ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వలేదు
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం 15 నెలల క్రితం రూ.20 వేలు డీడీ చెల్లించాను. కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరగడంతో నెల కిందట ఆరు విద్యుత్ స్తంభాలు, దానికి సరిపడే కండక్టర్ ఇచ్చారు. ట్రాన్స్‌ఫార్మర్ అడిగితే మీ సీరియల్ రాలేదు... వచ్చే వరకు ఆగాలంటూ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే బోరు వేయించి ఏడాదిన్నర అవుతోంది. నీళ్లున్నా పొలాన్ని బీడుగా వదిలేయాల్సి వచ్చింది. ఇకనైనా అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయాలి.
– కుళ్లాయప్ప, బూదేడు,
గార్లదిన్నె మండలం


