పశుశాఖ జేడీ ప్రేమ్‌చంద్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్‌కు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. అలాగే, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ)లో పనిచేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్) డాక్టర్ శ్రీకాంత్‌కు రాష్ట్రస్థాయి అవార్డు ప్రకటించారు. రాయలసీమ జిల్లాల్లోనే తొలిసారిగా ‘అనంత పాలధార’ పేరుతో పాల దిగుబడి పోటీలు, లేగదూడల ప్రదర్శన, ఉచిత గర్భకోశవ్యాధి శిబిరాన్ని అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి వేదికగా విజయవంతంగా నిర్వహించడం, పైలెట్ ప్రాజెక్టు కింద లింగనిర్ధారిత వీర్యం (సెక్స్ సార్టెడ్ సెమన్–ఎస్‌ఎస్‌ఎస్) పథకం విజయవంతంగా అమలు చేయడంతో రాష్ట్ర స్థాయి అవార్డు దక్కినట్లు జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్ తెలిపారు. అవార్డు రావడానికి సహకరించిన పశుశాఖ డీడీలు, ఏడీలు, వీఏఎస్, పారాస్టాఫ్ తదితరులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో పశుశాఖ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు.
ఆర్టీసీ ఉత్తమ కానిస్టేబుల్‌గా రాజశేఖర్
అనంతపురం క్రైం:ఆర్టీసీ ఉత్తమ కానిస్టేబుల్‌గా రాజశేఖర్ అవార్డు అందుకున్నారు. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయనకు సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక తిరుమల రావు అవార్డు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సహచరులు రాజశేఖర్‌కు అభినందనలు తెలిపారు.
ఎకై ్సజ్ సీఐ మహేష్‌కు
రాష్ట్రస్థాయి పురస్కారం
రాయదుర్గం: విధి నిర్వహణలో ప్రతిభ చూపిన రాయదుర్గం ఎకై ్సజ్ సీఐ మహేష్‌కుమార్‌ను రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విజయవాడలో ఎకై ్సజ్ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రాహుల్‌దేవ్‌శర్మ చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రం అందుకున్నారు. జిల్లాస్థాయిలోనూ ఆయన అవార్డుకు ఎంపిక కావడం గమనార్హం. ఈ సందర్భంగా సీఐ మహేష్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఒకేసారి అవార్డులు దక్కడం గర్వకారణమన్నారు. మరింత బాధ్యతగా విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
విడపనకల్లు: మండల పరిధిలోని పాల్తూరు గ్రామంలో సోమవారం పోలీసులు భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు. వివరాలు.. మండలంలో టీడీపీ నాయకుల అండదండలతో కొందరు రేషన్ బియ్యం అక్రమంగా కర్ణాటక ప్రాంతానికి తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పాల్తూరు నుంచి ఐషర్‌లో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన ఐషర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. వాహనంలోని 155 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
సత్యసాయి వాటర్ ప్లాంట్ ఉద్యోగి అదృశ్యం
బత్తలపల్లి: మండల కేంద్రానికి చెందిన మన్నీల సతీష్‌కుమార్ కనిపించకుండా పోయాడని అతని భార్య మన్నీల లీలావతి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సతీష్‌కుమార్ 28 సంవత్సరాలుగా తాడిమర్రి మండలంలోని శ్రీసత్యసాయి వాటర్ ప్లాంట్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 24వ తేదీ శనివారం ఉదయం విధులకు వెళ్లిన ఆయన తిరిగిరాలేదు. బంధువులు, పరిసర గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సోమవారం భార్య ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సోమశేఖర్ తెలిపారు.
పశుశాఖ జేడీ ప్రేమ్‌చంద్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
పశుశాఖ జేడీ ప్రేమ్‌చంద్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
పశుశాఖ జేడీ ప్రేమ్‌చంద్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు


