జిల్లాలో ఈ ఏడాది ఉద్యాన పంటలు, వాటి క్రయవిక్రయాల ద్వారా రూ.21,149 కోట్ల టర్నోవర్‌ జరుగుతుందని, ఆ మేరకు ‘గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌–జీవీఏ’ రానుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయడంపై అటు ఉద్యానశాఖ, ఇటు రైతులు ఆశ్చర్యంతో పాటు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వేల | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఈ ఏడాది ఉద్యాన పంటలు, వాటి క్రయవిక్రయాల ద్వారా రూ.21,149 కోట్ల టర్నోవర్‌ జరుగుతుందని, ఆ మేరకు ‘గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌–జీవీఏ’ రానుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయడంపై అటు ఉద్యానశాఖ, ఇటు రైతులు ఆశ్చర్యంతో పాటు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వేల

Jan 20 2026 7:58 AM | Updated on Jan 20 2026 7:58 AM

జిల్లాలో ఈ ఏడాది ఉద్యాన పంటలు, వాటి క్రయవిక్రయాల ద్వారా

జిల్లాలో ఈ ఏడాది ఉద్యాన పంటలు, వాటి క్రయవిక్రయాల ద్వారా

అనంతపురం అగ్రికల్చర్‌: రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల పరిధిలో ఉద్యాన ఉత్పత్తుల ద్వారా ఈ ఏడాది రూ.1,77,422 కోట్ల స్థూల విలువ (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌–జీవీఏ) ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో రూ.21,149 కోట్లతో అనంతపురం జిల్లా అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో రూ.13,456 కోట్ల అంచనాతో శ్రీసత్యసాయి జిల్లా ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాగా ఉన్నప్పుడు ఏనాడూ రూ.15 వేల కోట్లకు మించింది లేదు. మరి ఇపుడు రెండు జిల్లాలకు ఏకంగా రూ.35 వేల కోట్ల వరకు జీవీఏ రానుందని లెక్క వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా ఈ ఏడాది పొడవునా చీనీ టన్ను గరిష్ట ధర రూ.20 వేలకు మించలేదు. సరాసరి రూ.15 వేలతో అమ్ముడుబోవడంతో రైతులు భారీగా నష్టపోయారు. అలాగే రెండు నెలల పాటు అరటి టన్ను ధర రూ.2 వేలు దాటలేదు. ఇక ఎండుమిరప ధర కూడా భారీగా పతనమైంది. బొప్పాయి, కళింగర, కర్బూజ లాంటి వాటి ధరలు సైతం తగ్గాయి. మామిడి టన్ను రూ.20 వేల కన్నా ఎక్కువ పలికిన దాఖలాలు లేవు. ఇలా ప్రతికూల పరిస్థితుల్లో అంత భారీ స్థాయిలో టర్నోవర్‌ ఎలా సాధ్యం అవుతుందో అధికారులు, పాలకులే చెప్పాలి. మొత్తం మీద రాయలసీమ జిల్లాల నుంచి భారీగా ఆశించి అంచనాలు వేశారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ఆ తర్వాత రూ.13,444 కోట్లతో వైఎస్సార్‌ కడప, రూ.10,690 కోట్ల జీవీఏతో కర్నూలు, రూ.10,572 కోట్లతో అన్నమయ్య, రూ.8,096 కోట్లతో నంద్యాల, రూ.7,012 కోట్లతో చిత్తూరు, రూ.4,395 కోట్లతో తిరుపతి ఉండటం గమనార్హం.

ఉత్తుత్తి

లెక్కలేనా..?

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ–క్రాప్‌ నివేదిక ప్రకారం ఈ ఏడాది 100 రకాల వరకు ఉద్యాన పంటలు సాగు చేశారు. అందులో 30 రకాల పండ్లతోటలు, 50 రకాల వరకు కూరగాయలు, ఆకుకూర పంటలు, మరో 20 రకాల వరకు పూలు, ఔషధ పంటలు సాగు చేశారు. మొత్తంగా 3.15 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. వాటి ద్వారా 28 లక్షల నుంచి 30 లక్షల మెట్రిక్‌ టన్నుల ఫలసాయం రానుందని ఉద్యాన శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది ఫిబ్రవరి 5న నిర్వహించిన ‘హార్టికల్చర్‌ కాంక్లేవ్‌’లో ఐదు ప్రధాన పంటలను ‘గ్రోత్‌ ఇంజిన్లు’గా గుర్తించి వాటి ద్వారా జీవీఏ అధికంగా రానుందని లెక్క వేశారు. అందులో చీనీ ద్వారా ఏటా రూ.1,562 కోట్లు, ఎండు మిరప ద్వారా రూ.1,205 కోట్లు, అరటి ద్వారా రూ.1,204 కోట్లు, టమాట ద్వారా రూ.997 కోట్లు, మామిడి ద్వారా రూ.567 కోట్ల మేర జీవీఏ లెక్కవేశారు. ప్రధానంగా గుర్తించిన ఈ ఐదు పంటల నుంచి 20 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ఫలసాయం వస్తుండగా.. వాటి ద్వారా టర్నోవర్‌ లెక్కేసినా రూ.5,535 కోట్లు మాత్రమే. ఏ రకంగా చూసినా రూ.21,149 కోట్లు ఎలా సాధ్యమనేది అంతుచిక్కడం లేదని ఆ శాఖ వర్గాలతో పాటు రైతులు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మిరప సాగు సగానికి పైగా తగ్గిపోయింది. మిరప ద్వార అంచనా వేసిన రూ.1,205 కోట్లలో రూ.300 కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి ఎలా రూ.21 వేల కోట్లకుపైగా సాధ్యమవుతుందనేది అర్థం కావడం లేదు. ఏ పంట ద్వారా ఏ మేర జీవీఏ అంచనా వేశారనే దానిపై ఉద్యానశాఖ వద్ద వివరాలు కూడా లేకపోవడం చూస్తే... ప్రభుత్వం ఉత్తుత్తి లెక్కలు వేసిందనేది స్పష్టమవుతోంది.

జిల్లా ఉద్యాన పంట ఉత్పత్తుల టర్నోవర్‌ అంచనా రూ.21,149 కోట్లు

ఇందులో రూ.10 వేల కోట్లు అయినా చేరుకుంటుందా అన్నది సందేహమే

గ్రోత్‌ ఇంజిన్లుగా చీనీ, మామిడి, అరటి, మిరప, టమాట గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement