● విరబూసిన ఆశలు
ఆత్మకూరు: ఈ ఏడాది మామిడి చెట్లకు పూత విపరీతంగా పూసింది. దీంతో రైతులు పంటపై ఆశలు పెంచుకున్నారు. గత ఏడాది సరైన ధరలు లేక నష్టాలు చవిచూశారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పూత విరబూసింది. చాలా చోట్ల ముందస్తుగా మామిడి కాయలు కూడా కాశాయి. గత ఏడాది టన్ను రూ.10 వేలకు మించి అమ్ముడుపోలేదు. ప్రస్తుతం సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మార్కెట్‌లో టన్ను మామిడి కాయల ధర రూ.80 వేలకుపైగా పలుకుతోంది. తమ దిగుబడి మార్కెట్‌కు వచ్చే వరకు ఆ స్థాయిలో ధర ఉంటే లాభదాయకంగా ఉంటుందని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
● విరబూసిన ఆశలు


