బాబు పాలనలో ప్రాథమిక హక్కులకు భంగం
అనంతపురం: భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను చంద్రబాబు ప్రభుత్వం కాల రాస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. సోమవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, వైస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను అనంత వెంకటరామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాజ్యాంగం సమాన హక్కులు, సమాన అవకాశాలను అందరికీ కల్పించిందని చెప్పారు. ఈ రోజు దేశమంతా అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై గాంధీజీ చూపిన మార్గంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో తమ పార్టీ పోరాడుతోందని చెప్పారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో దేశానికే తలమానికంగా 206 అడుగుల ఎత్తుతో విజయవాడలో మహనీయుడు అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అంబేడ్కర్ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా వైఎస్సార్‌సీపీ ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు దాసరి వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శులు గౌని నాగన్న, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, బూత్‌కమిటీ జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, ఉపాధ్యక్షురాలు రాధా యాదవ్, రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, జావెద్, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అశ్వత్థ నాయక్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్‌గౌడ్, మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, న్యాయవాది హనుమన్న, కార్పొరేటర్లు గోగుల రాధాకృష్ణ, ఎం.శ్రీనివాసులు, గురు శేఖర్‌బాబు, రాజేశ్వరి, సాకే చంద్రలేఖ, జయలలిత, రహంతుల్లా, వైఎస్సార్‌సీపీ నాయకులు సాకే కుళ్లాయిస్వామి, మహమ్మద్ ఆసిఫ్, రామచంద్ర, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఫయాజ్, మహిళా నాయకులు దేవి, శోభా రాణి, శోభా బాయి, ఉషా, అంజలి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు
అంబేడ్కర్ రాజ్యాంగాన్ని
పరిరక్షించుకోవాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
అనంత వెంకటరామిరెడ్డి


