జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం
మీ అభిమానం మరువలేనిది
● ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ
అనంతపురం అర్బన్: జిల్లాలో పనిచేయడం చాలా సంతృప్తినిచ్చిందని, అధికారులు, ఉద్యోగుల అభిమానం మరువలేనిదని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అన్నారు. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీపై వెళుతున్న ఆయనకు జిల్లా యంత్రాంగం మంగళవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన సేవలను జిల్లా అధికారులు కొనియాడారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో సహకరించిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌ను అధికారులు సన్మానించి మొమెంటో అందజేశారు. కార్యక్రమంలో అస్టింట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ మలోల, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్‌కు సన్మానం
అనంతపురం క్రైం: బదిలీపై వెళ్తున్న ఇన్‌చార్జ్ కలెక్టర్, అహుడా వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మను మంగళవారం కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. అహుడ చైర్మన్ టి.సి.వరుణ్, కార్యదర్శి రామకృష్ణారెడ్డిలు ఇన్‌చార్జ్ కలెక్టర్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఈ రేవంత్, ఈఓ అరుణ కుమారి, ఏఓ రవిచంద్రన్, కేఎండీ ఇసాక్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దుశ్యంత్, జీపీఓ హరీష్ చౌదరి, సర్వేయర్ శరత్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


