దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
అనంతపురం: హక్కులతో పాటు రాజ్యాంగం కల్పించిన బాధ్యతలను పౌరులు గుర్తించుకోవాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ.భీమారావు అన్నారు. అనంతపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పునాది అయిన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా భారత్ విరాజిల్లడానికి రాజ్యాంగబద్ధమైన పాలనే కారణమన్నారు. దానిని పరిరక్షించుకోవాలని కోరారు.
విశిష్ట సేవలకు సత్కారం
అనంతపురం: అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీ ఖ్యాతిని ఇనుమడింప చేసిన మాజీ ప్రొఫెసర్లకు ఎస్కేయూ విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేసింది. పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో స్థానం సంపాదించిన ప్రొఫెసర్ రాజూరి రామకృష్ణారెడ్డి, ప్రపంచంలోని కెమిస్ట్రీ శాస్త్రవేత్తల జాబితాలో రెండో స్థానం దక్కించుకున్న దివంగత ప్రొఫెసర్ ఎంసీఎస్ శుభ ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీరికి ఎస్కేయూ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ అనిత పురస్కారాలు అందజేసి, సత్కరించారు.
పల్లెల్లో మొదలైన
రాజకీయ వేడి
● త్వరలో ముగియనున్న
సర్పంచ్‌ల పదవీకాలం
● పోటీ చేయడానికి ఆశావహుల
తీవ్ర ప్రయత్నాలు
● రిజర్వేషన్లు మార్పులపై
కూటమి నేతల కసరత్తు
బొమ్మనహాళ్: పల్లెల్లో అప్పుడే ‘స్థానిక’ రాజకీయం మొదలైంది. త్వరలోనే సర్పంచుల పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, రాప్తాడు నియెజకవర్గాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు పోటీ చేసేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 2021 ఫిబ్రవరి 17న సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 80 శాతం మంది వైఎస్సార్‌సీపీ మద్దతు దారులే విజయం సాధించారు. 20 శాతం మంది టీడీపీ మద్దతుదారులు గెలిచారు. అయితే ఏప్రిల్ 2న సర్పంచులు బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రకారం వారి పదవీకాలం 2026 ఏప్రిల్ 2 వరకు ఉంది. అయితే ఎన్నికలు జరిగిన రోజు నుంచి లెక్కించి, వచ్చే నెల 17కు పదవీకాలం ముగియనుందని పేర్కొంటూ ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా రిజర్వేషన్లు మార్పు చేయించాలని కసరత్తు చేస్తున్నారు. ఈసారి వైఎస్సార్‌సీపీ, టీడీపీతో పాటు బీజేపీ, జనసేన తరఫున కూడా అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తే తాము న్యాయస్ధానాలను ఆశ్రయిస్తామని ప్రస్తుత సర్పంచ్‌లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్ధితుల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం లేదని, స్పెషలాఫీసర్ల ద్వారా పాలన రావొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి


