గౌరవానికి అసలైన అర్థం..! ఆ బైకర్‌ చేసిన పనికి.. | Biker pauses at traffic signal to let cyclist pose with his superbike | Sakshi
Sakshi News home page

గౌరవానికి అసలైన అర్థం..! ఆ బైకర్‌ చేసిన పనికి..

Jan 25 2026 11:30 AM | Updated on Jan 25 2026 12:20 PM

Biker pauses at traffic signal to let cyclist pose with his superbike

ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశబ్దంగా కూడా ఇతరులు మన్ననలను అందుకోవచ్చు. అందుకు నిదర్శనం ఈ నిశబ్ధ సన్నివేశం. నిజానికి అక్కడ ఆ వ్యక్తి చేసింది చిన్న పనే అయినే..ఎందరో హృదయాలను గెలుచుకుంది..నీ ఉదారమైన మనసుకి సెల్యూట్‌..నవ్వు గ్రేట్‌ భయ్యా అంటూ నెటిజన్లు పొగడ్తల వర్షం కురింపించారు. అంత గొప్ప పని ఏం చేశాడతడు అంటే..

ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఎలాంటి సంభాషణ లేకుండా జరిగిన చిన్ని నిశబ్ద దృశ్యాన్ని కారులో ఉన్న రిషి పాండే అనే వ్యక్తి రికార్డుచేసి  సోషల్‌ మీడియోలో పోస్ట్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది.కరెక్ట్‌ రెడ్‌ సిగ్నల్‌ పడగానే వాహనాలు ఆగి ఉన్నాయి..ఇంతలో ఓ సాదారణ సైక్లిస్ట్‌కి అక్కడ సమీపంలో ఆగి ఉన్న సూపర్ బైక్‌పై ఫోటో దిగాలనిపించింది. 

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా..సూపర్‌ బైక్‌ని నడుపుతున్న బైకర్‌ని అడిగిమరి దాన్ని నడుపుతున్నట్టు ఫోటో తీసుకుంటాడు. సదరు బైకరే ఆ సైక్లిస్ట్‌ ఫోజులను క్లిక్‌మనిపించాడు. ఆ తర్వాత ఆ సైక్లిస్ట్‌ చిన్ని చిరునవ్వుతో బైక్‌ అతడికి ఇచ్చేసి వెళ్లిపోతున్న విధానం..బైకర్‌ని గౌరవిస్తున్నట్లుగానూ, అటు అతడు ఫుల్‌ హ్యాపీ అన్నట్లుగా ఉంది. 

ఇదంత కారులోంచి గమనిస్తున్న రిషి పాండే అనే వ్యక్తికి ఎంతో నచ్చి సైలంట్‌గా మొత్తం ఆ అందమైన దృశ్యాన్ని రికార్డు చేసి మరి నెట్టింట షేర్‌ చేశాడు. నెటిజన్ల సైతం అతడి విశాల మనసుకి ఫిదా అవ్వడమే గాక..గౌరవానికి అసలైన అర్థం ఈ కమనీయ దృశ్యం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.

 

 

(చదవండి: అబుదాబిలో కరీనా లుక్స్‌ అద్బుతః..! ఆ జాకెట్‌ అంత ఖరీదా..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement