుండమ్మ శుక్రవారం తన కుమారుడు రామాంజనేయులు, మనవరాలు మేఘనతో కలిసి కేసీ రామన్న ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో మధ్యాహ్నం వరకూ వేచి ఉండాల్సి వచ్చింది. ఈ లోపు కుటుంబసభ్యులతో కలసి బయట హోటల్‌కు వెళ్లి భోజనం చేస్తుండగా రామాంజనేయులుకు ఆస్పత్రి సిబ్బంది ఫోన్ చేశారు. ఇంజక్షన్ వేసిన కొద్ది సేపటికే... ‘అమ్మకు ఇంజక్షన్ చేయాలని ఆస్పత్రి వాళ్లు ఫోన్ చేశారు. మీరు ఆస్పత్రి వద్దకెళ్లండి నేను బిల్లు కట్టేసి వస్తా’ అని రామాంజనేయులు తెలపడంతో గుండమ్మను పిలుచుకుని మనవరాలు కేసీ రామన్న ఆస్పత్రికి చేరుకుంది. ఆ సమయంలోనూ అక్కడ వైద్యులు ఎవరూ లేరు. డాక్టర్ చెప్పారంటూ నర్సు పిలుచుకెళ్లి ఇంజక్షన్ వేసింది. ఆ సమయంలో తీవ్రమైన మంట కలుగుతోందని గుండమ్మ చెప్పగా, భయపడాల్సిన పనేమీ లేదంటూ నర్సు చెప్పింది. ఈ క్రమంలోనే గుండమ్మ కళ్లు తేలేసింది. అక్కడే ఉన్న మనమరాలు వెంటనే నర్సులను అప్రమత్తం చేసినా ఫలితం లేకపోయింది. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపకుండా అంబులెన్స్‌ను రప్పించుకుని సర్వజనాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండమ్మ మృతి చెందినట్లు నిర్ధారించి, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసు కేసు నమోదు.. గుండమ్మ కుటుంబసభ్యులు శనివారం ఉదయం కేసీ రామన్న ఆస్పత్రి నిర్వాహకులను నిలదీశారు. తమ తప్పిదమేమీ లేదని, సరైన చికిత్సను అందించామని, ఆరోగ్య పరిస్థితి విషమించినందు వల్లనే ఆమె మృతి చెందిందంటూ బుకాయించారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు వెంటనే నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టడంతో వైద్యుడి సూచన మేరకు ఇంజక్షన్ వేసిన తర్వాత వృద్ధురాలి పరిస్థితి విషమించి మృతి చెందినట్లుగా అక్కడి సిబ్బంది అంగీకరించినట్లు సమాచారం. ఘటనపై నాల్గో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పవన పుత్రా.. పాహిమాం
బొమ్మనహాళ్: ప్రసిద్ధి చెందిన నేమకల్లు ఆంజనేయస్వామి బాలాలయంలో శ్రావణమాస బ్రహోత్సవాల్లో భాగంగా నాల్గో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. పవనపుత్రా పాహిమాం నామస్మరణ మార్మోగింది. ప్రత్యేక పుష్పాలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు వైద్యం అనిల్‌కుమార్‌స్వామి ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. విశేష పుష్పమాలలతో అలకరించారు. ఆకుపూజలు చేశారు. అనంతరం మహామంగళహారతి, ప్రసాద వినియోగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని బియ్యం, బేడలు, టెంకాయలు, పుష్పమాలలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రేట్ ఇండియా మైనింగ్ నేమకల్లు వారు భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ ఈఓ నరసింహారెడ్డి, అన్నదాన కమిటీ సభ్యులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. బొమ్మనహాళ్ ఎస్ఐ నబీరసూల్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. హనుమాన్ భజనమండలి, భక్తమండలి సభ్యులు పల్లకీసేవ, భజనలు చేపట్టారు. నేడు బ్రహ్మ రథోత్సవం నేమకల్లు ఆంజనేయస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు శ్రీవారి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం 4.15 గంటలకు బ్రహ్మ రథోత్సవం ఉంటుందన్నారు. సాయంత్రం 7 గంటలకు లంకా దహనం ఉంటుందని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈఓ నరసింహారెడ్డి తెలిపారు. మురడి అంజన్నకు శ్రావణమాస పూజలు డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురడి ఆంజనేయస్వామికి శ్రావణ శనివారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు పవన్‌స్వామి ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహానివేదన నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక నుంచి భక్తాదులు వేలాదిగా తరలివచ్చి, స్వామిని దర్శించుకున్నారు. ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి బందోబస్తు నిర్వహించారు. విశేషాలంకరణలో మురడి ఆంజనేయుడునేమకల్లులో స్వామికి ప్రత్యేక అలంకరణ కసాపురంలో గరుడవాహనంపై ఊరేగుతున్న సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి, నేమకల్లులో స్వామి దర్శనం కోసం క్యూ కట్టిన భక్తులు గరుడవాహనంపై నెట్టికంటుడు గుంతకల్లు రూరల్: శ్రావణమాసం నాల్గవ శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం భక్తజనసందోహంతో కిటకిటలాడింది. భక్తిపారవశ్యంతో తన్మయత్వం పొందారు. వేకువజామునే ఆంజనేయస్వామికి అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేక పుష్పాలంకరణలో తీర్చిదిద్ధి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్లను గరుడ వాహనంపై కొలువుదీర్చి ఆలయ ఈఓ విజయరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివార్లను ఊరేగిస్తూ ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించారు. -
గురువును మించిన దైవం లేదు
● విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం ● 67 మంది టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం అనంతపురం ఎడ్యుకేషన్: తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువు జీవితానికి అర్థం నేర్పుతారు. పుస్తకంలోని పాఠాలతో పాటు క్రమశిక్షణ, విలువలు, బాధ్యత, మానవత్వాన్ని బోధించే గురువును మించిన దేవుడు లేరని వక్తలు కొనియాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అధ్యక్షత వహించారు. కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్, ఆర్జేడీ శామ్యూల్, డీఈఓ అయ్యూబ్ హుస్సేన్, సమగ్రశిక్ష ఏపీసీ శైలజ, డిప్యూటీ డీఈఓలు శ్రీనివాసరావు, కృష్ణయ్య, డీసీఈబీ కార్యదర్శి గంధం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానవక్తలు మాట్లాడుతూ ‘విద్యార్థి భవిష్యత్తుకు గురువే దిక్సూచి. అక్షర జ్ఞానం నుంచి ఆత్మవిశ్వాసం వరకు గురువే మార్గదర్శి. సమాజ నిర్మాణానికి గురువులే మూలస్తంభాలు. తరాలను తీర్చిదిద్దే శిల్పులు.. ఉపాధ్యాయులు’ అని కొనియాడారు. విద్యార్థి విజయమే గురువుకు అసలైన అవార్డు అన్నారు. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలు.. వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అన్నారు. అలాంటి గురువుల సేవలను స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చదువు చెప్పిన కళాశాలలో గురుపూజోత్సవం జరుపుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. సమాజానికి మంచి పౌరులను అందిస్తున్న గురువులను గౌరవించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం జిల్లాస్థాయి ఉత్తమ టీచర్ అవార్డులకు ఎంపికై న 67 మంది టీచర్లను అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా ‘విలువల విద్య’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
తాడిపత్రిలో అన్ని చోట్లా పోటీ చేస్తాం
● దమ్ముంటే జేసీ ప్రభాకర్ రెడ్డి మా సవాల్ స్వీకరించాలి ● మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసి తీరతామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం కావాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ చేశారు. వీలైతే ఆయన కూడా పోటీ చేయాలన్నారు. తాడిపత్రిలో మునిసిపల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపిస్తే ప్రజలు ఎవరి వైపు ఉన్నారో స్పష్టమవుతుందన్నారు. ఓటర్లకు డబ్బు పంపిణీతో పాటు దౌర్జన్యాలు చేయడం, పోలీసులపై ఒత్తిడి తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనే దురుద్దేశాలు ఉంటే విడనాడాలని, కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదని గ్రహించాలని హితవు పలికారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు నమ్మి టీడీపీ నాయకులు మోసపోవద్దని సూచించారు. రెండు సంవత్సరాలు గడిచాక ప్రభుత్వం మారితే బెంగళూరుకో, హైదరాబాద్‌కో జేసీ వెళ్లిపోతాడనే విషయాన్ని గ్రహించాలన్నారు. జేసీకి దమ్ము, ధైర్యం ఉంటే సవాల్‌ను స్వీకరించి మునిసిపల్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలన్నారు. జేసీ చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ తప్పులేనని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డిల కుట్ర రాజకీయాలు ఇటీవల తీవ్రమయ్యాయని మండిపడ్డారు. తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో అలజడి సృష్టించేందుకు నీచ రాజకీయాలు చేయిస్తున్నారన్నారు. జేసీ వర్గీయులు దాడులు చేస్తున్నా పోలీసులు ఫిర్యాదు ఎందుకు స్వీకరించరని ప్రశ్నించారు. బాధితుల పక్షాన నిలవకుండా నిందితులకు వత్తాసు పలకడమే పోలీసుల విధానమా.. అని నిలదీశారు. తాడిపత్రి పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుంటే మంచిదని సూచించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించారు. ఫోర్జరీ దొంగ జేసీ ప్రభాకర్ రెడ్డి.. తండ్రి కాలం నుంచే సంపన్నులమని చెప్పుకునే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్లు, అక్రమ రిజిస్ట్రేషన్లతో బీఎస్– 3 వాహనాలను బీఎస్–4గా మార్చి దొరికిన దొంగ అనే విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని పెద్దారెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు ఆపాలని హితవు పలికారు. -
పంట ఎండుతున్నా కరెంటు ఇవ్వరా?
రాప్తాడు రూరల్: పంటలకు నీరు పెట్టుకోవాల్సిన సమయంలో కరెంటు కోసం రైతులు అర్ధరాత్రి రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. రాప్తాడు మండలం హంపాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు హంపాపురం, గొల్లపల్లి, యర్రగుంట, గొందిరెడ్డిపల్లి గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి అవసరమైన త్రీఫేజ్ విద్యుత్ సరఫరా సక్రమంగా చేయడం లేదంటూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా విద్యుత్ సరఫరా సరిగా లేదని రైతులు వాపోయారు. వారం రోజులుగా పగటిపూట మూడు గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తున్నారని, రాత్రివేళల్లో కోత విధిస్తున్నారని తెలిపారు. రెండు రోజుల నుంచి పూర్తిగా విద్యుత్ సరఫరానే నిలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బోర్లు పనిచేయక పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ సమస్యపై ఎమ్మెల్యే పరిటాల సునీతతోపాటు ఆమె సోదరులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు ఆరోపించారు. ఓ వైపు ఎల్–నినో ప్రభావంతో వర్షాలు సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు ఉన్న నీటిని పంటలకు అందించేందుకు కూడా విద్యుత్ లేకపోవడం దారుణమని మండిపడ్డారు. పంటలు కళ్లముందే ఎండిపోతుంటే అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా విద్యుత్ అధికారులు స్పందించి హంపాపురం సబ్‌స్టేషన్ పరిధిలో వ్యవసాయానికి నిరంతరాయంగా త్రీఫేజ్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అంతరాయంపై నిరసన డి.హీరేహాళ్ (బొమ్మనహాళ్): డి.హీరేహాళ్ మండలం గొడిసెలపల్లి సబ్‌స్టేషన్‌ను శనివారం రైతులు ముట్టడించి నిరసన తెలిపారు. వ్యవసాయ మోటర్లకు త్రీఫేజ్ కరెంటు ఇవ్వకుండా సింగిల్ ఫేజ్ ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని గెణిగెర, జక్కలవడికి, బాదనహాళ్, అంబాపురం తదితర గ్రామాల రైతులు ఏకరువు పెట్టారు. మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో వరి, మొక్క జొన్న, వేరుశనగ, మిరప తదితర పంటలకు కీలక సమయంలో నీరు అందక దెబ్బతినే పరిస్ధితి నెలకొందని వాపోయారు. విద్యుత్ సమస్యను పరిష్కరించకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అధికారులను హెచ్చరించారు. హంపాపురం, గొడిసెలపల్లి విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్న రైతులు -
జారీ చేసిన చెక్కు రీకాల్
సాక్షి ప్రతినిధి, అనంతపురం/న్యూటౌన్: టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని ‘పచ్చ’ కాంట్రాక్టర్లు సైతం రెచ్చిపోతున్నారు. చేయని పనులకు సైతం అక్రమంగా బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇదేంటని బాధితులు ప్రశ్నిస్తే ‘నీ దిక్కున్న చోట చెప్పుకో.. ప్రభుత్వం మాది’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అర్హత లేకున్నా అందలం ఎక్కిన వైనం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకశిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల ప్రజల దాహార్తి తీర్చేందుకు నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. పథక నిర్వహణ కోసం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు టెండర్ పిలుస్తుంటారు. పనులు చేపట్టేందుకు వార్షిక టర్నోవర్ రూ.16 కోట్లతో పాటు నీటి ప్రాజెక్టుల నిర్వహణలో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి. కానీ.. ప్రకాశం జిల్లాకు చెందిన అడపా వెంకట్రావుకు చెందిన సంస్థ వార్షిక టర్నోవర్ రూ.4 కోట్లలోపు, నీటి ప్రాజెక్టుల నిర్వహణలో అనుభవం ఆరు నెలలు మాత్రమే ఉన్నప్పటికీ ‘ముఖ్య’ నేత అండదండలు ఉన్నాయని అధికారులను భయపెట్టి పనులు దక్కించుకున్నాడు. 1.9.2025 నుంచి తిరిగి పథకం నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలో పథకం అమలులో గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. ఈ అడ్డగోలు దోపిడీలో ‘అడపా’కు కొందరు అధికారుల సహకారమూ ఉన్నట్లు తెలుస్తోంది. ‘పచ్చ’ నేతల అండదండలతో .. తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడంలో అడపా వెంకటరావు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. వేతనాలను బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉన్నప్పటికీ... చేతికి డబ్బులిచ్చి ‘ఇదే మీ జీతం’ అని చెప్పి పంపిస్తున్నారు. రికార్డుల్లో రూ.16 వేలు ఉన్న కార్మికులకు రూ.14 వేలు, రూ.14 వేలు ఉన్నవారికి రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ‘ఉద్యోగం కావాలా.. జీతం కావాలా’ అంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘పచ్చ’ నేతల అండ చూసుకుని అడపా సాగిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలపై ఇప్పటికే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బెంబేలెత్తుతున్న అధికారులు అడపా అక్రమాలను కళ్లారా చూస్తున్నా ఏమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రజా సంఘాలు, కార్మికులు అడపా అక్రమాలపై ఫిర్యాదులు చేస్తే.. ‘అతను మా స్థాయి కాదు.. అతనిపై చర్యలు తీసుకుంటే మాకు ఇబ్బందులు తప్పవు’ అంటూ నిస్సహాయతను ప్రదర్శిస్తున్నారు. అధికారులను సైతం అడపా వెంకట్రావు తీవ్ర పదజాలంతో హెచ్చరిస్తారని, ఏమైనా అభ్యంతరాలు చెబితే ‘ల’ కారంతో తిడతారని సిబ్బంది చెబుతున్నారు. తనకు ‘ముఖ్య’ నేత అండదండలు పుష్కలంగా ఉన్నాయని, ఏమైనా తోక జాడిస్తే మీ ఉద్యోగాలే ఊడతాయని అడపా బెదిరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో భారీగా గోల్మాల్ టీడీపీ ముఖ్య నేత అండదండలతో రెచ్చిపోతున్న అడపా వెంకటరావు ఇటీవల అక్రమంగా రూ.43 లక్షల చెక్కు జారీ చేయించుకున్న వైనం -
వివాహిత ఆత్మహత్య
గుంతకల్లు: స్థానిక తాటాకుల వీధికి చెందిన రాజేశ్వరి (33) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి బోయ లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజేశ్వరికి 15 ఏళ్ల క్రితం నేమకల్లు మద్దిలేటితో వివాహం జరిగింది. సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల ఈ కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అప్పులు ఎక్కువగా ఉన్నాయంటూ తల్లి లక్ష్మీదేవితో రాజేశ్వరి చెప్పుకుంటూ బాధపడుతుండేది. శనివారం ఉదయం సెంట్రింగ్ పనికి మద్దిలేటి వెళ్లగా.. చిన్న కుమారుడు స్కూల్‌కు వెళ్లాడు. పెద్ద కుమారుడు శ్యామ్‌కుమార్ కూడా బయటకు వెళ్లిన సమయంలో జీవితంపై విరక్తి చెందిన రాజేశ్వరి బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. అప్పడే ఇంటికి వచ్చిన కుమారుడు శ్యామ్‌కుమార్ బెడ్ రూమ్ తలుపులు ఎంత కొట్టినా రాజేశ్వరి తెరవకపోవడంతో సమీపంలోనే ఉన్న మామ కృష్ణకు చెప్పాడు. ఆయన తలుపులు పగులగొట్టి వెంటనే రాజేశ్వరిని కిందకు దింపి ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజేశ్వరి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 11 నుంచి ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. సుబేధార్గంజ్ జంక్షన్లో రైలు (04135) ఈ నెల 11 నుంచి డిసెంబర్ 04 వరకు ప్రతి శుక్రవారం (13 సర్వీసులు) రాత్రి 9.20 గంటలకు బయలుదేరుతుందన్నారు. అదేవిధంగా యశ్వంతపూర్ జంక్షన్ నుంచి రైలు (04136) ఈ నెల 14 నుంచి డిసెంబర్ 17 వరకు ప్రతి సోమవారం (13 సర్వీసులు) ఉదయం 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఈ రైళ్లు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, రాయచూర్, కృష్ణ, యాదగిర్, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, ఖాజీపేట, మంచిర్యాల, మాల్లంపల్లి, కాగజ్‌నగర్, సిర్పూర్ రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయన్నారు. 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. బాలికపై అత్యాచారం.. యువకుడిపై పోక్సో కేసు ఉరవకొండ: మండల పరిధిలోని పెద్దముస్టూరు గ్రామానికి చెందిన చరణ్‌తేజ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ మహనంది యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సీఐ తెలిపిన మేరకు.. బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించిన చరణ్‌తేజ్ గత నెల 10న బెంగళూరుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తన స్నేహితులతో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక కోసం తల్లిదండ్రులు వెతుకుతున్న సమయంలో చరణ్ గత నెల 18న ఇంటి సమీపంలో వదిలి వెళ్లిపోయాడు. దీంతో మోసపోయిన బాలికతో పాటు వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొలెరో
● ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు రాయదుర్గం రూరల్/బెళుగుప్ప: రాయదుర్గం మండలంలోని కాశీపురం గేటు వద్ద శనివారం సాయంత్రం బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. బెళుగుప్ప మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రామ్‌చరణ్, అభిరామ్, గోపాల్‌లు రాయదుర్గం మండలంలోని కాశీపురం గ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్లి తిరిగి వస్తుండగా, రాయదుర్గం–అనంతపురం జాతీయ రహదారిపై బొలెరో ఢీకొంది. దీంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థులు గుండ్లపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై రాయదుర్గం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన రామ్‌చరణ్, అభిరామ్ -
అవార్డుల అందజేత
అనంతపురం: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుల అవార్డులను ఎస్కేయూ మాజీ రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు, జేఎన్టీయూ అనంతపురం మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. కృష్ణయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, హ్యుమానిటీస్ విభాగం ప్రొఫెసర్ టి. నారాయణ రెడ్డి అందుకున్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న కృష్ణయ్య ప్రొఫెసర్ శివకుమార్ ప్రొఫెసర్ నారాయణ రెడ్డి -
ఆర్ఎంపీ కేంద్రాల్లో తనిఖీలు
అనంతపురం సిటీ: ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలోని నకిలీ వైద్యుల నిరోధక కమిటీ సభ్యులు డాక్టర్ సుబ్బానాయుడు, డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి, డాక్టర్ కురువ శ్రీహరి శనివారం అనంతపురంలోని పలు ఆర్ఎంపీ ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు. విషయం తెలియగానే పలువురు ఆర్ఎంపీలు తమ కేంద్రాలకు తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అందుబాటులో ఉన్న నాలుగు ఆర్ఎంపీ కేంద్రాలను బృందం సభ్యులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయా కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నట్లుగా తమ పరిశీలనలో గుర్తించినట్లు తెలుస్తోంది. శాసీ్త్రయ ఆధారాలు లేకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా మోసపూరిత వైద్య విధానాలను అవలంబిస్తున్న పాతూరులోని మేఘన ప్రథమ చికిత్స కేంద్రం (జి.రమణ), రామ్‌నగర్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న శ్రీసాయి క్లినిక్ (డాక్టర్ ఎస్.నాగేంద్రకుమార్), ఆర్టీఓ కార్యాలయం మార్గంలోని సూపర్ కే మాల్ వద్ద ఉన్న సప్తగిరి ప్రథమ చికిత్స కేంద్రం (డాక్టర్ రమేష్), కళ్యాణదుర్గం రోడ్డులోని మహబూబ్ ప్రథమ చికిత్స కేంద్రం (ఎండీ బాషా, వి.మనోహర్) నిర్వాహకులపై నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో వీరిపై చర్యలకు ఏపీ మెడికల్ కౌన్సిల్‌కు నకిలీ డాక్టర్ల నిరోధక కమిటీ సభ్యులు సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. 9న ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన అనంతపురం అర్బన్: షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి ఈ నెల 9న జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తేదీ రాత్రి అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథి గృహానికి ఆయన చేరుకుంటారని, 9న ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు గిరిజన సంఘాల నాయకులు, గిరిజనుల నుంచి అరీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఉదయం 9.45 స్థానిక నవోదయ కాలనీ వద్ద ఉన్న ఏకలవ్య విగ్రహం వద్ద చేరుకుని పుష్పాంజలి ఘటిస్తారని తెలిపారు. ఉదయం 10.45 గంటలకు పామిడి మండలం పాలెం తండాకు చేరుకుని మధ్యాహ్నం ఒంటి గంట వరకు గిరిజనులతో మాట్లాడతారని, అదే విధంగా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కలెక్టరేట్ చేరుకుని సాయంత్రం 5 గంటల వరకు కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో సమీక్షిస్తారన్నారు. డిమాండ్లు నెరవేరే దాకా ఉద్యమం ● జేఏసీ అమరావతి చైర్మన్ దివాకర్‌రావు అనంతపురం అర్బన్: ‘‘మేము కొత్తగా ఏమీ అడగడం లేదు. పనిచేసిన కాలానికి రావాల్సిన జీతాలు, భత్యాలు, బకాయిలే అడుగుతున్నాం. మా డబ్బులు మాకు ఇవ్వండి. డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదు’’ అని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఆర్.ఎన్.దివాకర్‌రావు అన్నారు. జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ‘డిమాండ్స్ డే’లో భాగంగా శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఆవరణలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఐక్యంగా ఉద్యమానికి మద్దతు ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం తమకు లభించిన తొలి విజయమన్నారు. చట్టబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలనే ఉద్యోగులు ప్రధానంగా కోరుకుంటున్నారన్నారు. వెంటనే పీఆర్సీ కమిషనర్ నియమాకం, మధ్యంతర భృతి, పెండింగ్ డీఏలు, ఇతర ఆర్థిక బకాయిలు చెల్లించాలన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై స్పష్టమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ అమరావతి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటశివప్రసాద్, మహిళా విభాగం చైర్పర్సన్ సురేఖరావు, ఎస్సీ మునిసిపల్ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అజయ్‌బాబు, వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు ఓబులేసు, వైద్యారోగ్యశాఖ సంఘం నాయకుడు కోదండరామిరెడ్డి, నాయకులు గోవిందునాయక్, మంజునాథ్, రామకృష్ణ, నాగేంద్ర, అబ్దుల్, అధికారుల, ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. -
తరగతులకు టాటా.. ‘దుర్గం’ బాట
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉపాధ్యాయులను మచ్చిక చేసుకునేందుకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీచర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారనే విశ్వాసంతో వారిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు తాయిలాలను ఎరగా వేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ దంపతులకు పట్టు వస్త్రాలు అందజేసి, సన్మానం చేసేందుకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని వేదికగా మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. అనధికారిక సెలవు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. అనంతపురంలో కలెక్టర్ చేతుల మీదుగా డీఈఓ అధ్యక్షతన ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. అవార్డులు అందుకున్న టీచర్లకు డీఈఓ ఆన్‌డ్యూటీ పర్మిషన్ ఇచ్చారు. కానీ, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాటే వేద వాక్కుగా మారింది. ఎమ్మెల్యే ఆదేశాలతో శనివారం నియోజకవర్గ వ్యాప్తంగా పాఠశాలలకు అనధికారికంగా సెలవు ప్రకటించారు. మధ్యాహ్నానికి అందరూ రావాలంటూ ఫోన్లు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం కళ్యాణదుర్గంలోని ఎమ్మెల్యే సొంత కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఉపాధ్యాయ దంపతులు మధ్యాహ్నానికల్లా హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది గురువారం నుంచే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీచర్లకు ఫోన్లు చేసి చెప్పారు. దీంతో టీచర్లు శనివారం ఉదయం 11 నుంచే పాఠశాలలకు అనధికారిక సెలవు ప్రకటించారు. విద్యార్థులను ఇంటికి పంపించేసి..వారు మాత్రం కళ్యాణదుర్గం బాటపట్టారు. నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రం మండలాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 290 వరకు ఉన్నాయి. వీటిలో 38 వేల మంది దాకా విద్యార్థులు ఉన్నారు. కలెక్టర్ ఏం చేస్తున్నారు? సాధారణంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు విద్యార్థులు తమ గురువులను సత్కరించడం, పూజించడం చేస్తుంటారు. కానీ, ఎమ్మెల్యే నిర్వాకంతో విద్యార్థులు తమ టీచర్లను సత్కరించకుండానే పాఠశాలలను విడిచి వెళ్లాల్సి వచ్చింది. అనధికారిక సెలవుపై కలెక్టర్ ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. పాఠశాలకు అనధికారిక సెలవు ప్రకటించడంతో ఇంటికి వెళ్తున్న విద్యార్థులు ఎమ్మెల్యే అమిలినేని కార్యాలయం వద్దకు చేరుకున్న ఉపాధ్యాయ దంపతులు 05ఏటీపీ02 మూతపడిన ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులంతా ఎమ్మెల్యే కార్యాలయానికి రావాలంటూఫోన్లలో హుకుం అమిలినేని ఆదేశాలతో పాఠశాలలను, విద్యార్థులను వదిలేసి వెళ్లిన టీచర్లు -
గొర్రెపిల్లల దొంగల ఆటకట్టు!
రాప్తాడు రూరల్: రాప్తాడు మండలం లింగనపల్లిలో వరుసగా చోటుచేసుకున్న దొంగతనాలకు ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టారు. గొర్రెపిల్లల దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను రాప్తాడు సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. గొర్రెపిల్లల దొంగతనంతో వెలుగులోకి.. అనంతపురం రూరల్ మండలం రుద్రంపేట పంచాయతీ చంద్రబాబునగర్‌కు చెందిన సాయి, చిన్న అలియాస్ రవికుమార్‌రెడ్డి జల్సాలకు అలవాటుపడి చిన్నచిన్న దొంగతనాలు చేసేవారని సీఐ తెలిపారు. బైకు లేదా కారులో వచ్చి ఒకట్రెండు గొర్రెపిల్లలను ఎత్తుకెళ్లి విక్రయించేవారన్నారు. ఇటీవల లింగనపల్లిలో పది గొర్రెపిల్లలను కారులో ఎత్తుకెళ్తుండగా గ్రామస్తులు అడ్డగించారని, వారిని కత్తి, రాడ్డుతో బెదిరించి పరారయ్యారని వివరించారు. గ్రామస్తులపైకి కారును దూసుకెళ్లే ప్రయత్నం చేసి భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. ఆ సమయంలో గ్రామస్తులు కారును ఫొటో తీయడంతో దర్యాప్తులో కీలక ఆధారం లభించిందని సీఐ పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. సాయిపై గతంలోనూ పలు దొంగతనాల కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. బైకుపై ‘పోలీసు’.. అడ్డొచ్చిన వారికి బెదిరింపులు పేరూరు గ్రామానికి చెందిన ధన అలియాస్ ధనుంజయ అనే వ్యక్తి బైకుపై ‘పోలీసు’ అని రాసుకుని తిరిగేవాడని సీఐ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా ఉన్నవారిని, మద్యం సేవించే వారిని గుర్తించి పోలీసునంటూ బెదిరించి డబ్బులు దండుకునేవాడన్నారు. రవికుమార్‌రెడ్డితో కలిసి బైకుపై వెళ్లి గొర్రెపిల్లలను ఎత్తుకెళ్లేవాడని, ఎవరైనా ఎదురైతే కత్తితో బెదిరించడం, దాడి చేయడం వంటివి చేసేవారని వివరించారు. ధనుంజయ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. రైల్వే గ్యాంగ్‌మ్యాన్ అనుమానాస్పద మృతి అనంతపురం సెంట్రల్: నగరంలో శ్రీనివాసనగర్‌లో రైల్వే గ్యాంగ్‌మ్యాన్ వెంకటేష్(45) అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రైల్వేలో గ్యాంగ్‌మ్యాన్‌గా పనిచేస్తున్న వెంకటేష్ ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. గ్యాంగ్‌మెన్ ఉద్యోగానికి కూడా దూరంగా ఉంటున్నాడు. భార్యాపిల్లలు అతనికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్ శనివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో కనిపించాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ కౌలుట్లయ్య వివరించారు. -
‘స్థానిక’ ఎన్నికలకు కసరత్తు
అనంతపురం న్యూ టౌన్: స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అదే సమయంలో జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ సభ్యుల పదవీ కాలం ఈ నెల 24వ తేదీ ముగియనుంది. ఆ తర్వాత జిల్లా పరిషత్ మండల పరిషత్ వ్యవస్థలో ఎన్నికలు నిర్వహించేంత వరకు ప్రత్యేక అధికారుల నియామకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక కేంద్రాల్లో ఓటర్ల వివరాలు ఓటింగ్ కేంద్రాలు తదితర ప్రధాన ఎన్నికల అంశాలపై జిల్లా పరిషత్ కార్యలయంలో సంబంధిత అధికారులు వివరాలను నవీకరణ చేస్తున్నారు. నేడు ఎన్నికల ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్(వీసీ) నిర్వహించనున్నారు. ఈ వీసీ ద్వారా త్వరలో జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపట్టవలసిన చర్యలపై జిల్లా పరిషత్ సీఈవో, డిడివోలు, ఎంపీడీవోలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ప్రధానంగా జడ్పీ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, డీడీఓ కార్యాలయం నుంచి డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు ఎంపీపీ కార్యాలయాల నుంచి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు విర్చువల్‌గా జరిగే ఎన్నికల ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని కమిషనరేట్ నుంచి ఆదేశాలు అందాయి. 2026 అసెంబ్లీ ఓటర్ల జాబితానే ప్రాతిపదికగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 2026 జనవరిలో ప్రచురితమైన ఓటర్ల జాబితా ప్రాతిపదికగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు కొత్తగా ఓటర్లను చేర్చుకోవడం గానీ లేదా తొలగించడం గానీ జరగదు. మండలస్థాయిలో వాటి ప్రాదేశిక స్థానాన్ని బట్టి ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లను కలిపి మండల ప్రాదేశిక స్థానాల సరిహద్దులను గుర్తించనున్నారు. మరో వారం పది రోజుల్లో జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజాపరిషత్ ఓటర్ల జాబితాను ప్రచురించే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు ఈ నెల 10వ తేదీలోగా పూర్తిస్థాయి తుది ఓటర్ల జాబితాను ప్రచురించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మండలాల పరిధిలో 841 ఎంపీటీసీ స్థానాలకు, 63 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
బోధనలో మేటి ఆదినారాయణ
కణేకల్లు: తెలుగు బోధనలో ఆదినారాయణ తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించారు. కణేకల్లు మండలం హనకనహళ్ జెడ్పీ హైస్కూల్లో ఏడున్నరేళ్లు తెలుగు టీచర్‌గా పని చేశారు. 16 ఏళ్ల సర్వీసులో ఎక్కువ కాలం ఇక్కడే పని చేశారు. తెలుగు సబ్జెక్ట్‌లో విద్యార్థులకు నూటికి నూరు మార్కులు వచ్చేలా చేయాలనుకున్న ఆయన కృషి ఫలించింది. వరసగా మూడేళ్లూ... నూటికి నూరు మార్కులు విద్యార్థులకు వచ్చాయి. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించడంతోపాటు చేతిరాతపై సాధన చేయిస్తున్నారు. ఈ శ్రద్ధే ఆయనకు అవార్డును తెచ్చి పెట్టింది. -
దంపతులకు తీవ్రగాయాలు
● 108 వాహనం లేక తీవ్ర ఇబ్బందులు ఉరవకొండ: మండల పరిధిలో చిన్నమూస్టూరు వద్ద ద్విచక్ర వాహనం టైరు పగలడంతో అదుపు తప్పిన ఘటనలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాలమేరకు.. కోనాపురానికి చెందిన ఉలుతప్ప, శకుంతలమ్మ ఉరవకొండ నుంచి తిరిగి వారి స్వగ్రామానికి వెళ్తున్నారు. చిన్నమూస్టూరు వద్ద ద్విచక్ర వాహనం టైరు పగలడంతో వాహనం అదుపు తప్పింది. ఇద్దరూ తీవ్రంగా గాయపడగా 108కు ఫోన్ చేశారు. ఉరవకొండకు వాహనం లేదని మరోచోటి నుంచి వాహనం రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పడంతో గత్యంతం లేక ఆటోలో వారిని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురంకు వెళ్లాలని వైద్యలు సూచించగా.. 108 అందుబాటులో లేకపోవడంతో రూ.6 వేలు బాడుగ చెల్లించి ప్రైవేటు అంబులెన్స్‌లో అనంతపురంకు వెళ్లారు. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కనీసం 108 వాహనం కూడా అందుబాటులేకపోవడం సిగ్గుచేటని ప్రజలు మండిపడుతున్నారు. -
హక్కుల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఉద్యోగుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై నాయకులు మండిపడుతున్నారు. ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తెచ్చేపనిలో ప్రధాన సంఘాల నాయకులు నిమగ్నమయ్యారు.
అనంతపురం అర్బన్: డిమాండ్ల సాధన ధ్యేయంగా ఉద్యోగులు చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యచరణ ప్రకటించి మొదటి దశ చేపట్టింది. ఇందులో భాగంగా సిద్ధం... సిద్ధం... ఉద్యమానికి సంసిద్ధం నినాదంతో ఈనెల 1న నాయకులు, ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి జాయింట్ కలెక్టర్ జె.విష్ణుచరణ్‌కు ఉద్యమ నోటీసును అందజేశారు. అదే రోజు నుంచి నల్లరిబ్బన్లు ధరించి విధులకు హాజరవుతూ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నారు. ‘ఉద్యోగితో... చేయి చేయి కలిపి’ కార్యక్రమం పేరిట ప్రభుత్వ శాఖల్లో ఉద్యమ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో ప్రధాన సంఘం ఏపీ జేఏసీ పోరుబాటకు సిద్ధమైంది. శనివారం రాష్ట్ర ఏపీ జేఏసీ సమావేశమై రూపొందించే కార్యాచరణ మేరకు జిల్లాలో ఉద్యమాలు నిర్వహిస్తామని నాయకులు చెబుతున్నారు. అన్నీ తప్పుడు లెక్కలే... అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం రెవెన్యూ ఆదాయంలో జీతాలు, పెన్షన్‌కు అయ్యే ఖరచు 47.64 శాతంగా ఉంటే... చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రాష్ట్ర పన్నుల ఆదాయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఖర్చు 2024–25లో 98 శాతం, 25–26లో 94 శాతంగా పేర్కొంటూ శ్వేత పత్రం పేరుతో వాస్తవ విరుద్ధ గణాంకాలు ప్రకటించిందని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. హక్కుల సాధనే ధ్యేయంగా పిడికిలి బిగిస్తున్న ఉద్యోగులు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్న నాయకులు ఉద్యోగులందరినీ భాగస్వాముల్ని చేసేపనిలో ప్రధాన సంఘాలు కార్యాచరణ ప్రారంభించిన ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ -
డ్రాపౌట్స్ తగ్గింపుతో గుర్తింపు
కుందుర్పి: శెట్టూరు గ్రామానికి చెందిన వరలక్ష్మి కుందుర్పి ఎస్సీకాలనీ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గించడానికి భర్త కానిస్టేబుల్ బొమ్మలింగ సహకారంతో ఈ ఏడాది వేసవిలో ఓ ఆటోకు మైక్ ఏర్పాటు చేసుకొని ‘బడికి పోదాం రా’ నినాదంతో అవగాహన కల్పించారు. మండలంలోని 36 గ్రామాలు తిరిగి 180 మంది డ్రాపౌట్స్‌ను తిరిగి బడిలో చేర్పించారు. దీంతో ఇద్దరు ఉండాల్సిన బడిలో ఆరుగురు టీచర్లు ఉండేందుకు కృషి చేశారు. ఎస్సీ కాలనీ పాఠశాలకు సొంత ఖర్చులతో వర్ణమాలతో పాటు 6 గదులకు పెయింటింగ్‌తో పాటు గదుల పునరుద్ధరణ పనులు చేసి ప్రజల నుంచి మన్ననలు అందుకున్నారు. పాఠశాలకు కంప్యూటర్లు, మైక్‌సెట్ వితరణ చేశారు. టీచర్ వరలక్ష్మి సేవలకు ఉత్తమ అవార్డు వరించింది. -
ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతూ..
కణేకల్లు: విద్యార్థుల ప్రతిభను వెలికి తీయించడంలో రాజశేఖర్‌కు ఎవ్వరూ సాటిలేరు. కణేకల్లు మండలం యర్రగుంట జెడ్పీ హైస్కూల్ హెచ్ఎంగా పని చేస్తున్న రాజశేఖర్‌కు 30 ఏళ్ల అనుభవం ఉంది. ఎక్కడ పని చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. యర్రగుంటకు ముందు పెద్దపప్పూరు మండలం పెద్ద ఎక్కలూరు జెడ్పీ హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్ లేకపోవడంతో తానే పాఠాలు బోధించి.. పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణకు కృషి చేశారు. యర్రగుంట జెడ్పీహైస్కూల్ హెచ్ఎంగా ఏడాది క్రితం వచ్చారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు తపించారు. అలా ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్ పరీక్షలు రాయించగా.. నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. మాక్ అసెంబ్లీకి ఒక విద్యార్థిని ఎంపికయ్యింది. -
గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు
ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు ఏమీ కోరడం లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటినే అడుతున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు. పీఆర్సీ కమిషనర్‌ను నియమించలేదు. ఐఆర్ ప్రకటించలేదు. ఐడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు ఇతర డిమాండ్లను అడుగుతుంటే ఉద్యోగులను ప్రభుత్వ వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. హక్కుల సాధనకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. – ఆర్.ఎన్.దివాకర్‌రావు, జిల్లా చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి -
ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాం
చంద్రబాబు ప్రభుత్వం పీఆర్సీ కమిషనర్‌ను నియమించలేదు. ఐఆర్ ప్రకటించలేదు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంచారు. సరండర్ లీవ్ ఉసేలేదు. అయినా రెండున్నర ఏళ్ల పాటు ఓపిగ్గా ఉన్నాం. ఉద్యోగుల హక్కులను కాలరాస్తే వాటిని సాధించుకునేందుకు ఉద్యమబాట పడతాం. మాకు తెలుసు. ఇప్పటి వరకు విజ్ఞప్తులు చేసిన చేతులు ఇకపై ఉద్యమ పిడికిలి బిగించి పోరాటానికి సిద్ధమవుతాయి. ఇప్పటికే కార్యవర్గం సమావేశం నిర్వహించి నాయకులకు దిశానిర్దేశం చేశాం. రాష్ట్ర కమిటీ ప్రకటించనున్న కార్యాచరణ మేరకు ఉద్యమాలను సాగిస్తాము. – జక్కుల మాధవ్, జిల్లా చైర్మన్, ఏపీ జేఏసీ -
చెరువు మట్టి తరలింపుపై తిరుగుబాటు
డి.హీరేహాళ్ (బొమ్మనహాళ్): చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తుండడంపై దొడగట్ట గ్రామస్తులు ఆగ్రహించారు. గ్రామానికి చెందిన అధికార టీడీపీ నాయకుడు ఇరిగేషన్ అధికారులతో లోపాయికారిగా మాట్లాడుకుని దొడగట్ట చెరువులో జేసీబీలను పెట్టి ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టారు. రైతుల పొలాలకు మట్టి తోలుతామని చెప్పి వందలాది టిప్పర్ల మట్టిని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకున్నారు. మట్టి తవ్వుకున్నందుకు కొంత మొత్తాన్ని గ్రామ అభివృద్ధికి ఇస్తామని చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి.. సొమ్మంతా టీడీపీ నాయకుడు జేబులో వేసుకోవడంతో రైతులు, గ్రామస్తులు ఆగ్రహించారు. శుక్రవారం చెరువులోనుంచి మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. సారవంతమైన మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని అభ్యంతరం తెలిపారు. దీంతో మట్టి తరలింపు తాత్కాలికంగా నిలిచిపోయింది. రైతుల పొలాలకని మట్టి తవ్వకాలు కర్ణాటకలో అమ్మి సొమ్ము చేసుకున్న ‘పచ్చ’ నేత -
విద్యుత్ సమస్యలపై రైతుల కన్నెర్ర
బెళుగుప్ప: విద్యుత్ సమస్యలపై రైతులు కన్నెర్రజేశారు. శుక్రవారం హనిమిరెడ్డిపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి.. ప్రధాన రహదారిపై బైఠాయించారు. వీరి ఆందోళనకు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు లైన్మెన్ కూడా లేరని, అష్టకష్టాలు పడి సాగు చేసిన పంటలు లో ఓల్టేజీ సమస్యతో నీరందక ఎండిపోతున్నాయని మండిపడ్డారు. తొమ్మిది గంటలు ఇవ్వాల్సిన విద్యుత్‌ను లోడ్ రిలీఫ్ పేరుతో ఏడు గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించేంతవరకు కదిలేది లేదని భీష్మించారు. ఇంతలో అటువైపు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రావడంతో రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ● లోఓల్టేజీ సమస్య తీవ్రరూపం దాల్చడంతో నక్కలపల్లి రైతులు బెళుగుప్ప సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఇష్టారాజ్యంగా విద్యుత్ సరఫరా చేస్తుండటంతో లో ఓల్టేజీ ఏర్పడి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని, మోటర్లు ఆడటం లేదని తెలిపారు. దీంతో పంటలకు నీరందించలేని దుస్థితి నెలకొందన్నారు. సబ్‌స్టేషన్ పరిధిలో ప్రస్తుతం ఐదు, ఎనిమిది కలిపి 13 మిలియన్ వాట్స్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయని, వీటి స్థానంలో 16 లేదా 20 మిలియన్ వాట్స్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మండల ఏఈ గంగాధర్ మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. -
శిక్షణ ప్రతిబింబించేలా పరేడ్
అనంతపురం సెంట్రల్: తొమ్మిది నెలలుగా తీసుకున్న శిక్షణ ప్రతిబింబించేలా పరేడ్ ఉండాలని ఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. జిల్లా శిక్షణ కేంద్రంలో 101 మంది సివిల్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఈ నెల 7న జరగనున్న నేపథ్యంలో శుక్రవారం పోలీసు పరేడ్ మైదానంలో రిహార్సల్స్ నిర్వహించారు. ప్రత్యేక వాహనంలో ఎస్పీ పర్యటించారు. కార్యక్రమం విజయవంతమయ్యేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగభూషణం, డీటీసీ డీఎస్పీ విజయకుమార్, ఏఆర్డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. 160 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): కర్ణాటకకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ‘నల్ల బజారుకు పేదల బియ్యం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శుక్రవారం డి.హీరేహాళ్ మండలం లింగమనహళ్లి వద్ద ఆంధ్ర–కర్ణాటక హైవేపై విజిలెన్స్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఐషర్ వాహనంలో 160 క్వింటాళ్ల (320 బస్తాలు) రేషన్ బియ్యం అక్రమంగా తరలుతుండటాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ నరేంద్రభూపతి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజశేఖర్ తెలిపారు. పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, ఇతర రాష్ట్రాలకు తరలించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. 12వ పీఆర్సీ కమిటీ వేయాలి అనంతపురం ఎడ్యుకేషన్: వెంటనే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించి 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కమిటీని నియమించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ పీఆర్సీ అమల్లోకి వచ్చి దాదాపు మూడేళ్లు దాటినా ఇంతవరకు కమిటీని నియమించకపోవడం సరికాదన్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు విడతల కరువు భత్యం (డీఏ)ను వెంటనే ప్రకటించి, ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరారు. నాయకులు వి. రాజశేఖర్, రవికుమార్, నాగభూషణ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి
కర్నూలు (సెంట్రల్): తమ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ పదవులు పొంది తమనే మరచిపోయారని ఆశావహ పోలీసు అభ్యర్థులు తీవ్ర ఆవేదన చెందారు. శుక్రవారం కర్నూలులో ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కోరుతూ కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాలకు చెందిన ఆశావహ పోలీసు అభ్యర్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి ఈ దీక్షలను అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిరుద్యోగులు గ్రూపులుగా విడిపోయి నగరంలోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో ఉన్న ధర్నా చౌక్‌కు చేరుకొని దీక్షలను ప్రారంభించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా జాబ్ క్యాలెండర్లో ఒక్క పోస్టున్నీ భర్తీ చేయలేదన్నారు. పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను కేవలం 1,600 చూపడం అన్యాయమన్నారు. అసెంబ్లీలో హోంశాఖా మంత్రి అనిత, డీజీపీ చెప్పిన విధంగా 11,639 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. -
శింగనమల చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం
● రక్షించిన స్థానికులు శింగనమల: అనారోగ్యంతో కుటుంబ సభ్యులకు భారం కాకూడదని భావించిన ఓ మహిళ శింగనమల చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే అక్కడే రోడ్డు పనులు చేస్తున్న వారు గుర్తించి ఆమెను రక్షించారు. పోలీసుల వివరాల మేరకు... తాడిపత్రి గన్నెవారిపల్లి కాలనీకి చెందిన లక్ష్మీదేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు షుగర్, పెరాల్సిస్ ఉండడంతో, కుటుంబ సభ్యులకు భారమవుతానని భావించి శింగనమల మరువకొమ్మ క్రాస్‌కు బస్సులో వచ్చారు. అక్కడ బస్సు దిగి చెరువులోకి దూకింది. అయితే అక్కడే దగ్గరలో రోడ్డు పనులు చేస్తున్న కార్మికులు , రోడ్డు మీద ఉన్న ప్రయాణికులు వెంటనే ఆమెను కాపాడి చెరువులో నుంచి బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. ఏఎస్ఐ అశోక్‌కుమార్ సిబ్బందితో అక్కడికి వెళ్లి లక్ష్మీదేవిని పోలీస్‌సేష్టన్‌కు తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల వివరాలు కనుక్కొని వారిని పిలిపించి జాగ్రత్తగా చూసుకోవాలని మందలించారు. -
ఇన్స్పైరింగ్ టీచర్
కణేకల్లు: మ్యాథ్స్‌లో వెనుకబడిన విద్యార్థులు మెరుగ్గా రాణించేలా నిరంతరం ప్రోత్సహిస్తూ ఇన్స్పై రింగ్ టీచర్‌గా శ్రీనివాసరావు పేరు పొందారు. కణేకల్లు మండలం హనకనహళ్ జెడ్పీ హైస్కూల్ మ్యాథ్స్ టీచర్‌గా శ్రీనివాసరావు రాణించారు. లెక్కలంటే విద్యార్థుల్లో ఉండే భయం, ఆందోళనను తొలగించారు. విద్యార్థులు గైర్హాజరైతే తల్లిదండ్రులతో మాట్లాడి రెగ్యులర్‌గా వచ్చేలా చేసేవారు. రాత్రి పూట స్కూల్లోనే బస చేసి ప్రత్యేక తరగతులు చెప్పి లెక్కల్లో రాణించేలా చేశారు. మ్యాథ్స్‌లో మెరిట్ సాధించే విద్యార్థులకు బహుమతులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. నిరంతర ప్రోత్సాహమే ఉత్తమ టీచర్ అవార్డు వచ్చేలా చేసింది. -
కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి
● సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు అనంతపురం టవర్‌క్లాక్: సత్యసాయి తాగునీటి పథకాన్ని శాశ్వతంగా కొనసాగించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఎన్జీఓ హోంలో సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు కార్మికుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జి.ఓబులు మాట్లాడుతూ కార్మికులకు రావాల్సిన ఐదు నెలల వేతనాల కోసం 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. పుష్కరాలు , ఇతర కార్యక్రమాలకు నిధులు కేటాయించే ప్రభుత్వం ప్రజల దాహం తీర్చే ఈ పథకానికి ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. పాతబడిన పైపులైన్లు, మోటర్లు, పంపింగ్, విద్యుత్ వ్యవస్థలను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వేతనాలు తక్షణం చెల్లించి సమ్మెకు పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు ఆర్వీ నాయుడు, వైఎస్సార్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుసేన్ పీరా, గోవిందు, అనిల్ కుమార్ గౌడ్, రాజేష్ గౌడ్, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప పాల్గొన్నారు. నేడు, రేపు ‘సర్’ ప్రత్యేక క్యాంపెయిన్ అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు సంబంధించి శని, ఆదివారాలు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎనికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐఆర్ (సర్) గడువు పొడిగించిన నేపథ్యంలో అదనపు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓటరు నమోదు, వివరాల మార్పునకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించాలని, ఓటర్లకు తలెత్తే సందేహాలను నివృత్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దర్గాలో 21 కిలోల వెండి మాయం విడపనకల్లు: మండల పరిధిలోని వి.కొత్తకోటలోని బడేషావలి దర్గాలో 21 కిలోలు వెండి మాయం అయిన సంఘటనపై గ్రామస్తులు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. నాలుగు రోజు క్రితం దర్గాలో బడేషావలి ఉరుసు సందర్భంగా భక్తులు బడేషావలికి 27 కిలోలు వెండిని కానులకు రూపంలో సమర్పించారు. ఇందులో 21 కిలోలు వెండి మాయం అయినట్లు దర్గాకు సంబంధించి పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్గాకు సంబంధించి నూతనంగా ఎన్నికై న కమిటీ సభ్యులను పోలీసులు విచారించగా వెండిని తీసుకెళ్లి కరించగా ఆరు కిలోలు వచ్చిందని, దాన్ని కర్నూలు జిల్లా ఆదోనికి తీసుకెళ్లి కరిగించి విక్రయించగా రు.15.18 లక్షలు వచ్చాయన్నారు. ఆ సొమ్మంతా కూడా బ్యాంకులో డిపాజిట్ చేశామని కమిటీ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై ‘సాక్షి’ ఎస్ఐ ఖాజాహుస్సేన్ వివరణ కోరింది. అయితే రాతపూర్వకంగా తమకు ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని ఎస్ఐ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి గుత్తి: పట్టణ శివారులోని అనంతపురం రోడ్డులో సత్యసాయి వాటర్ పంప్ మౌస్ వద్ద శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం ఢీ కొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సురేష్ పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. -
మేటి బోధనతో మెరిశారు
● రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికై న ప్రొఫెసర్ ఎస్. కృష్ణయ్య జేఎన్టీయూ అనంతపురం సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్. ఆరు సంవత్సరాల పాటు రిజిస్ట్రార్‌గా సేవలు అందించారు. అనంతపురం ఎడ్యుకేషన్/అనంతపురం/గుత్తి/కళ్యాణదుర్గం రూరల్ : విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు.. వారి భవిష్యత్‌కు బలమైన పునాది వేయడంలో గురువుల పాత్ర కీలకం. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్న గురువులను గుర్తించి సత్కరించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏటా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందిస్తోంది. ఇందులో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది జిల్లాకు చెందిన నలుగురు అధ్యాపకులు, ముగ్గురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు–2026కు ఎంపికయ్యారు. ఉత్తమ అధ్యాపక అవార్డులకు ఎస్కేయూ నుంచి ఒకరు, జేఎన్టీయూ అనంతపురం నుంచి ముగ్గురు ప్రొఫెసర్లు ఎంపికయ్యారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు, జేఎన్టీయూ నుంచి మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. కృష్ణయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, హ్యుమానిటీస్ విభాగం ప్రొఫెసర్ టి. నారాయణ రెడ్డికి అవార్డులు దక్కాయి. అలాగే, కళ్యాణదుర్గం మండలం కొండాపురం ఎస్టీ కాలనీ ఎంపీపీ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్. గోవర్ధన్, గుత్తి కేజీబీవీలో బయాలజీ సీఆర్టీగా పనిచేస్తున్న ఆర్. గౌరీ ప్రభాంజలి, గుత్తి మండలం చెట్నేపల్లి జెడ్పీ పాఠశాలలో బయాలజీ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి. శామ్యూల్ ప్రతాప్‌ను రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక చేశారు. ఈనెల 5న విజయవాడలోని ఎస్.లయోలా స్కూల్లో నిర్వహించనున్న వేడుకల్లో వీరు అవార్డులు అందుకోనున్నారు. పాఠం చెప్పడం మాత్రమే కాదు.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, దానికి పదును పెట్టి, వారిని విజయ తీరాలకు చేర్చడమే లక్ష్యంగా ఆర్.గౌరీ ప్రభాంజలి పనిచేస్తున్నారు. ముఖ్యంగా కౌశల్ పోస్టర్ ప్రజెంటేషన్‌లో ఆమె వద్ద శిక్షణ పొందిన విద్యార్థినులు మూడుసార్లు రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలవడం ఆమె ప్రతిభకు నిదర్శనం. ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్, సదరన్ సైన్స్ ఫెయిర్లలో పలుమార్లు విద్యార్థినులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌లోనూ ఆమె తీర్చిదిద్దిన విద్యార్థినులు పలుమార్లు రాష్ట్ర స్థాయికి ఎంపికై తమ ప్రతిభను చాటారు. విద్యార్థులకు సైన్స్ పాఠాలను సులభంగా అర్థమయ్యేలా చెప్పేందుకు గౌరీ ప్రభాంజలి వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నారు. జిల్లాకు చెందిన ఏడుగురు గురువులకు రాష్ట్ర స్థాయి అవార్డులు నలుగురు అధ్యాపకులు, ముగ్గురు ఉపాధ్యాయుల ఎంపిక విద్యా రంగానికి అందించిన సేవలకు గుర్తింపు -
ఘనంగా సీతారాముల కల్యాణం
బొమ్మనహాళ్: ప్రసిద్ధి చెందిన నేమకల్లు ఆంజనేయస్వామి బాలాలయంలో గురువారం సీతారాముల కల్యాణాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్‌స్వామి ఆధ్వర్యంలో వేకువజామున స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి పుష్పాలతో అలంకరణ చేసి పూజలు చేశారు. అనంతరం సీతారాముల విగ్రహాలను పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెగా ప్రత్యేకంగా అలంకరించి కొలువు తీర్చారు. వేద మంత్రాల నడుమ కల్యాణోత్సవాన్ని కనులపండువలా నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. పేదల స్థలాల దురాక్రమణ గుత్తి: గుత్తిలో అధికార పార్టీ నాయకులు పేదల స్థలాలను దురాక్రమించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే 2007లో అప్పటి ప్రభుత్వం స్థానిక జంగాల కాలనీకి సమీపంలోని గుట్టపై సర్వే నంబర్లు 727–1,727–2లో 80 మంది పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయడంతో పాటు పట్టాలు కూడా ఇచ్చింది. ఇటీవల అధికార పార్టీ నాయకులు ఈ స్థలాలను ఆక్రమించేశారు.దీనిపై బాధితులు పోలీసులు, రెవెన్యూ అధికారులను ఆశ్రయించగా, ఎలాంటి న్యాయం జరగలేదు. పైగా వారు అధికార పార్టీ నాయకులకే వంత పాడుతుండడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ పుణ్యవతిని వివరణ కోరగా ఆమె స్పందించారు. సర్వే నంబర్ 727–1,727–2 స్థలాలకు సంబంధించి తమ వద్ద పూర్తి సమాచారం లేదన్నారు. 2007లో పట్టాలు ఇచ్చారో లేదో కూడా తెలియదన్నారు. గణేష్ మంటపాలకు ఆన్లైన్లో అనుమతులు అనంతపురం సెంట్రల్: గణేష్ మంటపాలు ఏర్పాటు చేసుకునేందుకు www.ganesh utsav.net వెబ్సైట్ ద్వారా అనుమతులు మంజూరు చేయనున్నట్ల్లు ఎస్పీ జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో అనమతుల కోసం పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్, పంచాయతీ, విద్యుత్, రెవెన్యూశాఖల చుట్టూ తిరగాల్సి ఉండేదని, అన్ని శాఖలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చినట్లు వివరించారు. ఎలాంటి రుసుం లేకుండానే అనుమతులు పొందవచ్చునని తెలిపారు. ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకోవాలని కోరారు. ఐటీఐల్లో మిగులు సీట్లకు కౌన్సెలింగ్ గడువు పొడిగింపు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఐటీఐలతో పాటు ప్రైవేటు ఐటీఐల్లో 2026–27 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీ కోసం 5వ విడత ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీని పొడిగించినట్లు జిల్లా ఐటీఐ కన్వీనర్, ప్రిన్సిపాల్ పి. రాయపరెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ దరఖాస్తుతో పాటు ఒరిజినల్ ధ్రువపత్రాలను ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోపు ప్రభుత్వ ఐటీఐ (బాలుర), అనంతపురంలో పరిశీలన చేయించుకోవాలి. కొత్త విద్యార్థులైతే ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు దరఖాస్తు చేసుకోవాలి. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రాయపరెడ్డి తెలిపారు. -
పశుగ్రాసం కొరత రానివ్వొద్దు
● కలెక్టర్ ఓ.ఆనంద్ గుత్తి రూరల్: రైతులకు పశుగ్రాసం కొరత రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు. మండలంలోని శ్రీపురం గ్రామ శివారులో ఉన్న చెరువులో 25 ఎకరాల్లో చేపట్టిన సామూహిక పశు గ్రాస పెంపకాన్ని కలెక్టర్ ఆనంద్ గురువారం ప్రారంభించారు. రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. రైతులు 10 లేదా 20 సెంట్లలో గడ్డి పెంచుకుంటే పశు గ్రాసం కొరత అసలు ఉండదని, తద్వారా ఆదాయం కూడా వస్తుందన్నారు. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం శ్రీపురం గ్రామంలో అధికారులపై కలెక్టర్ మండి పడ్డారు. గ్రామంలో వ్యవసాయం, పంటల సాగు, పశు సంపద తదితర విషయాలపై ఏడీఏ వెంక ట్రాముడు, ఏఓ ముస్తాక్ అహ్మద్, పశు సంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ ఆరా తీయగా, వారు సరైన సమాధానం చెప్పలేదు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ కార్యక్రమాలు 30 శాతం మంది రైతులకు కూడా తెలియడం లేదని, అధికారులు ఏ మాత్రం పని చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జేడీ ప్రేమ్ చంద్, వెటర్నరీ డీడీ రమేష్‌రెడ్డి, ఏడీ భారతి పాల్గొన్నారు. నీటి సరఫరా పనులు పూర్తి చేయాలి అనంతపురం అర్బన్: తాగునీటి సరఫరా పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. రాప్తాడు నియోజకవర్గంలో జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. పీఏబీఆర్ వద్ద ఫిల్టర్ బెడ్స్ పనులు మొదలు కాకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఆత్మకూరు వద్ద ఓహెచ్ఎస్ఆర్, సంప్, పంప్ హౌస్ నిర్మాణం ప్రారంభించలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే సునీత, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు తదితరులున్నారు.‘సర్’ విచారణ వేగవంతం అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు సంబంధించి ఓటర్ల విచారణ ప్రక్రియను వేగవంతం చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌కు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ తెలిపారు. సీఈఓ గురువారం వెలగపూడి నుంచి కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తో పాటు ఎన్నికల విభాగం డీటీ కనకరాజ్, ఎస్ఏ శామ్యూల్ బెంజిమన్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ విచారణకు సంబంధించి 1,22,601 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని, పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఓటరు నమోదుకు 11,327 దరఖాస్తులు, ఓటు తొలగింపునకు (ఫారం–7) 242, వివరాల చేర్పు–మార్పునకు (ఫారం–8) సంబంధించి 9,044 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయన్నారు. -
కరువును ఎదుర్కోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఉరవకొండ: జిల్లాలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కరువు పరిస్థితులు ఉన్నాయని, అయినా కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఖరీఫ్‌లో అనంతపురం జిల్లాలో 55 శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 48 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయన్నారు. భూగర్భజలాలు అడుగంటి తాగు, సాగునీటికే కాకుండా పశుగ్రాసం కొరత తీవ్రంగా వేధిస్తోందన్నారు. అలాగే రాయలసీమలో 75 శాతం పాల ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. శ్రీశైలంలో నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 874.30 అడుగులు ఉన్నాయన్నారు. ఇలాంటి తరుణంలో ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారన్నారు. శ్రీశైలానికి ఇన్‌ఫ్లో 13,171 క్యూసెక్కులు ఉంటే విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ ఔట్‌ఫ్లో 26,114 క్యూసెక్కులుగా వెళ్తోందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రెండు వారాల్లో డ్యాం నీటి మట్టం 854 అడుగులకు పడిపోతుందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పొతిరెడ్డిపాడు నుంచి నీళ్లు వచ్చే అవకాశం ఉండదన్నారు. తుంగభద్రడ్యాం పరిధిలోని హెచ్చెల్సీ, జీబీసీ పరిధిలో కేవలం రెండు నియోజకవర్గాలకే ఆరుతడి పంటలకు నీళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. పంటలు పెట్టుకున్న మిగిలిన నియోజకవర్గాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాతావరణం అనుకూలించని నేపథ్యంలో రైతులకు బీమా పరిహరం, ఇన్పుట్ సబ్సీడీ అందించాలని డిమాండ్ చేశారు. గడ్డి తింటూ కార్మికుల వినూత్న నిరసన కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం వద్ద ఉన్న సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ ముందు ఆ పథకంలో పని చేస్తున్న కార్మికులు డిమాండ్ల సాధన కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఽనిరవధిక సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగానే కార్మికులు పచ్చి గడ్డి తింటూ వినూత్నంగా నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే దాకా నిరసనతలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీరాములు, నేతలు శ్రీనివాసులు, హరి ఓబన్న శ్రీనివాసులు నాయక్‌తో పాటు కార్మికులు పాల్గొన్నారు. -
పక్కా స్కెచ్‌తోనే భరద్వాజ్ హత్య
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం వీఎన్ఆర్ కాలనీలోని ఆరాధ్య హోమ్స్‌కు వెళ్లే మార్గంలో గుజరి షాపు వద్ద జరిగిన మఠం భరద్వాజ్ (33) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పాళ్యం శ్రీహరి, పాళ్యం చందన, అనంతపురం రూరల్ పామురాయికి చెందిన దాసంద్రం అనిల్‌కుమార్, తరిమెల పంచాయతీ చింతమేకలపల్లికి చెందిన దండు మునికుమార్, గురుగుంట్లకు చెందిన వరుకూటి రామాంజనేయులు, బెళుగుప్పకు చెందిన అక్కిశెట్టి తులసిలను గురువారం అరెస్టు చేశారు. వివరాలను సీఐ శ్రీకాంత్‌యాదవ్ మీడియాకు వెల్లడించారు. కిడ్నాప్ కేసు పెట్టినా... రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే భరద్వాజ్‌కు టిఫిన్ సెంటర్ నిర్వహించే శ్రీహరితో పరిచయం ఉంది. ఈ క్రమంలో శ్రీహరి భార్య చందనతో భరద్వాజ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భరద్వాజ్... చందనను తీసుకెళ్లాడు. దీనిపై ఈ ఏడాది మార్చిలో అనంతపురం ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో భరద్వాజ్‌పై కిడ్నాప్ కేసు నమోదై రిమాండ్‌కు వెళ్లాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చందన వెంటపడుతుండటంతో శ్రీహరి, అతని బంధువులు భరద్వాజ్‌ను హతమార్చేందుకు కుట్ర పన్నారు. ఫోన్ చేయించి .. కాపు కాసి.. కుట్రలో భాగంగా గత నెల 29న రాత్రి 10.30 గంటల సమయంలో చందనతో భరద్వాజ్‌కు ఫోన్ చేయించి ఆరాధ్య హోమ్స్ వద్దకు రప్పించారు. భరద్వాజ్ కారులో అక్కడికి చేరుకుని చందనతో మాట్లాడి తిరిగి వెళ్తుండగా నిందితులు అతడి వాహనానికి మోటార్‌సైకిల్ అడ్డుపెట్టి కొడవలి, ఇనుపరాడ్లు, బండరాయితో దాడి చేసి హత్య చేశారు. నిందితులను పామురాయి వద్ద అక్కమ్మగార్ల గుట్ట సమీపంలో అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, కొడవలి, రెండు ఇనుపరాడ్లు, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఆచూకీ గుర్తించి అరెస్టు చేయడంలో సహకరించిన సీసీఎస్ సీఐ జయపాల్‌రెడ్డి, రూరల్ మహిళా ఎస్ఐ చైతన్యస్వరూపిణి, ఎస్ఐలు ధరణిబాబు, నవీన్‌కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు మహమ్మద్ రఫీక్, రామయ్య, కానిస్టేబుళ్లు తిమ్మప్ప, ఆసిఫ్, దాస్, రాజశేఖర్, మహేంద్ర, చంద్రకళను జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు. ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణం -
2.28 లక్షల హెక్టార్లలో పంటల సాగు
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ పంటల సాగు 65 శాతానికి చేరుకుంది. 3.43 లక్షల హెక్టార్లకు గానూ తాజా నివేదిక ప్రకారం 2.19 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ–క్రాప్ కొనసాగుతున్నందున సాగు విస్తీర్ణం మరింత పెరిగే పరిస్థితి ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఇక.. ‘ప్రత్యామ్నాయం’కు సంబంధించి 30 శాతం విస్తీర్ణానికి విత్తనాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో మండల అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. విత్తనం ఇచ్చామంటే ఈ–క్రాప్ చేయాల్సివుంటుందనే ఆలోచనతో చాలా పరిమితంగా ప్రత్యామ్నాయం చూపించే పరిస్థితి నెలకొంది. అలాగే వచ్చే నెల అక్టోబర్ నుంచి రబీ కూడా మొదలు కానుండటంతో నల్లరేగడి భూముల్లో ముందస్తుగా పప్పుశనగ సాగు చేసే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయానికి కొర్రీలు వేయనున్నట్లు చెబుతున్నారు. 31 వేల క్వింటాళ్ల ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళికలో చివరకు 5 వేల క్వింటాళ్లు కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ● వ్యవసాయశాఖ తాజా నివేదిక ప్రకారం 2.19 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి రాగా, అత్యధికంగా 1.08 లక్షల హెక్టార్లలో కంది సాగు చేశారు. ఆ తర్వాత వేరుశనగ 50 వేల హెక్టార్లుగా చూపించారు. 26,500 హెక్టార్లలో పత్తి, 14 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 10 వేల హెక్టార్లలో ఆముదం, 2,300 హెక్టార్లలో సజ్జ, కొర్ర 900 హెక్టార్లు, మిగతా పంటలు నామమాత్రంగా సాగు చేసినట్లు పేర్కొన్నారు. తేలికపాటి మినహా జూన్ 15 నుంచి వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నందున 44 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటికే ఖరీఫ్ దాదాపు దెబ్బతిని కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అక్టోబర్ నుంచి మొదలయ్యే రబీ ఆశలు కూడా వదులుకోవాల్సి ఉంటుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. -
భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఉచిత నైపుణ్య శిక్షణ
అనంతపురం సిటీ: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు మెరుగైన భవిష్యత్ కల్పించేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ లక్ష్మీనర్సయ్య తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం రూపొందించిన ‘ఇండస్ట్రీ రెడీ’ ఆన్లైన్ వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలోని తన చాంబర్లో గురువారం ఆయన ఆవిష్కరించారు. పారిశ్రామిక అవసరాలకు తగిన మానవ వనరులను పెంపొందించేలా బృహత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు లక్ష్మీనర్సయ్య తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో భవన నిర్మాణ కార్మికుల సభ్యత్వం కలిగిన వారి పిల్లలకు ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు తరఫున ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే డిప్లొమా, డిగ్రీ, బీటెక్, మెడికల్ విభాగాల్లో చదువుతున్న కార్మికుల పిల్లలు ఇందుకు అర్హులన్నారు. శిక్షణ మొత్తం ప్రీ రికార్డెడ్ (ముందస్తుగానే నిక్షిప్తం చేసిన) వీడియోల ద్వారా సాగుతుందన్నారు. ఈ విధానం వల్ల పిల్లలు తాము ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు తమకు తీరిక ఉన్న సమయాల్లో ఇంటి వద్దనే ఉంటూ మొబైల్ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏసీఎల్ శ్రీకాంత్‌నాయక్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎస్.ఎన్.లావణ్య, సహాయ కార్మిక అధికారులు కె.రాధారమాదేవి, ఎం. సుజాత తదితరులు పాల్గొన్నారు. పెళ్లి బస్సుపై రాళ్ల దాడి ● వ్యక్తికి తీవ్ర గాయాలు రాప్తాడు రూరల్: పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురం నగర శివారులోని సోములదొడ్డి వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా వీ.కోటకు చెందిన పెళ్లి బృందం బస్సులో గుంతకల్లుకు వెళ్లి వస్తుండగా సోములదొడ్డి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సుపైకి రాయి దూసుకొచ్చింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న కృష్ణమూర్తి అనే వ్యక్తి నుదిటిపై పడటంతో తీవ్ర రక్తస్రావమైంది. ఏం జరిగిందో అర్థంకాక ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సును నిలిపి బయటకు వచ్చి చూడగా రాయి విసిరిన వ్యక్తి అక్కడ కనిపించలేదు. గాయపడిన కృష్ణమూర్తిని వెంటనే అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీకాంత్‌యాదవ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బస్సులోని ప్రయాణికులను, స్థానికులను విచారించారు. రాయి దాడి వెనుక మిస్టరీ ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గార్లదిన్నె సమీపంలో ఓ బస్సుకు, ద్విచక్ర వాహనదారుడికి మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆ ద్విచక్ర వాహనదారుడు ఆ బస్సును వెంబడిస్తూ వచ్చి సోములదొడ్డి వద్ద రాయి విసిరినట్లు, అయితే లక్ష్యంగా చేసుకున్న బస్సుకు బదులుగా పొరపాటున వెనుక వస్తున్న పెళ్లి బస్సుపై రాయి పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు మతిస్థిమితం లేని వ్యక్తి రాయి విసిరి ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీకాంత్‌యాదవ్ తెలిపారు. -
బావిలో పడి వివాహిత మృతి
ఓడీచెరువు: మండల పరిధిలోని నల్లచెరువుపల్లికి చెందిన లక్కసాని ఉషారాణి (37) బావిలో పడి మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యుల వివరాలమేరకు... నల్లచెరువుపల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డి, ఉషారాణి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గురువారం ఉదయం టమాట పంటను చూసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రతాప్‌రెడ్డి తిరిగి వచ్చేశాడు. ఎంత సేపటికీ భార్య రాకపోవడంతో బోరు బావి దగ్గరికి వెళ్లి వెతకగా ఆమె బావిలోని నీటిలో పడి మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలికి అప్పుడప్పుడూ ఫిట్స్ వచ్చేవని, ప్రమాదవశాత్తూ బావినీటిలో పడి చనిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి తండ్రి సోమశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
నీటి కేటాయింపులో వివక్ష చూపుతారా?
● మాజీ మంత్రి సాకే శైలజానాథ్ శింగనమల: నీటి కేటాయింపులో వివక్ష చూపుతారా..? అంటూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శింగనమల నియోజకవర్గంలో ఉద్యాన పంటలు అధికంగా ఉన్నాయని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. తక్షణం మిడ్పెన్నార్కు నీరు వదలకుంటే చంద్రబాబు ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సాగునీటి సలహా మండలి సమావేశంలో కేవలం కొన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమన్నారు. మిగిలిన నియోజకవర్గాలు కనిపించలేదా అని నిలదీశారు. మిడ్ పెన్నార్ డ్యాం కింద 46 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నా ఎందుకు నీరు కేటాయించలేదని ప్రశ్నించారు. శింగనమల నియోజకవర్గంలో రైతులు, ప్రజలు సాగు, తాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిరక్ష్యంగా వ్యవహరి స్తోందని మండిపడ్డారు. గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారన్నారు. సాగు నీరు రాకపోతే భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు వట్టిపోతాయన్నారు. ఇప్పటికైనా స్పందించి నీటి సమస్యకు పరిష్కారం చూపకపోతే రైతులు, ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ● యథేచ్ఛగా బియ్యం దందా ● తక్కువకు కొని.. ఎక్కువకు అమ్మి.. ● జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో జోరుగా వ్యాపారం ● కర్ణాటక రాష్ట్రానికి తరలించేందుకు డి.హీరేహాళ్ మండలం జాజరకల్లు శివారులోని బీడు భూమిలో 50 కిలోలవి 280 ప్యాకెట్లు (14 టన్నులు) చౌక బియ్యాన్ని అక్రమంగా నిల్వచేశారు. వాటిని ఆగస్టు 18న పౌర సరఫరాల అధికారి శోభారాణి నేతృత్వంలో తహసీల్దారు శ్రీనివాసులు, ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి, సీఎస్‌డీటీ సుబ్రహ్మణ్యం, ఇతర సిబ్బంది దాడి చేసి స్వాధీనం చేసుకుని, రాయదుర్గం ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించారు. ● ఈ ఏడాది ఏప్రిల్ 13న గుత్తి మండలం ఎంగిలిబండ వద్ద బీడు భూమిలో 50 కిలోలవి 88 ప్యాకెట్ల (4.4 టన్నులు) చౌక బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు దాడిచేసి, స్వాధీనం చేసుకున్నారు. ● తక్కువ ధరకు నాణ్యమైన సోనామసూరి బియ్యం అంటూ ప్రజలను నమ్మించి ఆగస్టు 26న ఉరవకొండలో కొందరు అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని ప్రజలకు అంటగట్టారు. ఆలస్యంగా గుర్తించిన కొనుగోలుదారులు లబోదిబోమన్నారు. గుత్తి మండలం ఎంగిలిబండ వద్ద బీడు భూమిలో డంప్ చేసిన చౌక బియ్యం (ఫైల్) అనంతపురం అర్బన్: ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా పేదలకు అందే బియ్యం నల్లబజారు (బ్లాక్ మార్కెట్)కు తరలుతున్నాయి. బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. రేషన్ బియ్యం తక్కువ ధరకు సేకరించి, బయటి ప్రాంతంలో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ వ్యాపారం జోరందుకుంది. కొందరు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యం నొక్కేస్తూ వ్యాపారులకు అమ్ముతున్నట్లు తెలిసింది. మరికొందరు డీలర్లు కార్డుదారులకు బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇస్తున్నట్లు సమాచారం. రూ.15కి కొని.. రూ.50కి అమ్ముతూ.. పేదల ఆర్థిక అవసరాలను అక్రమార్కులు తమకు అనుకూలంగా చేసుకుని.. వారి నుంచి కిలో రేషన్ బియ్యం రూ.15తో కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో కర్ణాటక సరిహద్దున ఉన్న గ్రామాల్లో ఈ దందా జోరుగా సాగిస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని 50 కేజీల సంచుల్లో ప్యాక్ చేసి బళ్లారి, బెంగళూరు, బంగారుపేట, పావగడ, చిక్‌బళ్లాపూర్, తదితర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో బియ్యం కిలో రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. తొందరపడి కొనుగోలు చేయొద్దు అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని కొత్తసంచుల్లో ప్యాక్ చేసి.. తక్కువ ధరకు నాణ్యమైన సోనామసూరి అంటూ అమాయకులకు అంటగడుతున్నారు. ఈ విషయంలో ప్రజలు తొందరపడరాదు. బియ్యం తక్కువ ధరకు వస్తున్నాయని ఎక్కడపడితే అక్కడ కొనుగోలు చేయరాదు. దుకాణాలు, రైస్ మిల్లులు, రైతులు, స్థానికంగా ఉండే బియ్యం వ్యాపారుల నుంచి కొనుగోలు చేయాలి. క్రిమినల్ కేసులు నమోదు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాం. జిల్లా నుంచి రవాణా జరిగే మార్గంలో నిఘా పెట్టాం. విజిలెన్స్, పౌర సరఫరాల అధికారులు దాడులు నిర్వహిస్తూ అక్రమంగా రవాణా అవుతున్న బియ్యం పట్టుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 25 కేసులు నమోదు చేశాం. బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై 6ఏ కేసులతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. – శోభరాణి, జిల్లా పౌర సరఫరాల అధికారి -
12న జాతీయ లోక్ అదాలత్
అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఈ నెల 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు తెలిపారు. అనంతపురంలోని న్యాయ సేవా సదన్, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థలో గురువారం ఆయన రెండు జిల్లాల ఎస్పీలు జగదీష్, సతీష్‌కుమార్‌తో సబీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను రాజీ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి సత్యవాణి, న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎన్.రాజశేఖర్, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ శైలజదేవి పాల్గొన్నారు. 583 ఫోన్లు రికవరీ అనంతపురం సెంట్రల్: ‘మీ మొబైల్– మీ ఇంటికి’ కార్యక్రమం ద్వారా గురువారం జిల్లా వ్యాప్తంగా సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి రికవరీ చేసిన ఫోన్లను పోలీసులు అందజేశారు. 583 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకూ రూ.1.22 కోట్లు విలువజేసే 583 ఫోన్లను అందజేసినట్లు పేర్కొన్నారు. ముగిసిన జిల్లా స్థాయి క్రీడాపోటీలు అనంతపురం: ఆర్డీటీ క్రీడా మైదానంలో రెండు రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్–2026 క్రీడా పోటీలు గురువారం ముగిశాయి. కబడ్డీలో కూడేరు కేజీబీవీ ప్రథమ స్థానంలో నిలవగా, తాడిపత్రిలోని సాయి చైతన్య స్కూల్ రన్నరప్ దక్కించుకుంది. అలాగే వాలీబాల్‌లో విన్నర్స్‌గా బ్రహ్మసముద్రంలోని ఏపీఆర్ఎస్, రన్నర్స్‌గా నార్పల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఫుట్‌బాల్ విన్నర్స్‌గా కళ్యాణదుర్గం, రన్నర్స్‌గా గుంతకల్లు జట్టు నిలిచాయి. బాస్కెట్‌బాల్ విన్నర్స్‌గా నార్పల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, రన్నర్స్‌గా బసాపురం జెడ్పీహెచ్ఎస్, హాకీ విన్నర్స్‌గా దురదకుంట జెడ్పీహెచ్ఎస్, రన్నర్స్‌గా గడేకల్లు జెడ్పీహెచ్ఎస్ నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ఓ.ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలను అభినందిస్తూ ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయి, డీఎస్డీఓ ఎస్ఎం మంజుల, ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాసులు, శకుంతల, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.నాగరాజు, కార్యదర్శి సిరాజుద్దీన్, పీఈటీలు, డీఎస్ఏ కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు. మట్కా బీటర్ల అరెస్ట్ తాడిపత్రిటౌన్: పట్టణంలో పలు ప్రాంతాల్లో మట్కా రాస్తున్న మట్కా బీటర్లను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళ ఉన్నారు. వారి వద్ద నుంచి రూ 1,10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సెల్‌ఫోన్, మట్కా చీటీలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఆరోహణరావు తెలిపారు. పట్టణంలో ఎక్కడైనా మట్కా నిర్వహిస్తుంటే ప్రజలు తమకు సమాచారాం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. అలరించిన సంగీత కచేరీ ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన విశాఖ జిల్లా సత్యసాయి భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. గురువారం విశాఖటప్నం జిల్లాకు చెందిన సత్యసాయి భక్తులు ‘మానస సంచరే’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ సుమారు గంట పాటు కచేరీ నిర్వహించారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
మారిన అభివృద్ధి లెక్కలు
అనంతపురం క్రైం: ఉమ్మడి అనంతపురం జిల్లా పునర్విభజన జరిగి నాలుగేళ్లు గడిచినా.. పట్టణాభివృద్ధి పరంగా మాత్రం రెండు జిల్లాల మధ్య సంబంధం పూర్తిగా తెగిపోలేదు. అనంతపురం–హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థగా కొనసాగిన అహుడా పరిధి ఏళ్ల తరబడి రెండు జిల్లాల భౌగోళిక ప్రాంతాలను కలుపుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఆ వ్యవస్థకు తెరపడింది. అహుడా పేరును ‘అనంతపురం పట్టణాభివృద్ధి సంస్థ’గా (ఏటీపీ యూడీఏ) మార్చి.. శ్రీసత్యసాయి జిల్లా పరిధిని పూర్తిగా బయటకు తీసింది. అదే సమయంలో పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థ (పీయూడీఏ) పరిధిని శ్రీసత్యసాయి జిల్లాలో విస్తరించింది. ఇప్పటికే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. విస్తీర్ణంలో ‘అనంత’ ముందంజ కొత్త ఏటీపీ యూడీఏలో అనంతపురం నగరంతో పాటు రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు పట్టణాలు ఉన్నాయి. అనంతపురం, ఆత్మకూరు, బెలుగుప్ప, బొమ్మనహాళ్, బ్రహ్మసముద్రం, బుక్కరాయసముద్రం, డి.హీరేహాళ్, గార్లదిన్నె, గుత్తి, గుమ్మగట్ట, గుంతకల్లు, కళ్యాణదుర్గం, కంబదూరు, కనేణేల్లు, కూడేరు, కుందుర్పి, నార్పల, పామిడి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పుట్లూరు, రాప్తాడు, రాయదుర్గం, శెట్టూరు, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, యాడికి, యల్లనూరు మండలాలున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల్లో మొత్తం విస్తీర్ణాన్ని 10,205 చ.కి.మీ.గా పేర్కొన్నారు. అంటే అనంతపురం యూడీఏ కేవలం అనంతపురం నగర చుట్టుపక్కల అభివృద్ధి సంస్థ కాదు. తాడిపత్రి–యాడికి పారిశ్రామిక అక్షం, గుత్తి–గుంతకల్లు రవాణ అక్షం, అనంతపురం–రాప్తాడు పట్టణ విస్తరణ, ఉరవకొండ–వజ్రకరూరు ప్రాంతాల భవిష్యత్ అభివృద్ధి ఒకే ప్రణాళికా వ్యవస్థలోకి వచ్చాయి. ‘శ్రీసత్యసాయి’కి పెట్టుబడే బలం పీయూడీఏలో ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి వంటి పట్టణాలు ఉన్నాయి. మొత్తం 32 మండలాలు, 8,925 చ.కి.మీ. పరిధిలో పీయూడీఏను పునర్వ్యవస్థీకరించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ పారిశ్రామిక గణాంకాల ప్రకారం ఉమ్మడి అనంతపురం–శ్రీసత్యసాయి ప్రాంతంలో నమోదైన భారీ, మెగా పరిశ్రమలు 68. అందులో శ్రీసత్యసాయి జిల్లాలోనే 47, అనంతపురం జిల్లాలో 21 ఉన్నాయి. అంటే భారీ పరిశ్రమల సంఖ్యలో శ్రీసత్యసాయి జిల్లా వాటా దాదాపు 69 శాతం. పెట్టుబడుల విషయానికి వస్తే మొత్తం భారీ, మెగా పరిశ్రమల పెట్టుబడి సుమారు రూ.21,751.68 కోట్లు. అందులో శ్రీసత్యసాయి జిల్లాలో రూ.16,430.50 కోట్లు, అనంతపురం జిల్లాలో రూ.5,321.16 కోట్లు ఉన్నాయి. అంటే పెట్టుబడుల్లో శ్రీసత్యసాయి వాటా సుమారు 75.5 శాతం. ఉద్యోగాల పరంగానూ శ్రీసత్యసాయి జిల్లాలో 25,672, అనంతపురం జిల్లాలో 7,492 ఉద్యోగాలు నమోదయ్యాయి. అంటే విస్తీర్ణం అనంతపురం వైపు ఎక్కువగా ఉన్నా.. భారీ పరిశ్రమల ఆర్థిక బలం సత్యసాయి వైపు గట్టిగా కేంద్రీకృతమై ఉంది. పరిశ్రమల కేంద్రాల లెక్క ఇలా.. పారిశ్రామిక వివరాల ప్రకారం అనంతపురం వైపు అనంతపురం, గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, సజ్జలదిన్నె, సద్లపల్లి, తిమ్మసముద్రం వంటి పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. శ్రీసత్యసాయి వైపు అమ్మవారిపల్లి, గుడిపల్లి, హిందూపురం, గొల్లాపురం, కదిరి, అమడగూరు, పెనుకొండ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాలున్నాయి. రాప్తాడు, కొటిపి, కప్పలబండ వంటి ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి కూడా నమోదైంది. ఎంఎస్ఎంఈల్లో సీన్ రివర్స్ చిన్న, మధ్యతరహా పరిశ్రమల దగ్గర లెక్కలు పూర్తిగా మారిపోయాయి. రెండు జిల్లాల్లో కలిపి నమోదైన ఎంఎస్ఎంఈలు 7,040. ఇందులో అనంతపురం జిల్లాలో 4,180, శ్రీసత్యసాయి జిల్లాలో 2,860 ఉన్నాయి. అంటే సంఖ్య పరంగా దాదాపు 59.4 శాతం అనంతపురం వాటా ఉంది. ఎంఎస్ఎంఈ పెట్టుబడుల్లోనూ మొత్తం రూ.2,28,673.6 కోట్లు నమోదై ఉండగా.. అనంతపురం వాటా రూ.98,815.1 కోట్లు, శ్రీసత్యసాయి వాటా రూ.1,29,859 కోట్లు. ఉద్యోగాల్లో మాత్రం అనంతపురంలో 31,754, శ్రీసత్యసాయిలో 33,245 ఉన్నాయి. అహుడా స్థానంలో ఉమ్మడి అనంతకు రెండు పట్టణాభివృద్ధి సంస్థలు పరిశ్రమల పెట్టుబడుల్లో ‘శ్రీసత్యసాయి’ దూకుడు.. ఎంఎస్ఎంఈల సంఖ్యలో ‘అనంత’ ముందంజ -
వరించిన అవార్డులెన్నో..
ప్రొఫెసర్ శివకుమార్ జేఎన్టీయూ అనంతపురం కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏఐసీటీఈ ప్రాజెక్ట్, యూజీసీ రెండు ప్రాజెక్ట్‌లు చేపట్టారు. ఐదు పేటెంట్లు సాధించారు. గతంలో 3 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. ఐదుగురికి పీహెచ్డీ అవార్డులు ఈయన పర్యవేక్షణలో ఇచ్చారు. కెరీర్ అవార్డు ఫర్ యంగ్ టీచర్స్ అవార్డు, అవుట్ స్టాండింగ్ ఫ్యాకల్టీ అవార్డులు దక్కాయి. -
మరో మహోద్యమం తప్పదు
● ఉద్యోగులను ప్రభుత్వ వ్యతిరేకులుగా చూపుతారా? ● చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నేతల ఆగ్రహం అనంతపురం అర్బన్: ‘ఉద్యోగుల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఆర్థిక ప్రయోజనాలు అందించే విషయంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ప్రభుత్వ వ్యతిరేకులుగా చూపే ప్రయత్నం బాధాకరం. కాబట్టి హక్కుల సాధనకు సమష్టిగా ఉద్యమిద్దాం’ అని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఆర్.ఎన్.దివాకర్‌రావు పిలుపునిచ్చారు. ఉద్యమంలోకి వెళ్లాల్సిన కారణాలను వివరించేందుకు ‘ఉద్యోగితో చేయి చేయి కల్పి’ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా పరిషత్, కలెక్టరేట్, వైద్యారోగ్యశాఖ, తదితర కార్యాలయాల వద్ద ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ ఉద్యోగులు తమకు రావాల్సిన హక్కుల గురించి అడుగుతుంటే... రాష్ట్ర ఆదాయంలో 94 శాతం ఉద్యోగులు, పెన్షనీర్ల వేతనాలకే ఖర్చు చేయాల్సి వస్తోందంటూ తప్పుడు లెక్కలు చూపించడం దారుణమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హక్కులను సాధించుకునేందుకు ఉద్యమం తప్ప మరోమార్గం లేదన్నారు. ప్రతి ఉద్యోగి ఉద్యమంలో భాగస్వాములవ్వాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి పీఎస్‌ఖాన్, మహిళ విభాగం చైర్పర్సన్ సురేఖరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటశివప్రసాద్, కోశాధికారి సంతోష్, సిటీ చైర్మన్ పునీత్‌బాబు, వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు ఓబుళేసు, నాయకులు అబ్దుల్, రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలు పట్టవా? ‘‘ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనీర్ల ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరిస్తే మరో మహోద్యమం తప్పదు. సమస్యలపై ప్రభుత్వానికి రాష్ట్ర నాయకత్వం రెండున్నర ఏళ్ల పాటు ఓపిగ్గా విజ్ఞప్తులు చేసింది. చర్చలు జరిపింది. అయితే అటు కనీస స్పందన లేదు. ఈ పరిస్థితుల్లో పోరాటం ద్వారానే హక్కులను సాధించుకోవాలి. కాబట్టి ప్రతి ఉద్యోగి ఉద్యమానికి సిద్ధమవ్వాలి.’’ అని ఉద్యోగులకు ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ జక్కుల మాధవ్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సంఘం కార్యాలయంలో జేఏసీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే పీఆర్సీ కమిషన్ నియమిస్తామని, ఐఆర్ ప్రకటిస్తామని, పెండింగ్ లేకుండా డీఏలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ప్రభుత్వం ఈరెండున్నర ఏళ్లలో ఉద్యోగులను పూర్తిగా విస్మరించిదన్నారు. ఇప్పటి వరకు విజ్ఞప్తులు చేసిన చేతులు ఇప్పుడు పిడికిలి బిగించి ఉద్యమబాట పట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, నాయకులు రవికుమార్, వెంకటేష్‌బాబు, ప్రతాప్, నారాయణ, శ్రీనివాసరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, గౌస్‌పీరా, నరేష్, వెంకటరత్నం, మహేశ్వరెడ్డి, వంశీ, జమీల, తిమ్మప్ప, రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న జేఏసీ అమరావతి చైర్మన్ దివాకర్‌రావు, మాట్లాడుతున్న ఏపీ జేఏసీ చైర్మన్ మాధవ్ -
విద్యారంగానికి వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
అనంతపురం ఎడ్యుకేషన్: వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వైఎస్సార్‌టీఏ నాయకులు కొనియాడారు. వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఆయన అనేక సంస్కరణలు చేపట్టారని కొనియాడారు. ఉన్నత పాఠశాలల్లో సక్సెస్ స్కూల్స్ భావనతో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు ఆంగ్ల విద్య అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి విద్యారంగాన్ని బలోపేతం చేశారని పేర్కొన్నారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించారని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. -
దొంగల హల్చల్
రాయదుర్గంటౌన్: రాయదుర్గం పట్టణంలో వరుస చోరీలతో ప్రజలు, చిరు వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి పట్టణంలో మూడు చోరీలు జరిగాయి. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో అనంతపురం రహదారిలోని కోర్టు ఎదురుగా పక్కపక్కనే ఉన్న రెండు ఆటోమొబైల్ దుకాణాల్లో కొంత నగదుతోపాటు వస్తువులను దొంగలించారు. పైకప్పు షెడ్డు రేకులను కత్తిరించి లోపలకు ప్రవేశించిన దొంగలు క్యాష్ కౌంటర్లలోని కొంత చిల్లర నగదు, ఆటోమొబైల్ వస్తువులను దొంగిలించారు. హనిఫ్కు చెందిన ఆటోమొబైల్ షాపులో రూ.1,500 నగదుతోపాటు వస్తువులు, అలాగే పక్కనే గల యశ్వంత్‌కు చెందిన వెంకటేశ్వర ఆటోమొబైల్ షాపులో రూ.4 వేల నగదు, వస్తువులను దొంగిలించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాపుల్లోని సీసీ కెమెరా డివైజ్‌లను కూడా ఎత్తికెళ్లినట్లు తెలిపారు. అలాగే భంభంస్వామి దర్గా వద్ద నివాసం ఉంటున్న మొహిద్ అనే యువకుడు పెంచుకుంటున్న రూ.1.20 లక్షల విలువైన నాలుగు పొట్టేళ్లను ఎత్తుకెళ్లినట్లు బాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాళం వేసిన ఇంట్లో చోరీ గార్లదిన్నె: మండల పరిధిలోని కల్లూరులో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన హాజివలి కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కుమారుడు, కోడలు బంధువుల ఊరికి వవెళ్లగా, హాజి వలి ఒక్కడే ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి, కూరగాయల కోసం అనంతపురం మార్కెట్‌కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగుల గొట్టి లోపలకి చొరబడ్డారు. బీరువా తాళం పగులగొట్టిన అనంతరం 66 తులాల వెండి, 5 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఉదయం ఇంటికి వచ్చిన హాజీవలి తాళం పగులగొట్టి ఉండడం చూసి హతాశుడయ్యాడు. బీరువాలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి ఘొల్లుమన్నాడు. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. కొంగుకు రాళ్లు కట్టి.. చైను చోరీ ● బెంగళూరులో ఇద్దరు అనంతవాసుల అరెస్టు దొడ్డబళ్లాపురం(బెంగళూరు):పోలీసులమంటూ మహిళను ఏమార్చి తాళిబొట్టు చైను కాజేసిన ఇద్దరు దొంగలను బెంగళూరు నెలమంగల టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురానికి చెందిన సయ్యద్, హుసేన్ బాషాలు జూలై 8న బెంగళూరు సుభాష్ నగర నివాసి శైలజ స్థానికంగా వాకింగ్ చేస్తుండగా ఆమె వద్దకు వెళ్లారు. తాము క్రైం బ్రాంచ్ పోలీసులమని, ఇక్కడ ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయని, గస్తీ తిరుగుతున్నామని ఆమెను నమ్మించారు. శైలజ మెడలో తాళిబొట్టు చైను చూసి చాలా విలువైనదిలా ఉంది, ఇలా వేసుకుని తిరగకండి అని చెప్పి చైను విప్పించి పేపర్లో చుట్టి ఆమె కొంగుకు ముడి వేసి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లి కొంగు ముడి విప్పి చూసిన ఆమెకు చైనుకు బదులు రాళ్లు కనిపించాయి. దీంతో ఆమె నెలమంగల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అప్పటి నుంచి గాలించి నిందితులను అరెస్టు చేశారు. భూముల రీసర్వే పకడ్బందీగా చేపట్టండి ● జేసీ విష్ణు చరణ్ బెళుగుప్ప: భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. బుధవారం బెళుగుప్ప రెవెన్యూ పధిదిలోని 124, 125 సర్వే నంబర్లలో రైతులు రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరుల సమక్షంలో సాగుతున్న రీసర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రీసర్వేలో ఎలాంటి తప్పులకు తావివ్వకూడదన్నారు. త్వరితగతిన రీసర్వే పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సూయస్కుమార్, ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ అనిల్‌కుమార్, రీసర్వే ఏడీ కనక ప్రసాద్, ఏఓఎస్ అంజలి, మండల రీసర్వే డీటీ గురుబ్రహ్మ, వీఆర్ఓలు ప్రదీప్, ఎర్రిస్వామి, సర్వేయర్లు వినోద్, శ్రీదర్, విమల తదితరులు పాల్గొన్నారు. -
అల్లుడిపై కత్తితో దాడి
అనంతపురం సెంట్రల్: నగరంలోని అశోక్‌నగర్‌లో సొంత అల్లుడిపై అతని మామ కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పిల్లిగుండ్లకాలనీకి చెందిన రౌడీషీటర్ మున్నా తన కుమార్తెను అశోక్‌నగర్‌కు చెందిన బాబ్జాన్కు ఇచ్చి పెళ్లి చేశాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయంపై ఇరు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. దీనిపై పోలీసులకు బాబ్జాన్ ఫిర్యాదు చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన మున్నా కొంతమందిని వెంటబెట్టుకుని బుధవారం సాయంత్రం అల్లుడి ఇంటికి వెళ్లాడు. వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కాళ్లు, మెడ భాగాల్లో తీవ్ర గాయాలైన బాబ్జాన్ను స్థానికులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఘటనపై వన్‌టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. -
విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి
తాడిపత్రి రూరల్: విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి చెందిన ఘటన పట్టణ సమీపంలోని యల్లనూరు రోడ్డు రైల్వే గేటు వద్ద జరిగింది. అప్‌గ్రెడ్ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. పశ్చిమబెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లా నర్షిపూర్ ప్రాంతానికి చెందిన మసూద్‌రాణా(25) యల్లనూరు రోడ్డు రైల్వే గేటు వద్ద జరుగుతున్న రైల్వే బ్రిడ్జి పనుల వద్ద కూలీగా పనిచేసేవాడు. బుధవారం వెల్డింగ్, సెంట్రింగ్ పనులు చేస్తున్న సమయంలో చేతిలోని ఫోకస్ లైట్‌కు ఉన్న జాయింట్ తెగి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. సహచర కూలీలు వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మసూద్‌రాణా మృతి చెందాడని డాక్టర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. హోంగార్డుపై దాడి గుత్తి: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంగళవారం రాత్రి హోంగార్డు శ్రీనివాసులుపై తిలక్ రెడ్డి అనే వ్యక్తి దాడి చేశాడు. హోంగార్డు ఫిర్యాదు మేరకు ఎస్ఐ సురేష్ బుధవారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. హోంగార్డు శ్రీనివాసులు పీసీ రవీందర్ రెడ్డితో కలిసి బస్టాండ్ సమీపంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన తిలక్ రెడ్డి తన స్నేహితునితో కలిసి బైక్‌లో రాంగ్ రూట్లో వచ్చాడు. హోంగార్డు శ్రీనివాసులు బైక్‌ను ఆపగా.. నా బైక్‌నే ఆపుతావా? అంటూ తిలక్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయాడు. హోంగార్డుపై దాడికి పాల్పడ్డాడు. పీసీ రవీందర్‌రెడ్డి సర్దిజెప్పినా వినలేదు. హోంగార్డు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హోంగార్డు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి పాల్పడటంతో బాధితుడి ఫిర్యాదు మేరకు తిలక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అప్పుల బాధతో వ్యక్తి బలవన్మరణం సోమందేపల్లి(పరిగి): సోమందేపల్లి మండలంలోని కేతగానిచెరువు గ్రామానికి చెందిన నాగరాజు (42) అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేతగానిచెరువు గ్రామానికి చెందిన నాగరాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. ఇతనికి భార్య మంజులతో పాటూ ఇద్దరు సంతానం ఉన్నారు. నాగరాజుకు కొంతకాలంగా అప్పుల బాధలు ఎక్కువైనట్లు స్థానికులు తెలిపారు. దీంతో తరచూ మనస్తాపానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ఆయన గత మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు చరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అతని చరిత్రంతా మోసపూరితమే
కార్మికుల జీతాల కోసం గతంలో అనేకసార్లు ఆందోళన చేపట్టాం. ఏదో ఒక సాకు చెప్పి మభ్యపెట్టడం ఆనవాయితీగా మారింది. అడపా వెంకట్రావు చరిత్ర మొత్తం మోసపూరితమే అని రెండు జిల్లాల కలెక్టర్లకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరోమారు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల లోపాయికారి వ్యవహారంతో చెలరేగిపోతున్న అడప వెంకటరావు మోసకారితనంపై ఉద్యమిస్తాం. కార్మికుల బకాయిలను సాధించుకుంటాం. –ఓబులు, శ్రీరామరెడ్డి వాటర్ సప్లై స్కీం వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు అవును.. చెక్కు జారీ చేశాం శ్రీరామరెడ్డి వాటర్ ప్రాజెక్ట్ కార్మికుల వేతనాల చెల్లింపులకు సంబంధించి అడప వెంకటరావు పేరుతో చెక్కు జారీ చేసింది నిజమే. అతని అర్హతలకు సంబంధించి నాకు పెద్దగా తెలియదు. ఒప్పంద సంస్థ పేరుతో జారీ అయిన చెక్కును ఎందుకు రీకాల్ చేశారో నాకు తెలియదు. – జి.శ్రీనివాసులు, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ -
‘అనంత’ భళా.. ‘దుర్గం’ డీలా
● ఫీజు వసూళ్లలో మిశ్రమ స్పందన అనంతపురం అగ్రికల్చర్: మార్కెటింగ్‌శాఖ నిర్దేశించిన ఫీజు వసూళ్లలో మార్కెట్ కమిటీల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఐదు కమిటీలు లక్ష్యం దిశగా పయనిస్తుండగా మరో నాలుగు కమిటీలు లక్ష్యానికి ఆమడదూరంలో నడుస్తున్నాయి. ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉన్న 9 మార్కెట్ కమిటీలు, 15 సరిహద్దు చెక్‌పోస్టుల ద్వారా వివిధ రకాల ఫీజులు రూ.14.35 కోట్లు టార్గెట్ ఇవ్వగా, ఆగస్టు నెలాఖరుతో ముగిసిన ఐదు నెలల కాలంలో రూ.5.07 కోట్లకు పైగా వసూళ్లయ్యాయి. ఓవరాల్‌గా 35.37 శాతం సాధించాయి. ఇందులో అనంతపురం మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.5.25 కోట్లు కాగా ఇప్పటికే 51 శాతంతో రూ.2.69 కోట్ల వసూళ్లతో దూకుడు కొనసాగిస్తోంది. ఆ తర్వాత శింగనమల రూ.1.32 కోట్లకు గానూ 36.24 శాతంతో రూ.47.84 లక్షల వసూళ్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. రూ.1.13 కోట్లకు గానూ 34.87 శాతంతో రూ.39.40 లక్షల వసూళ్లతో ఉరవకొండ మూడో స్థానంలో ఉంది. ఇక 32 శాతంతో రాప్తాడు, 32 శాతంతో కళ్యాణదుర్గం మార్కెట్ కమిటీలు ఫరవాలేదన్నట్లుగా పయనిస్తున్నాయి. ఎటుతిరిగి రూ.30 లక్షలకు గానూ కేవలం 11 శాతంతో రూ.3.42 లక్షల వసూళ్లతో గుత్తి మార్కెట్ కమిటీ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఇక 14 శాతంతో రాయదుర్గం, 23 శాతంతో గుంతకల్లు, 25 శాతం వసూళ్లతో తాడిపత్రి మార్కెట్ కమిటీల్లో కూడా నిరాశాజనకంగా ఫలితాలు వెల్లడయ్యాయి. పశువులు, జీవాల సంతలు, చీనీ, చింతపండు, ఎండుమిర్చి, ఇతర వ్యవసాయోత్పత్తుల క్రయ విక్రయాలు, గోదాముల అద్దెలు, ట్రేడర్ల లైసెన్సులు, రెన్యువల్స్, రవాణా తదితర వాటికి సంబంధించి ఫీజులు, సెస్ వసూళ్లలో లీకేజీలు, సిబ్బంది కొరత, ఇన్‌చార్జ్‌ల పాలన కారణంగా వసూళ్లకు కోత పడుతున్నట్లు చెబుతున్నారు. వచ్చే మార్చిలోపు అన్ని కమిటీలు వంద శాతం లక్ష్యం సాధించడానికి చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్‌శాఖ ఏడీ రాఘవేంద్రకుమార్ తెలిపారు. -
అధికార బలంతో అరాచకం
రాప్తాడు రూరల్: అధికార బలంతో అరాచకం సృష్టించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. కురుగుంట పొలంలోని 172–1 సర్వే నంబరులో మొత్తం 17.75 ఎకరాల భూమి ఉంది. ఇందులో లలితమ్మకు 3.50 ఎకరాలు, లక్ష్మీదేవమ్మకు 3.15 ఎకరాలు ఉండగా, మిగిలిన 11.10 ఎకరాలు మారినేని సుబ్బరాయుడు కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. అయితే మారినేని కుటుంబ సభ్యుల పత్రాల్లో 12 ఎకరాలుగా ఉండటంతో వివాదం తలెత్తింది. 2020లో రీసర్వే నిర్వహించిన సమయంలో మారినేని కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో భూ వివాదం ఉన్నట్లు గుర్తించి జాయింట్ ఎల్పీఎంలో ఉంచారని బాధితులు తెలిపారు. 2025 జూన్‌లో మారినేని సుబ్బరాయుడు, లక్ష్మీనారాయణ, నారాయణస్వామి పేర్లపై సబ్ డివిజన్ చేశారని, ఈ ప్రక్రియలోనే తమకు అన్యాయం జరిగిందని లక్ష్మీదేవమ్మ కుటుంబం ఆరోపిస్తోంది. తమకు 3.15 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా ఆన్లైన్ రికార్డుల్లో కేవలం 2.69 ఎకరాలు మాత్రమే చూపించారని, అందులో సుమారు 84 సెంట్లను తమకు తెలియకుండా తగ్గించి మారినేని కుటుంబ సభ్యుల పేర్లపై నమోదు చేశారని బాధితులు వాపోయారు. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, కుమారుడు రఘునాథరెడ్డికి నోటీసు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ తాను ఎక్కడా సంతకం చేయలేదని ఆయన పేర్కొన్నాడు. కోర్టులో కేసు నడుస్తున్నా.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డుల్లో మార్పులు చేయించుకున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. స్థానిక టీడీపీ నాయకులు మారినేని లక్ష్మీనారాయణ, మారినేని నారాయణస్వామి అధికారులను ప్రభావితం చేశారని వారు చెబుతున్నారు. రికార్డుల్లో మార్పులు జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత లక్ష్మీదేవమ్మ కుటుంబ సభ్యులు పలుమార్లు రెవెన్యూ అధికారులను కలిసి తమకు న్యాయం చేయాలని కోరినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయారు. చేసేదిలేక న్యాయపోరాటానికి దిగారు. ఇదే సమయంలో ఈనెల 9న విచారణకు హాజరుకావాలని మారినేని కుటుంబ సభ్యులకు కోర్టు నుంచి నోటీసులు జారీ అయినట్లు బాధితులు తెలిపారు. నోటీసులు అందుకున్నప్పటికీ విచారణ పూర్తయ్యేలోపే 84 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకునేందుకు హడావుడిగా చర్యలు చేపట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత అండ చూసుకుని తమకు అన్యాయం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసు బందోబస్తు.. ఉద్రిక్తత బుధవారం సీఐ, ముగ్గురు ఎస్ఐలు, పెద్ద సంఖ్యలో పోలీసులు, మహిళా పోలీసులు, ప్రత్యేక బలగాలు భూమి వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసేందుకు వచ్చిన రెవెన్యూ సిబ్బందిని లక్ష్మీదేవమ్మ, ఆమె కుమారుడు రఘునాథరెడ్డి, కోడలు హరిత, కుమార్తె రమణమ్మ అడ్డుకున్నారు. ‘60 ఏళ్లుగా మేమే ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం. కోర్టులో వివాదం ఉంది. తీర్పు వచ్చేవరకు ఆగండి’ అంటూ మహిళా రైతు కుటుంబం వేడుకున్నా అధికారులు వినిపించుకోలేదు. రెండు గంటలపాటు సర్వేను అడ్డుకున్న అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివాదాస్పద భూమిపై న్యాయపోరాటం కొనసాగుతున్న సమయంలోనే పోలీసు బందోబస్తుతో వెళ్లి హద్దులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోళ్లు నాటేందుకు బొక్కలు పెడుతున్న డ్రిల్లింగ్ మిషన్ రైతు లక్ష్మీదేవమ్మను బలవంతంగా పక్కకు లాగేస్తున్న మహిళా పోలీసులు కోర్టులో కేసు ఉండగానే ‘హద్దులు’ దాటిన వైనం ఎమ్మెల్యే పరిటాల సునీత అండతోనే బరితెగించారని బాధిత కుటుంబీకుల కన్నీటిపర్యంతం -
నేమకల్లులో సుదర్శన హోమం
బొమ్మనహాళ్: నేమకల్లు ఆంజనేయస్వామి బాలాలయంలో శ్రావణమాస బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం సుదర్శన హోమం నిర్వహించారు. ప్రధాన అర్చకులు అనిల్కుమార్చార్యుల ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి పవిత్ర గంగాజలాభిషేకం, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో వేదపండితులు సుదర్శన హోమం హోమాన్ని నిర్వహించారు. విత్తన పప్పుశనగకు ప్రతిపాదనలు అనంతపురం అగ్రికల్చర్: రబీలో ప్రధానపంట పప్పుశనగ సాగుకు వీలుగా రైతులకు రాయితీపై ఇవ్వడానికి జిల్లాకు 45వేల క్వింటాళ్ల విత్తనం అవసరం అవుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు బుధవారం కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపారు. ఖరీఫ్‌లో అక్కడక్కడా నల్లరేగడి భూములు ఖాళీగా ఉన్నందున ఈసారి కేటాయింపులు చేయాలని కోరినట్లు తెలిపారు. రైతును బలిగొన్న విద్యుదాఘాతం బెళుగుప్ప: పంటకు నీరు పెట్టడానికి వెళ్లిన రైతును విద్యుదాఘాతం బలితీసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జీడిపల్లిలో కమ్మర చిన్న రామాంజనేయులు (64)కు మూడు ఎకరాల భూమి ఉంది. రెండు నెలల క్రితం బ్యాడిగ రకం మిర్చి సాగు చేశాడు. బుధవారం మధ్యాహ్నం పంటకు నీరు పెట్టడానికి పొలం వెళ్లాడు. స్టార్టర్ బాక్స్‌లో స్విచ్ ఆన్ చేయగానే.. మోటర్ వద్దకు వెళ్లే కేబుల్ తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో భార్య రామక్క స్థానిక వ్యక్తిని తోటకు పంపింది. అయితే అప్పటికే రామాంజనేయులు విగతజీవిగా పడి ఉండటం గమనించాడు. వెంటనే సమీప రైతుల సాయంతో విద్యుత్ వైర్లను తొలగించి మృతదేహాన్ని పక్కకు తీశారు. రామాంజనేయులుకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులకు, విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించారు. మాటలతో రెచ్చగొట్టి.. చితకబాది.. అనంతపురం సిటీ: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పార్కింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది దౌర్జన్యాలు పెచ్చుమీరిపోతున్నాయి. వారి సూచనలు పాటించకపోతే బూతులతో రెచ్చిపోతారు. దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. బుధవారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఉప్పునేసిన పల్లికి చెందిన ఆంజనేయులు అనే యువకుడు ద్విచక్ర వాహనంపై సర్వజనాస్పత్రికి వచ్చాడు. అప్పటికే చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తన తండ్రికి అవసరమైన మందుల కోసం వచ్చిన అతను తన వాహనాన్ని పార్క్ చేస్తున్న సమయంలో అక్కడున్న సిబ్బంది పక్కకు తీసుకెళ్లి పెట్టాలని తెలిపారు. దీంతో అతను మందులు తీసుకుని వెంటనే వెళ్లిపోతానని అనడంతో సిబ్బంది ససేమిరా అన్నారు. మాటలతో రెచ్చగొట్టి యువకుడిని పక్కకు నెట్టారు. స్వీయ రక్షణలో భాగంగా యువకుడు ప్రతిఘటించడంతో సిబ్బంది చుట్టుముట్టి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఏఎంసీలో చేర్చారు. బాధితుడిపైనే ఫిర్యాదు బాధిత యువకుడి ఫిర్యాదు మేరకు సర్వజనాస్పత్రి అవుట్ పోస్ట్ పోలీసులు పార్కింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిపై కేసు నమోదుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ వెంటనే అప్రమత్తమై సదరు యువకుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసేలా పావులు కదిపాడు. వాహనాన్ని పక్కన పెట్టమని చెప్పినందుకు తమపైనే యువకుడు దాడి చేసి గాయపరిచాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాలపై కేసుల నమోదుకు రెండో పట్టణ పోలీసులకు అవుట్‌పోస్టు సిబ్బంది సిఫారసు చేశారు. ఈ విషయమై సర్వజనాస్పత్రి పరిపాలనా అధికారి మల్లికార్జునరెడ్డిని వివరణ కోరగా.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. రోగులకు ఇబ్బంది కలిగిస్తే పార్కింగ్ కాంట్రాక్ట్ టెండర్‌ను రద్దు చేస్తామన్నారు. -
శ్రీనివాసా.. ఏమిటీ చెక్కుల గోల..?
అనంతపురం న్యూ టౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకశిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజక వర్గాల ప్రజల దాహార్తి తీర్చే నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. పథకం అమలు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కార్మికుల జానెడు పొట్టకు పిడికెడు అన్నం కరువైంది. ప్రతిసారి ఆందోళనలు చేస్తే తప్ప వేతనాలు అదే పరిస్థితి లేదు. వారికి చెల్లించాల్సిన జీతభత్యాల చెక్కులు యథావిధిగా జారీ అవుతున్నాయి. రాష్ట్రస్థాయి ‘ముఖ్య’ నేత అండదండలు ఉన్నాయన్న ఒకే ఒక నెపంతో కార్మికుల జీతాల నిధులను కొల్లగొడుతున్నారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ప్రాజెక్టు నిర్వహణకు ‘ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్’ అనే సంస్థతో జిల్లా పరిషత్ సీఈఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. గత ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు కాంట్రాక్ట్ కొనసాగింది. ఏమిటీ చెక్కుల మాయ..!? శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా ప్రాజెక్టులో పనిచేసే కార్మికుల వేతనాల చెల్లింపుల కోసం ప్రభుత్వం ఇటీవల నిధులను విడుదల చేసింది. గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగం అధికారులు కాంట్రాక్టు సంస్థకు కార్మికుల వేతనాల సొమ్మును చెక్కుల రూపంలో జారీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ‘ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్’ సంస్థ పేరుతో ఎం బుక్కులు తయారు చేశారు. అందులో పొందుపరిచిన వివరాల మేరకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ పేరుతో రూ.43,09,199కు చెక్కు (303306 నంబర్)ను ఆగస్టు 19న జారీ చేశారు. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఎవరి నుంచి.. ఎందుకు.. ఎలాంటి ఆదేశాలు వచ్చాయో ఏమో కానీ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు ఆగమేఘాల మీద స్పందించారు. గత నెల 19న ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ పేరుతో జారీ అయిన చెక్కును వెనక్కు తెప్పించారు. ఆ తర్వాత వెంటనే చెక్కును రద్దుపరచి మరో వారం రోజుల వ్యవధిలో అంటే ఆగస్టు 25న చెక్కు(303308 నంబర్)ను అడప వెంకటరావు పేరుతో జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. చెక్కు ఎందుకు రద్దు పరిచారు.. అనధికారిక వ్యక్తి పేరిట చెక్కు ఎందుకు ఇచ్చారు అన్నది అనుమానాలకు తావిస్తోంది. బినామీ కాంట్రాక్టర్ పేరుతో చెక్కు జారీ ‘ముఖ్య’ నేత సిఫార్సుతో ఫలహారం.. చక్రం తిప్పిన ఆర్డబ్ల్యూఎస్ అధికారి కాంట్రాక్ట్ ఒకరితో.. చెక్కు మరొకరి పేరుతో శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో భారీ కుంభకోణం -
బాలాలయాలకు పోటెత్తిన భక్తులు
బొమ్మనహాళ్: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నేమకల్లు, మురడి ఆంజనేయస్వాముల బాలాలయాలకు శ్రావణమాస మూడో మంగళవారం భక్తులు పోటెత్తారు. ప్రధాన అర్చకులు అనిల్కుమారాచార్యులు, పవన్‌స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహానివేదన, మహామంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్ఐలు నబీరసూల్, గురుప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. ప్రత్యేక అలంకరణలో నేమకల్లు ఆంజనేయస్వామి ప్రత్యేక అలంకరణలో మురడి ఆంజనేయస్వామి -
మురడి శివారులో చిరుత కలకలం
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): డి.హీరేహాళ్ మండలంలోని మురడి గ్రామశివారులో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు గ్రామ శివారులోని కొండ వైపు చిరుత వెళ్తుండడం గమనించారు. దీంతో భయాందోళనకు గురైన కూలీలు కేకలు వేయడంతో చిరుత పొలాల వైపు వెళ్లిపోయింది. వెంటనే గ్రామస్తులు డి.హీరేహాళ్ పోలీసులు, రాయదుర్గం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి అటవీశాఖ సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత జాడకోసం అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో రైతులు, కూలీలు భయపడుతున్నారు. చిరుత సంచారంపై అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాల వైపు వెళ్లవద్దని అధికారులు గ్రామస్తులకు సూచించారు. మహిళపై దాడి తాడిపత్రి రూరల్: మండలంలోని వీరాపురం గ్రామంలో మంగళవారం హేమావతిపై రాము, రామిరెడ్డిలు దాడి చేశారని పోలీసులు తెలిపారు. మురికి నీరు ఇంటి వద్దకు వచ్చాయన్న ఆగ్రహంతో గంజి నీరు పోయడమే కాక తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు 100కు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వీరాపురం వెళ్లి ఇరువురిని విచారణ నిమిత్తం అప్‌గ్రెడ్ పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. -
మద్యం మత్తులో డ్రైవింగ్.. యువకుడికి జైలు
ఎన్పీకుంట: మండల కేంద్రానికి చెందిన ఇడగొట్టు ప్రశాంత్ అనే యువకుడు మద్యం సేవించి ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ పట్టుబడ్డాడని ఎస్ఐ క్రిష్ణమూర్తి తెలిపారు. పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతున్నట్లు గుర్తించామని, నిందితుడిని కదిరి జ్యుడీషియల్ సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జడ్జీ 7 రోజులు జైలు శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. ఆవు దాడిలో వృద్ధురాలి మృతి వజ్రకరూరు: ఆవు దాడిలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొనకొండ్ల గ్రామంలో జరిగింది. వివరాలు.. కొనకొండ్ల ఇందిరమ్మ కాలనీకి చెందిన నెట్టికంటమ్మ (70) మంగళవారం ఇంటి వద్ద నుంచి సమీపంలోని దుకాణానికి వెళుతుండగా వెనుక వైపు నుంచి ఆవు దాడి చేసింది. దీంతో గాయపడిన వృద్ధురాలిని కుటుంబ సభ్యులు వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వృద్ధురాలు మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ● కాగా, అదే ఆవు దాడిలో మరో మహిళ గాయపడినట్లు తెలిసింది. ఇద్దరిపై దాడి చేసిన ఆవు కూడా మరణించడం గమనార్హం. ఈ ఆవు గ్రామంలోని ఓ దేవాలయానికి చెందినదిగా గ్రామస్తులు చెబుతున్నారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని వజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి వెల్లడించారు. ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష ఎన్పీకుంట: ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపర్చిన కేసులో ముద్దాయికి కదిరి అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఎస్ఐ కృష్ణమూర్తి వివరాలమేరకు... మండల పరిధిలోని ఎగువతూపల్లికి చెందిన కుప్పాల గంగప్ప గత ఏడాది నవంబర్ 24న మల్లెం శ్రీరాములు అనే వ్యక్తి జేసీబీతో చేస్తున్న రోడ్డు పనులను పర్యవేక్షిస్తుండగా అతనితో గొడవపడి దాడి చేసి గాయపరిచాడన్నారు. బాధితుడి ఫిర్యాదుమేరకు అప్పటి ఎస్ఐ వలిబాషా కేసు నమోదు చేసి ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని తెలిపారు. కదిరి అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ సాక్ష్యాలను పరిశీలించి ముద్దాయికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారన్నారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పుఇచ్చినట్లు పేర్కొన్నారు. సకాలంలో సాక్ష్యులను హాజరుపరచి ముద్దాయికి శిక్షపడేలా చేసిన ఎస్ఐ కృష్ణమూర్తి, కోర్టు కానిస్టేబుల్ శేషగిరి, అధికారులు, సిబ్బందిని ఎస్పీ సతీష్‌కుమార్ అభినందించనట్లు తెలియజేశారు. నెట్టికంటమ్మ (ఫైల్) మరణించిన ఆవు -
దుర్గమ్మ గుడిలో చోరీ
బత్తలపల్లి: మండల పరిధిలోని వెంకటగారిపల్లి సత్రం వద్ద వెలసిన పురాతన దుర్గమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆలయ పూజారి డేరంగుల రాజా చిన్నాన్న గంగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్‌లు ధరించి దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయ తలుపులను మిషన్ ద్వారా తొలగించారు. అనంతరం ఆలయం లోపలికి వెళ్లి మిషన్ ద్వారానే హుండీ తలుపులు తెరిచి అందులో ఉన్న దాదాపు రూ.15 వేల నగదు, 10 తులాల వెండి గొడుగుతో పాటు మరో ఏడు చిన్న గొడుగులను (దాదాపు 25 నుంచి 30 తులాల వరకు) ఎత్తుకెళ్లిపోయారు. ఆలయ పూజారి రాజా తిరుపతికి వెళ్లడంతో ఆయన చిన్నాన్న గంగయ్య ఆలయం వద్దకు పూజలు నిర్వహించేందుకు వెళ్లాడు. అక్కడ ఆలయ తలుపులు కోసి ఉండడంతో అనుమానం వచ్చి గ్రామస్తులకు సమాచారం అందించాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఆలయంలో సీసీ కెమెరా ఉండగా అందులో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి ఎలా పాల్పడింది నమోదైంది. ముగ్గురు వ్యక్తులు రాగా ఇద్దరు బయట కాపలాగా ఉన్నట్లు తెలిసింది. -
విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యేలా కృషి చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు ప్రతి విద్యార్థీ ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ డాక్టర్ ఎన్.అయూబ్ హుస్సేన్ సూచించారు. మంగళవారం నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిసిపల్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల హాజరు, బోధన తదితర అంశాలను పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలన్నారు. ప్రతి టీచరూ తమ సబ్జెక్టులో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని చెప్పారు. పదో తరగతి విద్యార్థులు ఎవ్వరూ గైర్హాజరు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫార్మేటివ్ అసెస్మెంట్–1 పరీక్షలు పూర్తయినందున విద్యార్థుల మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. పాఠశాలలో ‘మిషన్ మార్చ్’ కార్యక్రమం అమలుకు సంబంధించిన రోజువారీ కార్యకలాపాలను ప్రదర్శన బోర్డులో ఏర్పాటు చేయాలని సూచించారు. గత 30 రోజులుగా ఐదుగురు విద్యార్థులు పాఠశాలకు హాజరు కావడం లేదని ఆన్లైన్లో నమోదైన నేపథ్యంలో.. వారి ఇళ్లను సందర్శించి గైర్హాజరుకు కారణాలను తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులు అందుబాటులో లేకుంటే నిబంధనల ప్రకారం డ్రాప్ బాక్స్‌లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఉపాధ్యాయులందరూ ‘ఐగాట్ కర్మయోగి’ కోర్సులను పూర్తి చేయాలని సూచించారు. బోధనలో అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయులు అలవర్చుకుని విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందించాలని డీఈఓ సూచించారు. -
వరికి నీరు ఇవ్వలేం
● తేల్చి చెప్పిన ఆర్థిక మంత్రి కేశవ్ ● ఆరుతడి కింద 40 వేల ఎకరాలకు సాగునీరు ● రాయదుర్గం, ఉరవకొండకు పెద్దపీట.. మిగతా నియోజకవర్గాలకు మొండిచేయి అనంతపురం అర్బన్: సాగునీటిపై సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురయ్యింది. తాగునీటికే ప్రాధాన్యత... వరి, మిర్చి సాగుకు నీరివ్వలేం అంటూ మొదటి నుంచి అధికారులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వరికి నీరివ్వలేం అనే విషయాన్ని సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం వేదికగా స్పష్టం చేశారు. ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. అయితే ఆరుతడి పంటల సాగుకు నీటిని కేటాయించే విషయంలో వివక్ష కనిపించింది. ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, మంత్రి కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగునీటిని కేటాయించారు. ఇతర నియోజకవర్గాలకు మొండిచేయి చూపారు. సాగునీటి సలహా మండలి చైర్మన్, కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఐఏబీ సమావేశం నిర్వహించారు. మంత్రి, చీఫ్‌విప్‌తో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, జేసీ అస్మిత్‌రెడ్డి, బండారు శ్రావణిశ్రీ, దగ్గుపాటి ప్రసాద్ మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశానికి అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలి. జిల్లాకు చెందిన ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారంతా గైర్హాజరయ్యారు. నికర జలాల లభ్యత 10.323 టీఎంసీలు జిల్లాకు తుంగభద్ర డ్యాం నుంచి నీటి కేటాయింపు 16.097 టీఎంసీలు. ఇందులో జలాశయ, ప్రవాహ, ఇతర నష్టాలు 5.774 టీఎంసీలుగా అంచనా వేశారు. నష్టాలు పోగా నికర జలాల లభ్యత 10.323 టీఎంసీలుగా అంచనా వేశారు. ఇందులో తాగునీటి అవసరాలకు 5.130 టీఎంసీలు, సాగునీటి అవసరాలకు 5.193 టీఎంసీలు కేటాయించారు. వచ్చే ఏడాది జూలై 31 వరకు తాగునీటికే ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు. హెచ్ఎన్ఎస్ఎస్కు నీటి కేటాయింపుపై స్పష్టత వచ్చిన తరువాత అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ రెండు నియోజకవర్గాలకే... ఆరుతడి ఆయకట్టుకు సాగునీటిని రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాలకు మాత్రమే కేటాయించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఆరుతడి ఆయకట్టుకు సాగునీటికి కేటాయించలేదు. ● రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి టీడీ డ్యామ్ నుంచి హైలెవల్ ప్రధాన కాలువకు మొత్తం కేటాయింపు 1.824 టీఎంసీలు ఉండగా.. దామాషా ప్రకారం నికరంగా 1.170 కేటాయించారు. ఈ కాలువ కింద తడి 28,488 ఎకరాలు, ఆరుతడి 7,053 ఎకరాలు మొత్తం 35,541 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇందులో ఆరుతడి కింద 28 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని కేటాయించారు. ● ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి టీబీ డ్యామ్ నుంచి గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, గుత్తి సబ్ బ్రాంచ్ కెనాల్, ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు కేటాయింపు 1.716 టీఎంసీలు ఉండగా దామాషా ప్రకారం గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, గుత్తి సబ్ బ్రాంచ్ కెనాల్‌కు 0.722 టీఎంసీలు కేటాయించారు. ఈ కాలువల కింద ఆయకట్టు తడి 10,447 ఎకరాలు, ఆరుతడి ఆయకట్టు 21,616 ఎకరాలు ఉంది. ఇందులో ఆరుతడి 12 వేల ఎకరాలు ఆయకట్టుకు నీటిని కేటాయించారు. ● మధ్య పెన్నార్ దక్షిణ కాలువ కింద శింగనమల నియోజకవర్గం పరిధిలో తడి, ఆరుతడి ఆయకట్టు 33,176 ఎకరాలు ఉంది. మధ్య పెన్నార్ ఉత్తర కాలువ కింద తడి, ఆరుతడి ఆయకట్టు 13,325 ఎకరాలు ఉంది. తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ కింద తడి, ఆరుతడి ఆయకట్టు 31,131 ఎకరాలు ఉంది. ఈ కాలువలకు నీటి కేటాయింపు చేసినప్పటికీ ఆరుతడి ఆయకట్టుకు నీటిని కేటాయించలేదు. -
హక్కులను పోరాడి సాధించుకుంటాం
అనంతపురం అర్బన్: ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను పోరాడి సాధించుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఆర్.ఎన్.దివాకర్‌రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయం, జిల్లా ఖజానా, తదితర శాఖల్లో ఉద్యోగులకు నాయకులు నల్లరిబ్బన్ను తగిలించారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ ఉద్యమం మొదటి దశలో భాగంగా ఈ నెల 5వ తేదీ వరకు ఉద్యోగులందరం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. అదే విధంగా ‘‘సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి’’ అంటూ వాట్సాప్ డీపీలు ఉంచుకున్నామన్నారు. పీఆర్సీని నియమించకపోవడం, మధ్యంతర భృతి ప్రకటించకపోవడం, ఐదు డీఏల పెండింగ్ పెట్టడం, అరియర్స్ చెల్లింపు ఊసెత్తకపోవడం ఉద్యోగులను, వారి హక్కులను, ప్రయోజనాలను విస్మరించడమేనని మండిపడ్డారు. కార్యక్రమంలో మహిళ విభాగం జిల్లా చైర్పర్సన్ సురేఖరావు, నాయకులు హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ‘సర్’ గడుపు పొడిగింపు అనంతపురం అర్బన్: ఓటర్ల జాబితా క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువును భారత ఎన్నికల సంఘం ఈ నెల 10 వరకు పొడిగించింది. అందిన క్లెయిమ్‌ల అభ్యంతరాలను అక్టోబరు 5వ తేదీలోగా పరిష్కరిస్తారు. ఓటర్ల తుది జాబితా అక్టోబరు 9న ప్రచురిస్తారు. ఈ వివరాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్ మంగళవారం వెల్లడించారు. షెడ్యూల్ పొడిగింపును ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. తొలి షెడ్యూల్ ప్రకారం క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ గత నెల 30తో ముగిసింది. ఆ రోజు వరకు ఓటరుగా నమోదుకు (ఫారం–6) 20,912 దరఖాస్తులు రాగా 3,628 పరిష్కరించారు. 17,284 పెండింగ్‌లో ఉంచారు. తొలగింపునకు (ఫారం–7) 2,48,877 దరఖాస్తులు రాగా.. అందులో 2,48,615 పరిష్కరించారు. 262 పెండింగ్ ఉన్నాయి. ఓటరు వివరాల్లో మార్పునకు (ఫారం –8) 16,881 దరఖాస్తులు రాగా 5,325 పరిష్కరించారు. 11,556 పెండింగ్ ఉన్నాయి. వేతనాలు చెల్లిస్తేనే సమ్మె విరమణ అనంతపురం అర్బన్: సత్యసాయి నీటి సరఫరా ప్రాజెక్టు కార్మికులకు బకాయిపడిన ఐదు నెలల వేతనం చెల్లించే వరకు సమ్మె కొనసాగుతుందని కలెక్టర్ ఆనంద్‌కు సీఐటీయూ, వైఎస్సార్‌టీయూ నాయకులు స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలు, వేతన బకాయి అంశాలపై కలెక్టర్ మంగళవారం తన చాంబర్లో సీఐటీయూ నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్, నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి.. సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయాన్ని తెలియజేశారు. కార్మికులకు ఐదు నెలలుగా వేతనం అందకపోవడంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్యం, రోజువారీ ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారన్నారు. వేతనాల కోసం ప్రభుత్వం ఏటా రూ.35 కోట్లు బడ్జెట్లో కేటాయించేలా చూడాలన్నారు. డిమాండ్లపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ కార్మికుల వేతనాల కోసం అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో విడుదలయ్యేలా ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు. నాయకులు మాట్లాడుతూ వేతనాలు చెల్లించిన వెంటనే సమ్మె విరమిస్తామని కలెక్టర్‌కు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గంగాధర్, మధు, పొన్నూరప్ప, నరేషన్, వైఎస్సార్‌టీయూ నాయకులు గోవిందు, సురేష్‌బాబు, జయప్రకాష్, వెంకటేష్, రాజారెడ్డి పాల్గొన్నారు. -
వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం
కణేకల్లు: వయోభారంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు హెచ్చెల్సీ వద్ద ఆత్మహత్యకు యత్నించిన ఘటన కణేకల్లులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బెణికల్లు గ్రామానికి చెందిన లింగాయితీ గిరిజమ్మ, ఎర్రిస్వామికి ముగ్గురు కూతుళ్లుండగా, అందరికీ పెళ్లిళ్లయ్యాయి. ఇటీవల ఎర్రిస్వామి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వయోభారంతో బాధపడుతున్న గిరిజమ్మ జీవితంపై విరక్తి చెంది చనిపోవాలనుకుంది. సాయంత్రం బస్సులో కణేకల్లుకు వచ్చి శివారులో రామనగర్‌లోని హెచ్చెల్సీ వద్దకెళ్లింది. కాలువ గట్టుపై నుంచి దూకే శక్తి కూడా ఆ వృద్ధురాలికి లేదు. ఏదోలా కాలువలో పడి చనిపోవాలనుకున్న ఆమె ర్యాంప్ మీదుగా నడుచుకుంటూ కాలువలోపలికి వెళ్లింది. అటుగా వెళుతున్న కొందరు యువకులు గమనించి వెంటనే వృద్ధురాలిని రక్షించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వృద్ధురాలి నుంచి వివరాలు సేకరించి భర్తకు సమాచారమివ్వడంతో ఆయన ఆటోలో వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. తమను చూసుకునే వారు ఎవరూ లేకనే ఆత్మహత్యకు యత్నించినట్లు వృద్ధురాలు తీవ్ర వేదనతో పోలీసులకు చెప్పింది. పబ్లిక్ హెల్త్ ఎస్ఈల పదోన్నతులకు గీన్‌సిగ్నల్ అనంతపురం క్రైం: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగంలో పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2025–26 సంవత్సరానికి సూపరింటెండింగ్ ఇంజినీర్ల నుంచి చీఫ్ ఇంజినీర్లు (పబ్లిక్ హెల్త్)గా పదోన్నతి కల్పిస్తూ ఏడుగురు అధికారులతో కూడిన ప్యానెల్‌ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ జీఓ 207 జారీ చేసింది. అనంతపురం నగరపాలక సంస్థ సూపరిండెంటెంట్ ఇంజినీర్ జి. రాజశేఖర్ పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు. తదుపరి దశలో పోస్టింగ్‌లు కీలకంగా మారాయి. చీఫ్ ఇంజినీర్ హోదాలో ఎవరికి ఎక్కడ బాధ్యతలు అప్పగించాలన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సంబంధిత అధికారుల పోస్టింగ్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని ఇంజినీర్–ఇన్–చీఫ్‌కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ పదోన్నతులు ట్రైబ్యునల్, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఓఏలు, రిట్ పిటిషన్లు, అప్పీళ్లు, రివ్యూ పిటిషన్లు, ప్రత్యేక అనుమతి పిటిషన్లు, సివిల్ అప్పీళ్లలో వెలువడే ఆదేశాలు, తుది తీర్పులకు లోబడి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధుడి మృతదేహం లభ్యం గుంతకల్లు రూరల్: హంద్రీ–నీవా కాలువలో గల్లంతైన వృద్ధుడు సీతానంద (64) మృతదేహం రాగులపాడు వద్ద లభించింది. కసాపురం ఎస్ఐ టీపీ వెంకటస్వామి తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బెల్డోణ గ్రామానికి చెందిన సోమలింగమ్మ, సీతానంద దంపతులు కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వృద్ధాప్యంలో ఒకరు మరొకరికి భారంగా ఉండకూడదని నిర్ణయించుకున్న వారు ఆగస్టు 30న గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామం వద్ద ఉన్న హంద్రీ–నీవా కాలువ వద్దకు చేరుకున్నారు. ఇద్దరూ ఒకేసారి కాలువలో దూకారు. అయితే అదేరోజు కొద్దిదూరంలో సోమలింగమ్మ మృతదేహం లభ్యం కాగా, సీతానంద మృతదేహం గల్లంతయ్యింది. ఈ క్రమంలోనే మృతదేహం మంగళవారం రాగులపాడు వద్ద లభ్యమైంది. మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీలకు ఎంపిక బ్రహ్మసముద్రం: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ధనుష్య రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఆదివారం జిల్లా స్థాయిలో జరిగిన బేస్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. దీంతో విద్యార్థి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 12,13,14 తేదీల్లో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. విద్యార్థి ధనుష్యను జెడ్పీటీసీ ప్రభావతి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రమౌళి, పీటీలు హుసేన్, ఇబ్రహీం, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు. -
కళ్యాణదుర్గంతో విడదీయరాని బంధం
కళ్యాణదుర్గం: ప్రజాప్రస్థానంలో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్‌లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సుదీర్ఘంగా పాదయాత్ర సాగింది. శెట్టూరు, కంబదూరు, కళ్యాణదుర్గం, బ్రహ్మ సముద్రం మండలాల మీదుగా సాగిన ఈ యాత్రలో ఆయన రైతుల కష్టాలను, తాగు–సాగునీటి ఎద్దడిని ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల జీవనాడి, ప్రధాన నీటి వనరైన భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)ను తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్ఎల్సీ) ద్వారా నింపాలనే డిమాండ్‌ను పాదయాత్ర సమయంలో వైఎస్సార్ గుర్తించారు. సీఎం అయ్యాక 2007–08లో ఫ్లోరైడ్ సమస్య తీర్చేందుకు శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం విస్తరణకు, కంబదూరు, శెట్టూరు ప్రాంతాలకు తాగునీరు అందించే పలు రక్షిత మంచినీటి పథకాలకు నిధులు మంజూరు చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కింది. అందుకే ఆయన్ను మారుమూల పల్లెల్లో సైతం ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటూ ఉంటారు. -
సాంకేతిక విద్యా ప్రదాత
●వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు సువర్ణ యుగం ●ఉచిత విద్యుత్ అమలు, కరెంటు బకాయిల రద్దుతో వ్యవసాయానికి ఊపిరి ●సంక్షేమం.. అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాలకూ మేలు చేకూర్చిన వైనం ●నేడు వైఎస్సార్ వర్ధంతి .. జిల్లా అంతటా సేవా కార్యక్రమాలకు శ్రీకారంవిద్యా కేంద్రంగా మడకశిర మడకశిర: వైఎస్సార్ హయాంలో మడకశిరను విద్యా కేంద్రంగా మార్చారు. రాష్ట్రస్థాయి వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత రూపురేఖలను మార్చివేశారు. అలాగే వెటర్నరీ, హార్టికల్చర్, వ్యవసాయ పాలిటెక్నక్ కళాశాలలను కూడా ఏర్పాటు చేసి విద్యాప్రదాతగా నిలిచారు. ఒకేషనల్ జూనియర్ కళాశాల, జనరల్ పాలిటెక్నిక్ కళాశాలను కూడా ఏర్పాటు చేసి మడకశిర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. సాగు, తాగునీటికి భరోసా మడకశిర నియోజకవర్గంలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం వైఎస్సార్ హయాంలో దాదాపుగా 80 శాతం పనులను పూర్తి చేశారు. మడకశిరకు కృష్ణా జలాలు వస్తున్నాయంటే వైఎస్సార్ చూపిన చొరవే కారణం. వైఎస్సార్ హయాంలోనే పీఏబీఆర్ (శ్రీరామరెడ్డి తాగునీటి పథకం) తాగునీటి పథకం ప్రారంభమైంది. దాదాపు రూ.600 కోట్లతో ఈపథకాన్ని పూర్తి చేసి మడకశిర నియోజకవర్గానికి ఫ్లోరైడ్ రహిత తాగునీటిని అందించారు. రూ.2,500 కోట్ల అభివృద్ధి పనులు మడకశిర నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో వైఎస్సార్ హయాంలో దాదాపు 30 వేల పక్కా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. ఆయన హయాంలో వందలాది కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. వైఎస్సార్ హయాంలో మడకశిర నియోజకవర్గంలో దాదాపు రూ.2,500 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. అనంతపురం అగ్రికల్చర్: అది 1993 – 2004 మధ్య కాలం. ప్రకృతి కన్నెర్రజేసింది. వరుస కరువులు ఉమ్మడి అనంతపురం జిల్లాను అతలాకుతలం చేశాయి. పంటలు దెబ్బతిని.. పెట్టుబడులు తిరిగి రాలేదు. రైతు ఇంట అప్పులు కుప్పలుగా పెరిగిపోయాయి. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ పోషణ భారమై.. పొట్ట చేత పట్టుకుని వలసబాట పట్టారు. అప్పులు తీర్చలేక.. ఆత్మాభిమానం చంపుకోలేక వందలాదిమంది రైతులు అర్ధంతరంగా తనువు చాలించారు. ఆదుకోవాల్సిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాంటి సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. 2004లో వైఎస్సార్ అధికారంలోకి రాగానే రైతులతో పాటు అన్ని వర్గాలకూ నేనున్నానంటూ సంక్షేమ పథకాలు, రాయితీలతో భరోసా కల్పించారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సువర్ణయుగాన్ని మరిపించేలా పాలన సాగిస్తున్న క్రమంలో 2009 సెప్టెంబర్ 2న ఆయన హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన చేసిన మేలును ప్రజలు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు. నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా అంతటా సేవా కార్యక్రమాలతో ఆయనకు నివాళులర్పించనున్నారు. ఉచిత విద్యుత్‌తో వ్యవసాయానికి జీవం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే ఉచిత విద్యుత్ అమలుతో పాటు విద్యుత్ బిల్లుల మాఫీ ఫైలుపై తొలిసంతకం చేసి.. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయానికి జీవం పోశారు. ఈ క్రమంలో జిల్లా రైతులకు రూ.70.65 కోట్ల విద్యుత్ బకాయిలు మాఫీ అయ్యాయి. అలా ఐదేళ్లూ 1.75 లక్షల వ్యవసాయ మోటార్లకు రూ.వందల కోట్లు విలువ చేసే కరెంటు ఉచితంగా సరఫరా చేశారు. అంతకు మునుపు చంద్రబాబు హయాంలో విద్యుత్ బిల్లులు కట్టాలంటూ అర్థరాత్రి వెళ్లి మోటార్లు, స్టార్టర్లు ఎత్తుకెళ్లారు. ఎంతో మంది రైతులపై కేసులు పెట్టి వేధించారు. వైఎస్ రాకతో వ్యవసాయానికి సువర్ణయుగం మొదలైంది. అలాగే ఖరీఫ్‌లో 2004కు ముందు రూ.1,200 కోట్లు ఉన్న పంట రుణాలను ఐదేళ్లలో రూ.6,594 కోట్లకు చేర్చారు. పావలా వడ్డీ కింద రూ.44 కోట్లు ఇచ్చారు. బీమాతో రైతన్నకు భరోసా.. చంద్రబాబు హయాంలో అమలవుతున్న పంటల బీమా పథకం రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఆ పథకాన్ని రైతులకు మేలు జరిగేలా మార్పులు చేసి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎనలేని భరోసా కల్పించారు. 2004–2009 మధ్య వైఎస్ హయాంలో పంటకోత ఫలితాల ఆధారంగా వేరుశనగకు బీమా కింద కింద ఏకంగా రూ.1,138 కోట్ల పరిహారం ఇచ్చారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.100 కోట్లు ఇచ్చారు. వైఎస్ మార్క్ రుణమాఫీ వైఎస్ హయాంకు సంబంధించి 2008లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నందున కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం 3,03,937 మంది రైతులకు చెందిన రూ.554.92 కోట్ల రుణాలు ఒకేవిడతలో మాఫీ చేశారు. అప్పటికే బ్యాంకులకు రుణాలు చెల్లించిన రైతులను గౌరవిస్తూ వారికి కూడా ప్రోత్సాహకాల కింద 3,61,269 మందికి రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. మొత్తమ్మీద వైఎస్ మార్క్ రుణమాఫీ, ప్రోత్సాహకాల కింద ఒకే విడతగా 6,65,206 మంది రైతులకు రూ.625 కోట్ల లబ్ధి చేకూర్చారు. విత్తుకు రాయితీ ఏటా ఖరీఫ్, రబీలో జిల్లాలోని రైతులకు లక్షల క్వింటాళ్లు వేరుశనగ, పప్పుశనగ, కంది, ఇతర విత్తనాలు రాయితీతో ఇచ్చారు. అలా వైఎస్ 2004– 2009 వరకు ఆరేళ్ల కాలంలో 28,05,901 మంది రైతులకు రూ.280.88 కోట్ల రాయితీతో 26,02,717 క్వింటాళ్లు వేరుశనగ పంపిణీ చేశారు. కంది, ఆముదం లాంటి ఇతర విత్తనాల కోసం మరో రూ.80 కోట్లు ఖర్చు రాయితీ ఇచ్చారు. పండ్లతోటలు, సూక్ష్మసాగుకు ప్రోత్సాహం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్లతోటలు, డ్రిప్, స్ప్రింక్లర్ల రైతులకు కూడా చేయూతను అందించడంతో ఈ రంగాలు కూడా గాడినపడ్డాయి. రూ.25 కోట్లు రాయితీ ఇచ్చి పశుక్రాంతి, జీవక్రాంతి కింద 50 శాతం రాయితీతో మేలుజాతి పశువులు, గేదెలు అందజేసి క్షీరవిప్లవానికి నాంది పలికారు. 40 వేల హెక్టార్లలో కొత్తగా పండ్లతోటల విస్తరణకు రూ.80 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. దీంతో అప్పట్లోనే ‘ఫ్రూట్‌బౌల్ ఆఫ్ ఏపీ’గా పేరొచ్చింది. బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్లు) ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో రూ.280 కోట్లు రాయితీ ఇవ్వడంతో అప్పట్లోనే 1.13 లక్షల హెక్టార్లకు సూక్ష్మసాగు విస్తరించింది. వీటితో పాటు జలయజ్ఞం కింద పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడంతో అన్నదాతకు ఈ ఐదేళ్లూ వ్యవసాయం పండుగలా సాగింది. అనంతపురం: కరువు సీమలో అనంతపురం జేఎన్టీయూను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కల్పతరువుగా తీర్చిదిద్దారు. 2008 ఆగస్టు 18న జేఎన్టీయూ (ఏ)కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ యూనివర్సిటీగా మార్పు చేశారు. అనంతపురం లాంటి వెనుకబడిన జిల్లాలో సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో యూనివర్సిటీ 98 ఇంజినీరింగ్ కళాశాలలు, 33 ఫార్మసీ కళాశాలలు ఉండేవి. ఏటా లక్ష మంది విద్యార్థులు అభ్యసించేవారు. 2007–08 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ అగ్రికల్చర్ వంటి కోర్సులను నిరుపేద విద్యార్థులకు చేరువ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో లబ్దిపొందిన అనేక మంది నేడు ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు. -
బలిగోరుతున్న బెల్ట్‌షాపులు!
రాప్తాడు రూరల్: జాతీయ రహదారి–44పై మద్యం విక్రయాలు వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాప్తాడు మండల పరిధిలోని హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి వెంట ఉన్న కొన్ని హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో అనధికారికంగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తూ మద్యం లూజుగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైవేపై ప్రయాణించే కొందరు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు. హోటల్ కాదు.. మద్యం అడ్డా హైవే వెంట ఉన్న కొన్ని హోటళ్లలో మద్యం లూజు విక్రయాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏ సమయంలో వెళ్లినా మద్యం అందుబాటులో ఉంటోందని, దీంతో ఆయా ప్రాంతాలు వాహనదారుల్లో మద్యం లభించే ప్రదేశాలుగా గుర్తింపు పొందుతున్నాయని చెబుతున్నారు. హోటళ్లలో భోజనం, విశ్రాంతి కోసం ఆగే కొందరు మద్యం సేవించి వెంటనే వాహనాలు నడపడం ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు, ఎకై ్సజ్ అధికారుల దృష్టికి రాప్తాడులో డీఎస్పీ, పోలీస్‌స్టేషన్ కార్యాలయాలకు సమీపంలోనే కొన్ని హోటళ్లలో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే రామినేపల్లి శివారు, టోల్గేట్ సమీపంలోనూ మద్యం అక్రమ విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇంత బహిరంగంగా విక్రయాలు జరుగుతున్నా అటు ఎకై ్సజ్ అధికారులు కాని, ఇటు పోలీసు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. క్వార్టర్‌పై రూ.40–50 అదనపు వసూలు? బెల్ట్‌షాపుల్లో మద్యం బాటిళ్లను నిర్ణీత ధర కంటే అధికంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఒక్కో క్వార్టర్‌పై రూ.40 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అక్రమ మద్యం విక్రయాలు కొందరికి ఆదాయ వనరుగా మారుతుండగా.. మరోవైపు మద్యం సేవించే వారి కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. హైవే పక్కన మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, అనధికారికంగా మద్యం విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాప్తాడు మండల ప్రజలు కోరుతున్నారు. ఇటీవల బుక్కచెర్ల నుంచి రాప్తాడుకు వస్తున్న దంపతుల కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, ఆమె భర్త గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. రాప్తాడులో ఇటీవల మరో యువకుడు బెల్టుషాపులో మద్యం సేవించిన అనంతరం మరో బాటిల్ తీసుకుని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లగానే బైకు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎలాగోలా అతను ప్రాణాపాయం నుంచి గట్టెక్కాడు. జాతీయ రహదారి పక్కనే బెల్ట్‌షాపుల దందా తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి -
తాగునీటికీ కష్టమే
శింగనమల మండలం నాగులగుడ్డం తండాలో వర్షాలు లేక బోర్లన్నీ ఎండిపోయాయి. పది రోజులుగా వ్యవసాయ బోరు వద్దకెళ్లి తాగునీటి పట్టుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. తండాలో ఉన్న బోరు బావి ఎండిపోవడంతో పెద్ద జలాలపురం ఆంజనేయస్వామి గుడి వద్ద మరో బోరు వేశారు. అయితే విద్యుత్ కనెక్షన్ ఇచ్చి, మోటారు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. దీంతో తండావాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికై నా తమ తాగునీటి కష్టాలు తీర్చాలని తండా వాసులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
24 గంటల్లో డిగ్రీ ఇన్స్టంట్ ఫలితాలు విడుదల
అనంతపురం: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పరిధిలో ఆగస్టు 30న డిగ్రీ ఐదవ సెమిస్టర్ ఇన్స్టంట్ పరీక్ష నిర్వహించారు. జవాబు పత్రాలను వేగవంతంగా మూల్యాంకనం చేసి 24 గంటల్లోనే ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా, వారి భవిష్యత్తు విద్యా అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత వేగంగా మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు వీసీ ప్రొఫెసర్ జ్యోతికుమార్ తెలిపారు. పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రొఫెసర్ లక్ష్మయ్య సమర్థవంతంగా పర్యవేక్షించారని ప్రశంసించారు. ఇన్స్టంట్ పరీక్షలకు మొత్తం 231 మంది విద్యార్థులు హాజరు కాగా, 228 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. శ్రావణమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం బొమ్మనహాళ్: నేమకల్లు ఆంజనేయస్వామి బాలాలయంలో శ్రావణమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటి రోజు సోమవారం ధ్వజ పట ఆరాధన వైభవంగా నిర్వహించారు. అర్చకులు అనిల్‌కుమార్‌స్వామి ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు. రెడ్‌క్రాస్ జిల్లా శాఖకు ఐదు గవర్నర్ మెడల్స్ అనంతపురం సిటీ: విశిష్ట సేవలు అందించినందుకు గాను ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు ఐదు ప్రతిష్టాత్మక గవర్నర్ అవార్డులు దక్కాయి. వీటిలో మెంబర్షిప్ కేటగిరిలో రెండు మెడల్స్, సామాజిక సేవ, కార్పొరేట్ సామాజిక బాధ్యత కేటగిరిలో మరో మూడు మెడల్స్ ఉన్నాయి. మెంబర్షిప్ కేటగిరీలో గత ఏడాది మే 15న గవర్నర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అప్పటి కలెక్టర్ వినోద్‌కుమార్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా, రెండో మెడల్‌ను మంగళవారం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఏపీ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో వాకా శ్రీనివాసులరెడ్డి గవర్నర్ చేతుల మీదుగా అందుకోనున్నారు. అలాగే బ్లడ్ బ్యాంక్‌కు సుమారు రూ.70 లక్షల విలువైన పరికరాలను అందజేసిన మోబిస్ ఇండియా మాడ్యూల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సీఎస్ఆర్ కేటగిరీలో మెడల్ దక్కింది. ఈ మెడల్‌ను మోబిస్ మేనేజింగ్ డైరెక్టర్ యాంగ్యోంగ్డ్యూక్ అందుకోనున్నారు. మరో మెడల్ రెడ్‌క్రాస్‌కు రూ.55 లక్షల విలువైన సహకారం అందించిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు దక్కింది. ఈ అవార్డును ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దోమన్ యాదవ్ అందుకోనున్నారు. మూడో మెడల్ సప్తగిరి క్యాంఫర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు దక్కింది. అవార్డులకు ఎంపికై న వారిని కలెక్టర్ ఆనంద్ అభినందించారు. నేడు ఐఏబీ సమావేశం ● హడావుడిగా ఖరారు చేసిన అధికారులు అనంతపురం సెంట్రల్: సాగునీటి సలహామండలి (ఐఏబీ) సమావేశం మంగళవారం అనంతపురంలో నిర్వహించనున్నారు. హెచ్చెల్సీ కింద అనంతపురం జిల్లాతో పాటు ఆలూరు బ్రాంచ్ కెనాల్ కింద కర్నూలు జిల్లా రైతులు, పులివెందుల, మైలవరం బ్రాంచ్కెనాల్స్ కింద వైఎస్సార్ కడప జిల్లాల రైతులు ఉన్నారు. దీంతో ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు కూడా హాజరుకావాల్సి ఉంది. గతంలో వారం రోజుల క్రితమే ఐఏబీ సమావేశం తేదీ ఖరారు చేసేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నీ రాత్రికి రాత్రి సమావేశాల తేదీలను ఖరారు చేసేస్తున్నారు. ఇటు హెచ్చెల్సీ.. అటు హంద్రీ–నీవా ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నీటి వినియోగంపై రైతులకు ఉపయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఐఏబీ సమావేశం అత్యంత కీలకం. అలాంటి సమావేశాన్ని అధికారులు హడావుడిగా నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా హెచ్చెల్సీ ద్వారా దాదాపు 20 టీఎంసీలకు పైగా నీరు వచ్చే అవకాశముంది. అయితే గత బోర్డు సమావేశంలో అప్పటి అంచనాల మేరకు 16 టీఎంసీలు కేటాయించారు. దీంతో సాగుకు నీటిని విడుదల చేయడానికి ఆస్కారం లేదంటూ అధికారులు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం దాదాపు 100 టీఎంసీల సామర్థ్యంతో తొణికిసలాడుతోంది. ఈ నేపథ్యంలో హెచ్చెల్సీకి కేటాయింపులు పెరగనున్నాయి. అయినప్పటికీ సాగునీటికి నీటిని విడదుల చేయకూడదనే భావనతో పాటు తుంగభద్ర హై లెవల్ మెయిన్ కెనాల్ (హెచ్‌ఎల్‌ఎంసీ), గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు రైతులకు మాత్రమే మేలు చేకూర్చేందుకు.. దిగువన ఉన్న ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయలేమని చెప్పే విధంగా ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రణాళికలు రచిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నేటి సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
హక్కుల సాధనకు ఉద్యమం
‘సర్’ డేటా దుర్వినియోగం కాకూడదు అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్ –సర్) డేటా దుర్వినియోగం కాకూడదని జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకుడు జీసీ కిషోర్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాకు విచ్చేసిన ఆయన సర్‌పై సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్పరెన్స్ హాలులో కలెక్టర్ ఆనంద్‌తో కలిసి ఈఆర్ఓతో సమీక్షించారు. ‘సర్’లో ఏదేని సమస్య వస్తే కలెక్టర్, జేసీ, డీఆర్‌ఓతో మాట్లాడి పరిష్కరించుకోవాలన్నారు. డేటా రక్షణ బాధ్యత అధికారులపై ఉందన్నారు. తప్పుల్లేని ఓటర్ల జాబితా లక్ష్యం తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యంగా ఎస్ఐఆర్ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకుడు జీసీ కిషోర్‌కుమార్ స్పష్టం చేశారు. ‘సర్’పై ఆయన కలెక్టర్ ఆనంద్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కిషోర్‌కుమార్ మాట్లాడుతూ సమగ్ర ఓటర్ల జాబితా తయారీకి పార్టీల ప్రతినిధులు, బీఎల్ఏలు, బీఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతపురం అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు హక్కుల సాధనకు నడుం బిగించారు. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. పీఆర్సీ కమిషన్ వేయాలని, ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు చెల్లించాలని, అరియర్లు ఇవ్వాలనే డిమాండ్లతో ‘సిద్ధం.. సిద్ధం.. ఉద్యమానికి సంసిద్ధం’ అంటూ ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఆర్.ఎన్.దివాకర్‌రావు ఆధ్వర్యంలో నాయకులు, ఉద్యోగులు ర్యాలీగా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్‌కు చేరుకుని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌కు ఉద్యమ నోటీసు అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెండేళ్లుగా నిర్లక్ష్యం చేస్తున్నందున ఉద్యమబాట పట్టామని వివరించారు. అనంతరం దివాకర్‌రావు మీడియాతో మాట్లాడారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌కు ఉద్యోగుల ఎజెండా తప్ప మరెటువంటి ఎజెండా లేదని ప్రభుత్వ పెద్దలకు తెలియజేశామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన హక్కుల్ని అడిగితే... మీది రాజకీయ ఎజెండా... ఏదో కుట్ర కోణం... అతిపోకడలు అనే పదాలను మంత్రి ఉపయోగించడం ఉద్యోగవర్గాన్ని చాలా బాధించాయన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.. ప్రభుత్వంలో భాగమే అనేది తెలుసుకుని భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నామన్నారు. ఉద్యమ కార్యాచరణ ఇదే.. మొదటి దశ: సెప్టెంబరు 1న ‘సీఎం సార్... మా డబ్బులు మాకివ్వండి’ నినాదంతో సెల్‌ఫోన్ డీపీలు పెట్టుకుని నిరసన. 1 నుంచి 5 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు. 2 నుంచి 8వ తేదీ వరకు హ్యండ్ టూ హ్యాండ్ కార్యక్రమం ద్వారా కార్యాలయాలను సందర్శించి ఉద్యోగులను ఉద్యమంలో భాగస్వాముల్ని చేయడం. 3 నుంచి 5వ తేదీ వరకు భోజన విరామ సమయంలో నిరసనలు. 11వ తేదీన జిల్లా కేంద్రంలో కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తదుపరి ఉద్యమ కార్యాచరణపై చర్చ. ఉద్యమ రెండవ దశ: సెప్టెంబరు 15 నుంచి 26 వరకు ప్రభుత్వ నిబంధనల మేరకు వర్క్ టూ రూల్ పాటించడం. 15 నుంచి 22వ తేదీ వరకు సామాజిక మాధ్యమాల్లో డీపీలు, ఫొటోలు, రీల్స్ ద్వారా ప్రచారం. 15 నుంచి 25 వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు వినతిపత్రాల సమర్పణ. 17న నల్ల కండువాలతో నిరసన.. ‘సీఎం సార్... మా డబ్బులు మాకివ్వండి’ నినాదంతో మానవహారంగా ఏర్పడటం. 23న కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు, 26న ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ‘మా డబ్బులు మాకివ్వండి’ నినాదంతో ధర్నాలు. అప్పటికీ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే మూడో దశ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్ ఖాన్, అసోసియేట్ చైర్మన్ మల్లరాయుడు, కోశాధికారి సంతోష్‌గౌడ్, మహిళా విభాగం చైర్పర్సన్ సురేఖరావు, ప్రధాన కార్యదర్శి నాగమణి, జిల్లా ఇన్చార్జ్ శివానందరెడ్డి, తోట చెన్నప్ప, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్, కోశాధికారి పునీత్‌బాబు, నాయకుల శ్రీనివాసయూర్తి, విలేజ్ సర్వేయర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సందీప్, వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు ఓబులేసు, కార్యదర్శి నాగరాజు, గ్రామవార్డు సచివాలయు సంఘం నాయకులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. పీఆర్సీ కమిషన్, ఐఆర్, డీఏల కోసం డిమాండ్ జేసీకి ఉద్యమ నోటీసు అందజేసిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ దివాకర్‌రావు -
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
గుంతకల్లు: అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన మేరకు .. హనుమేష్‌నగర్‌కు చెందిన శంకర్, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. అయితే శంకర్ కొన్నేళ్ల కిందటే మృతి చెందాడు. అయితే చిన్న కుమారుడు శ్రీనివాసులు (40) జూదానికి బానిసకావడంతో పెళ్లి కూడా చేసుకోలేదు. ఈ నేపథ్యంలో అప్పులు ఎక్కువవడంతో వడ్డీ వ్యాపారులు నుంచి డబ్బు చెల్లించాలని వేధింపులు అధికమయ్యాయి. దీంతో జీవితంపై విరక్తి చెంది రోటరీ హైస్కూల్ సమీపంలోని రైలు పట్టాలపై గూడ్స్ రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. -
‘సమస్యలు పరిష్కరించండి సారూ..’
అనంతపురం అర్బన్: ‘మాపై దయ చూపి సమస్యలు పరిష్కరించండి సారూ’ అంటూ ప్రజలు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌తో పాటు డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీసీఓ అరుణకుమారి, సీపీఓ బాలాజీనాయక్, హౌసింగ్ పీడీ శైలజ, సర్వే శాఖ ఏడీ కనకరాజు, ఉపాధికల్పనాధికారి పల్లవి ప్రజల నుంచి వివిధ సమస్యలపై 486 అర్జీలు స్వీకరించారు. వాటిలో రెవెన్యూకు సంబంధించి 255, ఇతర సమస్యలకు చెందినవి 231 ఉన్నాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని చెప్పారు. వినతులు కొన్ని... ● ఉరవకొండలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో సరైన వసతులు కల్పించకుండా విద్యార్థులను ఇబ్బందికి గురిచేస్తున్నారని రవినాయక్ ఫిర్యాదు చేశాడు. ● బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం, కేకేఅగ్రహారం, సంజీవపురం, బొమ్మలాటపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వెంకటాపురం గ్రామానికి చెందిన జొన్న రామయ్య, తదితరులు ఫిర్యాదు చేశారు. తమ గ్రామాల మీద వెళ్తున్న హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. ● ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద రుణం మంజూరైనా డబ్బులు ఖాతాలో జమ చేయలేదని అనంతపురం రూరల్ మండలం రాచానపల్లికి చెందిన ఎం.పెద్దన్న ఫిర్యాదు చేశాడు. -
మూగజీవాలు విలవిల
జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పచ్చదనం మాయమైంది. భూములు బీళ్లుగా మారాయి. కొండగుట్టలు.. బోడిగా మారిపోయాయి. పచ్చి గడ్డి లేక మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. చివరకు గొంతు తడుపు కునేందుకు గుక్కెడు నీటికీ కటకటమనే పరిస్థితులు నెలకొనడంతో మూగజీవాల వేదన వర్ణనాతీతంగా మారింది. చివరకు వ్యవసాయ బోరు బావుల వద్ద కూడా నీరు లభ్యం కావడం లేదని గొర్రెల కాపరులు వాపోతున్నారు. సాగునీటికీ కటకటే ఎల్–నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి నీటి లభ్యత తక్కువగా ఉంటుందని అధికారులు ఆయకట్టుకు నీరు వదలడం లేదు. తుంగభద్ర నుంచి, హంద్రీ–నీవా నుంచి సాగునీరు వదలకపోవడంతో ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. -
సచివాలయ ఉద్యోగులకు బీఎల్ఓ, జనగణన పనులొద్దు
అనంతపురం క్రైం: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందాల్సిన సేవలకు ఆటంకం కలగకుండా స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు సిబ్బందిని ఇతర ప్రభుత్వ విధులకు దూరంగా ఉంచాలని జిల్లా స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు అధికారి జి.నాసరరెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. ముఖ్యంగా డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులను బీఎల్ఓ విధులు, జనగణన, ఇతర సర్వే సంబంధిత పనులకు వినియోగించకూడదని స్పష్టం చేశారు. మహిళల ఖోఖో జట్టుకు ద్వితీయస్థానంఅనంతపురం: ఆగస్టు 24 నుంచి 29 వరకు తిరుపతిలో నిర్వహించిన అమరావతి చాంపియన్‌షిప్–2026లో అనంతపురం జిల్లా మహిళల ఖోఖో జట్టు అద్భుతమైన ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని సాధించింది. జట్టు సభ్యుల్లో ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఉన్నారు. వీరిలో సివిల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థినులు శ్రీజ, అర్చన, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) మూడో సంవత్సరం విద్యార్థిని శారద ఉన్నారు. ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.జ్యోతికుమార్ క్రీడాకారిణులను సోమవారం అభినందించారు. సమ్మెలోకి ‘సత్యసాయి’ తాగునీటి కార్మికులు అనంతపురం అర్బన్/కూడేరు: సత్యసాయి నీటి సరఫరా ప్రాజెక్టు కార్మికులకు మళ్లీ నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. ఇందులో భాగంగానే వేతనాలు చెల్లించాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ప్రాజెక్టు కార్మికులు చేపట్టిన రిలే దీక్షలను సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్వీనాయుడు, నాగేంద్రకుమార్ ప్రారంభించి మాట్లాడారు. ఐదు నెలలుగా కార్మికులకు వేతనం ఇవ్వకపోతే వారు కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. వేతన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఈనెల 10న కలెక్టర్‌కు సమ్మె నోటీసు అందించామన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నామన్నారు. మరోవైపు కూడేరు పరిధిలో పీఏబీఆర్ డ్యాం వద్ద ఏర్పాటైన సత్యసాయి ప్రాజెక్ట్‌లో మోటర్లు పని చేయకుండా కార్మికులు స్విచ్ ఆఫ్ చేశారు. -
ఖరీఫ్‌లో కళ్లముందే కార్తెలు, నెలలు కరిగిపోతున్నా వరుణుడు జాడ కనిపించలేదు. సూపర్ ఎల్–నినో శక్తివంతంగా ప్రభావం చూపుతోంది. ఆశలు పెట్టుకున్న నైరుతి రుతుపవనాలు కదలిక లేకుండా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గాలివాటంగా కురస్తున్న తేలికపాటి వర్షాలకే 2.10 లక్షల హెక్టా
అనంతపురం అగ్రికల్చర్: కరువు ఘంటికలు మోగుతున్నాయి. ఖరీఫ్‌లో ఇప్పటి వరకు సాగులోకి వచ్చిన పంటలు అంతో ఇంతో చేతికి రావాలంటే ఆగస్టు వర్షాలే కీలకం. అయితే నెల దాటిపోయినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో దిగుబడులు వచ్చే అవకాశం లేకుండాపోయింది. జూన్ నుంచి ఆగస్టు వరకు మూడు నెలల కాలంలో 210 మి.మీకు గాను 42 శాతం లోటుతో 122 మి.మీ వర్షపాతం నమోదైంది. అందులో ప్రధానంగా నైరుతి ప్రవేశించిన జూన్ మొదటి 15 రోజుల్లోనే మంచి వర్షాలు పడటంతో ఆ సమయానికి 11 శాతం అధికంగా 68.4 మి.మీ నమోదైంది. పంటలు విత్తుకు కీలకమైన జూలైలో పరిస్థితి దారుణంగా తయారైంది. జూన్ 15 తర్వాత కనుమరుగైన వరుణుడి జాడ జూలై నెలంతా కనిపించలేదు. జూలైలో 64.3 మి.మీ గానూ 71 శాతం తక్కువగా కేవలం 18.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక ఆగస్టులో కూడా 84.4 మి.మీకు గాను 60 శాతం తక్కువగా 34 మి.మీ నమోదైంది. ఈ సీజన్లో మొత్తం మీద 12 వర్షపు రోజులు (రెయినీ డేస్) నమోదయ్యాయి. అందులో జూన్‌లోనే ఏడు ఉండగా.. మిగతా రెండు నెలల కాలంలో మరో ఐదు మాత్రమే ఉన్నాయి. పెద్దవడుగూరు, కూడేరులో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగతా 30 మండలాల్లో తక్కువగానే వర్షాలు కురిశాయి. మూడు నెలలు పూర్తయినా ఇప్పటికీ పుట్లూరు, యల్లనూరు, గుమ్మఘట్ట, వజ్రకరూరు, తాడిపత్రి, గుత్తి... ఈ ఆరు మండలాల్లో 60 నుంచి 75 శాతం తక్కువగా వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఇక మిగిలి ఉన్న సెప్టెంబర్ నెలలో 111.6 మి.మీ మేర సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ఎల్–నినో తీవ్రత అధికంగా ఉన్నందున సెప్టెంబర్‌లో కూడా సాధారణం నమోదయ్యే అవకాశం లేదంటున్నారు. ఎల్–నినో ప్రభావంతో నిలిచిన నైరుతి రుతుపవనాలు ఖరీఫ్ సీజన్లో 42 శాతం లోటు వర్షపాతం నమోదు దుర్భర పరిస్థితులతో భయాందోళనలో రైతులు -
హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్టు
బొమ్మనహాళ్: ప్రేమ వ్యవహారానికి సంబంధించి యువకుడిపై వేటకోడవళ్లతో దాడి చేసిన కేసులో నలుగురిని బొమ్మనహాళ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు వేటకొడవళ్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ నబీరసూల్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఉరవకొండ మండలం పెద్ద ముష్టూరుకు చెందిన చరణ్ అదే గ్రామానికి చెందిన ఓ బాలికతో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. ఈ విషయమై ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించగా అప్పట్లో రాజీ చేసిన్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇటీవల చరణ్ బొమ్మనహాళ్ మండలంలోని ఽశ్రీధరఘట్టలోని బంధువుల ఇంట్లో ఉంటూ ఇన్‌స్టా, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో బాలిక ఫొటోలను పోస్ట్ చేస్తున్నాడన్నారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఈనెల 29న వేటకోడవళ్లతో చరణ్‌పై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. చరణ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం గోవిందవాడ క్రాస్ వద్ద మునీంద్ర, నారాయణస్వామి, వన్నూరుస్వామి, ప్రసాద్‌ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు వేటకోడవళ్లు, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నిందితులను రాయదుర్గం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థులకు బంగారు భవిష్యత్
బుక్కరాయసముద్రం: ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందని హెడ్ ఆఫ్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ గ్రూప్ ఆమ్‌డాక్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఈఎస్ చక్రవర్తి అన్నారు. సోమవారం ఎస్ఆర్ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులకు ఆరంభ్–2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చక్రవర్తితో పాటు ఎస్ఆర్ఐటీ కళాశాల కరెస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ఐటీ కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థికి బంగారు భవిష్యత్ కల్పించేలా కళాశాల యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. నైపుణ్యాలతో కూడిన ఉన్నతమైన విద్యను అందించడమే లక్ష్యంగా కళాశాల యాజమాన్యం పని చేస్తోందన్నారు. అనంతరం ఈఎస్ చక్రవర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఇంజినీరింగ్ చదివేందుకు మంచి కళాశాలను ఎంచుకోవాలని సూచించారు. ఎస్ఆర్ఐటీ కళాశాల మంచి వాతావరణం, అధునాతన సౌకర్యాలు కల్పించిందన్నారు. 18 ఏళ్లలో ఎస్ఆర్ఐటీ న్యాక్, ఎన్బీఏ, (అటానమస్) స్వయం ప్రతిపత్తి గుర్తింపు పొందిందన్నారు. ఆలూరి సాంబశివారెడ్డి, చైర్పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ, డీన్ డాక్టర్ సాయి చైతన్య కిషోర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
కార్లు బాడుగకు తీసుకుని తాకట్టు
ఉరవకొండ: నియోజకవర్గంలో పలువురు కార్ల యజమానుల నుంచి బాడుగకు కార్లు తీసుకుని వాటిని బయట వ్యక్తులకు తాకెట్టు పెట్టి డబ్బు వసూలు చేసి పరారీలో ఉన్న మోసకారిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఉరవకొండ సీఐ మహానంది, ఎస్ఐ జనార్ధన్‌నాయుడు తెలిపిన వివరాలమేరకు... స్థానిక అంబేడ్కర్‌నగర్‌లో నివాసమంటున్న అంకె అమరేశ్వర అలియాస్ హనుమంతు పట్టణంలో బాడుగులకు వాహనాలు తిప్పే కార్ల యజమానుల వద్దకు వెళ్లి అధిక బాడుగ చెల్లిస్తానంటూ ఆశ చూపాడని తెలిపారు. అతని మాటలు నమ్మిన కార్ల యజమానులు కార్లు బాడుగలకు ఇచ్చారన్నారు. అయితే వారికి తెలియకుండా హనుమంతు 13 కార్లను బయట వ్యక్తులకు కుదవ పెట్టి డబ్బులు వసూలు చేసి పరారైనట్లు పేర్కొన్నారు. వాహన యజమానుల్లో ఒకరైన ఎర్రిస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సోమవారం పాల్తూరు క్రాస్ వద్ద 42వ జాతీయ రహదారి వద్ద నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 9 కార్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశామన్నారు. పోలీసుల అదుపులో నిందితుడు -
పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య
యల్లనూరు: పుట్లూరు మండలం తక్కల్లపల్లికి చెందిన రామాంజనేయులు కుమార్తె చుక్కోళ్ల వాసవి (16) కొంతకాలం కడుపునొప్పితో బాధ పడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వాసవిని హుటాహుటిన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో వాసవి చనిపోయినట్లు ఎస్ఐ సురేంద్రబాబు తెలిపారు. వాసవి తల్లి చిక్కోళ్ల అనంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. విశ్రాంత రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీగుత్తి: పట్టణంలోని కేపీఎస్ వెంచర్లో నివాసముండే విశ్రాంత రైల్వే ఉద్యోగి పురుషోత్తం ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు బీరువాలో దాచి ఉంచిన సుమారు తులం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వారం క్రితం హైదరాబాద్‌కు వెళ్లిన పురుషోత్తం కుటుంబ సభ్యులు సోమవారం ఇంటికి వచ్చారు. తలుపులు తెరచి ఉండగా అనుమానం వచ్చి లోపలికి వెళ్లి పరిశీలించారు. బీరువాలో దాచి ఉంచి సుమారు తులం బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేడు మహిళా క్రికెట్ జట్ల ఎంపిక అనంతపురం: ఆర్డీటీ క్రికెట్ టాలెంట్ హంట్‌లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అండర్–15, అండర్–18 విభాగాల్లో మహిళా కికెట్ జట్లను ఎంపిక చేయనున్నారు. కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బాలికలతో పాటు స్కూళ్లు, కాలేజీలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న మహిళా క్రికెటర్లు ఎంపిక ప్రక్రియలో పాల్గొనవచ్చన్నారు. ఈ మేరకు ఆర్డీటీ క్రీడా విభాగం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కె.ఊబిచెర్లలో చోరీ గుత్తి రూరల్: మండలంలోని కె.ఊబిచెర్లలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సోమవారం బాధితులు తెలిపిన మేరకు ... గ్రామానికి చెందిన నాయకం గోవిందు, రామేశ్వరమ్మ దంపతులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూలై 29న హైదరాబాద్ వెళ్లారు. అయితే ఈ నెల 3, 4 తేదీల్లో గోవిందు సోదరుడి వివాహం ఉండటంతో హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చారు. ఇంటి గేటు తాళాలు తీసి ఇంట్లోకి వెళ్లగా ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఉండటాన్ని గమనించారు. అనుమానంతో వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. రెండు బీరువాల్లో ఉంచిన 10 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు తెలుసుకొని వెంటనే పోలీసులుకు సమాచారం అందించారు. సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి ఆధారాలను సేకరించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి యల్లనూరు: చిలమకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త చిన్న బింగన్నగారి భాస్కర్‌తో పాటు మరొకరిపై జేసీ అనుచరులు సోమవారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు. వివరాలు.. భాస్కర్‌తో పాటు గడ్డంవారిపల్లి పరమేష్, తిరుమలాపురం శ్రీను కలిసి బైక్‌పై చిలమకూరు పెద్దమ్మగుడి వద్ద వస్తున్నారు. అదే సమయంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చిలమకూరు గ్రామానికి వస్తున్నారు. ఈ సందర్భంగా జేసీ సమక్షంలోనే ఆయన అనుచరులు భాస్కర్, శ్రీనుపై దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 50 తులాల బంగారు నగల చోరీ రాయదుర్గంటౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళను మాటలతో ఏమార్చి బ్యాగులోని 50 తులాల బంగారు నగలను అపహరించారు. ఈమేరకు డీ.హీరేహాళ్ మండలం మడేనహళ్లికి చెందిన పుష్పలత రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం పుష్పలత కణేకల్లులోని తన పుట్టింటికి వెళ్లి తిరిగి రాయదుర్గానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. కణేకల్లు క్రాస్‌లో ఓ మహిళ బస్సు ఎక్కి పుష్పలత పక్కన కూర్చుంది. స్నేహంగా మాటలు కలిపి పిల్లవాడికి పాలు తాగించేందుకు అంటూ కింద కూర్చొని బ్యాగులో ఉంచిన 50 తులాల బంగారు నగలను దొంగిలించింది. రాయదుర్గం పట్టణానికి చేరుకోగా మొదటి స్టాప్‌లో సదరు మహిళ దిగిపోయింది. బస్సు బస్టాండ్‌కు వెళ్లిన తర్వాత బ్యాగ్ జిప్ తీసి ఉండటంతో దొంగతనం విషయం బయట పడింది. దీంతో పుష్పలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
చేటు తెచ్చిన బస్సు ప్రయాణం
● తోపులాటలో అపస్మారక స్థితిలోకి మహిళ పత్తికొండ: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీతో ఓ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన సోమవారం సాయంత్రం పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకుంది. గుంతకల్లులోని ధర్మవరం గేట్‌కు చెందిన హసీనా తన కుమారుడు దాదా పీరాతో కలిసి ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం కర్నూలుకు వెళ్లింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకొని తిరిగి కర్నూలు నుంచి ఆర్టీసీ బస్సు (ఏపీ39యూఎల్1662)లో గుంతకల్లుకు బయలుదేరింది. కూర్చోవడానికి సీటు కూడా దొరికింది. అయితే సాయంత్రం సమయంలో బస్సు పత్తికొండ బస్టాండ్‌కు రాగానే వాష్‌రూమ్ కోసం కిందకు దిగింది. ఆ సమయంలో గుంతకల్లు వైపు బస్సులు తక్కువగా ఉంటాయి. దీనికితోడు దాదాపు 3 గంటలు పాటు గుంతకల్లు వైపు వెళ్లే బస్సులు రాలేదు. దాదాపు 200 మంది ప్రయాణికులు గుంతకల్లు వైపు వెళ్లడానికి బస్టాండ్‌లో నిరీక్షిస్తున్నారు. దీంతో వచ్చిన బస్సు కోసం ప్రయాణికులు చుట్టుముట్టారు. ఈక్రమంలో వాష్‌రూమ్ ముగించుకొని బస్సు ఎక్కుతున్న సమయంలో రద్దీ కారణంగా ప్రయాణికులు తోసుకున్నారు. దీంతో హసీనా అక్కడే స్పృహతప్పి పడిపోయింది. బస్సులో ఉన్న కుమారుడు దాదాపీరా ఆమెను పత్తికొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయినా ఆర్టీసీ సిబ్బంది తమకేమీ సంబంధం లేనట్లు ఆమెను కిందకు దింపి వెళ్లిపోవడం గమనార్హం. -
మామపై అల్లుడి దాడి
నార్పల: కుటుంబ కలహాలతో మామపై వేటకొడవలితో అల్లుడు విచక్షణారహితంగా దాడిచేసిన ఘటన మండల కేంద్రమైన నార్పలలో కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు... నార్పలలోని తిక్కస్వామివీధిలో నివాసం ఉంటున్న చిలమకూరి పాముల రాజాకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు ముందే వివాహం జరిపించాడు. చిన్నకుమార్తె రమాదేవికి 18 నెలలు క్రితం లింగాల మండలానికి చెందిన శివయ్య కుమరుడు చరణ్‌తో పెళ్లి చేశారు. కుమార్తె గర్భిణి కావడంతో ప్రసవం కోసం పాముల రాజా తన ఇంటికి పిలుచుకుని వచ్చాడు. నెల రోజుల క్రితం రమాదేవి ప్రసవించింది. బిడ్డను చూసేందుకు చరణ్ తో పాటు అతని తండ్రి శివయ్య వచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబ విషయాల్లో వచ్చిన మనస్పర్థల కారణంగా చరణ్ ... తన మామ అయిన పాముల రాజాపై వేట కొడవలితో దాడి చేశాడు. దాడిలో రాజా కుడి చేతికి తీవ్ర గాయమైంది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఆయన బయటకు పరుగులు తీశాడు. చరణ్ అంతటి అగకుండా రాజా వెంటాపడ్డాడు. గమనించిన స్థానికులు చరణ్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నారు. తీవ్రంగా గాయపడిన రాజాను వెంటనే అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా...పైళ్లెనప్పటి నుంచి తనను హింసిస్తున్నాడంటూ భర్త చరణ్‌పై భార్య రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ముగిసిన అహుడా కథ
అనంతపురం క్రైం: ఉమ్మడి అనంతపురం జిల్లా విభజనకు అనుగుణంగా పట్టణాభివృద్ధి సంస్థల పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. ఇప్పటి వరకూ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిని కలుపుతూ ఉన్న అనంతపురం – హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ (అహుడా) ఇకపై ఉండదు. దాని స్థానంలో రెండు జిల్లాలకు రెండు ప్రత్యేక పట్టణాభివృద్ధి సంస్థలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఈ నెల 17న రెండు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురానికి ఏటీపీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడీఏ), అహుడా పరిధిలోని శ్రీసత్యసాయి జిల్లా ప్రాంతాలను తొలగిస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 197 జారీ చేసింది. దీంతో అనంతపురం జిల్లా ప్రాంతంతో అనంతపురం పట్టణాభివృద్ధి సంస్థ (ఏటీపీ యూడీఏ) ఏర్పడింది. ఈ పరిధిలో అనంతపురం నగరపాలక సంస్థతో పాటు రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. అదే విధంగా 31 పూర్తి మండలాలు, 507 రెవెన్యూ గ్రామాలు ఏటీపీ యూడీఏ పరిధిలోకి వచ్చాయి. మొత్తం విస్తీర్ణం సుమారు 10,205 చదరపు కిలోమీటర్లుగా ఉంది. శ్రీసత్యసాయికి ‘పుడా’ శ్రీసత్యసాయి జిల్లా ప్రాంతాలను ఒకే పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 190 జారీ చేసింది. పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థ (పీయూడీఏ) పరిధిలో శ్రీసత్యసాయి జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండలాలు, గ్రామాలను చేర్చారు. కొత్త పుడా పరిధిలో 31 మండలాలు, 461 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం విస్తీర్ణం సుమారు 8,925 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి తదితర ప్రాంతాలు ఇకపై పుడా పరిధిలో పట్టణాభివృద్ధి ప్రణాళికలకు లోబడి ఉంటాయి. అహుడాకు తెర జిల్లాల విభజన జరిగినప్పటికీ ఇప్పటివరకూ కొనసాగుతున్న అహుడా వ్యవస్థను ప్రభుత్వం తాజాగా పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. దీంతో అహుడా పేరు చరిత్రలో కలిసిపోయి.. అనంతపురం జిల్లాకు ఏటీపీ యూడీఏ, శ్రీసత్యసాయి జిల్లాకు పుడా అధికారికంగా రూపుదిద్దుకున్నాయి. ఇకపై ఆయా ప్రాంతాల్లో మాస్టర్ప్లాన్లు, భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లు, అభివృద్ధి ప్రణాళికలు, పట్టణ విస్తరణ వంటి అంశాలను ఆయా యూడీఏలు పర్యవేక్షించనున్నాయి. చైర్మన్ల నియామకం ఎప్పుడో? కొత్తగా రెండు యూడీఏల పరిధులు ఖరారైనప్పటికీ వాటి చైర్మన్ల నియామకం మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీంతో కొత్త యూడీఏలకు చైర్మన్లుగా ఎవరిని నియమిస్తారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం తదుపరి దశలో చైర్మన్ల నియామకంతో పాటు ఇతర పాలక వ్యవస్థను పూర్తి చేయాల్సి ఉంది. కొత్తగా అనంతకు ఏటీపీ యూడీఏ, శ్రీసత్యసాయికి పుడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ల నియామకమే తరువాయి -
‘ఉత్తమ అధికారి’ లంచావతారం
అనంతపురం ఎడ్యుకేషన్: జనవరి 26న గణతంత్ర వేడుకల్లో ఉత్తమ అధికారిగా అవార్డు స్వీకరించిన పంచాయతీ కార్యదర్శి... కొద్ది నెలలకే అవినీతి ఆరోపణలతో ఏసీబీ విచారణను ఎదుర్కోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంటి నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో అనంతపురం రూరల్ రుద్రంపేట పంచాయతీ కార్యదర్శి హిదయతుల్లాను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన బోయ నాగేంద్రకు అనంతపురం రూరల్ కక్కలపల్లి సర్వే నంబర్ 122/3బీలో నాలుగు సెంట్ల స్థలం ఉంది. ప్లాట్ నంబర్ 21లో ఇల్లు నిర్మించుకునేందుకు ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్రూవల్ చేయాలంటే రూ.10 వేలు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి హిదయతుల్లా డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇవ్వలేనని నాగేంద్ర చెప్పడంతో రూ.8 వేలకు అంగీకరించారు. అయితే.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు హిదయతుల్లాను పట్టుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. ‘సారు’ చెప్పడంతో.. కక్కలపల్లి కాలనీ సచివాలయంలో శానిటరీ వర్కర్‌గా పనిచేస్తున్న కంబగిరి అలియాస్ గిరి సోమవారం కళ్యాణదుర్గం రోడ్డు కూడలిలోని అంజనా కేఫ్ వద్ద నాగేంద్ర నుంచి రూ.8 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తాను పంచాయతీ కార్యదర్శి హిదయతుల్లా సూచనల మేరకే నాగేంద్ర నుంచి డబ్బులు తీసుకున్నట్లు కంబగిరి ఏసీబీ అధికారులకు తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా కంబగిరి, పంచాయతీ కార్యదర్శి మధ్య జరిగిన ఆడియో కాల్ సంభాషణను ఏసీబీ అధికారులు సేకరించినట్లు తెలిసింది. అదుపులోకి హిదయతుల్లా అనంతరం ఏసీబీ అధికారులు రుద్రంపేట పంచాయతీ కార్యాలయానికి చేరుకుని పంచాయతీ కార్యదర్శి హిదయతుల్లాను అదుపులోకి తీసుకుని విచారించారు. ఎంపీడీఓ దివాకర్‌ను అక్కడికి పిలిపించి కంబగిరి ఉద్యోగ వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటి అప్రూవల్ కోసం పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉచితంగా చేయాల్సిన పనులకు ఎవరైనా అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీని ఆశ్రయించాలని సూచించారు. ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే ఏసీబీ డీఎస్పీల 94404 46181, 94404 48182 నంబర్లకు, ఇతర సీఐలనంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్లాన్ అప్రూవల్‌కు రూ.10 వేల లంచం డిమాండ్ ఏసీబీ వలలో రుద్రంపేట పంచాయతీ కార్యదర్శి హిదయతుల్లా రూ.8 వేలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ శానిటరీ వర్కర్ ‘సారు’ చెప్పడంతో డబ్బులు తీసుకున్నానని ఏసీబీ ముందు వెల్లడి -
ఆంక్షలపై అన్నదాతల ఆగ్రహం
● హంద్రీ–నీవా నీటి కోసం రోడ్డు దిగ్బంధం వజ్రకరూరు: హంద్రీ–నీవా నీళ్లు వస్తాయనే నమ్మకంతో పంట పెడితే.. సాగుకు వాడుకోరాదని ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై అన్నదాతలు ఆగ్రహించారు. ఒకవైపు వర్షాలు లేవు... మరోవైపు కళ్లముందు కాలువగుండా నీరు వెళ్తున్నా వాడుకునే అవకాశం లేకపోతే తాము ఎలా బతకాలి అంటూ ప్రశ్నించారు. రామగిరి చెరువు, వెంకటాంపల్లి, జరుట్లరాంపురం తదితర చెరువులను నింపడంతోపాటు పంటలకు నీటిని విడుదల చేయాలని వజ్రకరూరు మండలం గంజికుంట, తట్రకల్లు, పందికుంట, వెంకటాంపల్లి, జరుట్ల రాంపురం, వజ్రకరూరు, పామిడి మండలం ఎద్దులపల్లి, రామగిరి తదితర గ్రామాలకు చెందిన వందలాదిమంది రైతులు ఉద్యమించారు. సోమవారం రాగులపాడు సమీపంలోని హంద్రీ–నీవా ప్రధాన కాలువ వద్దకు చేరుకుని ఉరవకొండ – గుంతకల్లు రోడ్డును దిగ్బంధించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాలువలో సమృద్ధిగా నీరు వెళ్తున్నా వాడుకోవద్దంటే తాము పంటలపై ఆశలు వదులుకుని, అప్పులపాలు కావాల్సి వస్తుందన్నారు. గ్రామాల్లో బోర్లల్లో నీటిమట్టం పడిపోయిందని, చెరువులు, కుంటలు ఎండిపోయాయని, తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చిందన్నారు. చెరువులకు నీటిని విడుదల చేసేంత వరకు కదిలేది లేదని భీష్మించారు. మూడున్నర గంటలపాటు ఆందోళన కొనసాగడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సీఐ మహానంది, వజ్రకరూరు తహసిల్దార్ జయశ్రీ, ఎస్ఐ నాగస్వామి సిబ్బందితో వచ్చి పరిస్థితిని సమీక్షించారు. హంద్రీ–నీవా అధికారులు వచ్చి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అక్కడి నుంచి ఆదేశాలు వస్తే చెరువులకు నీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. -
గుండెపోటుతో ఇద్దరు అటెండర్ల మృతి
కణేకల్లు: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ అటెండర్ శ్రీనివాసులు (56) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. సిబ్బంది కథనం మేరకు.. కళ్యాణదుర్గానికి చెందిన శ్రీనివాసులు అవుట్సోర్సింగ్ కింద అటెండర్‌గా గత 12 ఏళ్ల నుంచి మోడల్ స్కూల్లో పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం డ్యూటీ కొచ్చిన శ్రీనివాసులు సుస్తీగా ఉండటంతో మెడికల్ రూమ్‌లో కూర్చున్నాడు. ఒక్కసారిగా ఛాతినొప్పి రావడంతో కుప్పకూలాడు. సిబ్బంది వెంటనే సీపీఆర్ చేసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాసులుకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన మృతిపై ప్రిన్సిపాల్ రెహానాబేగం, ఎంపీఓ–2 భవానీశంకర్ తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కళ్యాణదుర్గంలో మరొకరు... కళ్యాణదుర్గం: చాపిరి సహకార బ్యాంకులో అటెండర్‌గా పనిచేస్తున్న తిమ్మసముద్రం గ్రామానికి చెందిన టి.బాషా (58) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిన బాషాను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు వదలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతునికి భార్య రోజాబీ, ఐదుగురు సంతానం కాగా ఇద్దరికి వివాహం అయింది. ఇద్దరు కొడుకులు, ఒక కుమారుడు వీరి వద్దనే ఉంటున్నారు. -
వారికి ఉత్తర్వులు వర్తించవా?
అనంతపురం టౌన్: విద్యుత్ శాఖలో డిప్యుటేషన్లు రద్దు చేయడంతోపాటు ఎలాంటి బదిలీలు చేయకూడదని జూన్ నెలలో ఏపీ ఎస్పీడీసీఎల్ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యుటేషనపై వివిధ సెక్షన్లలో పనిచేసే ఉద్యోగులు యథా స్థానాలకు వెళ్లాలని విద్యుత్‌శాఖ ఎస్ఈ ఆదేశాలు జారీ చేశారు. అయితే కొందరు ఉద్యోగులు మాతృస్థానాలకు వెళ్లి విధులు నిర్వహిస్తుంటే.. మరికొందరు ఉద్యోగులు ఎస్ఈ ఉత్తర్వులు తమకు పట్టవన్నట్లు ఇక్కడే తిష్ట వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర్వులు కొందరికేనా? విద్యుత్ శాఖలో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులు కొందరు డిప్యుటేషన్లు, మరి కొందరు వర్కింగ్ ఇన్స్ట్రక్షన్స్ పేరిట ప్రత్యేక ఉత్తర్వులతో ఇక్కడే తిష్ట వేసుకున్నారు. అయితే ఇలాంటి ఉత్తర్వులను రద్దు చేస్తూ జూన్ నెలలో ఆ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే తమ మాతృ స్థానాల్లో జాయిన్ కావాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. దీంతో కొందరు ఉద్యోగులు వారి యథాస్థానాలకు వెళ్లిపోగా, చాలా మంది ఉద్యోగులు ఇక్కడే ఉండిపోయారు. ఎస్ఈ ఉత్తర్వులు కొందరికేనా? అంటూ ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. పలుకుబడి ఉన్నవారిని, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే వారిని ఎక్కడైనా కొనసాగిస్తారని వాపోతున్నారు. విద్యుత్ శాఖలో ఈఆర్ఓ వింగ్‌లో విధులు నిర్వహిస్తున్న చాలా మంది ఉద్యోగులు తమ మాతృ స్థానాలకు వెళ్లకుండా సర్కిల్ కార్యాలయం, రూరల్, అర్బన్ ఈఆర్ఓ కార్యాలయాల్లోనే ఉండిపోవడంపై మండిపడుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఎస్ఈ ఉత్తర్వులను 100శాతం అమలు చేయాలని కోరుతున్నారు. తిష్టవేసిన విద్యుత్ ఉద్యోగులు డిప్యుటేషన్లు రద్దు చేసినా కదలని వైనం ఎస్ఈ ఉత్తర్వులు కొందరికేనా అంటూ నిట్టూర్పుయథాస్థానాలకు వెళ్లాల్సిందే విద్యుత్ శాఖలో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులు కొందరు డిప్యుటేషన్లు, మరి కొందరు వర్కింగ్ ఇన్స్ట్రక్షన్స్ పేరిట ప్రత్యేక ఉత్తర్వులతో ఇక్కడే తిష్ట వేసుకున్నారు. ఎవరికీ మినహాయింపు ఉండదు. అందరూ తమ యథాస్థానాలకు వెళ్లాల్సిందే. దీనిపై మరో మారు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. – శేషాద్రిశేఖర్, ఎస్ఈ -
సిఫార్సులకు పెద్దపీట
బ్రహ్మసముద్రం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో విద్యుత్ అధికారుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అధికారులు సిఫార్సులకు పెద్దపీట వేస్తున్నారు. టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు. అర్హులైన రైతులు డీడీలు తీసి ట్రాన్స్ఫార్మర్లు, కనెక్షన్ల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. అధికార పార్టీ అనుయాయులైతే ఆగమేఘాలపై విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. అర్హులకు అందాల్సిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, పరికరాలు టీడీపీ వర్గీయులకు కట్టబెడుతుండపై రైతులు మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 1,719 మంది రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కోసం నిరీక్షిస్తున్నారు. సామాన్య రైతులు తమ పొలాలకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. విద్యుత్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనెక్షన్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. విద్యుత్ సదుపాయం లేక పంటలు ఎండిపోయి రూ.లక్షలు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. టీడీపీ నేతలకు విద్యుత్ అధికారుల వత్తాసు.. ఒక వైపు సామాన్య రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం అల్లాడుతుంటే మరోవైపు అధికార టీడీపీ నేతలకు మాత్రం అధికారులు ఆగమేఘాలపై కనెక్షన్లు మంజూరు చేస్తుండటం గమనార్హం. నిబంధనలు పక్కనపెట్టి దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే నేతల పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తుండంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలాల్లో అధికారుల తీరుపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు రైతులు వాపోతున్నారు. బ్రహ్మసముద్రం మండలానికి చెందిన ఓ రైతు 2024 అక్టోబర్‌లో ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీ చెల్లించాడు. రెండేళ్లు గడుస్తున్నా నేటికీ ట్రాన్స్ఫార్మర్, పరికరాలు ఇవ్వలేదు. కానీ అదే నెలలోనే ట్రాన్స్ఫార్మర్, పరికరాలు అన్నీ ఇచ్చినట్లుగా విద్యుత్ అధికారులు ఆన్లైన్లో పొందుపరిచారు. తనకు పరికరాలు కావాలని సదరు రైతు విద్యుత్ అధికారులను అడిగితే రెండేళ్లుగా ఇస్తామంటూనే కాలయాపన చేస్తున్నారని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. ట్రాన్స్ఫార్మర్ల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న రైతులు టీడీపీ నేతలకు విద్యుత్ అధికారుల వత్తాసు అధికార పార్టీ మద్దతుదారులైతే ఆగమేఘాలపై కనెక్షన్లు సీనియార్టీ మేరకే ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు సీనియార్టీ ప్రకారమే అందిస్తాం. డీడీలు కట్టకుండానే ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు తెలిస్తే.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. రైతులకు ఎక్కడైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకువస్తే క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సమస్య పరిష్కరిస్తాం. – కళ్యాణ్ చక్రవర్తి, ఈఈ, కళ్యాణదుర్గం ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ట్రాన్స్ఫార్మర్ బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామంలోనిది. టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ కోసం డీడీ తీయలేదు. అయినా 8 నెలల క్రితమే ట్రాన్స్‌ఫార్మరు ఏర్పాటు చేశారు. అసలైన రైతులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. టీడీపీ నేత డీడీ చెల్లించుకుండానే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేయడంపై రైతులు మండిపడుతున్నారు. -
నేటి నుంచి ఆర్డీటీ క్రికెట్ టాలెంట్ హంట్
అనంతపురం: ఉమ్మడి జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రికెట్ క్రీడాకారులను వెలికితీసి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఆర్డీటీ చర్యలు చేపట్టింది. ‘క్రికెట్ టాలెంట్ హంట్’ పేరుతో సోమవారం నుంచి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఈ మేరకు ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు అనంత క్రీడాగ్రామంలోని క్రికెట్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అండర్–15, అండర్–18 విభాగాల్లో సెలక్షన్స్ జరుగుతాయి. ఎంపిక ప్రక్రియలో పాల్గొనే బాలబాలికలు ఇప్పటి వరకూ ఏ విభాగంలోనూ జిల్లా స్థాయికి మించి ఆడి ఉండకూడదు. ఎంపిక జరిగే ప్రాంతంలోనే నమోదు ప్రక్రియ ఉంటుంది. ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకెళ్లాలి. ఈ నెల 31న హిందూపురంలోని ఎంజీఎం స్కూల్ మైదానం, సెప్టెంబర్ 1న కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం, 2న గుంతకల్లు రైల్వే గ్రౌండ్, 3న కళ్యాణదుర్గం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం, 4న ధర్మవరంలోని ఆర్డీటీ క్రీడా కేంద్రం, 5న అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా కేంద్రంలో ఎంపికలు ఉంటాయి. అనంత, చిత్తూరు మ్యాచ్ డ్రా అనంతపురం: అనంత క్రీడాగ్రామం వేదికగా సాగుతున్న ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీడే క్రికెట్ టోర్నీలో భాగంగా అనంతపురం, చిత్తూరు జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. చిత్తూరు జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆదివారం ఆట కొనసాగించింది. 130.4 ఓవర్లలో 531 పరుగులకు ఆలౌట్ అయింది. చిత్తూరు బ్యాటర్ కృష్ణతేజారెడ్డి సెంచరీ (132)తో కదంతొక్కాడు. చరంజిత్ (84), రుషిల్ (82), భవానీ ప్రసాద్ (73), సాయిచరణ్ (45) రాణించారు. అనంతపురం బౌలర్లలో ప్రదీప్‌రెడ్డి, అర్జున్ టెండూల్కర్ చెరో మూడు వికెట్లు, ప్రమోద్‌కుమార్ రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు చివరి రోజు ఆట ముగిసే సమయానికి 36.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 254 పరుగులు సాధించింది. అర్జున్ టెండూల్కర్ 65 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. మరో బ్యాటర్ వీరారెడ్డి 64, జయంత్ కృష్ణ 54 పరుగులు సాధించారు. సీఐ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ అనంతపురం సెంట్రల్: కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న సీఐ తబ్రేజ్ అహ్మద్ కారు తరచూ ప్రమాదానికి గురవుతోంది. వారం రోజుల క్రితం అనంతపురం తపోవనం సర్కిల్లో సీఐ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటన మరువక ముందే ఆదివారం స్థానిక టవర్‌క్లాక్ సమీపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద రెడీ టూ కాంక్రీట్ మిక్చర్ లారీ ఢీ కొట్టింది. కారు స్వల్పంగా దెబ్బతింది. ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
పెళ్లికి హాజరైన చంద్రబాబు
అనంతపురం టౌన్: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె విద్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు కుమారుడు శివరాజ్‌ల వివాహ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 2.30గంటలకు అనంతపురం శిల్పారామం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గన బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలుకు చేరుకొని వధూవరులను ఆశ్వీరదించారు. పెళ్లి వేడుకల్లో సీఎంతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హైకోర్టు రెగ్యులర్ బెంచ్‌ను ‘సీమ’లో ఏర్పాటు చేయాలి అనంతపురం: హైకోర్టు రెగ్యులర్ బెంచ్‌ను రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఏపీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను అనంతపురం బార్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు బార్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ గాజుల పద్మజ, జనరల్ సెక్రెటరీ, జేఏసీ కో కన్వీనర్ ఎన్.ఆదిశేషారెడ్డి ఆదివారం నంద్యాలలోని మంత్రి క్యాంప్ ఆఫీసులో కలిసి వినతిపత్రం అందజేశారు. హైకోర్టు రెగ్యులర్ బెంచ్‌ను కర్నూలులోని బీ క్యాంప్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. సజావుగా నీట్–పీజీ అనంతపురం అర్బన్: జిల్లాలోని ఐదు కేంద్రాల్లో ఆదివారం నీట్– పీజీ సజావుగా జరిగింది. 979 మంది అభ్యర్థులకు గాను 967 మంది హాజరయ్యారు. 12 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టబందోబస్తు నిర్వహించారు. వైద్య సదుపాయం, మౌలిక వసతులు అందబాటులో ఉంచారు. -
పక్కా ప్రణాళికతోనే హత్య!
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ పాపంపేటకు చెందిన మఠం భరద్వాజ్ అలియాస్ భరత్ దారుణ హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న నలుగురు అనుమానితులను రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిని రహస్య ప్రదేశానికి తరలించి తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. పక్కా ప్రణాళికతోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. భరద్వాజ్‌కు ఓ వివాహిత మహిళతో సన్నిహిత సంబంధం ఉండటమే హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు మహిళ భర్తతో పాటు అనంతపురం రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, మరో ఇద్దరు ఈ హత్యలో పాల్గొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సదరు మహిళను సంతానం లేని దంపతులు దత్తత తీసుకున్నట్లు తెలిసింది. వారు ఇటీవల మృతి చెందగా.. తమ ఆస్తిని అప్పటికే విక్రయించినట్లు సమాచారం. అయితే తనకు దత్తత తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఉందని సదరు మహిళ పలువురితో చెబుతూ.. న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిసింది. అనంతపురం కమలానగర్లో టిఫిన్ సెంటర్ నిర్వహించే సదరు మహిళ, ఆమె భర్తకు టిఫిన్ కోసం వెళ్లే క్రమంలో భరద్వాజ్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఆస్తి వివాదం గురించి వారు భరద్వాజ్‌తో చర్చించినట్లు సమాచారం. తనకు పరిచయాలు ఉన్నాయని, న్యాయపరంగా సమస్యను పరిష్కరించి ఆస్తి ఇప్పిస్తానని అతను చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సదరు మహిళకు, భరద్వాజ్‌కు సాన్నిహిత్యం పెరిగింది. ఆమెను విజయవాడకు తీసుకెళ్లి కొద్దిరోజులు అక్కడే ఉండగా.. ఆమె భర్త వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు వారిద్దరినీ తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం సదరు మహిళను హోంకు తరలించగా.. అక్కడికి వెళ్లిన భరద్వాజ్ ఆమెను మళ్లీ తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో కేసు నమోదు కావడంతో భరద్వాజ్ రిమాండ్‌కు వెళ్లి, సుమారు నెల క్రితం బయటకు వచ్చినట్లు సమాచారం. పిలిపించి.. పక్కా స్కెచ్‌తో? సదరు మహిళ భర్త సమీప బంధువు వివాహం ఇటీవల జరగడంతో స్థానిక బళ్లారిరోడ్డులోని లలితానగర్ ఆరాధ్య హోమ్స్‌లో భార్యాభర్తలు కొద్దిరోజులుగా ఉంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే భరద్వాజ్ శనివారం రాత్రి అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా కొడవళ్లతో నరికి, తలపై రాయితో మోదారు. కుడిచేయిని మోచేయి వరకు తెగిపోయేలా నరికారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న భరద్వాజ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా.. అతన్ని సదరు మహిళ ఫోన్ చేసి పిలిపించిందా? లేక ముందస్తు ప్రణాళికలో భాగంగానే అక్కడికి రప్పించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారి విచారణలో హత్యకు దారితీసిన అసలు కారణాలు, ఘటన వెనుక ఉన్న వ్యక్తులు బయట పడే అవకాశముంది. భరద్వాజ్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం పోలీసుల అదుపులో నలుగురు? టిఫిన్ సెంటరులో పరిచయం.. వివాహేతర సంబంధమే కారణమా? -
మోయలేని భారం
కిరాణా సరుకుల ధరలు చుక్కలు చూపుతున్నాయి. పంచదార కిలోపై రూ.30 పెరిగితే, పప్పు, ఉప్పు, బెల్లం, ఆయిల్ ఇతర వస్తువులన్నీ మండిపోతున్నాయి. మార్కెట్లో ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాట, బీన్స్ ఇలా ఏది చూసినా కిలో రూ.40 పైనా పలుకుతున్నాయి. ఇది సామాన్యులపై తీరని భారం పడుతుంది. – పొరాళ్ల శివకుమార్, రాయదుర్గం ధరలు నియంత్రించాలి రూ.500 వెచ్చించినా కూరగాయలు బ్యాగు నిండని పరిస్థితి. సరైన వర్షాలు లేక కూరగాయలు ఆశించిన స్థాయిలో మార్కెట్‌కు రావడం లేదు. ఉల్లి అయితే కిలో రూ.70కి చేరింది. మిగిలిన సరుకుల ధరలు కూడా షాక్ కొడుతున్నాయి. ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించాలి. – శివశంకరమ్మ, బొమ్మనహాళ్ -
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా : 40,81,148 మంది కుటుంబాలు : 9,68,160
రాయదుర్గం: నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో సామాన్యుల బడ్జెట్ తలకిందులవుతోంది. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో సతమతమవుతున్న పేద, సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలకు తాజా ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. మరోవైపు శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్ జోరందుకుంది. మార్కెట్‌కు వెళ్లి ధరలు చూసిన వినియోగదారులు ‘ఇంత పెరిగాయేంటి’ అంటూ బెంబేలెత్తిపోతున్నారు. గత వారంతో పోల్చుకుంటే కిలో చక్కెర హోల్ సేల్‌లో రూ.42 ఉండగా, ప్రస్తుతం రూ.72కి చేరింది. కిరాణా కొట్టులో బియ్యం, పప్పు, ఉప్పు, బెల్లం, ఆయిల్ ఇలా ఏది కొనాలన్నా ధరలు బెంబే లెత్తిస్తున్నాయి. 25 కిలోల సన్న బియ్యం బస్తా రూ.1800కు చేరింది. ఎల్–నినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులను సాకుగా చూపుతూ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారు. గత నెలలో రూ.145 ఉన్న పామాయిల్ ప్యాకెట్ ధర ఇప్పుడు రూ.155కు చేరింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.180 నుంచి రూ.200 వరకు పెరిగింది. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఎక్కువ శాతం తీపి వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో పంచదార (చక్కెర) ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నలుగురు సభ్యులున్న కుటుంబం నెల ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే బియ్యంపై రూ.200 నుంచి రూ.400, పప్పులపై రూ.100 నుంచి రూ.300 వరకు అదనపు భారం మోయాల్సి వస్తోంది. ఇక కూరగాయల ధరలు సైతం కొండెక్కి కూర్చున్నాయి. ఉల్లి మొదలు వెల్లుల్లి, టమాట, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ, ఆఖరికి కాకర వరకు కిలో రూ.40 పైమాటే. ఉల్లి అయితే మరింత ఘాటెక్కి కిలో రూ.70కి చేరింది. ఈ లెక్కన నెలకు రూ.2వేల వరకు భారం పెరిగింది. గ్యాస్, పెట్రోల్ కలిపి లెక్కిస్తే నెలకు చిన్న కుటుంబమైనా రూ.3 వేలు ఖర్చులు అదనంగా వస్తున్నాయి. అదనపు భారం రూ.290.44 కోట్లకు పైనే.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 40,81,148 జనాభా, 9,68,160 కుటుంబాలు ఉన్నాయి. పెరిగిన నిత్యావసర ధరల దృష్ట్యా సగటున ప్రతి కుటుంబంపై రూ.3 వేల చొప్పున అదనపు బడ్జెట్ లెక్కిస్తే రూ.290.44 కోట్ల భారం పడనుంది. జిల్లాలో స్వీట్ బేకరీ నిర్వాహకులు 3 వేల మందికి పైగా ఉంటారు. స్వీట్ల తయారీకి ఎక్కువ భాగం పంచదార వినియోగిస్తారు. రోజూ వంద క్వింటాళ్లకు తక్కువ కాకుండా ఈ బేకరీల్లో చక్కెర పాకం పడుతారు. కిలో రూ.42 నుంచి రూ.72 అంటే రూ.30 అదనంగా పెరిగింది. ఈ లెక్కన వంద క్వింటాళ్ల వినియోగానికి రూ.3 లక్షలు భారం మోయాల్సి వస్తోందని బేకరీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బెల్లం ధరలు కూడా నియంత్రణలోకి రావడం లేదు. చేదెక్కిన చక్కెర.. ఘాటెక్కిన ఉల్లి మండిపోతున్న నిత్యావసర ధరలు తలకిందులవుతున్న వంటింటి బడ్జెట్ 25 కిలోల సన్న బియ్యం బస్తా రూ.1800 వంట నూనె ప్యాకెట్ రూ.155, ఇతర వస్తువులదీ అదేదారి కూరగాయల రేట్లు కూడా అంతే.. సామాన్య, మధ్య తరగతి ప్రజల బెంబేలు నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోయింది. జిల్లా స్థాయిలోనూ ధరల నియంత్రణ కమిటీ ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై సమీక్ష జరపాలి. కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వైస్ చైర్మన్‌గా జేసీ, కన్వీనర్‌గా జిల్లా పౌరసరఫరాల అధికారి ఉంటారు. సభ్యులుగా తూనికలు, కొలతలు, మార్కెటింగ్, రవాణాశాఖ అధికారి ఉంటారు. ప్రతి నియోజకవర్గంలోనూ వ్యాపారులు బియ్యం, పప్పులు, నూనె, పంచదార, బెల్లం ఇతర నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు అమాంతం పెంచేస్తూ నడ్డి విరుస్తున్నా ధరల నియంత్రణపై ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదని సామాన్యులు పెదవి విరుస్తున్నారు. ధరల నియంత్రణ ఏదీ? -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజాసమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. అలాగే భూసమస్యలకు సంబంధించిన అర్జీలను రెవెన్యూ క్లినిక్‌లో అధికారులకు అందజేయాలన్నారు. అర్జీ పరిష్కార స్థితిని కాల్ సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని తెలిపారు. వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ఉరవకొండ: రాయంపల్లిలో నెరమెట్ల, రాయంపల్లి, వ్యాసాపురం గ్రామాల ప్రజల ఆరాధ్య దైవం పర్వతేశ్వరస్వామి ఆలయం ఎదురుగా 18 అడుగుల శివలింగం, నందీశ్వరుని విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఉదయం గోపూజ, హోమాలు, ప్రత్యేక అభిషేకాలు తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శివలింగం, నందీశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మహాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, పాల్తూరు కల్లుహోళ్ల మఠం పీఠాధిపతులు చెన్నవీరశివాచార్య మహాస్వామి, కొక్కరచేడు గురుసేవాశ్రమం గురుచరణానందగిరి మాతాజీల అధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి బెళుగుప్ప: అతివేగంగా ఆర్టీసీ బస్సు నడుపుతున్నాడంటూ డ్రైవర్‌పై ఓ ద్విచక్రవాహనదారుడు దాడికి పాల్పడ్డాడు. ఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం విరుపాపల్లి మీదుగా వెళ్తోంది. ఆ వెనకే ఓ వ్యక్తి బైకుపై వేగంగా వచ్చి బస్సును ఆపాడు. బస్సును ఎందుకు అతివేగంగా తోలుతున్నావంటూ అసభ్యపదజాలంతో దూషించడమే కాకుండా దాడికి పాల్పడ్డాడు. కండక్టర్ లలిత, ప్రయాణికులు సర్దిచెప్తున్నా వినలేదు. అనంతరం డ్రైవర్ బస్సును నేరుగా బెళుగుప్ప పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి.. తనపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేశాడు. హంద్రీ–నీవా కాలువలోకి దూకిన దంపతులు ● భార్య మృతి.. భర్త గల్లంతు గుంతకల్లుటౌన్: జీవితంపై విరక్తితో వృద్ధ దంపతులు హంద్రీ–నీవా కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో భార్య మృతదేహం లభ్యం కాగా.. గల్లంతైన భర్త కోసం గాలింపు చేపట్టారు. పోలీసుల కథనం మేరకు... కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బెలడోణ గ్రామానికి చెందిన సోమలింగమ్మ (60), సీతానంద(64) దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరు కుమారుడు నారాయణ వద్ద ఉంటున్నారు. వీరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం గుంతకల్లులో ఆస్పత్రికి వెళ్తున్నామని ఇంటి నుంచి వచ్చిన వీరు బస్సులో కసాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి హంద్రీ–నీవా కాలువ వద్దకు వెళ్లి నీటిలో దూకారు. నీటిలో తేలియాడుతున్న సోమలింగమ్మను స్థానికులు గమనించి రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. నీటిలో గల్లంతైన సీతానంద కోసం గాలింపు చేపట్టారు. దంపతులు అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కసాపురం ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. -
అన్నాభిషేకానికి పోటెత్తిన భక్తజనం
ఆత్మకూరు: శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలోని శ్రీ సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర, మంజునాథ స్వామి వారికి అన్నాభిషేకం నిర్వహించారు. మొదట స్వామి వారికి పాలాభిషేకం, పంచామృతాభిషేకాలు చేశారు. ఆకుపూజ నిర్వహించి.. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. స్వామి వారి స్వర్ణముఖ కవచానికి ఆలయం చుట్టూ పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున కాలసర్పదోష నివారణ, రాహుకేతు హోమాలను చేపట్టారు. స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి గంటల సమయం పట్టింది. -
పెరుగు ప్యాకెట్‌కు వచ్చి నగదు అపహరణ
పెనుకొండ రూరల్ (సోమందేపల్లి): పెరుగు ప్యాకెట్ కోసం వచ్చిన వ్యక్తులు దుకాణంలో నగదు అపహరించారు. ఈ ఘటన సోమందేపల్లిలోని ఇండియన్ పెట్రోల్ బంకు సమీపంలోని మదర్ డెయిరీలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మదర్ డెయిరీ యజమాని చరణ్ దుకాణంలో చిన్న పిల్లలను ఉంచి పనిపై బయటకు వెళ్లాడు. దీన్ని గమనించిన బుల్లెట్ ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు అగంతకులు వంద రూపాయల నోటు ఇచ్చి పెరుగు ప్యాకెట్ ఇవ్వాలని చిన్నారులను కోరారు. పెరుగు ప్యాకెట్ ఇచ్చిన తర్వాత గల్లా పెట్టెలోని చిల్లరను చిన్నారులు తీసి ఇచ్చే క్రమంలో వారిని ఏమార్చి అందులోని పదివేల రూపాయల నగదును అపహరించారు. దుకాణానికి తిరిగి వచ్చిన తర్వాత యజమాని గమనించి చిన్నారులను ఆరా తీశాడు. ఇద్దరు వ్యక్తులు వచ్చి ‘ఆ నోటు బాగలేదు..ఈ నోటు బాగలేదు’ అంటూ తమను ఏమార్చిన విషయాన్ని తెలిపారు. వారే నగదు అపహరించి ఉంటారని నిర్ధారణకు వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వ్యక్తి ఆత్మహత్య పామిడి: పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన భాస్కర్ (33) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. భాస్కర్ గతంలో నైటీల కటింగ్ వర్క్ చేస్తూ భార్య, కుమారున్ని పోషించేవాడు. అయితే..కొంతకాలంగా మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. విసిగి వేసారిన భార్య వినీత రెండేళ్ల క్రితం తన తొమ్మిదేళ్ల కుమారుడు బాబును తీసుకుని పుట్టినిల్లు అయిన పెద్దవడుగూరు మండలం ముప్పాలగుత్తికి చేరుకుంది. దీంతో ఒంటరైన భాస్కర్ జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి పామిడి పోలీసుస్టేషన్‌కు సమీపంలోని గదిలో ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అతన్ని స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది ధ్రువీకరించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో లారీడ్రైవర్ మృతి కదిరి అర్బన్: మండల పరిధిలోని యర్రదొడ్డి టోల్గేట్ సమీపంలో కదిరి– అనంతపురం ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీడ్రైవర్ గణేశన్ (63) మృతిచెందాడు. కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపిన మేరకు...టోల్గేట్ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని అనంతపురం వైపు నుంచి తమిళనాడుకు వెళ్తున్న లారీ అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన లారీడ్రైవర్ గణేశన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రైలు నుంచి జారిపడి యువకుడి మృతి కనగానపల్లి: చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి సమీపంలో ఆదివారం ఒక యువకుడు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. హిందూపురం రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ లావణ్య తెలిపిన వివరాల మేరకు... ధర్మవరం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ప్యాదిండి వద్ద రైల్వే ట్రాక్ పక్కన ఒక యువకుడి మృతదేహం ఉందని స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ధర్మవరం పట్టణం ఇందిరానగర్‌కు చెందిన హర్షవర్ధన్ (21)గా గుర్తించారు. మగ్గం పనులు నేర్చుకుంటున్న ఈ యువకుడు శనివారం సాయంత్రం బయటకు వెళ్తున్నానని తల్లి కాంతమ్మకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. తర్వాత ధర్మవరం నుంచి రైలులో ఎక్కడికో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి ఉండొచ్చునని మృతుడి బంధువులు తెలిపారు. హిందూపురం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపడుతున్నారు. కర్ణాటక వాసి దుర్మరణం హిందూపురం టౌన్: హిందూపురం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపురం–పెనుకొండ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఇతను కర్ణాటక రాష్ట్రం హవేరి తాలుకా బసాపూర్ గ్రామానికి చెందిన అరుణ్ చావడిగా గుర్తించారు. హిందూపురం రైల్వే ఎస్ఐ లావణ్య తెలిపిన మేరకు.. రైల్వే కి.మీ 11/000–11/100 వద్ద రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహాన్ని శనివారం ఆన్ డ్యూటీ కీమ్యాన్ తిరుపాల్ నాయక్ గుర్తించారు. హిందూపురం రైల్వే స్టేషన్ మాస్టర్ ద్వారా రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 25–30 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తి రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో మృతి చెందినట్లు గుర్తించారు. మృతుని తలకు తీవ్ర గాయం కావడంతో పాటు శరీరంపై పలు గాయాలు ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయగా మృతుడు కర్ణాటకవాసిగా తేలింది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. -
ఆశలు అడియాసలు
విడపనకల్లు: ఓ వైపు ఎల్–నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు హెచ్చెల్సీ ద్వారా గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) కింద ఆయకట్టుకు నీరు వదలడం లేదు. ఈ పరిస్థితుల్లో విడపనకల్లు మండలం ఎన్.తిమ్మాపురం గ్రామానికి చెందిన హంపేష్ అనే రైతు బోరు కింద వస్తున్న అరకొర నీటితోనే నెలన్నర కిందట ఐదు ఎకరాల విస్తీర్ణంలో మిరప సాగు చేశాడు. అయితే ఇప్పుడు ఆ పంటకు విల్టు రోగం సోకింది. వైరస్‌తో మొక్క వాడిపోయి బూడిదరంగులోకి మారిపోవడం.. దిగుబడి గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉండటంతో చేసేది లేక రైతు ఆదివారం ట్రాక్టర్‌తో పంటను దున్నేశాడు. దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. -
17 ఏళ్లుగా ఇన్చార్జ్ ప్రిన్సిపాళ్లే దిక్కు!
మడకశిర: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలకు 17 ఏళ్లుగా ఇన్చార్జ్ ప్రిన్సిపాళ్లే దిక్కుగా మారారు. నేటికీ ప్రభుత్వం ప్రిన్సిపాల్ పోస్టులను మంజూరు చేయలేదు. రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు లేకపోవడంతో ఆ కళాశాలల నిర్వహణ అంతంతగానే మారింది. 2008లో ఏర్పాటు.. అనంతపురం, మడకశిరలో రెండు ఒకేషనల్ జూనియర్ కాలేజీలున్నాయి. 2008లో ఇవి ఏర్పాటయ్యాయి. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఆ కళాశాలలకు ప్రిన్సిపాల్ పోస్టులు మంజూరు కాలేదు. దాదాపు 17 ఏళ్ల నుంచి ఇన్చార్జ్ ప్రిన్సిపాళ్ల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. దీంతో కళాశాలల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందన్న విమర్శలున్నాయి. ప్రిన్సిపాల్ పోస్టులను మంజూరు చేయాలని అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులు కోరుతున్నా... పాలకులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. కోర్సులకు పెరుగుతున్న ఆదరణ.. జిల్లాలో ఒకేషనల్ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. ప్రధానంగా ఒకేషనల్ కోర్సులను పూర్తి చేసుకుని చాలా మంది విద్యార్థులు స్వయం ఉపాధి పొందడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఒకేషనల్ కళాశాలల్లో ఎంఎల్టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, డీటీ, సెరికల్చర్, సీటీ, ఈటీ, ఈఈటీ, ఎఫ్‌జీఎం, ఎంఅండ్ ఏటీ, బీఅండ్ ఆర్ఎం, సీఎస్ తదితర కోర్సులను నిర్వహిస్తున్నారు. రెండేళ్లలో ఈకోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. దీంతో ఈకోర్సులకు డిమాండ్ నెలకొంది. మడకశిర ఒకేషనల్ కళాశాలలో 11 కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మడకశిర కళాశాలలోనే దాదాపు 550 మంది విద్యార్థులు వివిధ కోర్సులు చేస్తున్నారు. 25 ఒకేషనల్ కళాశాలలు మంజూరు.. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ఉన్నప్పుడు 25 ఒకేషనల్ కళాశాలలను మంజూరు చేశారు. ప్రస్తుతం ఏపీలో 12 ఒకేషనల్ కళాశాలలు ఉన్నాయి. మడకశిర, అనంతపురంలోని కళాశాలలు కూడా వైఎస్సార్ హయాంలో మంజూరైనవే. స్వయం ఉపాధి కల్పించడానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చి కళాశాలలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈకళాశాలల్లో రెండేళ్ల కోర్సులను పూర్తి చేసుకున్న అనేక మంది విద్యార్థులు స్వయం ఉపాధి పొందుతున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈకళాశాలల నిర్వహణను గాలికొదిలేసింది. ప్రిన్సిపాల్ పోస్టులను మంజూరు చేయకుండా కాలయాపన చేస్తోంది. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ కూడా ప్రిన్సిపాల్ పోస్టుల మంజూరులో నిర్లక్ష్యం వహిస్తుండటం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం ఒకేషనల్ కళాశాలలకు ప్రిన్సిపాల్ పోస్టులను మంజూరు చేసి విద్యాభివృద్ధికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే కళాశాలల్లో విద్యాప్రమాణాలు తగ్గి విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. నేటికీ ఒకేషనల్ కళాశాలలకు మంజూరు కాని ప్రిన్సిపాల్ పోస్టులు 2008లో ఉమ్మడి అనంతపురం జిల్లాకు రెండు కళాశాలలు మంజూరు ప్రిన్సిపాల్ పోస్టుల మంజూరును పట్టించుకోని ప్రభుత్వం -
విద్యార్థుల హక్కులు అణచివేస్తే ఉద్యమాలే
● ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ అనంతపురం ఎడ్యుకేషన్/అనంతపురం కల్చరల్ : విద్యావ్యవస్థను ప్రైవేటీకరిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో వ్యాపారం చేస్తున్న పాలకుల విధానాలను ప్రశ్నించాలని ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షురాలు ఐషీ ఘోష్ పిలుపునిచ్చారు. విద్యార్థుల హక్కులను అణిచివేస్తే సమరశీల ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు. అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్లో శనివారం నిర్వహించిన ‘జెన్–జీ’ బహిరంగ సభలో ఆమె ముఖ్య వక్తగా ప్రసంగించారు. 12 ఏళ్లుగా పాలకుల విధానాలతో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగం, పోటీ పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలపై పేరుకుపోయిన ఆగ్రహానికి జంతర్ మంతర్ ఉద్యమం ప్రతిరూపమన్నారు. నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు విద్యార్థుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఐషీ ఘోష్ ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్, ప్రసన్నకుమార్, ఓతూరు పరమేష్, జిల్లా అధ్యక్షుడు తరిమెల గిరి, వైఎస్సార్ కడప జిల్లా కార్యదర్శి రవి, సత్యసాయి జిల్లా కార్యదర్శి నాగార్జున, నాయకులు పాల్గొన్నారు. జవాబుదారీతనం వచ్చేంత వరకూ పోరు కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారి తనం వచ్చే వరకూ పోరు ఆగదని ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ అన్నారు. శనివారం స్థానిక లలిత కళాపరిషత్‌లో విశ్వ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మేధావులతో ముఖాముఖి కార్యక్రమం ఆలోచనాత్మకంగా సాగింది. జెన్ జీ ఉద్యమ నేపథ్యంలో అనంతకొచ్చిన ఐషీ ఘోష్ మాట్లాడుతూ యువత చేసిన ఉద్యమంలో నిబద్దత ఉంది కాబట్టే కేంద్ర విద్యామంత్రి దిగొచ్చారని గుర్తు చేశారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, విశ్వ విజ్ఞాన కేంద్రం ప్రతినిధి రాజ్ మోహన్ మాట్లాడారు. ఆర్ట్స్ కళాశాలలో జరిగిన ఎస్ఎఫ్ఐ సమావేశంలో మాట్లాడుతున్న ఐషీ ఘోష్, హాజరైన విద్యార్థులు -
అనంతపురం ఎడారిగా మారబోతోంది!
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాకు గతేడాది 52 టీఎంసీల నీటిని తెచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు, అధికారులు.. ఈసారి పరిస్థితిని ముందే ఎందుకు అంచనా వేయలేకపోయారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. ఎల్–నినో ప్రభావం ఉంటుందని, భవిష్యత్తులో వర్షాలు తగ్గే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నప్పటికీ గతేడాది నీటిని సద్వినియోగం చేసుకోలేదన్నారు. రానున్న రోజుల్లో అనంతపురం జిల్లా ఎడారిగా మారబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కాలువ గట్లపై పోలీసు పహారా కాస్తున్నారని, రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లు, పైపులైన్లు తొలగిస్తున్నారని, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కుప్పం ప్రాంతంలోని చెరువులన్నీ నిండే వరకు అనంతపురం జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందించే పరిస్థితి లేదన్నారు. కాంక్రీట్ లైనింగ్ పేరుతో దోపిడీ హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ పేరుతో రూ.4 వేల కోట్ల దోపిడీ జరిగిందని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. లైనింగ్ పూర్తయినా చిత్తూరు జిల్లాలో 50 శాతం నీరు లాస్ కింద పోతోందన్నారు. ‘కాలువకు కాంక్రీట్ వేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. లైనింగ్ వేయడం మానవ తప్పిదం’ అని అన్నారు. టీడీపీ అంటే దోపిడీ, దౌర్జన్యాల పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. పేరూరు డ్యాంకు నీళ్లెందుకు ఇవ్వలేదు? పేరూరు బ్రాంచ్ కెనాల్‌కు ఒక టీఎంసీ నీళ్లు ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020లోనే జీఓ ఇచ్చారని, ఆయన హయాంలో మూడేళ్లు పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చామని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు చుక్కనీరు లేక చుట్టుపక్కల వేలాది బోర్లు ఎండిపోతున్నాయన్నారు. ‘వెయ్యి అడుగుల మేర తవ్వినా నీళ్లు పడలేదని స్వయంగా ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీలో చెప్పారన్నారు. ‘రెండేళ్లు చుక్క నీరు ఇవ్వకుండా పేరూరు డ్యాంకును ఎండబెట్టింది మీరు కదా? ఆ పాపం మీది కాదా?’ అంటూ పరిటాల సునీతను ప్రశ్నించారు. జీడిపల్లి–అప్పర్ పెన్నార్ ప్రాజెక్టును 2028లో పూర్తి చేస్తామని చెబుతున్నారని, అప్పటివరకు ప్రజలు తాగునీటికి ఏం చేయాలని నిలదీశారు. చంద్రబాబు నిర్వాకం వల్ల రానున్న ఆరు నెలల్లో జిల్లాలో 50 శాతం మంది ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే జిల్లా ఎడారిగా మారుతుందని ప్రకాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడులో మళ్లీ పాత సంస్కృతి రాప్తాడు నియోజకవర్గంలో మళ్లీ పాత సంస్కృతిని తెరపైకి తెస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. పేరూరు డ్యాంకు నీళ్లు విడుదల చేయకపోతే ఆరు మండలాల ప్రజలు ఎమ్మెల్యే సునీత ఇంటిముందు ధర్నా చేస్తారన్నారు. పీఏబీఆర్ నుంచి పాపంపేట వరకు తాగునీటి పనులు పూర్తి చేయకపోతే ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాల ప్రజలు మీ ఇంటివద్ద ధర్నా చేస్తారన్నారు. అలాగే జీడిపల్లి–అప్పర్‌పెన్నార్ ప్రాజెక్ట్‌కు సంబంధించి రైతులకు భూ సేకరణ బకాయిలు విడుదల చేయకపోతే బాధితులు మీ ఇంటిముందు ఆందోళన చేపడతారని హెచ్చరించారు. మొదటి హెచ్చరికగా సంబంధిత ఎస్ఈ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తారని, అప్పటికీ స్పందించకపోతే ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాలు చేస్తారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు చంద్రకుమార్, మారుతీప్రసాద్, నాగార్జున, వైస్ ఎంపీపీ రామాంజనేయులు, నాయకులు బద్దలాపురం పెద్దిరెడ్డి, మీనుగ నాగరాజు, పాపంపేట ప్రసాద్‌రెడ్డి, భానుకోట శివ, నెమలివరం శీనా, సుధాకర్, ప్రణీల్‌రెడ్డి పాల్గొన్నారు. గతేడాది 52 టీఎంసీలు ఇచ్చామన్నారు.. ఈసారి చుక్క నీరివ్వలేరా? ఆరు నెలల్లో 50 శాతం మంది ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి పేరూరు డ్యాంకు నీళ్లివ్వకపోతే ఎమ్మెల్యే ఇంటి ముందు ప్రజల ధర్నా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి -
రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి
అనంతపురం: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైఎస్సార్సీపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రేటర్ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సాధన టాస్క్‌ఫోర్స్ రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అధ్యక్షతన జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. పార్టీ పీఏసీ సభ్యులు వై.విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్య, జిల్లా టాస్క్ ఫోర్స్ కో ఆర్డినేటర్ నార్పల సత్యనారాయణరెడ్డి, ఐటీ విభాగం జోనల్ కోఆర్డినేటర్ మంజునాథ్ యాదవ్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణా, తుంగభద్ర జలాలను తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. తాగునీటితో పాటు సాగునీరు, పశువులకు అవసరమైన నీరు అందించడం కూడా ప్రభుత్వ బాధ్యతే అని స్పష్టం చేశారు. తాగునీటికే పరిమితం చేస్తే ఇప్పటికే వర్షాభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాయలసీమకు, ముఖ్యంగా అనంతపురం జిల్లాకు కృష్ణా–తుంగభద్ర జలాల్లో రావాల్సిన న్యాయమైన వాటా, నీటి విడుదల, అవసరమైన సాగునీటి కేటాయింపులు కచ్చితంగా దక్కేలా ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒత్తిడి తీసుకురావడంపై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు రాయలసీమ సాగునీటి హక్కుల కోసం శాసీ్త్రయ ఆధారాలతో, వాస్తవ గణాంకాలతో ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. సాగునీటి సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి ప్రజలకూ అవగాహన కల్పించాలి వైఎస్సార్సీపీ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో నిర్ణయం -
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. ఉక్కపోత పెరిగింది. వాయువ్య దిశగా గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
నేడు చంద్రబాబు రాక అనంతపురం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం అనంతపురం రానున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు కుమారుడు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె వివాహం స్థానిక బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలులో జరగనుంది. ఈ వివాహానికి సీఎం మధ్యాహ్నం ఒంటి గంటకు హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పటిష్ట బందోబస్తు అనంతపురం సెంట్రల్: సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. శనివారం పోలీసు కార్యాలయ ఆవరణలో బందోబస్తుకు హాజరయ్యే పోలీసులకు ఆయన పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్ నుంచి కల్యాణమంటపం వరకు సీఎం ప్రయాణించే మార్గాల్లో భద్రతా లోపాలు తలెత్తకుండా గట్టి బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపు, రూట్ బందోబస్తు, హెలిప్యాడ్ వద్ద భద్రతపై పలు సూచనలు చేశారు. అనంతరం సీఎం కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. కసాపురానికి పోటెత్తిన భక్తజనం గుంతకల్లు రూరల్: శ్రావణ మాస మూడో శనివారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. రాత్రి సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్లను గజ వాహనంపై కొలువదీర్చి ఈఓ మేడేపల్లి విజయరాజు, ఏఈఓ వెంకటేశ్వర్లు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ హుస్సేన్ సూచించారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఎస్జీఎఫ్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదు పాఠశాలలకు క్రీడా ప్రతిభ అవార్డులు అందించారు. శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక ఉపాధ్యాయ భవన్లో కార్యక్రమం నిర్వహించారు. డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు. డీఈఓ మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకొని క్రమశిక్షణ, దేశభక్తిని అలవర్చుకొని క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చదువుతోపాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. డీవైఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ పాఠశాలల్లో కొందరు విద్యార్థులను మాత్రమే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపే విధానం కాకుండా ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గుత్తి డీవైఈఓ లక్ష్మన్న, ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాసులు, శకుంతల, ఏపీఎస్‌ఏపీఈ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి, పీడీ, పీఈటీ జిల్లా కార్యదర్శి సిరాజుద్దీన్, ఐదు పాఠశాలల హెచ్ఎంలు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
భార్యపై అనుమానంతో భర్త పైశాచిక దాడి
బెళుగుప్ప: మండలంలోని గంగవరంలో భార్యపై అనుమానంతో మారణాయుధాలతో పైశాచికంగా దాడి చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన భానుకు కణేకల్లుకు చెందిన యాశిన్తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఖాజీమ్, ముజీమ్ అనే ఇద్దరు కుమారులు సంతానం. యాశిన్ బేల్దారి పనులు చేస్తూ జీవనం సాగించే వాడు. భార్యపై అనుమానంతో చిత్రహింసలు పెట్టడంతో పోలీసులు, బంధువులు పంచాయితీలు చేశారు. ఇదే క్రమంలో కణేకల్లు నుంచి గంగవరం వచ్చి ఇంటిని అద్దెకు తీసుకొని జీవనం సాగించేవారు. అయినా కూడా మట్కా, జూదం వ్యసనాలకు లోనైన యాసిన్ పద్ధతి మార్చుకోక పోగా భార్యపై అనుమానం మరింత పెంచుకున్నాడు. శనివారం తెల్లవారుజామున మారణాయుధంతో మెడ చుట్టూ పొడిచి, రోకలిబండతో ముఖాన్ని ఛిద్రం చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె కుప్పకూలి పడిపోవడంతో నిందితుడు పారిపోయాడు. స్థానికులు గ్రహించి తొలుత కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్సకు అనంతపురం తరలించారు. ఘటనపై బాధిత మహిళ భాను సోదరుడు మస్తాన్‌వలీ ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
ఇంటి తలుపు పెకలించి చోరీ
రాయదుర్గంటౌన్: పట్టణంలోని అనంతపురం రహదారి ఆర్టీసీ డిపో ఎదురుగా ఈశ్వర్‌నగర్ 3వ క్రాస్‌లో నివాసం ఉంటున్న ఫొటోగ్రాఫర్ ఆనంద్ ఇంట్లో చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటి తలుపును దుండగులు పెకలించి లోపలికి ప్రవేశించి, బీరువాలోని రూ.30 వేల నగదు, 20 గ్రాముల బంగారు నగలు, 50 గ్రాముల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. యజమాని ఆనంద్ కర్ణాటకలోని కుడితిని గ్రామానికి వెళ్లి శనివారం ఇంటికొచ్చి చూస్తే తలుపులు తీసి ఉన్నాయి. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యార్థినిపై హత్యాయత్నం కేసు విచారణ పెద్దవడుగూరు : మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని హర్షిత అనే విద్యార్థిని లంచ్ బాక్సులో గుర్తు తెలియని వ్యక్తులు విషపదార్థం కలిపిన విషయం విదితమే. దీనిపై స్పందించిన పోలీసులు సీఐ నరేంద్రరెడ్డి శనివారం పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. బాలిక తల్లిదండ్రులను పిలిచి విచారణ చేశారు. తమకు ఎవరితోనూ ఘర్షణలు, విభేదాలు లేవని విద్యార్థిని తల్లిదండ్రులు సమాధానం ఇచ్చారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
యువకుడి దారుణ హత్య
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ బళ్లారి రోడ్డులో శనివారం రాత్రి దారుణ హత్య జరిగింది. పాపంపేటకు చెందిన ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతన్ని పోలీసులు అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే చనిపోయాడు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. వివరాలు.. అనంతపురం రూరల్ మండలం పాపంపేటకు చెందిన మఠం సోమశేఖర్‌కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మఠం భరద్వాజ్ (30) అలియాస్ భరత్. అవివాహితుడైన భరత్‌పై బళ్లారి రోడ్డులోని లలితానగర్ ఆరాధ్య హోమ్స్ సమీపంలోని గుజరీ దుకాణం పక్కన శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో తలపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో కుడిచేయి మోచేతి వరకు పూర్తిగా తెగిపోయింది. అనంతపురం రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న భరత్‌ను అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు. బళ్లారి రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వివాహితతో భరత్ కొంతకాలంగా సన్నిహితంగా తిరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు లేదా మరెవరైనా దాడికి పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీఐ శ్రీకాంత్‌యాదవ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. -
సాగు లెక్కలపై సందేహాలెన్నో..?
అనంతపురం అగ్రికల్చర్: వర్షాభావం వెంటాడుతున్నా... పంట విత్తుకునేందుకు తేమ లేకున్నా... అదను కాకున్నా... సాగు లెక్కలు పెరుగుతూనే ఉన్నాయి. ఊరూరా నెట్వర్క్ ఉన్నా కచ్చితమైన సాగు గణాంకాలు సేకరించడంలో వ్యవసాయశాఖ విఫలమవుతోంది. 31 మంది ఏఓలు, 50 మంది వరకు ఏఈఓలు, 326 మంది ఆర్ఎస్కే అసిస్టెంట్లతో పాటు అదనంగా పదుల సంఖ్యలో ఎంపీఈఓలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు సాగు చేశారు, ఇంకా ఎంత చేయాల్సి ఉంది, ప్రత్యామ్నాయం ఎంత అవసరం అవుతుందనే వివరాలు తెలుసుకోవడం సులభమైనా... ఆ పని మాత్రం చేయడం లేదు. వందశాతం కచ్చితమైన సమాచారం లేకున్నా 80 శాతం వాస్తవ లెక్కలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. తద్వారా పంటల బీమా కింద పంటల వారీగా ప్రీమియం కట్టించడం, ప్రత్యామ్నాయం, ఇతరత్ర ప్రయోజనాలు వర్తింపజేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయశాఖ వారం వారం విడుదల చేస్తున్న సాగు గణాంకాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలే ఎల్–నినో తీవ్రంగా ఉన్న ఈ ఖరీఫ్‌లో కష్టాల్లో ఉన్న తమకు మేలు జరిగేలా చంద్రబాబు సర్కారు, వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జూలైలోనే 1.50 లక్షల హెక్టార్లలో పంటలు ఈ ఖరీఫ్‌లో జూలై మొదటి వారం ముగిసేనాటికే జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేసినట్లు తెలుస్తోంది. కానీ వ్యవసాయశాఖ మాత్రం 3.43 లక్షల హెక్టార్లకు గాను 16 శాతంతో కేవలం 55 వేల హెక్టార్లు చూపించడం గమనార్హం. ఆ తర్వాత వారం వారం పెంచుకుంటూ వస్తోంది. జూలైలో అక్కడక్కడా కురిసిన తేలికపాటి వర్షాలకు కొంత విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. అయితే వ్యవసాయశాఖ మాత్రం జూన్ 30న 40 వేల హెక్టార్లు చూపించి.... క్రమంగా అంటే జూలై 6న 55 వేల హెక్టార్లు, జూలై 13న 82 వేల హెక్టార్లు, జూలై 27న 1.05 లక్షల హెక్టార్లుగా పేర్కొన్నారు. అంటే ఖరీఫ్‌లో ప్రధాన పంటలైన కంది, వేరుశనగ, పత్తి, ఆముదం, మొక్కజొన్న లాంటి పంటలు విత్తుకునే గడువు జూలై ఆఖరుతో ముగిసింది. ఆగస్టు 3న విడుదల చేసిన నివేదికలో 40 శాతంతో 1.40 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేసినట్లు తెలిపారు. అంతటితో ఆగకుండా ఈ నెల 10న 1.70 లక్షల హెక్టార్లు, 17న 1.88 లక్షల హెక్టార్లు... తాజాగా విడుదల చేసిన సాగు లెక్కల ప్రకారం 60 శాతంతో 2.08 లక్షల హెక్టార్లకు చేర్చారు. తేలికపాటి వర్షాలకు వాస్తవంగా వారానికి 2 నుంచి 3 వేల హెక్టార్లు పెరిగే అవకాశం ఉన్నా... వారం వ్యవధిలోనే 20 వేల నుంచి 30 వేల హెక్టార్లకు పెంచడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘ప్రత్యామ్నాయాని’కి కొర్రీలే సాగు గణాంకాలు 60 శాతానికి చేరుకోవడంతో ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళికకు కొర్రీలు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఉలవ, పెసర, అలసంద, కంది, కొర్ర, జొన్న తదితర విత్తనాలు 40 వేల క్వింటాళ్లకు 80 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించినా.. ప్రస్తుతానికి 31 వేల క్వింటాళ్లకు కుదించారు. ఇప్పుడు మళ్లీ ఇందులో సగానికి పైగా కొర్రీలు వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఉలవ, కొర్రలు 10 వేల నుంచి 12 వేల క్వింటాళ్లు పంపిణీ చేసినా బాగా చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది. ఈ–క్రాప్ కొనసాగుతున్నందున ఇంకా సాగు లెక్కలు పెరిగే పరిస్థితి ఉన్నందున ‘ప్రత్యామ్నాయం’ మరింత తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. తాజాగా 2.08 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు వాస్తవంగా జూలై మొదట్లోనే 1.50 లక్షల హెక్టార్లలో సాగు కానీ అధికారికంగా చూపించింది 55 వేల హెక్టార్లు మాత్రమే ఊరూరా నెట్వర్క్ ఉన్నా సరైన సాగు లెక్కలు రాని దుస్థితి ఇప్పుడు ఉలవలు, కొర్రలతో సరిపెడుతున్న ‘ప్రత్యామ్నాయం’ -
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
అనంతపురం సెంట్రల్: ధ్యాస మళ్లించి ప్రయాణికులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుత్తి, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 60 లక్షలు విలువజేసే బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీసు కాన్ఫరెన్స్‌హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జగదీష్ వివరాలు వెల్లడించారు. రాయదుర్గం మారెమ్మగుడి వీధికి చెందిన ఎరుకల రమణమ్మ, ఎరుకల గంగమ్మ, ఎరుకల సుంకమ్మ, డి.హీరేహాళ్ మండలం మురడికి చెందిన ఆనంద్, రాయదుర్గంలోని కనేకల్రోడ్డుకు చెందిన ఎరుకల సుంకమ్మ, గుత్తిలోని జెడ్ వీరారెడ్డి కాలనీకి చెందిన వనార్చి చిట్టెమ్మలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 40 తులాలు బంగారు, 100 గ్రాములు వెండి, రూ.1.49 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో వనార్చి చిట్టెమ్మ బ్యాగు లిఫ్టింగ్ నేరాల్లో సిద్ధహస్తురాలు. ఇటీవల టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన ముఠాలోనూ పట్టుబడింది. ఆర్టీసీ బస్టాండ్లు, రద్దీ ప్రాంతాలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని, వారి వద్ద ఉన్న విలువైన బ్యాగులను చాకచక్యంగా అపహరించేవారు. ప్రయాణికుల్లా నటిస్తూ, వారికి ఆటంకం కలిగిస్తూ ధ్యాస మళ్లించి బ్యాగులు, పర్సులు, హ్యాండ్ బ్యాగుల్లో ఆభరణాలు దోచుకునేవారు. నిందితులందరూ ఒకరికొకరు పరిచయస్తులు, బంధువులు కావడం గమనార్హం. నిందితులపై గుత్తి పోలీసుస్టేషన్లో 11 కేసులు, అనంతపురం త్రీటౌన్, ఉరవకొండ పోలీసుస్టేషన్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 13 కేసులు నమోదయ్యాయి. నిందితుల అరెస్ట్‌లో ప్రతిభచూపిన గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, గుత్తి సీఐ రామారావు, సీసీఎస్ సీఐలు శేషగిరి, జయపాల్‌రెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
అక్షరమై వెలుగు
భావ వ్యక్తీకరణకు సులభమైన, సులక్షణమైన మార్గం అమ్మభాష తెలుగు. సంస్కృతంలోని తియ్యదనం, తమిళంలోని అమృతం, కన్నడంలోని సుమధుర పరిమళం కలగలిసిన కమ్మనైన భాష. తెలుగు భాషలోని మాధుర్యాన్ని, తేనెలొలుకు తీపి పలుకుల సోయగాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. అమ్మ భాష తెలుగు.. అనంతపురం ఎడ్యుకేషన్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మాట్లాడే భాషగా, గొప్ప సాహిత్య సంపదను కలిగిన భాషగా తెలుగు ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే మారుతున్న జీవనశైలి, ఆంగ్ల భాష ప్రభావం, సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న ఇతర భాషల వినియోగం నేపథ్యంలో తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగింది. తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల వ్యవహారిక భాషలోనే విద్య, పాలన, సాహిత్యం కొనసాగాలని గిడుగు చేసిన ఉద్యమం తెలుగు భాష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇంటి నుంచే మొదలు కావాలి తెలుగు భాష పరిరక్షణ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకూడదు. పిల్లలతో తల్లిదండ్రులు తెలుగులో మాట్లాడటం, ఇంట్లో తెలుగు పుస్తకాలు చదివించడం, తెలుగు కథలు చెప్పడం ద్వారా భాషపై చిన్నారుల్లో ఆసక్తి పెంచాలి. పాఠశాలల్లో తెలుగు భాష, సాహిత్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తెలుగు అభ్యాసాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉంది. సాంకేతికతతో కొత్త పుంతలు సెల్‌ఫోన్ నుంచి సామాజిక మాధ్యమాల వరకు ప్రతి చోటా తెలుగు వినియోగాన్ని పెంచితేనే భాషకు భవిష్యత్తు ఉంటుంది. తెలుగు టైపింగ్, తెలుగు పుస్తకాల డిజిటలీకరణ, ఆన్లైన్ తెలుగు విద్య, తెలుగు పదజాలంతో రూపొందుతున్న సాంకేతిక సాధనాలు భాషను యువతకు మరింత చేరువ చేస్తున్నాయి. యువత సోషల్ మీడియా వేదికల్లో తెలుగును ఎక్కువగా ఉపయోగిస్తే భాష మరింత విస్తృతమవుతుంది. తరాలు మారుతున్నా ప్రత్యేకతను చాటుతూనే ఉన్న తెలుగు భాష వేల ఏళ్ల నుంచే వర్ధిల్లుతున్న సాహిత్యం మాతృభాష పరిరక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యత వ్యవహారిక భాషకు ‘గిడుగు’ బాట నేడు తెలుగు భాషా దినోత్సవం అనంతలో తెలుగు సాహితీ సౌరభం అనంతపురం నేల...తెలుగు సాహిత్యానికి, జానపద కళలకు విశిష్టమైన కృషి చేసిన పలువురు కవులు, రచయితలు, కళాకారులకు నిలయంగా నిలిచింది. పప్పూరు రామాచార్యులు తెలుగు సాహిత్య, పత్రికా రంగాల్లో విశేష సేవలందించారు. రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ వంటి సాహితీవేత్తలతో పాటు అనంతపురం ప్రాంతానికి చెందిన అనేక మంది కవులు, రచయితలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. జిరసం అధ్యక్షుడిగా పని చేసిన జూపల్లి ప్రేమ్‌చంద్, చిలకూరి దేవపుత్ర, సింగమనేని నారాయణ, బండి నారాయణస్వామి (కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత), ఏలూరి యంగన్న, శాంతినారాయణ, రాచపాళం చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు అనేకమంది మాతృభాషాభివృద్ధికి అనేక రచనలు చేశారు. -
తెలుగు భాష.. మన సంస్కృతికి జీవనాడి
తెలుగు భాషకు శతాబ్దాల ఘనమైన చరిత్ర, సాహిత్య సంపద, సంస్కృతి ఉన్నాయి. తీయదనంతో పాటు భావాలను ఎంతో చక్కగా వ్యక్తీకరించే సామర్థ్యం తెలుగుకున్న ప్రత్యేకత. నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ నుంచి శ్రీశ్రీ , గురజాడ, విశ్వనాథ వంటి ఎందరో మహాకవులు, రచయితలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు భాషలోని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు. ప్రస్తుత కాలంలో ఇతర భాషల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – బుల్లే శంకర్ లైబ్రేరియన్, రాప్తాడు -
రైతుల దుస్థితి పట్టని కేశవ్
ఉరవకొండ: సాగునీటి పోరు ఉధృతరూపం దాల్చింది. నీళ్లున్నా ఆయకట్టుకు వదలకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంపై రైతులు ఆగ్రహించారు. వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కదం తొక్కారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ శుక్రవారం ఉరవకొండ మండలం చిన్నముస్టూరు సమీపంలోని హంద్రీ–నీవా కాలువ పక్కన అనంతపురం – బళ్లారి 42వ జాతీయ రహదారిని దగ్బంధించారు. నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు ఆందోళనను అడ్డుకునేందుకు చిన్నముస్టూరు, ఇంద్రావతి, రాయంపల్లి, పాల్తూరుతో పాటు అన్ని గ్రామాల్లోనూ పోలీసులు భారీగా మోహరించి, కేసులు నమోదు చేస్తామంటూ బెదిరించారు. అయినా పోలీసుల ఆంక్షలు.. అడ్డంకులను దాటుకుని రైతులు పొలాల గుండా హైవేకు చేరుకున్నారు. కొందరు రైతులు పురుగుమందు డబ్బాలు చేతపట్టి తమ దుస్థితిని చాటారు. హెచ్చెల్సీ, హంద్రీ–నీవా, జీబీసీ పరిధిలోని ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినదించారు. పంట చేతికొచ్చే సమయంలో నీరు లేక ఎండిపోతే పరిస్థితి ఏమిటి.. అప్పులు చేసి సాగు చేసిన రైతులను ఎవరు ఆదుకుంటారు అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆందోళన కొనసాగింది. హైవేపైనే రైతులంతా సహపంక్తి భోజనాలు చేశారు. ఎవరిని అడిగి నిర్ణయించారు? ‘హెచ్చెల్సీ, హంద్రీ–నీవా కింద ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేమని జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇది మీ సొంత నిర్ణయమా లేక శాసనసభలో కానీ, రాజ్యసభలో కానీ ఏమైనా చర్చించారా.. సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించనే లేదు. మరి ఎవరిని అడిగి నిర్ణయించారు’ అని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ దాటిపోతున్నా ఇప్పటివరకూ ఐఏబీ సమావేశం నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా అయితే రైతులు పంటలు పెట్టుకోలేక.. ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే దాదాపు వంద మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా హెచ్చెల్సీ, హంద్రీ–నీవా, జీబీసీ కింద కనీసం తరుతడి పంటలకై నా నీళ్లు ఎప్పడిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ ఒకటో తేదీలోపు సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వకపోతే ఆయకట్టు రైతులతో కలిసి జీబీసీ, హెచ్చెల్సీ షట్టర్లు ఎత్తి పొలాలకు నీటిని మళ్లిస్తామని హెచ్చరించారు. ఆయకట్టుకు నీటి కేటాయింపులు లేక పంటలు సాగు చేసుకోలేని దుస్థితిలో రైతులు ఉన్నా మంత్రి పయ్యావుల కేశవ్‌కు కనిపించడం లేదని విశ్వ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను పొగుడుతూ మెప్పు పొందేందుకు ప్రయత్నించడం కాదు.. జిల్లా రైతుల అవస్థలను వివరించి.. హంద్రీ–నీవా, హెచ్చెల్సీ, జీబీసీలకు సాగునీరు విడుదలయ్యేలా చూడాలని సూచించారు. సొంత నియోజకవర్గంలో రైతులు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో చూసి సిగ్గుపడాలని తెలిపారు. కరువు పీడిత అనంతపురం జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవాను ప్రారంభించారని గుర్తు చేశారు. అలాంటి ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని సీఎం స్వార్థ ప్రయోజనాల కోసం తన సొంత నియోజకవర్గం కుప్పానికి తీసుకెళ్తుంటే.. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, అధికార ప్రతినిధి సీపీ వీరన్న, రాష్ట్ర నాయకులు హావళిగి భరత్‌రెడ్డి, యోగేంద్రరెడ్డి, కరణం భీమిరెడ్డి, జల్లిపల్లి దేవేంద్ర, డొనేకల్లు కురుబ రమేష్, ఏసీ ఎర్రిస్వామి, బసవరాజు, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షులు మోపిడి సిద్దార్థ్, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, మండల కన్వీనర్లు సోమశేఖర్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, ఓబన్న, రైతు విభాగం నాయకులు జయచంద్రారెడ్డి, డిష్ సురేష్, ఉస్మాన్, విద్యార్థి విబాగం నాయకులు నవీన్‌రెడ్డి, కౌడిగి గోవిందు, జోగి వెంకటేష్, విడపనకల్లు సుంకన్న, డిష్ వెంకటేష్, భూమారెడ్డి, నరిగన్న తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కదం తొక్కిన కర్షక లోకం 42వ జాతీయ రహదారి 3 గంటలపాటు దిగ్బంధం పురుగుమందు డబ్బాలతో నిరసన తెలిపిన రైతులు సాగునీరివ్వకపోతే షట్టర్లు ఎత్తి పొలాలకు మళ్లిస్తామన్న వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ -
●రైతుల కన్నీటి కష్టాలు
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీర్ఘకాలికంగా ఫలసాయాన్ని అందించే పండ్లతోటలు సైతం ప్రమాదంలో పడ్డాయి. దీంతో రైతులు వాటిని కాపాడుకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. పెద్దవడుగూరు మండలం కాశేపల్లికి చెందిన రైతులు వెంకటరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి ఇటీవల 300 మామిడి మొక్కలు నాటారు. అవి ఎండిపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో ట్యాంకర్లతో నీటిని తెప్పించి.. కూలీలను పెట్టుకుని బిందెలతో వాటికి పోయిస్తున్నారు. పంటలకు రక్షక తడులు అందించడానికి ప్రభుత్వం సాయం చేయాలని రైతులు కోరుతున్నారు. – పెద్దవడుగూరు -
బస్సులో బంగారం మాయం
నార్పల: మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌లో బస్సులో బంగారం చోరీకి గురైన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. మడుగుపల్లికి చెందిన నందిని అనంతపురం వెళ్లేందుకు నార్పల బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తోంది. బస్సు రాగానే బాగా రద్దీగా ఉండడంతో బస్సులో సీటుకోసం తోటి ప్రయాణికులకు సీటుపై వేయమని చెప్పి తన బ్యాగ్‌ను అప్పగించింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికి బ్యాగ్‌ను పరిశీలించగా సుమరుగా నాలుగు తులాలు బంగారు కనిపించలేదు. దీంతో నందిని వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే నార్పల పోలీసుస్టేషన్ ఎదుట బస్సును ఆపి ప్రయాణికులను తనిఖీ చేశారు. అయితే తనిఖీలో బంగారం ఆచూకీ మాత్రం లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఆలయాల్లో ఆభరణాల చోరీ కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లో ఆలయాల్లో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి సమయలో రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లులోని జుంజప్ప ఆలయంలో తాళం ధ్వంసం చేసి స్వామి వారికి కానుకల రూపంలో వచ్చిన దాదాపుగా 4 కేజీల వెండి ఆభరణాలను దొచుకెళ్లారు. అలాగే మండల పరిధిలోని బోయలపల్లిలో ముత్యాలమ్మ ఆలయంలో కానుక రూపంలో వచ్చిన రెండు బంగారు తాళిబొట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. పట్టణ, రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
నీట్–పీజీకి పకడ్బందీ ఏర్పాట్లు
అనంతపురం అర్బన్: ఈ నెల 30న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)– పీజీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్వో మలోల అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణపై డీఆర్ఓ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పరిపాలనాధికారి అలెగ్జాండర్‌తో కలిసి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఐదు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 979 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులను ఉదయం 7 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. వ్యక్తి అనుమానాస్పద మృతి గుంతకల్లు రూరల్: కర్నూలు జిల్లా మద్దికెర గ్రామానికి చెందిన జోలాపురం గోవిందరాజులు (45) శుక్రవారం కసాపురంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. గోవిందరాజులు శుక్రవారం ఉదయం గుత్తిలో పెళ్లి వేడుకలు ముగించుకున్న తర్వాత కసాపురం చేరుకున్నాడు. అక్కడ తనకు పరిచయం ఉన్న మరో మహిళతో కలిసి నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం సమీపంలోని ఓ ప్రైవేటు అద్దెగదికి వెళ్లాడు. సాయంత్రం వేళ గోవిందరాజులు బాత్రూములో కాలుజారి పడిపోయాడంటూ వెంట వచ్చిన మహిళ గది నిర్వాహకులకు తెలిపారు. వెంటనే వారు అంబులెన్స్‌లో గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. గోవిందరాజులు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కసాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదు పాఠశాలలకు స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులు అనంతపురం ఎడ్యుకేషన్: హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని పాఠశాల స్థాయిలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025–26కు జిల్లాలో ఐదు ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేసినట్లు డీఈఓ డాక్టర్ అయూబ్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపికై న కంబదూరు మండలం నూతిమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తాడిపత్రి తలారి చెరువు పెన్నా ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాల, వజ్రకరూరు మండలం కొనకొండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉరవకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (సెంట్రల్), విడపనకల్లు మండలం పాల్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కలెక్టర్ చేతుల మీదుగా శనివారం ఉదయం 10 గంటలకు అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్లో అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సహాయకులు (వ్యాయామ విద్య) అవార్డుల కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని డీఈఓ ఆదేశించారు. పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహిస్తూ విద్యార్థులను రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు తీర్చిదిద్దేలా మరింత కృషి చేయాలని సూచించారు. వీఆర్‌కు కానిస్టేబుల్ కులశేఖర్‌రెడ్డి తాడిపత్రిటౌన్: తాడిపత్రి కానిస్టేబుల్ కులశేఖర్‌రెడ్డిని ఎస్పీ జగదీశ్ శుక్రవారం వీఆర్‌కు పంపారు. ఇటీవల ఓ మహిళ కుటుంబ సమస్యలతో పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఆమె నంబరును సేకరించిన కానిస్టేబుల్ కుల శేఖర్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి వేళ ఫోన్ చేశాడు. తనతో అసభ్యకరంగా మాట్లాడాడని కానిస్టేబుల్‌పై బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ అనంతరం సదరు కానిస్టేబుల్ కులశేఖర్‌రెడ్డిని వీఆర్‌కు బదిలీ చేసినట్లు తెలిసింది. 30న డిగ్రీ ఇన్స్టంట్ పరీక్షలు అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఇన్స్టంట్ పరీక్షలు ఈ నెల 30న అనంతపురంలోని కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.వి.లక్ష్మయ్య తెలిపారు. ఇన్స్టంట్ పరీక్షలకు అర్హత కలిగి, నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు ఆదివారం ఉదయం 10 గంటలకు కేఎస్ఎన్ కళాశాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ 5వ సెమిస్టర్ హాల్ టికెట్‌ను తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. -
తిరిగి తిరిగి.. విసిగి వేసారి...
● రెండు నెలలైనా పలువురికి అందని ‘సుఖీభవ–పీఎం కిసాన్’ అనంతపురం అగ్రికల్చర్: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందడం లేదు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించినట్లుగా ప్రతి రైతుకూ రూ.20 వేలు ఇవ్వకుండా రూ.14 వేలకు పరిమితం చేశారు. ఇలా మొదటి ఏడాది సుఖీభవ కింద రూ.400 కోట్లకు పైగా రైతులకు ఇవ్వకుండా మోసం చేసిన విషయం తెలిసిందే. రెండో ఏడాది మొదలు పెట్టినా జాబితాకు వివిధ రూపాల్లో కొర్రీలు వేయడంతో వేలాది మందికి పెట్టుబడి సాయం అందకుండా పోతోంది. జాబితాకు కొర్రీలు.. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ రూ.20 వేలు ఇస్తామన్న హామీతో రైతుల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం మొదటి ఏడాది పైసా ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. చివరకు రూ.14 వేలు ఖరారు చేసి రెండో ఏడాది మొదలు పెట్టినా రైతుల సంఖ్య పెరగాల్సి ఉన్నా తగ్గించడం గమనార్హం. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 2.85 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ ఇస్తుండగా నేడు 30 వేల మందికి కొర్రీలు వేసి 2.55 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు. రైతు భరోసా కింద గత ప్రభుత్వం 2.94 లక్షల మంది వరకు ఇవ్వగా నేడు 20 వేల మందికి రిక్తహస్తం చూపి 2.75 లక్షల మంది రైతులకు మాత్రమే ఇస్తున్నారు. ఇలా 25 వేల మందికి పైగా పెట్టుబడి సాయం అందించకుండా మొండిచేయి చూపిస్తున్న దుస్థితి నెలకొంది. పేరుకు మాత్రం సాయం పెంచినట్లు చెబుతున్నా మొదటి ఏడాది ఎగ్గొట్టడం, జాబితాలో రైతుల పేర్లు తొలగించడం చూస్తే చంద్రబాబు ప్రభుత్వానికి రైతులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఈకేవైసీ లేదని, ఎన్పీసీఐ యాక్టివ్ లేదని, మ్యాపింగ్ చేయలేదంటూ వేలాది మంది రైతులు సుఖీభవ–పీఎం కిసాన్ సొమ్ము కొందరు రైతులకు జమకాని పరిస్థితి నెలకొంది. గతంలో క్యాలెండర్ ప్రకారం జమ.. గతంలో 2019–2024 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం క్రమం తప్పకుండా క్యాలెండర్ ప్రకారం మూడు విడతల్లో భరోసా కింద పెట్టుబడి సాయం అందించింది. కరోనా మహమ్మారితో 2020, 2021లో అత్యంత విపత్కర పరిస్థితులు నెలకొన్న సమయంలో కూడా రూ.13,500 ప్రకారం ఏకంగా 2.90 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.390 కోట్ల వరకు సాయం అందించారు. అలా ఐదేళ్ల కాలంలో భరోసా–పీఎం కిసాన్ కింద ఒక్కో రైతుకు రూ.67,500 ప్రకారం జిల్లా రైతులకు రూ.1,937 కోట్లు మేర భారీ ఎత్తున పెట్టుబడి సాయం జమ చేయడం గమనార్హం. 2026–27కు సంబంధించి మొదటి విడతగా రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద 23వ విడతగా రూ.2 వేల ప్రకారం గత జూన్ 20న రూ.188.67 కోట్ల సొమ్ము విడుదల చేశారు. అయితే, రెండు నెలలు దాటినా పలువురు రైతులకు నగదు జమకాని పరిస్థితి నెలకొంది. రోజూ పదుల సంఖ్యలో రైతులు అనంతపురం జేడీఏ కార్యాలయానికి వస్తుండగా, మరికొందరు ప్రతి సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌కు, ఇంకొందరు రైతులు ఆర్ఎస్కేలు, మండల వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలసిపోతున్న పరిస్థితి నెలకొంది. -
ఆరోగ్యం బాగలేదన్నా.. పట్టించుకోలేదు!
● విచారణ అధికారుల ఎదుట శింగనమల కేజీబీవీ విద్యార్థిని తల్లిదండ్రుల ఆవేదన అనంతపురం ఎడ్యుకేషన్: ‘మా పాపకు ఆరోగ్యం బాగలేదని చెప్పినా కేజీబీవీ ఎస్ఓ, సిబ్బంది పట్టించుకోలేదు. మా పాప చనిపోయి ఉంటే ఎవరు బాధ్యత వహించేవారు?’ అంటూ శింగనమల కేజీబీవీ ఆరో తరగతి విద్యార్థిని ప్రియదర్శిని తల్లిదండ్రులు విచారణ అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ప్రియదర్శినిని అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి శుక్రవారానికి మూడు రోజులు పూర్తయింది. ఆరోగ్య పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటే వైద్యులు ఇన్ని రోజులుగా ఆస్పత్రిలోనే ఉంచుతారో అర్థం చేసుకోవచ్చని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా కేజీబీవీ యాజమాన్యం కనీసం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. మరో విద్యార్థిని ద్వారా సమాచారం అందుకున్న తండ్రి రామాంజనేయులు ఈ నెల 25న సాయంత్రం కేజీబీవీకి వెళ్లారు. అయితే కుమార్తెను కనీసం చూపించకుండా ‘మీపాప యాక్షన్ చేస్తోంది.. ఏమీ కాలేదుపో’ అంటూ గద్దించి పంపినట్లు తెలిపారు. దీంతో మరుసటి రోజు ఉదయం తల్లిదండ్రులు లక్ష్మీ, రామాంజనేయులు ఇద్దరూ కేజీబీవీకి వెళ్లి ఎస్ఓ, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చివరకు తమ కుమార్తెను బలవంతంగా బయటకు తీసుకొచ్చి అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ‘సాక్షి’ కథనంతో కదిలిన అధికారులు శింగనమల ఘటనపై ‘కేజీబీవీల్లో భద్రత గాలికి’ అనే శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. కేజీబీవీ యాజమాన్య నిర్లక్ష్యంతో విద్యార్థిని ప్రాణాల మీదకు వచ్చిన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనంపై సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు స్పందించి విచారణకు ఆదేశించారు. కేజీబీవీ సెక్రటరీ దేవానందరెడ్డి కూడా పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు, శింగనమల ఎంఈఓ నరసింహరాజు కేజీబీవీకి వెళ్లారు. ఎస్ఓ, సిబ్బందితో సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు సేకరించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులను మాత్రం సాయంత్రం వరకు కలవలేదు. విచారణలో భాగంగా ముందుగా బాధితురాలి వద్దకు వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితి, జరిగిన పరిణామాలపై తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఎట్టకేలకు సాయంత్రం చీకటి పడిన తర్వాత సమగ్రశిక్ష, విద్యాశాఖ అధికారులు నగరంలోని ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న ప్రియదర్శినితో పాటు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అక్కను కూడా కలవనీయలేదు! ప్రియదర్శిని అక్క మాధవి అదే కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. చెల్లెలు ఆస్పత్రిలో చేరిందన్న విషయం తెలిసి ఆమె తీవ్ర ఆందోళనకు గురవుతోంది. కనీసం ఒక్కసారి ఫోన్లో చెల్లెలితో మాట్లాడించాలని కేజీబీవీ ఎస్ఓ, సిబ్బందిని ప్రాధేయపడినా పట్టించుకోలేదని ఆరోపించారు. సిబ్బంది కనీస మానవత్వం కూడా చూపకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోందని తల్లిదండ్రులు మండిపడ్డారు.


