కర్ణాటకలో విక్రయించాం
నాకున్న ఐదు ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో 20 క్వింటాళ్ల దిగుబడులను మద్దతు ధర కన్నా తక్కువకు కర్ణాటక వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. పొలం వద్దకే అధికారులను పంపి ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానంతో పంట కొనుగోలు చేపట్టింది. జగన్ ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలి.
– రైతు శ్రీనివాసులు, యలగలవంక, బెళుగుప్ప మండలం


